Tuesday, November 23, 2010

నాగపూర్‌ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం


న్యూజిలండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధిచింది. న్యూజిలాండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు అలౌట్‌ అయ్యింది. దీంతో మూడు టెస్టుల సీరీస్‌ను 1-0 తేడాతో భారత్‌ గెలుచుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ద సీరీస్‌గా హర్భజన్‌, మ్యాన్‌ ఆప్‌ద మ్యాచ్‌గా ద్రవిడ్‌ ఎంపికయ్యారు. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సౌతీ 31 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. భారత్‌ బౌలింగ్‌లో ఇషాంశ్‌ శర్మ , హర్బజన్‌ సింగ్‌ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఓజా, రైనా ఇద్దరు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Sunday, November 21, 2010

రెండో రోజు భారత్‌ స్కోర్‌ 292/2




 న్యూజిలండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట మూగిసే సమయానికి భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. సచిన్‌ 57, ద్రావిడ్‌ 69 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అంతక ముందు న్యూజిలాండ్‌ 148 పరుగులతో ఆట ప్రారంభించి మరో 45 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 292/2 పరుగులు చేసింది. సెహ్వాగ్‌, గంభీర్‌ ఇద్దరు ఆట ప్రారంభించి మొదటి వికెటు 113 పరుగుల వద్ద సెహ్వాగ్‌ వెట్లోరి బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. ( 72 బంతులలో 12 ఫోర్లు, 1 సిక్స్‌లతో ) 74 పరుగులు చేశాడు. గంభీర్‌ ( 127 బంతులలో 12 ఫోర్లు ) 78 పరుగులు చేశాడు. సచిన్‌ 57, ద్రావిడ్‌ 69 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్‌ బౌలింగ్‌లో వెట్లోరి, సౌతీ చెరో వికెటు లభించింది. భారత్‌ 99 పరుగుల అధిక్యతం ఉంది.

Monday, November 15, 2010

న్యూజిలండ్‌ స్కోరు 273/4


భారత్‌ - న్యూజిలండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్యలో నాల్గొవ రోజు న్యూజిలాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మెక్‌కల్లమ్‌ 124, విలియమ్‌సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో టెస్టు మ్యాచ్‌ కూడా డ్రా దిశగా పయనిస్తుంది. నాల్గోవ రోజు ఆట ప్రారంభించిన భారత్‌ మరో 36 పరుగులు చేసి చివరి వికెటు కోల్పోయింది. భజ్జీ 116 బంతులలో ఏడు ఫోర్లు, ఏడు సిక్స్‌ర్‌ల సహయంతో సెంచరీ చేసి నాటౌట్‌గా మిగిలాడు. శ్రీశాంత్‌ 24 పరుగుల ఔట్‌ అయ్యాడు. భారత్‌ 122 పరుగుల అధికత్యం నిలిచింది. న్యూజిలండ్‌ రెండో ఇన్సింగ్‌ ప్రారంభించిన నాలుగు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మెకింతోష్‌ 49, గుప్తిల్‌ 18, టైలర్‌ 7, రైడర్‌ 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. మెక్‌కల్లమ్‌ 124, విలియమ్‌సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ బౌలింగ్‌లో ఓజా రెండు వికెట్లు తీసుకున్నాడు. శ్రీశాంత్‌ , రైనా చెరో వికెటు తీసుకున్నారు. న్యూజిలండ్‌ 115 పరుగుల లీడ్‌తో ఉంది.

Sunday, November 7, 2010

తీవ్రత తగ్గిన 'జల్‌'



కొద్దిరోజులుగా వణుకు పుట్టించిన జల్‌ తుపాను తీవ్రత తగ్గింది. తీవ్ర తుపాను నుండి సాధారణ తుపాను స్థాయికి జల్‌ తీవ్రత తగ్గినట్లు వాతావరణశాఖ ఆదివారం సాయంత్రం నిర్ధారించింది. ఇది మరింతగా బలహీనపడి చెన్నై, నెల్లూరుల మధ్య ఆదివారం రాత్రికే తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. తుపాను కారణంగా నెల్లూరు జిల్లాలో 14 మంది, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. విశాఖ జిల్లాలో ఒక మత్స్యకారుడు గల్లంతయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంక వద్ద సముద్రంలో 15 మంది జాలర్లతో కూడిన సోనా బోటు చిక్కుకుంది. కృష్ణపట్నం రేవులో పదో నెంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. పులికాట్‌ సరస్సు పొంగుతోంది. కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమశిల, కండలేరు జలాశయాలు నిండాయి. తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో పెద్దఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. సముద్రం కల్లోలంగా ఉంది.రాత్రి 7.30 గంటలకు భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం తుపాన్‌ చెన్నై తీరానికి 90 కిలోమీటర్లు దూరాన, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది.


దక్షిణ కోస్తా జిల్లాల వైపు నెమ్మదిగా కదులుతున్న తుపాను ఆదివారం రాత్రి 12 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున రెండు గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అయితే తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు మీటరు నుంచి రెండు మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత తగ్గినప్పటికీ మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను కొనసాగిస్తోంది.

అహ్మదాబాద్‌ టెస్టు : భారత్‌ 82/6


న్యూజిలండ్‌తో జరుగుతున్న తొలిటెస్టు నాలుగో రోజున ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 82 పరుగుల మాత్రమే చేసింది. లక్ష్మణ్‌ 34, భజ్జీ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ గంభీర్‌ 0, సెహ్వాగ్‌ 1, ద్రావిడ్‌ 1, సచిన్‌ 12, రైనా 0, ధోని 22 పరుగులకే అవుట్‌ అయ్యారు. మార్టిన్‌ భారత్‌ను దెబ్బమీద దెబ్బ తీశాడు. భారత్‌ 110 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Saturday, November 6, 2010

భారత్‌కు కివీస్‌ చెక్‌


uó²sÁÔYÔà ÈsÁT>·TÔáTq• yîTT<Š{ì fÉdŸT¼ eÖ«#YýË eTÖ&à sÃE qÖ«›ý²+&Ž €³eTTНd dŸeTjáÖ“¿ì ×<ŠT $¿³T¢ ¿ÃýËÎsTT 331/5 |ŸsÁT>·T\T #ûd¾+~. ÂsÕ&ƒsY 104 , $*jáTyŽTdŸHŽ 87,  yîT¿ù¿£\¢yŽT 65, fñ\sY 56 |ŸsÁT>·T\T #ûXæsÁT. uó²sÁÔY u…*+>´ýË  zC² Âs+&ƒT $¿³T¢ rdŸTÅ£”H•&ƒT. ÈVÓ²sY U²HŽ, çoXæ+ÔY,  VŸ²sÁÒÈHŽ d¾+>´ #îsà $¿³T rdŸTÅ£”H•sÁT. uó²sÁÔY ©&+>´ 156 |ŸsÁT>·T\T.

Thursday, November 4, 2010

దీపావళి శుభాకాంక్షలు

పరుగుల విందు



డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన బ్యాట్‌ పదునును న్యూజిలాండ్‌ బౌలర్లకు మరోసారి రుచి చూపించాడు. వరుస వైఫల్యాలతో నిరుత్సాహపరుస్తున్న రాహుల్‌ ద్రావిడ్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి మొటేరా మైదానంలో తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. వీరిద్దరూ విజృంభించి ఆడి సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్‌తో గురువారం నాడిక్కడ ప్రారంభమైన తొలి క్రికెట్‌ టెస్టులో భారత్‌ మొదటి రోజు మూడు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. వన్డే మ్యాచ్‌ తరహాలో బ్యాటింగ్‌ చేసిన సెహ్వాగ్‌ 173 పరుగులు చేసి అవుటయ్యాడు. కాగా ద్రావిడ్‌104 పరుగులకు అవుటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 237 పరుగులు జోడించి రికార్డు నెల కొల్పారు. వరుసగా తొమ్మిది టెస్టుల్లో టాస్‌ కోల్పో యిన ధోనీ ఈ టెస్టులో టాస్‌ గెలవడం తరువాయి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. బౌలర్లకు భారంగా పరిణ మించిన పిచ్‌పై భారత్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగి ఆడారు. 

తొలి వికెట్‌కు గంభీర్‌, సెహ్వాగ్‌ 12 ఓవర్లలోనే 60 పరుగులు చేసి శుభారంభం అందించారు. గంభీర్‌ అవుటైన తరువాత వచ్చిన ద్రావిడ్‌ ఆరంభంలో కొంత నిదానంగా ఆడినప్పటికీ తరువాత పుంజు కున్నాడు.సెహ్వాగ్‌తో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. సునీల్‌ గవాస్కర్‌, సురీందర్‌ అమర్‌నాథ్‌ 1976లో ఆక్లండ్‌లో 204 పరుగులు చేసి నెలకొల్పిన రికార్డును సెహ్వాగ్‌, ద్రావిడ్‌ జోడీ చెరిపేసింది. మొదటి రోజు ఆట టీ విరామం తరువాత భారత్‌ ఈ రెండు వికెట్లను కోల్పోయింది.సెహ్వాగ్‌కు టెస్టుల్లో ఇది 22వ సెంచరీ కాగా ద్రావిడ్‌కు 30వది.