ఎంత ఎదిగినా మూలాల్ని, ఎంత ఎత్తుకు చేరుకున్నా నడిచొచ్చిన దారిని మర్చిపోకూడదు. ఆ అనుభవాలే వెలకట్టలేని పాఠాల్ని, భవిష్యత్తుకు కావాల్సినంత భరోసాని అందిస్తుంటాయి. ఆ మాటే చెబుతోంది సమంత. తెలుగు చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న కథానాయికల జాబితాలో సమంత పేరు కూడా ఉంటుంది. కానీ ఒకప్పుడు వెయ్యి రూపాయలు సంపాదించడానికి అల్లాడిపోయిందట. మూడేసి గంటలు నిలబడాల్సివచ్చేదట. ఈ విషయాన్ని సమంతే చెప్పుకొచ్చింది. ‘‘పద్నాలుగేళ్ల నుంచీ నా అవసరాలకు సరిపడా డబ్బుని నేను సంపాదించుకోవడం మొదలెట్టా. చిన్న చిన్న పనులెన్నో చేశా. పెళ్లి జరుగుతున్నప్పుడు వీధి గుమ్మం దగ్గర పన్నీరు చల్లడానికి ఇద్దరు అమ్మాయిల్ని నిలబెడతారు కదా? ఆఖరికి ఆ పనీ చేశా. మూడు గంటలు నిలబడితే... వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. ఎంత సంపాదించానన్నది కాదు. అది నా కష్టార్జితం. ఆ మాటే గొప్ప సంతృప్తిని ఇచ్చేది. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నా... అప్పటి కిక్ రావడం లేద’’ంటోంది సమంత..