Friday, December 10, 2010
భారత్ 5-0 తేడాతో ఘన విజయం
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్‌లో భారత్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ విభాగంగా రాణించి సిరీస్ కైవసం చేసుకుంది. టెస్టు మ్యాచ్‌లో 1-0 తేడాతో, వన్డేలో 5-0 తేడాతో భారత్ - న్యూజిలాండ్ పై రెండు విభాగాలుగా విజయం సాధించింది. ఆఖరి చివరి వన్డేలో న్యూజిలాండ్ 103 పరుగులకే అలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో ఫ్రాంక్లింగ్ 24 పరుగులు చేసి టాప్ స్కోర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మైన్‌లు అంతగా రాణించలేకపోయారు. భారత్ బౌలింగ్‌లో ఆశ్విన్ 3 మూడు వికెట్లు తీసుకోగా యువరాజ్, యుసుఫ్ పఠాన్, నెహ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్ కుమార్ ఒక వికెటు తీసుకున్నారు. 104 పరుగుల లక్ష్యంతో భ్యాటింగ్ దిగిన భారత్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.ే గంభీర్ 0, విరాట్ కోహ్లీ 2 పరుగులకే అవుట్ అయ్యారు. ఓపెనరుగా వచ్చిన పార్థీవ్ పటేల్ అర్థ సెంచరీ చేశాడు. (56) పార్థీవ్ పటేల్ అండగా యువరాజ్ సింగ్ 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Monday, December 6, 2010
ఘాటెక్కిస్తానంటోన్న ' రిచా '
తొలి చిత్రం ' లీడర్'లో పద్దతిగా కన్పించిన రిచా గంగోపాధ్యారు, ' మిరపకారు' సినిమాకొచ్చేసరికి చాలా ఘూటుగా కన్పిస్తోంది.' మిరపకారు ' సినిమాతో తన గ్లామర్ ఘాటు ఏంటో చూపిస్తానంటోన్న రిచా వెంట టాలీవుడ్ దర్శక నిర్మాతక ఇప్పుడు క్యూ కడ్తున్నారట.నిన్న జరిగిన ' మిరపకాయ' సినిమా ఆడియో విడుదల వేడుకలో అందరి కళ్ళూ రిచాపైనే పడ్డాయంటే ఆమె ఎంత గ్లామర్‌ని వెద జల్లిందో అర్ధం చేసుకోవచ్చు. రేంజ్‌ని ఎంతవరకు పెంచుతుందోగానీ, ' మిరపకారు' సినిమాపై మాత్రం టాలీవుడ్‌లో అంచనాలు బాగానే వున్నాయి.
భూవివాదంలో అనుష్క
అందాల అనుష్క నటిగానే కాకుండా మంచి వ్యక్తిగా కూడా మన సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. వివాదాలకు, గొడవలకు ఎప్పుడూ దూరంగా వుంటుంది. తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి అనుష్క ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకొంది.రెండేళ్ల క్రితం వైజాగ్ లో కొందరు సినీప్రముఖులతో కలిసి అనుష్క కూడా విశాఖ జిల్లా భీమిలిలో కొంత భూమి కొనుగోలు చేసింది.అయితే ఆ స్థలం తనదేనని తనకి తెలియకుండా ఎవరో అక్రమంగా అనుష్కకి అమ్మేశాడని ఓ ఎన్నారై కోర్టు కెక్కాడు. ఈ కేసు విషయమై కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, అనుష్క వాటిని పట్టించుకోలేదు.దీంతో ఈ కేసు విచారణను చేపట్టిన న్యాయమూర్తి జనవరి 28 న అనుష్క వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీచేసింది. మరి దీనిని ఈ ముద్దుగుమ్మ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి! తరలిపోతున్న టాలీవుడ్..
Saturday, December 4, 2010
మూడు వన్డేలో భారత్ ఘన విజయం
కెప్టెన్ గంభీర్ 126 ( 117) సెంచరీ, విరాట్ కోహ్లీ 63 (70) అర్థసెంచరీలతో చెలరేగడంతో మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో భారత్ 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరికొద్ది రోచేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ విజయం టీం ఇండియాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఓపెనర్ విజరు 30( 50)తో గౌతమ్ గంభీర్‌లు మొదటి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం భారత్‌ను పటిష్ఠ స్థితిలో ఉంచింది.
అంతకు ముందుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్థీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుప్తిల్ 12, మెక్‌కలమ్ 0, విలియమ్‌సన్ 21, టేలర్ 4, స్లైరిస్ 22, వెట్లోరి 3, హాప్కిన్స్ 6, మెక్‌కలమ్ 43, మిల్స్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఫ్రాంక్లిన్ 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ బౌలర్లలలో జహీర్ , అశ్విన్,పఠాన్ రెండేసి వికెట్లు తీయగా, మునాఫ్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.
Sunday, November 28, 2010
మొదటి వన్డే భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ 40 పరుగుల తేడా విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.2 ఓవర్లలో 236 పరుగులకఁ అలౌట్ అయ్యింది. టేలర్ ఒక్కడే అర్థసెంచరీ చేశారు. మిగిత బ్యాట్‌మైన్ పెద్దగా రాణించలేకపోయారు. గుప్తిల్ 30, హౌ 9, విలియమ్‌సన్ 25, స్లైరిస్ 10, ఎలియట్ 5, హాప్కిన్స్ 16, టఫీ 4, మెక్‌కల్లమ్ 35, మిల్స్ 32 పరుగులకఁ ఔట్ అయ్యారు. భారత్ బౌలింగ్‌లో శ్రీశాంత్, యువరాజ్ సింగ్, అశ్విన్ తలో మూడు వికెట్లు తీసుకొఁ మిడిల్ ఆర్డర్‌ను కట్టడి చేశారు. నెహ్రాకఁ ఒక వికెట్ లభించింది.
అంతకముందు భారత్ 276 పరుగులకఁ ఆలౌటైంది. విరాట్ కోహ్లీ ( 105 )అద్బుత సెంచరీ చేశాడు.టాస్ ఓడి బ్యాటింగ్‌కఁ దిగిన భారత్ ఓపెనర్లు విజరు 29, గంభీర్ 38, పరుగులకఁ ఔటయ్యారు. కోహ్లీ యువరాజ్‌తో కలసి మూడు వికెట్‌కఁ 88 పరుగుల స్కోరు అందించారు. యువరాజ్ 42 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అ తర్వాత వచ్చిన బ్యాట్‌మైన్‌లు పెద్దగా రాణించలేకపోయారు. రైనా 13, వర్థమాన్ షా 4, ఆశ్విన్ 0, నెహ్రా 0, శ్రీశాంత్ 4, యుసుఫ్ పఠాన్ 29 పరుగులు చేశారు.న్యూజిలాండ్ బౌలర్లలలో మెకే నాలుగు, మిల్స్ మూడు, టఫే రెండు వికెట్లు దక్కాయి.
Wednesday, November 24, 2010
కొత్త సీఎంగా కిరణ్‌కూమార్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బుధవారం రాజీనామా సమర్పించిన రోశయ్య స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. కిరణ్‌కుమార్ రేడ్డి రేపు ఉదయం 10 గంటలకు స్పీకర్ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణా స్వీకారం చేస్తారు.
నేటి నుండి యాషెస్ పోరు
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య 133 సంవత్సరాల పోరాటం మరోసారి కొనసాగనుంది. యాషెస్ సిరీస్‌గా పేరుగాంచిన ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ గురువారం నాడిక్కడ ప్రారంభం కానుంది. ఆండ్రూ స్ట్రాస్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ట్రోఫీని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉండగా యాషెస్ సిరీస్‌ను ఎక్కువసార్లు గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఈసారి విజేతగా నిలవాలని ఉబలాటంతో ఉంది. రికీ పాంటింగ్ తన నాయకత్వ గరిమను మరోసారి చాటుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. 1988 తరువాత గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా అదే రికార్డును కొనసాగించేందుకు సమయాత్తమవుతుండగా ఆసీస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని స్ట్రాస్ బృందం ఎదురుచూస్తోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను గెలుచుకుని శుభారంభం చేయాలని ఇరు జట్లు ఉత్సుకతో ఉన్నాయి. ఇటీవలి కాలంలో సంచలన విజయాలు సాధిస్తున్న ఇంగ్లండ్ ఉత్సాహంతో ఉరకలేస్తుండగా కొన్ని ఎదురుదెబ్బలు తిన్న ఆసీస్ వాటి నుండి పాఠాలు నేర్చుకుని తన ప్రాభవానికి ఎదురులేదని చాటుకోవాలని ఆకాంక్షిస్తోంది. అయితే ఇటీవలికాలంలో ఆసీస్‌కు పెద్ద దిక్కుగా ఉంటున్న బోల్లింగర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడు. మిచెల్ జాన్సన్‌పై ఆసీస్ ప్రధానంగా ఆధారపడుతోంది.సైమన్ కటిచ్, షేన్ వాట్సన్, మైఖేల్ క్లార్క్, మైఖేల్ హస్సే మాత్రమే కాదు మార్కస్ నార్త్ , బ్రాడ్ హాడిన్, జాన్సన్ కూడా పరుగుల వర్షం కురిపించగల సత్తా ఉన్నవారు. రికీ పాంటింగ్ ఈ యాషెస్ సిరీస్‌ను ప్రతిష్టాత్మకమైందిగా భావిస్తున్నాడు. జాన్సన్‌తో పాటు సిడిల్, బెన్ హిల్ఫెన్హాస్ ఆసీస్ జట్టులో ప్రత్యర్థులను దెబ్బతీయగల బౌలర్లు. ఇంగ్లండ్ విషయానికి వస్తే కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్, కెవిన్ పీటర్సన్, పాల్ కాలింగ్‌వుడ్ ప్రత్యర్థులపాలిట సింహస్వప్నాలే. అలెస్టర్ కుక్ ఫామ్‌లో ఉన్నాడో, లేదో తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో పిచ్ ఫాస్ట్‌బౌలింగ్‌కు అనుకూలంగా మారగలదని నిపుణులు భావిస్తున్నారు.
Tuesday, November 23, 2010
' నాగవల్లి' డిసెంబర్ 16న విడుదల
వెంకటేష్ నటించిన ' చంద్రముఖి ' సీక్వెల్ ' నాగవల్లి' డిసెంబర్ 16న విడుదలయ్యే అవకాశముంది. వెంకటేష్ హీరోగా అనుష్క, కమలినీ ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దాదాస్ తారమణులుగా ఈ చిత్రం నటించనున్నారు. ఆడియో చాలా పెద్ద హిట్ కావడంతో సినిమా పై కూడాప్రేక్షకల్లో అంచనాలున్నాయి. వెంకటేష్ అభినయం హైలైట్ అవుతుంది. చంద్రముఖి కంటే నాగవల్లి పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకు ఏర్పడింది.
Subscribe to:
Posts (Atom)









