నవదీప్, రాజీవ్ సాలూరి హీరోలుగా పంచి బొరా హీరోయిన్‌గా రవి కార్పొరేషన్ సంస్థ నిర్మిస్తున్న ' ఆకాశమే హద్దు ' చిత్రం రెండు పాటలు సహా 70 శాతం టాకీ పూర్తి చేసుకుంది. రవిచరణ్ మెరిపో ఈ చిత్రానికి దర్శకుడు. నిమ్మగడ్డ వేణుగోపాల్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఏప్రిల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత మాట్లాడుతూ '' నేటి యువతరం అభిరుచులకు అద్దం పట్టే చిత్రమది. ప్రేమ, బాధ్యతల మధ్య భావోద్వేగాలను మా చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం.
Sunday, January 30, 2011
Saturday, January 29, 2011
వారి పెళ్లిగోళ మనకెందుకు....?
అల్లు అర్జున్ పెళ్లి తేది ఖరారైపోయింది. ఎన్టీఆర్ పెళ్లి తేదీ కూడా తర్వలోనే ప్రకటించబడనుంది. ఇంతకీ మిగిలిన కుర్ర హారో, హీరోయిన్‌ల పెళ్లెప్పుడు అనే సందేహం ఇప్పుడు సినీ అభిమానులలో మెదులౌతున్న ప్రశ్న. హీరోలు సినిమాల మీద సినిమాలు తీసున్నారు. మరి పెళ్లెప్పుడు అని అడిగితే సమయం రావాలి కదా అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ , గోపీచంద్‌లను గురించి చెప్పుకోవచ్చు. వీరి పెళ్లి గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా మీడియాలో ఊహగానాలు వెలువడుతూనే ఉన్నాయి. ప్రభాస్ , కాజల్ వీరిద్దరి కాంభినేషన్‌లో డార్లింగ్, మిస్టర్ ఫర్‌పెక్టు సినిమాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య పుకార్లు వస్తున్నాయి .. ? ఈ సంవత్సరంలో వీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. గోపీచంద్, అనుష్కల గురించయితే చెప్పనవసరం లేదు. వారి ప్రేమ చిగురించిన నాటితో పోల్చుకుంటే వారికి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండాలి. అయినా ఇంకా సమయం కావాలి సమయం సమయం కావాలి దాట వేస్తూనే ఉన్నారు. ఇక పోతే రామ్ చరణ్, రాణా, మంచు మనోజ్, నాగచైతన్య, తరుణ్, నితిన్, ఉదరు కిరణ్ లిస్ట్‌లో ఉన్నారు. మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ పెళ్లి ఈ ఏడాదే జరిగే అవకాశాలున్నాయి. గతేఏడాది విష్ణు వివాహం జరిగిపోయింది. మనోజ్ వివాహనికి అడ్డంకులేవీ లేవు.
కెప్టెన్ వెంకి
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ( సీసీఎల్ ) మ్యాచ్ అటు దక్షిణాది, ఇటు ఉత్తరాది తారాగణంతో జరుగనుంది. టాలీవుడ్ జట్టుకు వెంకటేష్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరపున ఈ జట్టు ఓనర్‌గా మంచు విష్ణు వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14 లోపు ఈ జట్టులో ఎవరెవరు ఆడతారో నిర్ణయిస్తామని, ఆ టీం ఆవిష్కరణ కార్యక్రమం జరపగానికి సన్నాహాలు చేస్తున్నామని శనివారంనాడు మంచి విష్ణు విలేకరులకు తెలియజేశారు. జట్టుకు ప్రచార కర్తలుగా తాప్సీ, సమంత వ్యవహరిస్తున్నారు. కన్నడ జట్టుకు పునీత్ రాజ్‌కుమార్, హిందీ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్‌ఖాన్ వ్యవహరిస్తున్నారు.
ఆల్ రౌండర్స్ ..
షాహిద్ ఆఫ్రిద్, అబ్దుల్ రజాక్ , యూసుఫ్ పఠాన్, మాథ్యూస్ , దిల్షాన్, ఫెరీరా, షకిబుల్, రైడర్, నాథన్ మెకకలమ్, షేన్ వాట్సన్, కామెరూన్ వైట్, డేవిడ్ హసీ, క్రిస్‌గేల్, కాలింగ్‌వుడ్, ఇ లా ప్రతి ఒక టీమ్‌లో ఇద్దరు లేక ముగ్గురు ఆల్ రౌండర్స్ ఉంటారు.
షాహిద్ ఆఫ్రిద్, అబ్దుల్ రజాక్ లాంటి ఆల్ రౌండర్లు మెరుపులు మెరిపిస్తే ఎంతటి జట్టుయినా చిత్తు కావాల్సిందే. ముఖ్యంగా అఫ్రిద్ ఫామ్‌లోకి వస్తే చాలు ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. సిక్స్‌ల వర్షం కురిపిస్తాడు. అతని తోడు రజాక్ కూడా అవసరమైన సమయంలో జట్టును అదుకుని పరుగుల రాబట్టడం అలవాటు బౌలింగ్‌లో అఫ్రిది తన స్పిన్‌తో కీలక సమయాల్లో వికెట్టు పడగొట్టి మ్యాచ్‌ను మలుపుతిప్పుతాడు.
యూసుఫ్ పఠాన్ విధ్యంసకర బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపిస్తాడు. కీలక సమయంలో ఎలాంటి భయం లేకుండా అలవోకగా సిక్సర్లు ఫోర్లు బాదడం ఇతని బలం. బౌలింగ్‌లో తన ఆఫ్ స్పిన్‌తో కీలక వికెట్టు పడగొడతాడు. అతనికి తోడు యువరాజ్ సింగ్ ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టి పడేయడం, తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించడం యువీనైజం. వీరిద్దరూ రాణిస్తే ప్రపంచ కప్ ఇండియాదే.
మాథ్యూస్, ఫెరారీ, దిల్షాన్, లాంటి ఆల్ రౌండర్లు రాణిస్తే శ్రీలంక జయభేరి తథ్యం. దిల్షాన్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా రాణించగలడు. అతనికి తోడు మాథ్యూస్, ఫెరీరా ఇద్దరు మంచి అల్ రౌండర్లు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫోర్లు, సిక్సులతో విరుచుపడే మ్యాథ్యూస్, ఆరంభంలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు నడ్డి విరవడం వెన్నతో పెట్టిన విద్య.
షకిబుల్ బంగ్లాకు చాలా కీలక ఆటగాడు. వన్డేల్లో ఆల్‌రౌండర్‌గా రాణించగలిగాడు. బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలో సత్తా చాటుతున్నాడు.
న్యూజిలాండ్‌లో జట్టులో రైడర్, స్లైరీస్, వీరితో పాటు నాథన్ మెక్‌కలమ్ స్పిన్ బౌలర్‌గా, అల్ రౌండర్‌గా జట్టుకు సేవలందిస్తున్నాడు. రైడర్ బ్యాటింగ్‌లో మంచి ఫామ్‌తో పరుగుల వర్షం కురుపిస్తూనే.. తనదైన శైలి బౌలింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. స్టైరీస్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఎంతో తోడుపడుతున్నాడు. నాథన్ మెక్‌కలమ్ కీలక సమయాలలో జట్టుకు వెన్నంటి ఉంటూ విజయ తీరాలకు చేరుస్తున్నారు.
ఆస్ట్రేలియాలో షేన్ వాట్సన్, వైట్ వీద్దరు కలిసి రాణిస్తే విజయం వారిదే. జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్, మిడిలార్డర్‌లో డేవిడ్ హసీ, వైట్‌లలో ఏ ఒక్కరు రాణించినా ప్రత్యర్థి జట్టు విజయంపై ఆశలు వదులుకోవల్సిందే...!
క్రిస్‌గేల్ అతను ఉన్నతసేపు జట్టు విజయానికి డోకా ఉండదు. క్రిస్‌గేల్ సిక్స్, ఫోర్లు వర్షం కురిస్తే ఇక అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. జట్టులో అతని తోడుగా బ్రావో అల్ రౌండర్‌గా మంచి ప్రదర్శన కనబరుస్తాడు. వీరుద్దరు విజృంబించిన రోజు విండీస్‌పై గెలిచే దైర్యం ఏ జట్టుకు లేదు.

' జై బోలో తెలంగాణ' సినిమా పోటీ లేరు
'జై బోలో తెలంగాణ' చిత్రానికి నిజంగా ఎంత క్రేజ్ ఉందనేది తెలియదు. కానీ ఈ చిత్రంతో తలపడేందుకు ఎవరి వారు భయపడుతున్నారు. తెలంగాణలో, అంటే నైజాం ఏరియాలో ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉంటుందని చిత్ర పరిశ్రమ అంచనా వేస్తోంది. దాంతో ఈ సినిమాతో పాటు రిలీజ్ చేస్తే సినిమా వారం, లేక రెండు వారాలు పాటు వాయిదా వేసుకున్నారు.అందుకే ' జై బోలో తెలంగాణ ' చిత్రం విడుదలవుతున్న రోజు ఏ సినిమా విడుదలకు సిద్దంగా లేదు. ఇప్పటికే ' కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు' సినిమా వాయిదా పడగా, తాజాగా మరో సినిమా ' వస్తాడు నారాజు ' చిత్రం కూడా వారం రోజుల పాటు వెనక్కి వెళ్లింది.
Friday, January 28, 2011
కాంట్రాక్టుల వర్షం ..
భారత్ స్టార్ బ్యాట్స్‌మెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్ మైదానంలో ప్రవేశిస్తే పరుగుల వర్షం. కాంట్రాక్టులకు సుమఖత చూపితే కనకవర్షం. ఈ ఏడాది తొలి 27 రోజుల్లోనే సచిన్ టెండ్కూలర్‌కు అతడి ఆదాయం ఎంతో తెలుసా ! కోటిన్నర రూపాయలు. అతడు తాజాగా రు. 40 కోట్ల రూపాయల మేర కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో రాణించి భారత్‌కు ప్రపంచకప్ అందిస్తే మరిన్ని కాంట్రాక్టులు అతడికి దక్కనున్నాయనడంలో ఆశ్చర్యం లేదు. ాక కోకాకోలా సంస్థ సచిన్‌తో మూడేళ్ల కాంట్రాక్టు కుదర్చుకుంది. ఈ కాంట్రాక్టు విలువ రు. 20 కోట్లు. రు. 250 కోట్లతో ప్రాజెక్ట్ ప్రారంభించిన అమిత్ ఎంటర్‌ప్రైజెస్ సచిన్‌కు రెండు ఆధునాతన విల్లాలను కూడా కానుకగా సమర్పించుకుంది. వీటి విలువ ఒక్కొక్కటి రెండున్నర కోట్ల రూపాయాలు. సచిన్ ాప్పటికే 17 కంపెనీల ఉత్పతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.
ప్రపంచకప్ కీలకమైన జట్లు ఇవే
శ్రీలంక జట్టు : కుమార్ సంగక్కర , జయవర్ధన్, దిల్షాన్, మురళీ ధరన్, మథ్యస్, తరంగా, సమరావీరా , స్లిల్వా, కపుదెగేరా, పెరార్ , కులాశేఖరా, మలింగా, మెండిస్, హీరాత్ , పెరోనార్.
వెస్టిండీస్ జట్టు : డారెన్ సమ్మీ ( కెప్టెన్ ), క్రిస్ గేల్, బ్రావో, డారెన్ బ్రావో, పొలార్డ్, రామ్‌నరేష్ శర్వాన్, డెవోన్ స్మిత్, సులైమాన్ బెన్, నిఖితా మిల్లర్, బాగ్ ( వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, రవి రాంపాల్, కేమర్ రోచ్, చందర్ పాల్ , ఆండ్రియన్ భరత్.
న్యూజిలండ్ జట్టు : వెటోరి ( కెప్టెన్ ), బెన్నెట్, జేమ్స్ ఫ్రాంక్లిన్, గుప్టిల్, జేమీ హౌ, బ్రెండన్ మెక్‌కల్లమ్, నాథన్ మెక్‌కల్లమ్, కైల్ మిల్స్, జాకబ్ ఓరమ్, జెస్సీ రైడర్, టిమ్ సౌతీ, స్లైరిస్, రాస్ టేలర్, కేన్ విలియమ్సన్, ల్యూక్ వుడ్‌కాక్.
దక్షిణాఫ్రికా జట్టు : గ్రేమ్ స్మిత్ ( కెప్టెన్ ), ఆమ్లా, బోథా, డివిలియర్స్, డుమిని, డు ఫ్లెసిన్, ఇంగ్రామ్, కలిస్, మోర్నీ మోర్కెల్, వేనీ పార్నెల్, పీటర్సన్, స్టెయిన్, తాహిర్, సోట్‌సొబ్, వాన్‌విక్.
భారత్ జట్టు : మహేంద్రసింగ్ ధోనీ ( కెప్టెన్ ) వీరేంద్ర సెహ్వాగ్ ( వైస్ కెప్టెన్ ), సచిన్ టెండ్కూలర్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, యుసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, నెహ్రా, ప్రవీణ్ కుమార్, మునాఫ్ పటేల్, ఆశ్విన్, పీయూష్ చావ్లా
ఆస్ట్రేలియా జట్టు : రిక్ పాటింగ్ ( కెప్టెన్ ) మైఖెల్ క్లార్క్ ( వైస్ కెప్టెన్ ), బొల్లింగర్, బ్రాడ్ హ్యాడీస్, జాన్ హేస్టింగ్స్, నాథన్ హర్టీజ్, డేవిడ్ హస్సీ, మిచెల్ జాన్సన్, బ్రెట్‌లీ, టిమ్ ఫెయిన్, స్ట్రీవ్ స్మిత్, షాన్ టెయిట్, షేన్ వాట్సన్, కామెరూన్ వైట్.
పాక్‌స్థాన్ జట్టు : షాషిద్ ఆఫ్రీదీ, మిస్బాఉల్‌హక్, మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ ( వికెట్ కీపర్), యూనిస్ ఖాన్, అషద్ షఫీక్, ఉమర్ అక్మల్, అబ్దుల్ రజాక్, అబ్దుర్ రెహమాన్, సయ్యద్ అజ్మల్, పోయబ్ అక్తర్, ఉమర్‌గుల్, వహబ్ రీయాజ్, సోహాయిల్ తన్వీర్, అహ్మద్ షెహజాద్.
ఇంగ్లండ్ జట్టు : ఆండ్రూ స్ట్రాస్ ( కెప్టెన్ ), అండర్సన్, ఇయాన్ బెల్, టిమ్ బ్రెన్నన్, స్టువర్డ్ బ్రాడ్, పాల్ కాలింగ్‌వుడ్, ఇయాన్ మోర్గాన్, పీటర్సన్, ప్రయార్, అజ్మల్ షెహజాద్, గ్రేమ్ స్వాన్, ట్రెడ్‌వెల్, ట్రాట్, రైట్, యార్డీ.
ఆ హీరోతో కూడా చేస్తే ఓ పనైపోతుంది
తెలగుతో పాటు కన్నడంలో కూడా అగ్రతారల్లో ఒకరుగా భాసిల్లుతున్నారు ప్రియమణి. ఈమె ప్రస్తుతం. కన్నడంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. కాగా.ఇటీవల అక్కినేని నాగార్జునతో ' రగడ ' చిత్రంలో రొమాన్స్ చేసిన ఈ తార ఆ చిత్రంలోని ' అష్టలక్ష్మీ ' పాత్ర తనకెంతో పేరు తెచ్చి పెట్టిందనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.ఇదే విషయం గురించి ఆమె మాట్లాడుతూ '' నాగ్‌తో పుల్‌లెంగ్త్ హీరోయిన్‌గా నటించాలన్న నా కోరిక ' రగడ'తో తీరింది. ఆయనతో నాటించడం ఎంతో కంపర్టబుల్‌గా వుంటుంది. మళ్ళీ నాగ్‌తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఒకవైపు నాగార్జునతో ' రగడ' చేస్తూనే మరో వైపు ఆయన మేనల్లుడు సుమంత్‌తో ' రాజ్' చిత్రంలో నటిస్తుంటే ఎంతో థ్రిల్లింగ్ అనిపించేది. ఒకేసారి అక్కినేని కుటుంబానికి చెందిన ాద్దరు హీరోలతో నటించాను.ఇక బ్యాలెన్స్‌గా వున్న ' నాగచైతన్యతో కూడా నటిస్తే ఓ పనైపోతుంది. '' అంటూ ముసిముసిగా నవ్యుతూ తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. ప్రియమణి. మీరుఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలోనూ మరో హీరోయిన్‌తో కలిసి నటిస్తున్నారు. అప్పుడు మీ మధ్య కాంపిటీషన్ ఎలా వుంటుందన్న ప్రశ్నకు ఆమె సమధానం చెబుతూ ' ప్రతి హీరోయిన్‌తోనూ నాకు మంచి సంబంధమే వుంది.
Subscribe to:
Posts (Atom)