Saturday, November 12, 2011

ఘనంగా 'దూకుడు' అర్థ శతదినోత్సవం

 ప్రముఖ నటుడు మహేష్‌బాబు, నటి సమంత నటించిన 'దూకుడు' అర్థ శతదినోత్సవం శనివారం విజయవాడలో ఘనంగా జరిగింది. వేలాదిగా తరలొచ్చిన అభిమానులతో విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాల మైదానం హోరెత్తింది. రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ వేడుకలకు నటుడు మహేష్‌బాబు ముందుగా గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గం ద్వారా వచ్చారు. మహేష్‌బాబు, ఇతర సినీనటులను చూసేందుకు వచ్చిన వారితో బందరురోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఒకానొక సమయంలో కళాశాల గేటువద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు తీవ్ర అవస్థలు పడ్డారు. హీరో మహేష్‌బాబును అభిమానులు గజమాలతో సత్కరించారు. అనంతరం ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్‌బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, సుంకర అనీల్‌ నటీనటులు, సాంకేతికవర్గాన్ని అభినందించారు. సినీరంగంలో ఉన్న సగం మంది కానూరు కళాశాలకు రావడంతో అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ చిన్నతనంలోనే సినిమారంగంలో 'దూకుడు' ప్రదర్శించిన మహేష్‌బాబు పెద్దయిన తరువాత కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారని అన్నారు. 75 ఏళ్ల సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన 'పోకిరి' అతని కీర్తిలో కలికితురాయని అన్నారు. దాని రికార్డులకు చేరువగా 'దూకుడు' వెళుతుందని అన్నారు. నటి సమంత మాట్లాడుతూ 'దూకుడు' సినిమా తనకు జీవితంలో గుర్తుండిపోయే విజయాన్ని అందించిందన్నారు.

పెళ్లి పీటలెక్కనున్న మమత


Friday, November 11, 2011

పెళ్లికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన స్నేహ

సినీ నటి స్నేహ పెళ్ళి తెరను అడ్డు తొలగించింది. సుమారు 3, 4 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్న స్నేహితుడు మరియు కోలివుడ్‌ నటుడు. ప్రసన్నను వివాహమాడనుంది. 2012 మార్చిలో పెళ్ళి చేసుకుంటున్నట్లు స్నేహ అధికారికంగా ప్రకటించింది. స్నేహ ప్రస్తుతం హీరో నాగార్జున చిత్రం ' రాజన్న' సినిమాలో నటిస్తుంది. ఇక ఎంగేజ్‌మెంట్‌ను అంగరంగ వైభవంగా చేసేందుకు త్వరలో తేదిని ప్రకటిస్తామన్నారు.

Thursday, November 10, 2011

11-11-11 నేడు అరుదైన తేదీ

నవంబర్ 10: అన్ని ఒకేరకమైన అంకెలతో, ఎటు నుంచి చూసినా ఒకేలాగ కనిపించే అరుదైన తేదీ 11-11-11.. నేడు అంటే శుక్రవారం ఈ తేదీకి వేదిక కానుంది. వందేళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి తేదీ దర్శనమిస్తుంది. అందులోనూ 11-11-11 తేదీన 11గంటల, 11నిమిషాల. 11 సెకన్లు సమయం మరీ ప్రత్యేకం. అరుదైన అంకెల గారడీ చుట్టూ ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు ముసురుకున్నాయి. ఈ ప్రత్యేక తేదీన ఔత్సాహికులు విహహాలు, వేడుకలు జరుపుతుండగా, హిందూ సంప్రదాయం ప్రకారం ఈ సంఖ్య అంతగా అచ్చిరాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 11-11-11 తరహాలో తదుపరి అంకెలు (22-22-22) కాల్యెండర్‌లో లేకపోవడమే ఇందుకు కారణమని కొన్ని వెబ్‌సైట్లు ప్రవచిస్తున్నాయి. గతం ఈ తేదీ వచ్చినప్పుడు, అంటే 1911, నవంబర్ 11న పర్యావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి

Saturday, October 29, 2011

ఐటమ్‌ సాంగ్‌కి 50 లక్షలు

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో మహేష్‌బాబు హీరోగా ' ది బిజినెస్‌ మేన్‌ ' సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్‌ హిట్‌ అయిన ' దూకుడు' తర్వాత మహేష్‌ బాబు హీరోగా మరో సినిమా కావడంతో ' ది బిజినెస్‌ మేన్‌' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా వుంటే, ' ది బిజినెస్‌ మేన్‌ ' సినిమా కోసం మాస్‌ మసాలా ఐటమ్‌ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. ఇందు కోసం ముంబై నుంచి శ్వేతా భరద్వాజ్‌ అనే సెక్సీ భామని టాలీవుడ్‌కి ఇంపోర్డ్‌ చేస్తున్నారు.
ఇక, ఈ ఐటమ్‌ సాంగ్‌ కోసం ఏకంగా శ్వేతా భరద్వాజ్‌కి యాభై లక్షలు చెల్లిస్తున్నారట. పాట పిక్చరైజేషన్‌ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పెయిన్‌లో ఘాటింగ్‌ జరుపుకుంటోన్న ' ది బిజినెస్‌ మేన్‌ ' విదేశాలనుంచి తిరిగిరాగానే, ఐటమ్‌ సాంగ్‌ చిత్రీకరణ జరగనుందట.

Friday, October 28, 2011

కాజల్‌ ఔట్‌ .. త్రిష ఇన్‌

 జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ' దమ్ము ' సినిమాలో పలువురు సినీ హీరోయిన్లు పేర్లు వినిపిస్తున్నాయి. ఏకంగా రెండు, కాదు మూడు కాదు ఏకంగా నాలుగురు లేక ఐదుగురి పేర్లు విని పిస్తున్నాయి. తొలుత హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటించాల్సి వుండగా, అనూహ్యంగా ఆ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది శృతిహాసన్‌ ప్లేస్‌లో ' జోష్‌ ' ఫేం కార్తీక పేరు వినించింది.. అయితే కార్తీక పేరు తెరమరుగైపోయి.. కొత్తగా కాజల్‌ పేరు తెరపైకొచ్చింది. ' దమ్ము'లో కాజల్‌ హీరోయిన్‌గా నటించడం దాదాపు ఖాయమైపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో .. కాజల్‌కి బదులుగా త్రిషని తీసుకున్నారని సమాచారం. ఇంతవరకు జూనియర్‌ ఎన్టీఆర్‌తో త్రిష ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

Thursday, October 27, 2011

గౌతమ్‌ గంభీర్‌కు పెళ్లి కళ ...

   భారత బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌ కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి నేడు వైవాహిక జీవితంలోకి ఆడుగుపెట్టబోతున్నాడు. ఢిల్లీకే చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె నటాషా జైన్‌తో గంభీర్‌కు గుర్గావ్‌ ఫామ్‌ హౌస్‌లో శుక్రవారం వివాహం జరగనుంది. ఈ ప్రయివేట్‌ కార్యక్రమానికి గంభీర్‌ సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ వివాహానికి ప్రముఖ సింగర్‌ రహత్‌ ఫతేష్‌ ఖాన్‌ ప్రత్యేక ఆహ్వానితునిగా విచ్చేయనున్నాడు. గౌతమ్‌, నటాషాలకు సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. ఆరు నెలల కిందే వీరి వివాహాం జరగాల్సింది. కానీ భారత్‌-ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌ నేపథ్యంలో వాయిదా పడింది.