Saturday, April 30, 2016

రానాతో కాజల్‌?

 చిన్న చిత్రాలతో విజయాలు సాధించిన దర్శకుడు తేజ. ఆయనకు గత కొంతకాలంగా సరైన విజయాల్లేవు. ఇటీవల ఆయన రూపొందించిన ‘హోరా హోరీ’ నిరాశపరిచింది. తేజ ఇప్పుడు మరో ప్రయత్నం చేయబోతున్నారు. ఆయన రానా కోసం కథ సిద్ధం చేశారని సమాచారం. రానా కూడా తేజతో పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా కాజల్‌ని ఎంచుకొన్నారట. ‘లక్ష్మీ కల్యాణం’తో కాజల్‌ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది తేజనే. ఆ తరవాత ఆయన దర్శకత్వంలో కాజల్‌ నటించలేదు. ప్రస్తుతం ‘బాహుబలి 2’, ‘ఘూజీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు రానా. త్వరలోనే తేజ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

Thursday, April 28, 2016

మంచి కథ దొరికితే ఒకే సినిమాలో ముగ్గురం..

   ఖరీదైన వస్తువులు, విలువైన ఆస్తులను కొనుగోలు చేయడం లాంటి విషయాలకు దూరంగా ఉండాలని తన పిల్లలకు తరచూ చెప్నేవాడినని బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ అంటున్నాడు. ఇప్పటికీ తన వయసు మీద పడ్డట్లు కనిపించకుండా చూసుకునే అనిల్, తన పిల్లలకు సలహాలు ఇస్తుంటానని చెప్పాడు. సోనమ్ కపూర్, హర్షవర్థన్ కపూర్,రియా కపూర్ లకు ఆరోగ్యానికి సంబంధించిన వాటిపై ఖర్చు చేయడంలో తప్పులేదన్నాడు. ఆస్తులు, ఆభరణాలు, విలువైన బ్యాగులు లాంటివి కోనుగోలు చేయడం వృథా అని ఆయన అభిప్రాయపడ్డాడు. తాను మాత్రం స్పా సెంటర్లలో ఎక్కువగా గడుపటానికి ఇష్టపడతానని, అందువల్లే చాలా అనందంగా, ఆరోగ్యంగానూ ఉంటానని అనిల్ హెల్త్ సీక్రెట్ బయటపెట్టాడు.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) 17వ ఎడిషన్ వేడుకల నిర్వహణ స్పెయిన్ లోని మాడ్రిడ్ లో జరుగుతుందని తెలిపాడు. మెడికల్ స్పా ఎక్కడ ఉన్నా సరే వాటిలో అత్యుత్తమమైన వాటిలో కనీసం వారమైనా ఆరోగ్యం కోసం గడుపుతానని వెల్లడించాడు. ఇంకా చెప్పాలంటే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ బరువు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆస్ట్రియాలోని 'స్పా' సెంటర్లకు తరచుగా వెళ్తుంటారని చెప్పుకొచ్చాడు. వారసుడు హర్షవర్ధన్, సోనమ్ లతో కలిసి నటించే ఆలోచన ఉందా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ... మా ముగ్గురికి సమ ప్రాధాన్యం ఉండేలా ఏదైనా స్క్రిప్టుతో దర్శకుడు వస్తే  కచ్చితంగా ఇది నెరవేరుతుంది అంటూ అనిల్ కపూర్ నవ్వేశాడు.

Tuesday, April 26, 2016

అన్నదమ్ములిద్దరూ... ఒకేరోజు

 చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ తరవాతి చిత్రాన్ని పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు మొదలెడతారా అనే ఆసక్తి నెలకొంది. ఈ రెండు ప్రశ్నలకు ఒకేసారి సమాధానం దొరికిందిప్పుడు. చిరంజీవి - వినాయక్‌ల ‘కత్తి’ రీమేక్‌కి ఈనెల 29న లాంఛనంగా కొబ్బరికాయ కొట్టేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. అదే రోజున పవన్‌ కల్యాణ్‌ - ఎస్‌.జె.సూర్యల సినిమా కూడా ముహూర్తం జరుపుకోనుందట. 29వ తారీఖు దాటితే మంచి ముహూర్తాలు లేవని వీరిద్దరూ అదే రోజున తమ సినిమాని లాంఛనంగా ప్రారంభించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. వచ్చే నెల చివరి వారంలో చిరు సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. పవన్‌ - సూర్యల చిత్రం కూడా వచ్చే నెలలోనే మొదలవుతుంది. ఈలోగా అటు వినాయక్‌, ఇటు ఎస్‌.జె సూర్య స్క్రిప్ట్‌పై కసరత్తులు ముమ్మరం చేశారు. చిరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌, పవన్‌ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.

Monday, April 25, 2016

అనుష్క గురించి కోహ్లి ఏం చెప్పాడంటే!

 విరాట్‌ కోహ్లి కెరీర్‌ మంచి జోరుమీద ఉంది. అటు మైదానంలోనూ, అటు వ్యక్తిగత జీవితంలోనూ అతను దూసుకుపోతున్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌గా దూకుడు మీదున్న కోహ్లి తాజాగా టీ-20లో సెంచరీ కూడా కొట్టాడు. క్రికెట్‌లో అసాధారణమైన పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తున్న కోహ్లి వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా కనిపిస్తున్నాడు. గతంలో బ్రేకప్‌ చేసుకున్నట్టు భావిస్తున్న కోహ్లి-అనుష్క శర్మ మళ్లీ ఒక్కటైనట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఈ ప్రేమజంట డిన్నర్ చేస్తూ కనబడింది.                        ఈ నేపథ్యంలో కోహ్లి సోమవారం ముంబైలో తన అభిమానులతో పిచ్చాపాటిగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా మీరు మీ ప్రియురాలు అనుష్క శర్మతో మళ్లీ కలిసిపోయారా? ఒకరు ప్రశ్నించగా.. 'అదిమాత్రం ఎవరికీ తెలియకూడదు. ఆ విషయంపై నేనేమీ మాట్లాడను' అంటూ దాటవేశారు. దీంతో ఓ మహిళా జర్నలిస్టు 'మీ వ్యక్తిగత జీవితం ఎలా సాగుతుంది' అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో కనుబొమ్మలు ముడేసిన కోహ్లి 'నా వ్యక్తిగత జీవితం గురించి కొంతవరకు తెలుసుకొనేందుకు ఫ్యాన్స్‌కు అవకాశముందని చెప్పాను. దానర్థం నా వ్యక్తిగత జీవితం గురించి ప్రతి విషయాన్ని చెప్తానని కాదు' అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు.

Saturday, April 23, 2016

రివ్యూ: సరైనోడు

 ఆరు పాటలు.. నాలుగు ఫైటింగ్‌లు.. కొంచెం ఎమోషన్‌.. అన్నిటికంటే మించి హీరోయిజం. ఇవి ఉంటే చాలు.. కమర్షియల్‌ సినిమా తయారైపోతోందిప్పుడు. ఈ నాలుగూ ఏ స్థాయిలో ఉన్నాయన్న దాని మీదనే సినిమా జయాపజయాలు ఆధారపడుతున్నాయి. బోయపాటి శ్రీను సినిమాలూ వాటినే నమ్ముకొన్నాయి. ఈసారి ఆయనకు.. స్టైల్‌ జోడించే కథానాయకుడు దొరికాడు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రమే ‘సరైనోడు’. బోయపాటి శైలికి.. అల్లు అర్జున్‌ స్టైల్‌కీ లింకు ఎలా కుదిరింది? ‘సరైనోడు’ ఎలా ఉంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.. పదండి.
కథేంటి?: గణ (అల్లుఅర్జున్‌) కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించడు. ఎంతటివాడికైనా ఎదురెళ్తాడు. స్థానిక ఎమ్మెల్యే దివ్య (కేథరిన్‌)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఇంట్లో వాళ్లు కూడా వీరిద్దరి ప్రేమని అంగీకరిస్తారు. అయితే.. ఎవరితోనూ గొడవ పెట్టుకోననే మాటిస్తేనే పెళ్లిచేసుకొంటానని షరతు విధిస్తుంది దివ్య. అమ్మవారి ముందు ప్రమాణం చేయబోతుండగా.. అక్కడికి మహాలక్ష్మి(రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) వస్తుంది.
ఆమె కోసం మళ్లీ బరిలోకి దిగుతాడు గణ. మహాని వెంటాడుతున్న సమస్య పేరు.. వైరం ధనుష్‌ (ఆది పినిశెట్టి). అతను ముఖ్యమంత్రి కొడుకు. పర్ణశాల అనే గ్రామంలోని పంటపొలాల్ని బలవంతంగా లాక్కుని అక్కడ వ్యాపారం చేయాలనుకొంటాడు. అడ్డొచ్చినవాళ్లని చంపుతూ పోతుంటాడు. ఆ పర్ణశాలకీ మహాకీ సంబంధం ఏమిటి? ధనుష్‌ని గణ ఎలా ఎదిరించాడు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది?: కమర్షియల్‌ సూత్రాలకు అనుగుణంగా అల్లుకొన్న కథ ఇది. దుర్మార్గుడైన ప్రతినాయకుడు. అతన్ని ఎదిరించే కండబలం ఉన్న కథానాయకుడు. వారిద్దరి మధ్య పోరు. తెలిసిన చిన్న కథనే తీసుకున్న దర్శకుడు తనదైన శైలిలో కథనాన్ని నడిపించారు.
హీరోయిజం.. పోరాటాలు.. పాటలు.. బిల్డప్‌ షాట్స్‌.. ఇలా మాస్‌కి నచ్చే అంశాల్ని రంగరించారు బోయిపాటి. మాస్‌తో పాటు.. అల్లుఅర్జున్‌ అభిమానులకు ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం విడివిడిగా చూస్తే బాగానే ఉన్నట్టు అనిపించినా వాటిని కలిపే బలమైన కథ లేకపోవడం ‘సరైనోడు’లో కనిపించే ప్రధానమైన లోటు.
విశ్రాంతి ముందొచ్చే పోరాట ఘట్టం ఆకట్టుకుంటుంది. కోర్టు సన్నివేశంలో ఎమోషన్‌ని బాగా పండించారు. ద్వితీయార్థంలో అనుకోని మలుపులు పెద్దగా కనిపించవు. కామెడీని నమ్ముకున్నా ఆశించినంతగా పండలేదు. అయితే.. పతాక ఘట్టాలు మాత్రం ఆకట్టుకొంటాయి. అదే.. ‘సరైనోడు’ అనుకునేలా చేస్తుంది.
ఎవరెలా?: ఈ సినిమా కోసం అల్లుఅర్జున్‌ బాడీ పెంచాడు. కండ బలం చూపించాడు. మాస్‌కి నచ్చేలా మారిపోయాడు. యాక్షన్‌ ఘట్టాల్లో చాలా చురుగ్గా కనిపించాడు. తనకు అలవాటైన డాన్సుల్లో మరింత అలరించేలా చేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని లాగించే ప్రయత్నం చేశాడు.
కేథరిన్‌ ఓకే అనిపిస్తుంది. రకుల్‌కి అంత స్కోప్‌ లేదు. ఆది పినిశెట్టి నటన ఆకట్టుకుంటుంది. ప్రతినాయకుడిగా బన్నీకి దీటుగా కనిపించాడు. బ్రహ్మానందం అప్పుడప్పుడు కాస్త నవ్విస్తాడు. శ్రీకాంత్‌కి ఇలాంటి పాత్రలు అలవాటే. మిగిలినవాళ్లంతా తమ అనుభవంతో బండి లాగించేశారు.
తమన్‌ అందించిన బాణీల్లో రెండు బాగున్నాయి. ‘తెలుసా.. తెలుసా’ మంచి మెలోడీ. యాక్షన్‌ ఘట్టాల్ని తన నేపథ్య సంగీతంతో మరింత ఎలివేట్‌ చేశాడు. ద్వితీయార్థానికి కాస్త కత్తెర పడాల్సింది.. సినిమా అంతా స్టైలిష్‌గా తీశారు. రత్నం డైలాగులు అక్కడక్కడ పేలాయి. కథకుడిగా బోయపాటి కొత్తగా ఏం చేయకున్నా.. తన బలాలపైనే దృష్టి పెట్టాడు. బోయపాటి సినిమాల్లో ఏవైతే హైలైట్స్‌గా కనిపిస్తాయో.. సరైనోడులోనూ రిపీట్‌ అయ్యాయి.. మారింది హీరో మాత్రమే.
చివరిగా.. మాస్‌కి వీడు.. ‘సరైనోడు’ 

Wednesday, April 20, 2016

పెళ్లిపై స్పందించిన తమన్నా

 ముంబయికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని మిల్కీబ్యూటీ తమన్నా వివాహం చేసుకుంటోందని, పెళ్లి తరువాత ఆమె సినిమాలు చేయడం మానేస్తుందని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలన్నీ అవాస్తవమని తమన్నా తేల్చి చెప్పారు.
తాను ఈ వార్తలు చదివిన వెంటనే ట్విట్టర్‌ ద్వారా ఖండించానని, అయినప్పటికీ కొందరు తన పెళ్లిపై స్టోరీలు రాస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో మూడు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నానని తెలిపారు. అసలు ఈ వార్త ఎలా ప్రచారంలోకి వచ్చిందో తనకు తెలియడం లేదని చెప్పారు తమన్నా. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని, పెళ్లి వార్త ఏమైనా ఉంటే మొదట అందరికీ చెబుతానన్నారు.

Tuesday, April 19, 2016

ఆలియా, సిద్ధార్థ్‌ డిషూం.. డిషూం

 బాలీవుడ్‌ ప్రేమపక్షులు ఆలియా భట్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాల మధ్య పెద్ద గొడవ జరిగిందని సినీ వర్గాల సమాచారం. ఇటీవల సినీ నిర్మాత మన్మోహన్‌ శెట్టి కుమార్తె ఆర్తీ శెట్టి బర్త్‌డే పార్టీకి హాజరైన ఇద్దరూ పార్టీలో గొడవపడినట్లు తెలుస్తోంది.
సిద్ధార్థ్‌కి ఆలియా మాజీప్రియుడు అలీ దడార్కర్‌ ప్రవర్తన నచ్చడంలేదని ఈ విషయమై ఇద్దరి మధ్య వాదులాట జరిగిందని బాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. పార్టీ అయ్యాక ఇద్దరూ అసలేం జరగనట్లు వెళ్లిపోయారు. ఇటీవల కరణ్‌ జోహార్‌ ఇంటికి వెళ్లిన వీరిద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకుని విడివిడిగా ఎవరి కారులో వారు ఇంటికి వెళ్లిపోయారట. వీరిద్దరి మధ్య గొడవ సద్దుమణుగుతుందో లేదో చూడాలి.

విన్నారా!

 కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రభాస్‌కు ఇష్టం. దానికోసం పుస్తకాలు బాగా చదువుతారు. కొత్త కొత్త టాపిక్స్‌తో వచ్చే పుస్తకాలను ఏరికోరి చదువుతుంటారు. ఆయన ఇంట్లో ఓ మినీ లైబ్రరీ ఉంది. దాన్నిబట్టి ఈ యంగ్ రెబల్ స్టార్ ఏ రేంజ్‌లో పుస్తకాలు చదువుతారో ఊహించుకోవచ్చు. చదువు వల్ల వచ్చే జ్ఞానం ఎప్పటికీ వృథా కాదని ప్రభాస్ నమ్ముతారు. ‘‘పుస్తకాలు మానసిక వికాసానికి తోడ్పడతాయి. అందుకే  చదువుతుంటాను. షూటింగ్స్ బిజీ వల్ల పుస్తకాలు చదివే తీరిక చిక్కడంలేదు. కానీ, టైమ్ దొరికినప్పుడల్లా ఏదో ఒక బుక్ చదివేస్తా’’ అని ప్రభాస్ అన్నారు. ప్రస్తుతం ‘బాహుబలి 2’లో నటిస్తూ బిజీగా ఉన్నారాయన.

Monday, April 18, 2016

రివ్యూ: ‘ఫ్యాన్‌’


బాలీవుడ్‌లో ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించగల నేర్పరి షారుఖ్‌ ఖాన్‌. రొమాంటిక్‌ హీరోగానే కాదు.. విలన్‌ పాత్రల్లోనూ తనలోని నటనా చాతుర్యంతో ప్రేక్షకులను అకట్టుకుంటాడు. 2006లో వచ్చిన ‘డాన్‌’.. 2011లో సీక్వెల్‌గా వచ్చిన ‘డాన్‌-2’లో షారుఖ్‌ నెగెటివ్‌ పాత్రల్లో కనిపించాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మరో నెగిటివ్‌ రోల్‌తో ‘ఫ్యాన్‌’గా థియేటర్లలోకి అడుగుపెట్టాడు. గురువారం యూఏఈలో విడుదలైన ‘ఫ్యాన్‌’ చిత్రం.. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రేక్షకుల్ని ఈ ‘ఫ్యాన్‌’ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం.
కథేంటంటే..: ఆర్యన్‌ ఖన్నా(షారుఖ్‌ ఖాన్‌) దేశంలోనే అత్యంత అభిమానగణం ఉన్న హీరో. 19 ఏళ్ల గౌరవ్‌(షారుఖ్‌ ఖాన్‌) అతనికి ప్రపంచంలోనే గొప్ప అభిమాని. విశేషమేమిటంటే.. ఇద్దరూ అచ్చుగుద్దినట్లు కవలల్లా ఉంటారు. ముఖకవళికలు.. శరీరాకృతి.. హావభావాల్లో వీసమెత్తు తేడా కనిపించదు. ఆర్యన్‌ ఫొటోలు.. ఫ్లెక్సీలతో తన ఇంటినే ఓ ఆల్బమ్‌లా మార్చేస్తాడు ఆ ‘ఫ్యాన్‌’. ఒక్క మాటలో చెప్పాలంటే తన అభిమాన హీరోనే అతని ప్రపంచం! ఆర్యన్‌ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు వూరుకోడు. చీల్చి చెండాడుతాడు. అంత అభిమానం మరి.
ఓ రోజు ఎలాగైనా ఆర్యన్‌ను కలవాలని ముంబయిలోని అతని ఇంటికి వెళతాడు గౌరవ్‌. అతన్ని చూసి ఆర్యన్‌ ఉద్వేగానికి గురవుతాడు. దాంతో ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. అనుకోకుండా ఆ అనుబంధం తెగిపోయి.. ఇద్దరి మధ్య వైరుధ్యం ఏర్పడుతుంది. ఆర్యన్‌కు ఉన్న మంచిపేరును చెడగొడతానని గౌరవ్‌ శపథం చేస్తాడు. దీంతో అప్పటి వరకూ తన అభిమాన నటుడి కోసం గౌరవ్‌ పడరాని పాట్లు పడగా.. ఆ తర్వాత కథ అడ్డం తిరుగుతుంది. గౌరవ్‌ను ఛేజ్‌ చేసేందుకు హీరో నానా తంటాలు పడతాడు. మరి చివరికి ఆ ‘ఫ్యాన్‌’ అన్నంత పని చేశాడా? అందుకు హీరో ఏం చేశాడు? తదితర విషయాలను తెరపైన చూడాల్సిందే.
ఎలా ఉందంటే..: షారుఖ్‌ అభిమానులకు ‘ఫ్యాన్‌’ డబుల్‌ బొనాంజా అనే చెప్పొచ్చు. 19 ఏళ్ల యువకుడి పాత్రలో షారుఖ్‌ ఇమిడిపోయిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆర్యన్‌ను కలిసేందుకు గౌరవ్‌ పడే తిప్పలు.. ఆ తర్వాత ఇద్దరి మధ్య వైరుధ్యం వంటి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ సగటు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. చిత్రం మొత్తాన్ని ‘వన్‌ మ్యాన్‌ షో’గా నడిపించేశాడు షారుఖ్‌.
ద్వితీయార్ధంలో మాత్రం కొన్ని సన్నివేశాలు కాస్త మందకొడిగా సాగినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంతో తన రియల్‌ అభిమాని వలూచా డిసౌజాను వెండితెరకు పరిచయం చేశాడు షారుఖ్‌. ఈ చిత్రంలో షారుఖ్‌ సతీమణి గౌరీఖాన్‌గా నటించింది. ఇతర నటీనటులు వారి పరిధుల మేరకు మొప్పించారు.
సాంకేతికంగా..: నేపథ్య సంగీతం విషయంలో సంగీత దర్శకుడు బాగానే పని చేసినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. తర్వాతేం జరుగుతుంది? అన్న ఉత్కంఠను కలిగించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు.

ఓపెనింగ్ కలెక్షన్లు.. రూ. 680 కోట్లు

  హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. భారత్ కంటే ఆలస్యంగా నార్త్ అమెరికాలో విడుదలైన ఈ సినిమాకు 680 కోట్ల రూపాయల ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఇక భారత్ లో ఈ నెల 8న విడుదలైన ఈ సినిమా పది రోజుల్లో 100 కోట్ల మార్క్ దాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1588 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.
ఈ సినిమా భారత్ సహా 15 దేశాల్లో 8వ తేదీ విడుదల కాగా, నార్త్ అమెరికాలో 15న విడుదలైంది. హాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు విశ్లేషకుల ప్రశంసలు, హిట్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. యువకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీని..   జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు.

ఐపీఎల్ -9 విజేత ఎవరంటే..?

ఐపీఎల్ -9లో లీగ్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సీజన్ ఉత్కంభరిత పోరు ఇంకా ఎదురుకానప్పటికీ మ్యాచ్ లకు ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. చెన్నై, రాజస్థాన్ జట్ల రద్దు కాగా, వాటి స్థానంలో గుజరాత్, పుణే బరిలో నిలిచాయి. ఈసారి మాత్రం టైటిల్ బెంగళూరుదే అంటున్నారు బుక్ మేకర్స్. విరాట్ కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ)కే టైటిల్ కైవసం చేసుకునే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. పంజాబ్ ఈసారి చివరిస్థానంతో సరిపెట్టుకుంటుందని అంచనా వేశారు. బుక్ మేకర్స్ అభిప్రాయాలు ఆధారంగా ఆయా జట్ల విజయావకాశాలు ఈ విధంగా ఉన్నాయి.

బెంగళూరు- 29 శాతం
గుజరాత్- 19 శాతం
ముంబై- 14 శాతం
పుణే- 13 శాతం
కోల్ కతా-12 శాతం
ఢిల్లీ- 6 శాతం
హైదరాబాద్-5 శాతం
పంజాబ్ - 4 శాతం

Sunday, April 17, 2016

ఆర్టీసీ బస్సులో ఏం జరిగిందంటే...

 ‘‘నాతోపాటు 22మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మంచి మనసున్న నిర్మాత డా. రామానాయుడుగారు. ఆయనలాగే ఎమ్మెస్ రాజుగారు ఒక్కో సినిమాకు ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేయడం అభినందనీయం. ఈ సినిమా విజయవంతమై మంచి పేరు, డబ్బులు తీసుకురావాలి. టైటిల్ పాజిటివ్‌గా ఉంది’’ అని ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రైట్ రైట్’. వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
దర్శకులు బి.గోపాల్, మారుతి, వంశీ పైడిపల్లి కలిసి ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘డ్రైవర్, కండక్టర్‌కు మధ్య జరిగే కథే ఈ చిత్రం. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఆర్డినరీ’ సినిమా స్ఫూర్తితో ఈ చిత్రం నిర్మించాం. తొలి భాగం వినోదాత్మకంగా ఉంటే, మలి భాగంలో మిస్టరీ ఉంటుంది. ఎస్. కోట నుంచి గవిటికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మే చివరి వారం లేదా జూన్ మొదటివారంలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘కథ కొత్తగా ఉంది. మంచి టీమ్‌తో చేసిన ఈ కొత్త ప్రయత్నం అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇందులో ఐదు పాటలున్నాయనీ, త్వరలో పాటలను విడుదల చేస్తామనీ నిర్మాత తెలిపారు.
 ఈ చిత్రానికి కెమేరా: శేఖర్ వి.జోసెఫ్, సంగీతం: జె.బి, సహ నిర్మాత: ఎమ్.వి. నరసింహులు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె. శ్రీనివాస రాజు.

జడేజా పెళ్లి సందడిలో కాల్పులు


భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా వివాహం కాస్త వివాదాస్పదంగా మారింది. పెళ్లి వేడుకల్లో భాగంగా సెలెబ్రిటీ ఫైరింగ్‌ చేపట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే..  రాజ్‌కోట్‌కు చెందిన రివా సోలంకితో ఈరోజు జడేజా వివాహం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి వూరేగింపు జరుగుతుండగా.. జడేజా బంధువులు సెలెబ్రిటీ ఫైరింగ్‌ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దీంతో సమాచారమందుకున్న పోలీసులు జడేజా నివాసానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాల్పులు జరిగినట్లు తమ కంట్రోల్‌ రూంకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఒకవేళ కాల్పులు లైసెన్స్‌ ఉన్న తుపాకీతో జరిపినా.. స్వీయరక్షణ సమయంలో కాకుండా ఇలా ఫైరింగ్‌ చేస్తే అది నేరమే అవుతుందని, అందుకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు.

ఔను! నేను నాన్నను కాబోతున్నాను!

 తండ్రి కావడం ఎవరికైనా గొప్ప అనుభూతి. వెలకట్టలేని సంతోషం. అదే సంతోషంలో తాను మునిగి తేలుతున్నట్టు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ తెలిపాడు. 'హా మే బాప్ బాన్నే వాలా హూ'  (అవును.. నేను తండ్రిని కాబోతున్నాను) అని అతను వెల్లడించాడు.
షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు త్వరలోనే తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. మీరా రాజ్‌పుత్ గర్భవతి అయినట్టు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై ఇంతవరకు షాహిద్ స్పందించలేదు. అతని తాజా చిత్రం 'ఉడ్తా పంజాబ్‌' ట్రైలర్ విడుదల సందర్భంగా విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. 'ఎందుకండి.. డొంక తిరుగుడు ప్రశ్నలు అడుగుతారు. డైరెక్టుగా అడగండి. అవును.. నేను నాన్నను కాబోతున్నాను' అంటూ తేల్చాశాడు షాహిద్‌.

నిజంగా ఈ వార్త షాహిద్, మీరా అభిమానులకు ఆనందం కలిగించేదే. ఈ ఏడాది ఆరంభం నుంచి విడాకులు, బ్రేకప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్‌ జనాలకు తీపి కబురు అని చెప్పవచ్చు.

Saturday, April 16, 2016

ధైర్యముంటే చాలు!

  సినిమాలో సాధించడానికి నటీమణుల కు ధైర్యం చాలా అవసరం అంటున్నారు నటి తమన్నా. ఏమిటీ చాలా మంది శ్రమ, కృషి, ప్రతిభ అన్నింటికీ మించి అదృష్టం ఉండాలంటుంటారు. అలాంటిది ఈ మిల్కీబ్యూటీ ైధైర్యం కావాలంటున్నారేమిటనుకుంటున్నారా? అదేమిటో తమన్నా మాటల్లోనే చూద్దాం. నేను చిత్ర రంగప్రవేశం చేసి చాలా ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ తమిళం, తెలుగు,హిందీ భాషల్లో ప్రము ఖ నాయకిగానే వెలుగొందుతున్నాను. ఇన్నేళ్లలో సినిమా నాకు చాలానే నేర్పించింది. కొత్తలో నటినవ్వాలన్న ఆసక్తి మినహా వేరేమీ తెలియదు. నేను ఉత్తరాది సంస్కృతిలో పెరిగిన యువతిని. అలాంటిది దక్షిణాది చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక్కడ భాష తెలియదు. సంస్కృతి, సంప్రదాయాలు అస్సలు తెలియవు.
అయినా ఇక్కడి చిత్రాల్లో నటించడం మొదలెట్టాను. ఎలాంటి భయానికి గురి కాలేదు. ధైర్యం మాత్రమే నాలో ఉంది. అదే నన్ను ఉన్నత స్థాయికి చేర్చింది. తెలి యని భాష అని అప్పుడు భయపడి ఉంటే నటిగా ఇంత గుర్తింపు తెచ్చుకునే దానిని కాదు. అందుకే అంటున్నా నటీమణులు సాధించాలంటే చాలా ధైర్యం అవసరం. సినిమా జయాపజయాల గురించి నేను చింతించను. కఠనంగా శ్రమిస్తాను. చిత్ర జయాపజయాలన్నవి ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది.
నా వరకు నేను నటిగా చాలా సంతోష జీవితాన్ని అనుభవిస్తున్నాను. అనుభవా లు చాలా పాఠాలు నేర్పాయి. అవే ఇప్పుడు జీవితాన్ని ఎలా మలచుకోవాల న్న పరిణితిని కలిగించాయి. అంటున్న తమన్నా ప్రస్తుతం తమిళం,తెలుగు,హింది భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తమిళంలో విజయ్‌సేతుపతికి జం టగా ధర్మదురై చిత్రంలోనూ, తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతున్న బ్ర హ్మాండ చిత్రం బాహుబలి-2 చిత్రంతో పాటు హిందీలో రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్‌కు జంటగా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ధోనీ భార్య షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో

 భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ లో బిజీ బిజీ గా  ఉన్నా,  ఆయన భార్య  సాక్షి సింగ్ మాత్రం మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ పాపాయిని  అల్లారుముద్దుగా పెంచుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ లో ఆమె పలుసార్లు స్పందించారు కూడా.  ఇపుడు తాజాగా  మరో ఆసక్తికరమైన ఫోటోను  షేర్ చేశారు.    రైజింగ్ గుజరాత్ లయన్స్ పై  ధోనీ సారధ్యంలోని పూనే సూపర్ గెయింట్స్  ఓడిపోవడం,  రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి బ్రాండ్ అంబాసిడర్ గా ధోనీ రాజీనామా  లాంటి అంశాలతో ఒత్తిడిలో ఉన్న   ధోనీ  తన  ముద్దుల  కుమార్త జియా తో సేద తీరుతున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  మై  లైఫ్  కాప్షన్ తో  ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేసిన ఈ పోటో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

కాగా  భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రియల్ ఎస్టేట్‌ సంస్థ అమ్రపాలి అంబాసిడర్‌ పదవికి  గుడ్‌బై చెప్పడం పలువురి ప్రశంసలకు నోచుకుంది.నోయిడాలోని సదరు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బాధితులే కాకుండా సహచర టీమిండియా క్రికెటర్లు కూడా ధోనీ నిర్ణయాన్ని కొనియాడుతున్న సంగతి తెలిసిందే.

'సినిమా హిట్ అయితేనే డబ్బు తీసుకుంటా'

 బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఓ సినిమాలో నటించినందుకు ఎంత డబ్బు తీసుకుంటాడు? ఆయన పారితోషకం 40 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నది బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే సినిమాల్లో నటించినందుకు తానెప్పుడూ డబ్బులు తీసుకోలేదని షారుక్ చెబుతున్నాడు. బాక్సాఫీసు వద్ద తన సినిమాలు హిట్ అయితే నిర్మాతలు ఇష్టపూర్వకంగా ఇచ్చింది తీసుకుంటానని చెప్పాడు.
'నా సినిమాలు హిట్ అయితేనే నాకు డబ్బులు ఇవ్వమని నిర్మాతలకు చెబుతా. అదికూడా వాళ్లు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే మొత్తం తీసుకుంటా. డబ్బుల కోసం డిమాండ్ చేయను. ఎండార్స్ మెంట్లు, ఈవెంట్లు, లైవ్ షోలలో పాల్గొన్నందుకు మాత్రమే ఫీజు తీసుకుంటాను. సినిమాల్లో నటించడాన్ని వ్యాపారంగా భావించను. నేను సినిమాల్లో నటిస్తూ ఉండాలి. వీలైనంతవరకు ఎక్కువ మంది నా సినిమాలు చూడాలన్నదే నా ఆశ' అని షారుక్ అన్నాడు. షారుక్ తాజా చిత్రం ఫ్యాన్ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.

Wednesday, April 13, 2016

ఆ కాళ్లు ఎవరివంటే...


గడచిన కొన్ని నెలలుగా తెలుగు పరిశ్రమనూ, ప్రేక్షకులనూ వెంటాడుతున్న ప్రశ్న ఒకటి ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. యస్.. మీరు ఊహించినది కరెక్టే. ‘అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అన్నదే ఆ ప్రశ్న. వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే వరకూ రాజమౌళి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేట్లు లేరు. ఇక... ఉగాది సందర్భంగా మొదలైన రెండో ప్రశ్న మరొకటి. దానికి మాత్రం సమాధానం దొరికిపోయిందోచ్. మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి సమర్పణలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్ లుక్ ఉగాది సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే.
మామూలుగా ఏ స్టార్ హీరో ఫస్ట్ లుక్ విడుదలైనా దాని గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక... ఈ పోస్టర్ అయితే మరింత చర్చనీయాంశమైంది. కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు మహేశ్‌బాబు చెప్పులు తొడుగుతున్న ఆ కాళ్లు ఎవరివి? అని చాలామంది తలబద్దలు కొట్టుకున్నంత పని చేశారు. ఆ చిత్రంలో కీలకపాత్రలు చేస్తున్న నటులందరి పేర్లూ అనుకుని చూశారు. ప్చ్.. సమాధానం దొరకలేదు. ఇంతకీ ఆ కాళ్లు ఎవరివో తెలుసా? నటుడు సత్యరాజ్‌వి. ‘బ్రహ్మోత్సవం’లో మహేశ్‌బాబు తండ్రిగా నటిస్తున్నారాయన. విశేషం ఏంటంటే.. అటు మొదటి ప్రశ్న ‘బాహు బలి’లోనూ, ఇటు రెండో ప్రశ్న ‘బ్రహ్మోత్సవం’లోనూ కామన్‌గా ఉన్నది సత్యరాజ్ కావడం.

'ప్రభాస్ సరసన నటించాలని ఉంది'

  సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న బ్రిటీష్ బ్యూటి అమీజాక్సన్ తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఇప్పటికే విక్రమ్ లాంటి స్టార్ హీరోతో శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ లతో కలిసి నటించిన ఈ బ్యూటి, మరో సారి శంకర్ దర్శకత్వంలో రోబో 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు జోడిగా నటిస్తోంది అమీ. ఇలా టాప్ స్టార్స్ తో కలిసి పనిచేస్తున్న ఈ భామ ఓ టాలీవుడ్ హీరో సరసన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోందట.
 
మదరాసీ పట్టణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమీజాక్సన్, హిందీలో ఏక్ దివానా థా, తెలుగులో ఎవడు, తమిళ్ లో ఐ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్ ను చూసి షాక్ అయ్యానన్న ఈ బ్యూటి, ఛాన్స్ వస్తే ప్రభాస్ తో కలిసి నటించడానికి రెడీ అంటూ ప్రకటించింది. మరి అమీ కోసం ఎవరైన ప్రభాస్ సరసన ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

Tuesday, April 12, 2016

జర్నలిస్టు ముద్దు.. లైట్ తీసుకున్న ఐష్

భారత్‌లో బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్ టన్ దంపతుల పర్యటన సందర్భంగా ఓ షాకింగ్  సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ కోడలు,  హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ పట్ల ఓ జర్నలిస్టు ప్రవర్తనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
           బ్రిటిష్‌ యువరాజు విలియమ్‌, ఆయన భార్య కేట్‌ మిడిల్టన్‌   పర్యటనలో భాగంగా ఓ ఛారిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో యువరాజు దంపతులతో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో నీలికళ్ల సుందరి ఐష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐష్‌ను చూసిన ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఈ సందర్భంలో ఓ జర్నలిస్ట్‌ ఐష్‌ని విష్‌ చేయగా.. దానికి ప్రతిస్పందించిన ఐష్  హాయ్ హౌ ఆర్ యూ అంటూ ముందుకొచ్చి అతనికి షేక్ హ్యండ్‌ ఇచ్చింది. అంతే.. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ జర్నలిస్ట్‌ ఐష్‌ చేతిని ముద్దాడాడు. దీంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. ఐష్‌ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా... హుందాగా నవ్వులు చిందిస్తూ ముందుకు కదిలారు.

నాలుగున్నర గంటలపాటు కళ్లార్పకుండా 24 విన్నా - సూర్య

 ‘‘ ‘24’ నా కెరీర్‌లో ముఖ్యమైన సినిమా. ‘మనం’ సమయంలోనే ఈ  సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పుడే దర్శకుడు విక్రమ్‌కుమార్  ‘24’ కథ వినిపించారు. నాలుగున్నర గంటలపాటు కళ్లార్పకుండా ఆయన చెప్పిన కథే విన్నాను. ఈ కథ ఎంతగా నచ్చిందంటే వెంటనే నిర్మాతగా మారడానికి నిర్ణయించుకున్నా. వెంటనే సంగీత దర్శకుడు ఏ.ఆర్.రె హ్మాన్ తలుపు తట్టాం. ఇంతకాలం ఎందుకు గ్యాప్ వచ్చిందనే ప్రశ్నకుఈ చిత్రం ఓ సమాధానం అవుతుంది’’ అని హీరో సూర్య అన్నారు. ‘ఇష్క్’, మనం’ చిత్రాల ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో సూర్య మూడు విభిన్నమైన పాత్రల్లో నటించిన చిత్రం - ‘24’.
గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్‌టైన్ మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్త నిర్మాణంలో జ్ఞానవేల్ రాజా సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. సమంత, నిత్యామీనన్ కథానాయికలు. ఏ.ఆర్.రెహ్మాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటలను హీరో కార్తీ విడుదల చేశారు.  ఏఆర్. రెహ్మాన్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా అవకాశం ఇచ్చినం దుకు సూర్య, విక్రమ్‌కుమార్‌లకు చాలా థ్యాంక్స్,  మా అబ్బాయి అమీన్ మొదట ‘ఓకే బంగారం’లో అరబిక్ పాట పాడాడు. మళ్లీ రెండో సారి ‘నిర్మలా కాన్వెంట్’లో ‘కొత్త కొత్త భాష’ పాట పాడాడు.

మీ ఆశీస్సులు అతనికి ఎప్పుడూ ఉండాలి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా కథ చెప్పినప్పుడు అసలు దీన్ని తెరకెక్కించడం సాధ్యమా అని అనిపించింది. కానీ మాకు చెప్పిన దాని కన్నా బాగా విక్రమ్ ఈ సినిమా తీశారు’’ అని సమంత అన్నారు. ఈ వేడుకలో హీరోలు కార్తీ, అఖిల్, నిర్మాత సుధాకర్‌రెడ్డి, పాటల రచయిత చంద్రబోస్, నటుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

అనుష్కతో బ్రేకప్ ను ఇలా చెప్పాడా?

 టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే పాపులర్ అయ్యాడు. టి-20 ప్రపంచ కప్ లో విరాట్ బ్యాటింగ్ మెరుపులను నెటిజన్లు తెగ ప్రశంసించారు. ఇక సోషల్ మీడియాలో విరాట్ ఆటతీరుతో పాటు అతని ప్రేమాయణం కూడా హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మతో రెండున్నరేళ్ల బంధాన్ని టి-20 ప్రపంచ కప్ నకు ముందు విరాట్ తెగదెంపులు చేసుకున్నాడు. కోహ్లీ చేసిన పెళ్లి ప్రతిపాదనను అనుష్క ఒప్పుకోకపోవడం వల్లే వీరి బంధం తెగిపోయిందని వదంతులు షికారు చేశాయి. విరాట్ ఆడుతుంటే స్టేడియంలోని గ్యాలరీలో సందడి చేసే అనుష్క టి-20 ప్రపంచ కప్ సందర్భంగా ఎక్కడా కనిపించలేదు. అయితే గతవారం ఇద్దరూ కలసి మళ్లీ  కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  గత బుధవారం ముంబై బాంద్రాలోని రాయల్టీ క్లబ్‌లో ఈ ఇద్దరూ కలిసి డిన్నర్‌ చేశారు. దీంతో వీరి ప్రేమ మళ్లీ చిగురించిందంటూ బాలీవుడ్ లో ఊహాగానాలు మొదలయ్యాయి.

కాగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్ కొత్త ఫొటో బాగా పాపులరయింది. ఆ ఫొటోలో విరాట్ టీ షర్ట్ వేసుకున్నాడు. దానిపై 'వు వర్ ఆన్ ఏ బ్రేక్' అని రాసి ఉంది. అనుష్కతో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నట్టు ఇలా టీ షర్ట్ ద్వారా వెల్లడించాడా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంతకీ అనుష్కతో బంధాన్ని బ్రేకప్ చేసుకున్నాడా? లేక మళ్లీ కలసిపోయారా అన్నది కోహ్లీకే తెలియాలి!

Monday, April 11, 2016

ఓ ఐడియా.. ముగ్గుర్ని కాపాడింది!

 అదో నిర్మానుష్య ద్వీపం. చుట్టూ నీరు తప్ప మరేమీ కనిపించదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు ముగ్గురు యువకులు. మూడు రోజుల నిరీక్షణ తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. ఒక చిన్ని ఆలోచన ఆ ముగ్గురి ప్రాణాలను కాపాడింది. ఇంతకీ ఆ ఆలోచన ఏంటీ..? అసలు ఆ ద్వీపంలో వారెలా చిక్కుకున్నారు..?
ఫెడరేటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మైక్రోనేషియాలోని పులప్‌ ఐలాండ్‌ నుంచి ముగ్గురు యువకులు పడవలో పర్యటనకు బయలుదేరారు. అయితే దురదృష్టవశాత్తు సముద్రపు అలలకు వారి పడవ బోల్తాపడి మునిగిపోయింది. ముగ్గురూ ఈదుకుంటూ ఫనడిక్‌ అనే ద్వీపానికి చేరుకున్నారు.
ప్రాణాలకు తెగించి ఒడ్డుకైతే చేరారుగానీ.. ఆ దీవి నుంచి వారికి బయటపడే మార్గం కనిపించలేదు. ఎటు చూసినా చెట్టూచేమలు.. నీరే కనిపించింది. నిర్మానుష్యంగా ఉన్న ఆ దీవిలో మూడు రోజులు గడిపారు ఆ యువకులు. మరోవైపు పడవ మునక సమాచారమందుకున్న అమెరికా కోస్టు గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల తర్వాత ఆ యువకులకు ఓ ఆలోచన తట్టింది. వెంటనే.. చెట్టు కొమ్మలతో ఇసుకపై H E L P అంటూ పెద్ద పెద్ద అక్షరాలను రాశారు. అటుగా వచ్చిన జపాన్‌ ఎయిర్‌బేస్‌కు చెందిన నేవీ సిబ్బంది ఆ అక్షరాలను గుర్తించారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టి.. ఆ యువకులను రక్షించారు. వారు సమయస్ఫూర్తితో హెల్ప్‌ అని రాయడం, లైఫ్‌ జాకెట్లతో అక్కడే నిలబడి వుండడం.. వల్లే మా సహాయం అందుకుని ప్రాణాలతో బయటపడగలిగారు... అని చెప్పారు అధికారులు.

కోహ్లితో గొడవపడ్డా.. కానీ కలిసి ఆడతా..!


భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లితో గతంలో ఎన్నోసార్లు మైదానంలో గొడవపడ్డాను. కానీ అతని కెప్టెన్సీలోనే ఇప్పుడు ఆడాల్సి వస్తోందని.. ఇలాంటి వింతలు ఐపీఎల్‌ లాంటి దేశవాళీ టోర్నీలోనే సాధ్యమవుతాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్‌-9 వేలంలో వాట్సన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ సీజన్‌లోనే అత్యధిక ధర రూ.9.5 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మంగళవారం తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లి గురించి వాట్సన్‌ మాట్లాడుతూ ‘ఇలా కోహ్లితో కలిసి ఆడతానని అసలు వూహించలేదు.. ఓ క్రికెటర్‌గా అతణ్ని ఎక్కువగా గౌరవిస్తా’ అని అన్నాడు.

 అలానే జట్టులో ఉన్న వెస్టిండీస్‌ విధ్వసంక ఓపెనర్‌ క్రిస్‌గేల్‌తో 2009లో జరిగిన గొడవపై కూడా వాట్సన్‌ స్పందించాడు. ఆ గొడవ అనంతరం క్రిస్‌గేల్‌ ఓ ఇంటర్వ్యూలో ‘వాట్సన్‌ చూడ్డానికి గంభీరంగా ఉన్నా చాలా సున్నితమైన వ్యక్తి’ అంటూ వ్యాఖ్యానించాడని గుర్తు చేశాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాట్సన్‌ జట్టు అవసరార్థం తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించాడు. కోహ్లి, క్రిస్‌గేల్‌, డివిలియర్స్‌ లాంటి హిట్టర్లు ఉన్నప్పటికీ ఇంతవరకూ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. మరి టీ20ల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన వాట్సన్‌ రాకతోనైనా ఈ సీజన్‌లో బెంగళూరు విజేతగా నిలుస్తుందేమో చూడాలి..! 

నాలో చాలా మార్పు వచ్చింది

 బాలీవుడ్‌లో ‘ఏక్‌ విలన్‌’.. ‘బ్రదర్స్‌’ వంటి చిత్రాలతో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించాడు. అయినా.. ఆ సినిమా నటన పరంగా తన ప్రవర్తనను మార్చేసిందని చెబుతున్నాడు.
‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ సినిమాతో పని పట్ల నా ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాలో ఎంతో మార్పొచ్చింది. తొలినాళ్లలో చేసిన కొన్ని సినిమాలు ఎప్పుడూ కొత్తగా అనిపించేవి. అందులో బాగా చేస్తున్నానా? లేదా? అని నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని. కానీ ఈ చిత్రంలోని పాత్రకు నా నిజ జీవితానికి చాలా సారూప్యత ఉంది’’ అని అన్నాడు సిద్ధార్థ్‌.
అంతేకాదు.. ‘‘నేను పనిచేసిన ఇతర దర్శకులందరితో కంటే.. ఈ సినిమాలో శకున్‌తో కలిసి పని చేయటం కొత్త అనుభూతిని కలిగించింది. సెట్‌లో ఉన్నప్పుడు ఆ పాత్రలో నువ్వే కనపడాలి అని చెబుతుండేవాడు’’ అని దర్శకుడ్ని పొగిడేశాడు సిద్ధార్ధ్‌.

Sunday, April 10, 2016

బ్రహ్మచారిగా ఉందామనుకొన్నా.. ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది!

పవన్‌ కల్యాణ్‌... ‘అభిమానం’ అనే పదాన్ని ‘భక్తి’ స్థాయికి తీసుకెళ్లిన కథానాయకుడు.
తన ఆలోచనల్ని ‘ఇజం’గా మార్చిన భావకుడు. హీరోయిజానికి కొత్త ఉత్సాహాన్ని ఇంజెక్ట్‌ చేసిన నటుడు. ఆయనకు సమాజం అంటే ప్రేమ. పుస్తకాలంటే పిచ్చి. చదివింది ఆచరిస్తాడు. ఆచరించేదే చెప్తాడు. పవన్‌లో ఆ నిజాయతే అభిమానులకు నచ్చుతుంది. పవన్‌ కనిపిస్తే..
పవన్‌ మాట్లాడితే.. అంత ఉత్సాహంగా వూగిపోవడానికి కారణం అదే. ఓవైపు కథానాయకుడిగా, మరోవైపు నాయకుడిగా పవన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వసూళ్లలో గత రికార్డుల్ని తిరగరాస్తోంది. ఈ సందర్భంగా పవన్‌తో సంభాషించింది ‘ఈనాడు సినిమా’. అటు రాజకీయాల గురించీ, ఇటు సినిమాల గురించీ, తన వ్యక్తిత్వం గురించీ పవన్‌ కల్యాణ్‌ ఇలా చెప్పుకొచ్చారు.


వాడికి నేనంటే కోపం
‘‘అకీరాకు నేనంటే చాలా ఇష్టం. వాడు సినిమా వాతావరణానికి దూరంగా ఉంటున్నాడన్న సంతోషంగా ఉన్నా నా దగ్గర లేడనే బాధగా ఉంది. వాడికీ ఆ బాధ ఉంది. అందుకే వాడికి నాపై కోపం. నా స్టార్‌ స్టేటస్‌, ఇమేజ్‌కు అకీరా దూరంగా ఉండటం మంచిదే. భవిష్యత్తులో తను ఏం చేస్తాడన్నది తన ఇష్టాయిష్టాల్నిబట్టే ఉంటుంది’’ ..........http://www.eenadu.net/telugumovies/cinemanews.aspx?item=cinema&no=6

ఐపీఎల్ -9లో మరో వివాదం

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు, రెండు దిగ్గజ జట్లపై వేటు, లలిత్ గేట్.. ఇలా అనేక అవరోధాలను దాటుకుంటూ ప్రారంభమైన ఐపీఎల్ 9వ సీజన్ లో మరో వివాదం చెలరేగింది. ఇప్పటికే మహారాష్ట్రలో మ్యాచ్ లు నిర్వహించే అంశం కోర్టుదాకా వెళ్లింది. తాజాగా ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేపై బీసీసీఐ అనూహ్యరీతిలో వేటువేసింది. హర్షా భోగ్లే కామెంటేటింగ్ కాంట్రాక్టును బోర్డు ఉన్నపళంగా రద్దుచేసింది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా కామెంటేటర్లపై.. ప్రధానంగా హర్షా భోగ్లేను ఉద్దేశిస్తూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కామెంట్లుకూడా వేటుకు బలమైన కారణమని తెలుస్తున్నది.
సోషల్ మీడియా ద్వారా కామెంటేటర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనాలను సేకరిస్తోన్న బీసీసీఐ.. అదే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న కారణంగా హర్షా భోగ్లేపై వేటు వేసినట్లు ఓ అధికారి చెప్పారు. కామెంట్రీపై ఆటగాళ్ల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని, అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 9వ సీజన్ ప్రారంభమైన రోజే హర్షాను కామెంటేటర్ల ప్యానెల్ నుంచి తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. హర్షా కూడా తాను ఇకపై ఐపీఎల్ కు అందుబాటులో ఉండబోనంటూ ట్వీట్ చేశారు.


వరల్డ్ కప్ లో ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇండియన్ కామెంటేటర్లు ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మాట్లాడటంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లు తాను చేసినవే కావడంతో మ్యాచ్ అనంతరం హర్షా భోగ్లే తనను తాను సమర్థించుకున్నారు. ఇదేకాకుండా న్యూజిలాండ్ తో నాగపూర్ లో జరిగిన ప్రారంభమ్యాచ్ లోనూ విదర్భ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో గొడవపడ్డారట హర్షా భోగ్లే. రెండు భాషల్లో (ఇంగ్లీష్, హిందీల్లో) కామెంట్రీ చెప్పేందుకు అస్తమానం అటూఇటూ తిరుగుతోన్న హర్షాను 'ఇది వీఐపీ లాంజ్ మీరు నిమిషానికోసారి అలా తిరిగితే కుదరదు'అని చెప్పారట. దీనికి హర్షా సదరు అధికారులపై చిందులేశారట. అన్ని కారణాలను బేరిజు వేసుకున్న తర్వాత హర్షాకు షాక్ ఇవ్వాల్సిందేనని ఫిక్సైన బీసీసీఐ ఆయనపై వేటు వేసింది. ఐపీఎల్ ప్రసార హక్కులు సోని-ఈఎస్ పీఎన్ చానెల్ వి కాబట్టి వారు పట్టుబట్టి హర్షాభోగ్లేను కొనసాగిస్తారా, లేక బీసీసీఐ నిర్ణయానికి సరేనంటారా చూడాలి. శని, ఆదివారాలనాటి మ్యాచ్ లకైతే భోగ్లే అందుబాటులోలేరు. 90వ దశకం నుంచి క్రికెట్ కామెంటేటర్ గా కొనసాగుతున్న హర్షా భోగ్లే ఐపీఎల్ ప్రారంభం(2008) నుంచి ఆ టోర్నీకి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Saturday, April 9, 2016

తమన్నాకు మరో బంపర్ ఆఫర్!

 బాహుబలి సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా భాటియాకు మరో బంపర్ ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ సినిమా బాజీరావ్ మస్తానీ ఘన విజయంతో జోరుమీదున్న రణ్ వీర్ సింగ్ కు జోడీగా తమన్నా నటించనున్నట్టు బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దిల్ వాలే సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.  రణవీర్, రోహిత్  కలిసి నిర్మించనున్నారని సమాచారం. దీనిపై దిల్ వాలే డెరెక్టర్ ను  ప్రశ్నించగా వేచి ఉండండి. కాలమే సమాధానం చెబుతుందని బదులిచ్చాడు.

హీరోగా స్టార్ క్రికెటర్ తనయుడు

  ఫిలిం ఇండస్ట్రీలో వారసుల హవా బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లామర్ ఇండస్ట్రీ కావటంతో ఈ రంగంలోని వారందరూ తమ వారసులను సినిమాల్లోనే నటించేలా ప్రోత్సహిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇతర రంగాల వారు కూడా సినీ రంగం మీద దృష్టి పెడుతున్నారు. రాజకీయ, వ్యాపార రంగాల నుంచి చాలా మంది సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అదే బాటలో ఓ స్టార్ క్రికెటర్ కొడుకు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.
 
ప్రముఖ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కొడుకు అబ్బాస్(అసదుద్దీన్) త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో 'నాకు ఓ లవ్వరుంది', 'దక్షిణ మధ్య భారత జట్టు' సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కె సురేష్ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Wednesday, April 6, 2016

‘సర్దార్ గబ్బర్ సింగ్’ లీకైంది..!

పొద్దుటూరులో సీడీ షాపులపై పోలీసుల దాడులు
పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు



  విడుదల కంటే ముందే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం లీకైందంటూ పుకార్లు వినిపించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం ఉదయం నుంచి దాడులు చేశారు. పవన్‌కల్యాణ్ నటించిన సర్దార్‌గబ్బర్‌సింగ్ ఈనెల 8న విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి  సంబంధించిన సీడీలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందింది. దీంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు సీడీ షాపులు, తయారీ దారులపై పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ చిత్రానికి పని చేసిన కొందరు టెక్నీషియన్ లు రెండు రోజుల క్రితం ల్యాబ్ నుంచి కాపీ చేసుకున్నట్లు పుకార్లు వినిపించాయి. ప్రొద్దుటూరులోని  పలు సీడీ షాపులలో పోలీసులు సోదాలు చేశారు. సీడీలను తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న దుకాణాలపై కూడా దాడి చేసి హార్డ్ డిస్క్‌లు, సీడీ రైటర్‌లను పరిశీలించారు. టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరిని, త్రీ టౌన్ పరిధిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు వారిని బైండోవర్  చేసి తహ సీల్దార్ వద్ద హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులను చిత్రం విడుదల అయ్యే వరకూ ప్రతి రోజూ స్టేషన్‌లో హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. అయితే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన  సీడీలు ఎవరి వద్ద దొరకలేదని పోలీసులు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు థియేటర్ యజమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రజల కంటే ఐపీఎల్‌ క్రికెట్‌ ముఖ్యమా?

బీసీసీఐని నిలదీసిన బాంబే హైకోర్టు
మహారాష్ట్ర ప్రజల కంటే ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణ ముఖ్యమా? అని బాంబే హైకోర్టు బుధవారం బీసీసీఐని నిలదీసింది. మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో ఏప్రిల్‌ 9నుంచి మే 29 వరకు మొత్తం 20 క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించవలసి ఉంది. క్రికెట్‌ పిచ్‌లను ఒక సారి తడిపేందుకు సుమారు 60 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. మహారాష్ట్రలో రాజధాని ముంబయితో సహా పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. అందువల్ల క్రికెట్‌ మ్యాచ్‌లను నీటి ఎద్దడి లేని రాష్ట్రాల్లో నిర్వహించుకోవాలని బీసీసీఐకి హైకోర్టు సూచించింది. నీటి ఎద్దడి సమస్యకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉండగా, పిచ్‌లను తడపడానికి నీటిని వృధా చేస్తే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాకుండా ఇక్కడ తాగునీటి ఎద్దడి ఉన్న విషయం మీకు తెలియదా? అని కూడా ప్రశ్నించింది. 2015లో అనావృష్టి వల్ల 3,228 మంది ఆత్మహత్య కు పాల్పడ్డారని జర్నలిస్టు తిరోడ్కర్‌ హైకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల బీసీసీఐ వినియోగించే ప్రతి నీటి బొట్టుకు పైసలు వసూలు చేయాలని ఆయన కోరారు. విలువైన నీరు వృధా చేయకుండా సంబంధిత సంస్థలకు ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. మహారాష్ట్రలో ఐపీఎల్‌ క్రికెట్‌ నిర్వహణ వల్ల చాలా నీరు వృధా అవుతుందని 'లోక్‌సత్తా మూవ్‌మెంట్‌' అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. కాగా దీనిపై బీసీసీఐ వాదన మరోలా ఉంది. తాము తాగునీరు కాకుండా ఇతర నీటిని పిచ్‌లను తడిపేందుకు ఉపయోగిస్తున్నామని ఆ సంస్థ నిర్వహకులు చెబుతున్నారు. నాగపూర్‌, పుణే, ముంబయి నగరాల్లో క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి టికెట్లను అమ్మేశామని, ఇప్పుడు వీటిని రద్దు చేస్తే చాలా నష్టపోతామని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా ఆవేదన వ్యక్తం చేశారు.

రీ ఎంట్రీకి రెడీ అవుతోన్న టాలీవుడ్ స్టార్ హీరో ..

  బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. లాంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్, తరువాత ఆ సక్సెస్ ను కొనసాగించలేకపోయాడు. వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ సిద్ధూ టాలీవుడ్ వదిలేసి చెన్నై వెళ్లిపోయాడు. అక్కడ కూడా మంచి సక్సెస్ లు రాకపోవటంతో అవకాశాలు తగ్గిపోయాయి. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్న సిద్ధార్థ్ మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ మీద దృష్టిపెట్టాడు.
              చందమామ కథలు సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఇటీవల గుంటూరు టాకీస్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆర్ట్ సినిమాలే కాదు కమర్షియల్ సినిమాలు కూడా చేయగలనని ప్రూవ్ చేసుకున్న ఈ దర్శకుడు, ప్రస్తుతం ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ ను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే సిద్దూకి కథ కూడా చెప్పి ఒప్పించిన ప్రవీణ్, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు.

Tuesday, April 5, 2016

'కామెంట్లపై వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్'

 ఇకపై ఎవరైనా తనపై కామెంట్స్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని విమర్శకులను హెచ్చరించింది బాలీవుడ్ హీరోయిన్ జరైన్ ఖాన్. తన బాధను వెల్లడించేందుకు ఇన్ స్టాగ్రామ్ ను మార్గంగా ఎంచుకుంది. తన స్కూలు డేస్, కాలేజీ రోజులలో ఎలా ఉండేదో తెలిపేందుకు ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'నా శరీరం నా ఇష్టం. నేను ఎలా ఉండాలో చెప్పేందుకు మీరేవరు. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొంతకాలం నుంచి ఆమె శరీరాకృతి గురించి చాలా రకాల విమర్శలొస్తున్నాయి. ఆమె బాడీ బికినీకి ఒప్పేలా ఉందడని, ఆమె చాలా లావుగా ఉంటుందని అందుకే అవకాశాలు ఇవ్వాలంటే దర్శకనిర్మాతలు బెదురుతారంటూ వచ్చిన కామెంట్లపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
2010లో సల్మాన్ ఖాన్ సరసన 'వీర్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హౌస్ ఫుల్, హేట్ స్టోరీ 3 మూవీలలో నటించింది. బాలీవుడ్ లో జీరో సైజ్ భామలకే గిరాకీ ఎక్కువని, కానీ జరైన్ ఈ ఇండస్ట్రీకి సెట్ అవ్వదంటూ విమర్శల నేపథ్యంలోనూ కొన్నిసార్లు అవకాశాలు కోల్పోయింది. 'ఇప్పటికే చాలా కేజీలు తగ్గాను. అయినా సన్నబడాలని, మెరుపుతీగలా తయారవ్వాలంటే నా వల్ల కాదు. ఒకసారి నా ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతోంది. వైట్ డ్రెస్ 9వ తరగతి, పింక్ డ్రెస్ ఇంటర్ చదువుతున్నప్పుడు దిగిన ఫొటోలు. అప్పటికి, ఇప్పటికీ నన్ను నేను ఎలా మలుచుకున్నానో ఆ బాధలు నాకు తెలుసు. ఇక ఎవరి వ్యాఖ్యలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని బొద్దుగుమ్మ తీవ్రంగా విరుచుకుపడింది. చాలా మంది హీరోయిన్లు లావుగా ఉన్నప్పటికీ ఆమెను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు రావడంతో మనస్తాపానికి లోనై ఈ విధంగా జరైన్ ఖాన్ తన బాధను వెల్లగక్కింది.

వాళ్ల బ్రేకప్‌ ఉత్తిదేనా..?

 బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రణ్‌బీర్‌ కపూర్‌.. కత్రినా కైఫ్‌ బ్రేకప్‌ విషయం ఓ పట్టాన కొలిక్కిరావట్లేదు. ఇటీవల బ్రేకప్‌ అయిన వీరిద్దరిని కలపడానికి ఒకవైపు వారి స్నేహితులు.. సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నా.. మరోవైపు ఎక్కడికి వెళ్లినా రణ్‌బీర్‌.. కత్రినా ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. దీంతో ఇక వాళ్లిద్దరు కలిసే అవకాశాలు లేవని బీటౌన్‌లో అనుకున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన వీరిద్దరు మళ్లీ ఒక్కటవుతున్నారన్న సందేహాన్ని కలిగించిందట.
ప్రస్తుతం వీరు బ్రేకప్‌ అయినా.. ‘జగ్గాజాసూస్‌’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రణ్‌బీర్‌.. కత్రినా ఒకరినొకరు కలవకుండా వేరువేరుగా ఉన్నారట. కానీ.. వీరిద్దరికి సన్నిహిత స్నేహితురాలైన ఆర్తి పుట్టిన రోజు పార్టీకి మిస్‌ కాకుండా ఒకే సమయంలో వచ్చారట. అంతేకాదు.. ఇరువురు ఆప్యాయంగా పలుకరించుకొని చాలా సేపు మాట్లాడుకున్నారట. పార్టీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి రణ్‌బీర్‌ వెళ్లిన తర్వాత కత్రినా వెళ్లిపోయిందట. దీంతో వీరిద్దరు మళ్లీ కలిసిపోతున్నారంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఇది అంత విశ్వసనీయ సమాచారం కాకున్నా ఒకవేళ నిజంగానే సర్దుకుపోయి.. ప్రేమను కొనసాగిస్తే వారి జంటను అభిమానించే అభిమానులకు సంతోషకరమైన విషయమే కదా!

Monday, April 4, 2016

పెళ్లయ్యాక సినిమాలు మానేశా: హీరోయిన్‌


గత జనవరిలో రాహుల్‌ శర్మను పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆసిన్ థొట్టుంకల్‌. పెళ్లయిన తర్వాత ఎలాంటి సినిమా ఆఫర్లు ఆమె ఒప్పుకోవడం లేదట. ఈ విషయాన్నే పెళ్లికి ముందు కూడా చెప్పింది. అయినా తనకు పలు సినిమాల ఆఫర్లు వస్తున్నాయంటూ కథనాలు వస్తుండటంతో మళ్లీ ఓసారి వివరణ ఇచ్చింది.                 'నేను గతంలో చెప్పిన దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన నా మీడియా మిత్రులందరికీ మరోసారి తెలియజేస్తున్నా. నేను ఎలాంటి అసైన్‌మెంట్లను ఒప్పుకోవడం లేదు. నా బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లు సహా నా కమిట్‌మెంట్లన్నింటినీ పెళ్లికి ముందే పూర్తి చేశాను. నా వర్క్‌ గురించి, అసైన్‌మెంట్ల గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రస్తుతం నేను వాటిని చేయడం లేదు. పెళ్లికి ముందే నేను ప్రకటన చేశాను' అని ఆసిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో వెల్లడించింది. మైక్రోమాక్స్ కో ఫౌండర్ అయిన రాహుల్‌-ఆసిన్ పెళ్లి జనవరి 19న జరిగిన సంగతి తెలిసిందే. క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది.                    2008లో 'గజినీ' సినిమాతో బాలీవుడ్‌కు హాయ్‌ చెప్పిన ఆసిన్‌.. పెళ్లికి ముందు చివరగా అభిషేక్ బచ్చన్ నటించిన 'ఆల్ ఈజ్ వెల్‌' సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది.

ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలు షురూ..

 ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్‌ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకం మొదలైంది. ఈనెల 16న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ ఆడుతుంది. సన్‌రైజర్స్‌హైదరాబాద్‌ డాట్‌ ఇన్‌, బుక్‌మైషో డాట్‌ కామ్‌ వైబ్‌సెట్లలో టిక్కెట్లు కొనుక్కోవచ్చు. జింఖానా మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయంలో బాక్స్‌ ఆఫీస్‌, కెఫీ కాఫీ డే ఔట్‌లెట్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఈ నెల 9నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ముంబయి, పుణె జట్లు తలపడనున్నాయి

ఒక పెద్ద హీరో.. నలుగురు కుర్ర హీరోలతో..

  ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు హీరోలతో ప్రముఖ బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఆడిపాడనుంది. తన తదుపరి ఒకే చిత్రంలో ఐదుగురు నటులతో కలిసి నటించనుంది. వీరిలో ఒకరు అగ్రహీరో, సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కాగా మిగితా నలుగురు యంగ్ హీరోలు.
ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రాన్ని తెరకెక్కించి మంచి హిట్ కొట్టిన గౌరీ షిండే ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో అలియాభట్ హీరోయిన్ గా నటించనుండగా ఆష్కి-2 ఫేమ్ ఆదిత్యరాయ్ కపూర్, అలి జాఫర్, అంగాడ్ బేడి, కునాల్ కపూర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. షారుక్ ఖాన్ కూడా నటించనున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర ఏమిటనే విషయం మాత్రం ఇంకా గోప్యంగానే ఉంది.

Saturday, April 2, 2016

నీదా.. నాదా ..

వెస్టిండీస్‌ × ఇంగ్లాండ్‌
టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు
రాత్రి 7 గంటల నుంచి డీడీ, స్టార్‌స్పోర్ట్స్‌లో



తిరుగులేని ఫామ్‌, అంతులేని ఆత్మవిశ్వాసం, రెట్టించిన ఉత్సాహంతో విండీస్‌ ఓ వైపు.. అంచనాలను తలకిందులూ చేస్తూ సాగిన తన ప్రస్థా´నాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్‌ మరోవైపు. ఆఖరి పోరాటానికి వేళైంది! ఈడెన్‌ గార్డెన్స్‌ ముస్తాబైంది. ఆతిథ్య భారత్‌ సహా ఫేవరెట్లుగా బరిలోకి దిగిన హేమాహేమీ జట్లను అద్భుత ప్రదర్శనలతో వెనక్కి నెట్టిన ఈ రెండు సంచలన జట్ల మధ్య పొట్టి ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే. ఎవరి అవకాశాలనూ కొట్టిపారేయలేం. ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. రెండూ రెండే. రెండూ బలమైనవే. అంతరం తక్కువ. బలమైన హిట్టర్లతో, పదునైన బౌలర్లతో కదనోత్సాహంతో ఉన్న ఇంగ్లిష్‌, కరీబియన్‌ సైన్యాల మధ్య రసవత్తర సమరం ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం.. కోల్‌కతాలో కప్పు ముద్దాడేదెవరో!
కోల్‌కతా
టీ20 ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్ల తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఫైనల్లో వెస్టిండీస్‌ జట్టు ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. మెరుపు వీరులతో విండీస్‌ జోరు మీదుంటే.. అదిరే ఆటతో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పనికిరాదన్న ముద్రను చెరిపేసుకుంటోంది ఇంగ్లాండ్‌. అందుకే క్రికెట్‌ అభిమానులంతా ఈడెన్‌ వైపు చూ స్తున్నారు. ఫైనల్లో ఏ జట్టు గెలిచినా రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ సాధించిన తొలి జట్టుగా అవతరిస్తుంది.


  ఆసీస్‌ను విండీస్‌ నిలువరించేనా!
నేడే మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌
మధ్యాహ్నం 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌-1, 3లో

ఒకరు వరుసగా మూడుసార్లు విజేతలు.. మరొకరు ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి! వీరిద్దరిలో గెలిచేదెవరు? ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేదెవరు? మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌ దృశ్యమిది. ఆదివారం జరిగే టోర్నీ తుది సమరంలో మూడుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియా.. జోరు మీదున్న వెస్టిండీస్‌ను ఎదుర్కోనుంది. మెగ్‌ లానింగ్‌ సారథ్యంలోని ఆసీస్‌.. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది. అస్‌బౌర్న్‌, పెర్రీ, బ్లాక్‌వెల్‌లపై ఆసీస్‌ ఎక్కువగా ఆధారపడుతోంది. మరోవైపు స్టెఫానీ టేలర్‌ నేతృత్వంలోని విండీస్‌ జట్టు కూడా గెలుపుపై ధీమాగా ఉంది. ఇప్పటిదాకా 8 టీ20ల్లో విండీస్‌పై ఆసీస్‌దే గెలుపు.   

ఆమెకు... 70 లక్షల మంది ఫాలోవర్స్‌

 బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా ట్విట్టర్‌ ఖాతాలో 70 లక్షల మంది అభిమానులు చేరారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. అంతేకాదు తన ట్విట్టర్‌ ఖాతాను 7 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నందుకు తెగ సంబర పడిపోతూ... ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. ‘నన్ను ఫాలో చేస్తున్నందుకు ధన్యవాదాలు... మీరంతా కలిసి నా ట్విట్టర్‌ కుటుంబాన్ని 7 మిలియన్లకు చేర్చారు, అద్భుతం’ అంటూ ట్వీట్‌ చేశారు. సోనాక్షి నటిస్తున్న ‘అకిర’, ‘ఫోర్స్‌ 2’ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్నాయి.

Friday, April 1, 2016

అలా మాట్లాడితే నేను సహించను!

 పుట్టిన గడ్డ గురించి నాలుగు మంచి మాటలు చెప్పే అవకాశం వస్తే, ఎవరూ వదులుకోరు. దేశ ప్రతిష్ఠ గురించి నాన్‌స్టాప్‌గా చెప్పేస్తారు. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా అలానే చేస్తున్నారు. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’లో నటించడం మొదలుపెట్టాక, ప్రియాంకకు ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రంలో కూడా అవకాశం వచ్చింది. ఇది కాకుండా ఓ టాక్ షోకి కూడా అవకాశం దక్కించుకున్నారు. వీటి కోసం ఆమె అమెరికాలో ఎక్కువగా ఉంటున్నారు.
              అక్కడివాళ్లకి మన దేశ ప్రతిష్ఠ గురించి, హిందీ చిత్రాల గురించి అదే పనిగా చెబుతున్నారట. ఆ విషయం గురించి ప్రియాంకా చోప్రా చెబుతూ - ‘‘మన దేశం ఎందులోనూ తక్కువ కాదు. మన భారతీయ చిత్రాలు వేరే ఏ దేశం చిత్రాలకూ తీసిపోవు. ‘అక్కడి సినిమాల్లో పాటలూ, డ్యాన్సులూ కామన్ అట’ అని విదేశీయులు మన సినిమాల గురించి అన్నప్పుడు ‘మేమేమీ కావాలని పాటలు పెట్టం.
              కథ ముందుకు సాగడానికి పాటలు ఉపయోగపడతాయి. మా ప్రేక్షకులు వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాళ్ల ఆనందమే మాకు ముఖ్యం’ అని చెబుతుంటాను. మన దేశం గురించి ఎవరు చులకనగా మాట్లాడినా నేను సహించను’’ అని ఆవేశంగా అన్నారు.

'సావిత్రి' రివ్యూ


 
చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న నారా రోహిత్ ఈ శుక్రవారం 'సావిత్రి' అనే టైటిల్ తో ప్రేక్షకులను పలకరించాడు. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్ సాదినేని చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కించిన సినిమా 'సావిత్రి'. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ లో బడ్జెట్ మూవీ ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..
కథ : సావిత్రి (నందిత) అనే అమ్మాయికి చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే విపరీతమైన ప్రేమ. ఖాళీ దొరికినప్పుడల్లా తన పెళ్లి గురించే కలలు కంటూ ఉంటుంది. పెళ్లి జరిగేందుకు ఏం చేయడానికైనా వెనుకాడని విచిత్ర మనస్తత్వం ఉన్న చలాకీ పిల్ల. తమ కుటుంబానికి సన్నిహితులైన ఓ వ్యక్తితో సావిత్రికి పెళ్లి నిశ్చయం అవుతుంది. నానమ్మ (రమప్రభ)తో కలిసి సంతోషంగా దైవ దర్శనానికి రైల్లో షిర్డీ బయలుదేరుతుంది సావిత్రి. ఆ ప్రయాణంలో తారసపడతాడు రిషి(నారా రోహిత్).

ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ప్రేమ జంట (మధునందన్, శ్రీముఖి)ను రక్షించే క్రమంలో రిషీ ఆ రైల్లో ప్రయాణించాల్సి వస్తుంది. తొలిచూపులోనే సావిత్రికి ఆకర్షితుడైన రిషి.. ఆమె ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు. అయితే ప్రేమ జంటను రౌడీల నుంచి తప్పించే సమయంలో రిషితోపాటు సావిత్రి కూడా ట్రైన్ మిస్ అవుతుంది.ఇక తిరిగి వాళ్లు రైలును అందుకోవడానికి చేసే ప్రయత్నాలు, ప్రేమజంట పెళ్లి, సావిత్రి  ప్రేమ పొందడానికి రిషి పడే కష్టాలతో మిగిలిన కథ నడుస్తుంది.


ఎవరెలా చేశారంటే..

ఎప్పటికప్పుడు తన పాత్రల్లో వైవిధ్యం ఉండాలని తపనపడే నటుల్లో నారా రోహిత్ ఒకరు. రిషి పాత్రలో తేలికగా ఒదిగిపోయాడు. హీరోయిన్ నందిత అందంగా కనపడింది. తన రోల్ కు పూర్తి న్యాయం చేసిందని చెప్పొచ్చు. పెద్దలకు తెలియకుండా పారిపోయి వచ్చిన జంటగా కామెడీ టచ్ తో మధునందన్, శ్రీముఖిలు అలరించారు. ప్రభాస్ శీను, ఫిష్ వెంకట్, షకలక శంకర్ లు కాసేపు నవ్వించగలిగారు. సీనియర్ నటి రమాప్రభతో సహా మిగిలిన నటీనటులంతా తమ పాత్ర మేరకు రాణించారు.

అయితే దర్శకుడు ఇంతకుముందు తెలిసిన కథనే ఎంచుకోవడంతో పెద్దగా థ్రిల్లింగ్ గా అనిపించదు. తర్వాత ఏం జరుగుతుందనేది ముందే అర్థమైపోతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోరుతోపాటు పాటలు పర్లేదనిపించాయి. కుటుంబ విలువలను చూపించే ప్రయత్నం బావుంది. క్లైమాక్స్ లో డైలాగులు పేలాయి. ఓవరాల్ గా సావిత్రి సాధారణ సినిమానే.