Wednesday, September 30, 2015

సమంత,నయనతార,విజయ్ ఇళ్లపై ఐటీ దాడులు



సినీ తారలు సమంత.. నయనతార.. తమిళ యువనటుడు విజయ్ ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించింది. తిరువనంతపురం.. కొచ్చి.. చెన్నైలతో పాటు.. దేశ వ్యాప్తంగా వీరికి ఆస్తులున్న 32 ప్రాంతాల్లో ఆదాయపన్ను అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్.. చెన్నైలలోని సమంత.. నయనతార ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక.. విజయ్ బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. పేరుప్రఖ్యాతులున్న ముగ్గురు సినీతారల ఆస్తులపై తనిఖీలు జరపటం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సమాజ సేవ చేస్తూ.. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సమంత ఆస్తులపైనా అధికారులు దాడులు జరపటం విపరీతమైన చర్చకు తావిస్తోంది. ఈ ముగ్గురు తారల ఇళ్లపై ఐటీ శాఖాధికారులు జరుపుతున్న దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tuesday, September 29, 2015

అక్టోబర్‌ 29న హర్బజన్‌ సింగ్‌ పెళ్లి...

 ఇండియాన్‌ క్రికెటర్‌ హర్బజన్‌ సింగ్‌, బాలీవుడ్‌ నటి గీతాబస్రాల పెళ్లి తేదీ ఖరారైంది. అవుననే అంటున్నాయి. మీడియా వర్గాలు వీరిద్దరికి పెళ్లి నిశ్చయమైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అక్టోబర్‌ 29న వీరు పంజాబ్‌లో పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం. మొత్తం ఐదురోజులపాటు ఈ వివాహ తంతు జరగనుందట. నవంబర్‌ 1వ తేదీన దిల్లీలో రిసెప్షన్‌కి ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం గీతా లండన్‌లో ఉంది. ముంబయిలోని డిజైనర్లు ఆమె పెళ్లికి ధరించాల్సిన దుస్తులను డిజైన్‌ చేసి అక్కడికే పంపిస్తున్నారట. హర్భజన్‌కి కూడా అక్టోబర్‌ 25 నుంచి నంబర్‌ 5 వరకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతో ఆ తేదీల్లోనే పెళ్లి పనులు ఖారారు చేసినట్లు సమాచారం.

Monday, September 28, 2015

సిద్ధాపురం గ్రామాన్ని శ్రీమంతుడు చెసే పనులు

 సిద్ధాపురం గ్రామాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని మహేష్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ముందుకెళ్లాలని మహేష్ అన్నారు. ఇక ఆ ఉత్కంఠకు మహేష్‌బాబు ఎట్టకేలకు తెరదించారు. మంత్రి కేటీఆర్, మహేష్‌బాబు జరిపిన సుదీర్ఘ సమాలోచనల అనంతరం కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు.

సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్‌బాబు

  సినీ నటుడు మహేష్‌బాబు పాలమూరు జిల్లాలోని ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొన్న విషయం విదితమే. ఇక ఆ ఉత్కంఠకు మహేష్‌బాబు ఎట్టకేలకు తెరదించారు. మంత్రి కేటీఆర్, మహేష్‌బాబు జరిపిన సుదీర్ఘ సమాలోచనల అనంతరం కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. సిద్ధాపురం గ్రామాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని మహేష్‌బాబు పేర్కొన్నారు. రాబోయే కాలంలో నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ముందుకెళ్లాలని మహేష్‌బాబు అన్నారు. ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నారు మహేష్‌బాబు అన్నారు. మహేష్‌బాబు సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

Sunday, September 27, 2015

నిమజ్జనానికి బయలుదేరిన ఘన నాథులు


నగరంలో గణేష్ శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల నుంచి ఘన నాథుల విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరాయి. సుందరంగా అలంకరించిన వాహనాలపై వినాయకుని విగ్రహాలను కొలువు తీర్చారు. వీనుల విందైన సినిమా, భక్తి గీతాలతో బొజ్జ గణపయ్య విగ్రహాల ముందు నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ మూషిక వాహనున్ని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వైపు తీసుకు వస్తున్నారు. గణపతి బొప్ప మొరియా, తుల్జ మొల్చి నౌకరియా అని ఏక దంతున్ని కొలస్తూ ముందుకు సాగుతున్నారు. సాయంత్రానికల్లా హుస్సేన్‌సాగర్ ప్రాంతం వినాయకుని విగ్రహాలతో తరలివచ్చే వాహనాలు, భక్తులతో రద్దీగా మారనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు రోడ్లపైకి చేరుకున్నారు. శోభాయాత్రను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.







Saturday, September 26, 2015

నిమజ్జనోత్సవం రెడీ

గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వినాయక విగ్రహాలు ఊరేగింపుతో వచ్చే ప్రధాన శోభాయాత్ర రహదారులన్నింటిని మూసివేయనున్నారు. నగర వాసులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ప్రధాన ఉరేగింపు ర్యాలీ జరిగే రూట్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ఇతర వాహనాలకు అనుమతి లేదు, కేవలం వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు.








Thursday, September 24, 2015

యా .. ఆల్లా ..

 ముస్లింలకు పరమ పవిత్రమైన హజ్‌యాత్రలో మహా విషాదం చోటుచేసుకొంది. సౌదీ అరేబియాలోని మీనాలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో (స్థానిక కాలమానం) జరిగిన తొక్కిసలాటలో 717 మంది యాత్రికులు మరణించారు. మృతుల్లో రాష్ర్టానికి చెందిన ఓ మహిళ సహా నలుగురు భారతీయులున్నారు. ఈ దుర్ఘటనలో 860 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, మహిళలే అధికంగా ఉన్నారు. మృతుల్లో అనేక దేశాల పౌరులున్నారని సౌదీ అరేబియా పౌర రక్షణ విభాగం తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని స్థానిక మీడియా పేర్కొంది. 1990 తర్వాత హజ్‌యాత్రలో ఇంతటి విషాదం చోటుచేసుకోవటం ఇదే మొదటిసారి. ముస్లింల పవిత్ర నగరం మక్కాలో ఈ నెల 11న గ్రాండ్ మసీదుపై భారీ క్రేను కూలిన ఘటనలో 11మంది భారతీయులుసహా 115 మంది యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే


సౌదీ అధికారులతో విదేశాంగ శాఖ మంతనాలుఈ సంవత్సరం హజ్‌ యాత్రలో మన దేశం నుంచి సుమారు లక్షన్నర మంది హాజరైనట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. మక్కాలో జరిగిన ఘోర ప్రమాదంపై అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని, వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్‌ స్వరూప్‌ మీడియాకు తెలిపారు. ఘటనపై కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా స్పందించారు. మక్కాకు లక్షన్నర మందికి పైగా భారతీయులు వెళ్లారని చెప్పారు. యాత్రకు ఎంత మంది వెళ్లారన్న దానిపై విదేశాంగ శాఖ, హజ్‌ కమిటీ వద్ద కచ్చితమైన సమాచారం ఉందని, దాని ఆధారంగా అన్ని వివరాలు తెలుసుకుంటామన్నారు. విభిన్న కోటాల్లో రాష్ట్రాలు యాత్రికులకు సాయం చేస్తూ హజ్‌ యాత్రకు పంపిస్తున్నందున హజ్‌ సెల్‌ పేరిట విదేశాంగ శాఖ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షిస్తోందని వివరించారు.

Wednesday, September 23, 2015

'దసరా' దమాకా

అక్టోబర్‌లో సినిమా సందండి              సినీ ప్రేక్షకులకు వినోదాల విందు అందించేందుకు తెలుగు కథానాయకులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్‌ నెలలో భారీ అంచనాలతో విడుదల కాబోతున్నాయి. రామ్‌ ' శివమ్‌' నఅఉష్క ప్రధాన పాత్రలో రూపొందిన ' రుద్రమదేవి', రామ్‌చరణ్‌ ' బ్రూస్‌లీ' అక్కినేని నటవారసుడుగా అఖిల్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న ' అఖిల్‌, నందమూరి కల్యాణ్‌ రామ్‌ ' షేర్‌' చిత్రాలు బరిలోకి వస్తున్నాయి. అక్టోబర్‌లో విడుదలకానున్న ఈ చిత్రాలూ విజయపరంపరను కొనసాగిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. దసరా పండుగకు అటూ ఇటూగా విడుదలవుతున్న చిత్రాలన్నీ భారీ స్థాయిలోనే ఉన్నాయి. పండుగా సందర్భంగా సెలవులు కలిసొచ్చే అవకాశం ఎలాగూ ఉంటుంది. దీంతో దియేటర్లకు మంచి అవకాశం వచ్చింది. ఈ ఒక నెలల్లోనే నాలుగు సినిమాలు భారీ బడ్డెట్‌తో వస్తున్నాయి.


మరో ప్రేమకథతో రామ్‌ ' శివమ్‌ '
         రామ్‌, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ' శివమ్‌' అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అదే రోజు గాంధీ జయంతి వర్థంతి ఉత్సవం కావున సెలవు ఉంటుంది. ఈ సినిమా దర్శకుడిగగా శ్రీనివాస్‌ రెడ్డి పరిచమవుతున్నారు. సంగీతం దేవీశ్రీ ప్రసాద్‌ అందించారు.
' రుద్రమదేవి'గా వస్తున్న అనుష్క
        ఈ చిత్రం అక్టోబర్‌ రెండో వారంలో 9న విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడింది. దర్శకుడు గుణశేఖర్‌ పట్టువదల కుడా సినిమాని ప్రేక్షకుల ముందుకుతెస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క టైటిల్‌ పాత్రలో నటిస్తుండగా అల్లు అర్జున్‌ గోనగన్నారెడ్డిగా. దగ్గుబాటి రానా చాశుక్య వీరభద్రుడిగా కన్పించనున్నారు. కృష్ణంరాజు, ప్రకాశ్‌రాజ్‌, నిత్యామీనన్‌, కేథరిన్‌గా నటిస్తుంది.


రామ్‌చరణ్‌ ' బ్రూస్‌లీ'           శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న రామచరణ్‌ చిత్రం ' బ్రూస్‌ లీ' ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 16న విడుదలవుతోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ఫైటర్‌గా కన్పించనున్నాడు. హిరోయినుగా రకుల్‌ప్రీతిసింగ్‌ నటిస్తుంది. మెగాస్టార్‌ చిరంజీవి అతిధి పాత్రలో మెరవనున్నారు. ఆయన ఓ పాటలో సైతం కన్పిస్తారని సమాచారం.


అక్కినేని ' అఖిల్‌'       
       అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా పరిచయవతున్న చిత్రం ' అఖిల్‌' వీవీ వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరో కథానాయకుడు నితిన్‌ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం మరో విశేషం. థమన్‌, అనూప్‌రూబెన్స్‌ పాటలకు స్వరాలు సమకుర్చగా.. మణిశర్మ నేపథ్యంలో సంగీతమందించారు. కథానాయికగా అయేషా సెహగల్‌ నటిస్తుంది.


' షేర్‌గా వస్తున్న కల్యాణ్‌రామ్‌

          నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ' షేర్‌' ఈ చిత్రం అక్టోబర్‌ 30న విడుదవుతోంది. కథానాయిక సోనాల్‌ చౌహాన్‌ నటిస్తుంది.



Tuesday, September 22, 2015

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు


రాష్ట్ర శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభంకాగానే.. ఇటీవల మృతిచెందిన మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పీ కిష్టారెడ్డి మృతికి సభ నివాళులర్పించనుంది. అనంతరం ప్రవేశపెట్టనున్న సంతాప తీర్మానంపై చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు, ఏయే తేదీల్లో జరగాలన్న విషయంపై స్పీకర్ మధుసూదనాచారి ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతో బుధవారం సమావేశం కానున్నారు. ఇందులోనే అసెంబ్లీ సమావేశాల తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు. సభ మొదటిరోజు కావడంతో కిష్టారెడ్డి సంతాప తీర్మానంతోపాటు బీఏసీ సమావేశం మాత్రమే జరగవచ్చని సమాచారం.

Monday, September 21, 2015

దాల్మియాకు వీడ్కోలు


  భారత క్రికెట్‌ యోధుడు జగ్‌మోహన్‌ దాల్మియా అంత్యక్రియలు అభిమనులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. దాల్మియా భార్య చంద్రలేఖ, కూతురు వైశాలి, చివరిసారి కన్నీటి వీడ్కోలు పలికారు. కుమారుడు అభిషేక్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు బిసిసిఐ ప్రముఖులు అనురాగ్‌ ఠాకుర్‌, రవిశాస్త్రి, సునీల్‌ గవాస్కర్‌, సిఎఒ రత్నాకర్‌ శెట్టి, సౌరవ్‌ గంగూలీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాలు పలువురు పాల్గొన్నారు.

 

దాల్మియా అంతిమయాత్ర ఆయన నివాసం నుంచి మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ప్రారంభమైంది. 12.50 నిమిషాలకు ఆయన భాతిక కాయాన్ని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) ఆఫీసుకు తీసుకువచ్చారు. అక్కడ ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల చివరి చూపు కోసం రెండు గంటలపాటు ఉంచారు. క్యాబ్‌ ఆఫీసులో మీడియా దిగ్గజం సభాష్‌ చంద్ర సంతాపం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ 'దాల్మియా భారత క్రికెట్‌నే కాదు ప్రపంచ క్రికెట్‌ను సైతం పాపులర్‌ చేశాడు. దాల్మియా గైర్హాజరీలో ప్రపంచ క్రికెట్‌ కూడా కష్టాలు పడింది. ఆయన వల్ల ధన ప్రవాహం భారత క్రికెట్లోకి మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లోకి కూడా పారింది.

దాల్మియా నేత్రదానం

   సమాజసేవకు పాటుపడాలని క్రికెటర్లకు నిత్యం ఉద్భోదించే దాల్మియా ఈ విషయంలోనూ తానే ముందని నిరూపించుకున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అంధత్వం నిర్మూలన అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన దాల్మియా.. ఇప్పుడూ తానూ నేత్ర దానం చేసి ఆదర్శప్రాయుడయ్యారు. కోల్‌కతాలోని సుస్రుత్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వన్ముక్తా ఐ బ్యాంక్‌కు దాల్మియా తన కళ్లు దానం చేశారు. స్పాట్ ఫిక్సింగ్‌తో మసకబారిన బీసీసీఐ ప్రతిష్ఠను పెంచే బాధ్యతలను అధ్యక్షుడిగా తన భుజానికెత్తుకున్న దాల్మియా.. ఐపీఎల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని, అంధత్వం నిర్మూలన అనే కార్యక్రమం తరహాలో అలాంటి కార్యక్రమం ఇక్కడా చేపట్టాలని లీగ్‌లో దాల్మియా పిలుపునిచ్చిన సంగతి విదితమే.

Bruce Lee - new poster-ram charan,rakul prithi sing

Bruce Lee - new poster-ram charan,rakul prithi sing


Sunday, September 20, 2015

అఖిల్‌ ఈ చిత్రం ఆడియో విడుదల

 అఖిల్‌ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్‌ నిర్మిస్తున్న చిత్రం 'అఖిల్‌'. అనూప్‌ రూబెన్స్‌, ఎస్‌.ఎస్‌.థమన్‌ సంయుక్తంగా సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. తొలుత థియేట్రికల్‌ ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున, మహేష్‌ ఆవిష్కరించారు. అనంతరం అక్కినేని నాగార్జున ఆడియోను రిలీజ్‌ చేసి విచ్చేసిన అతిథులందరికీ అందజేశారు. 
 
  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ,''అఖిల్‌ సినిమాలో అంత బాగా కనిపించడానికి కారణం వినాయక్‌, నితిన్‌, సుధాకర్‌రెడ్డి సహా అందరి కృషి ఉంది. కృష్ణగారితో 'వారసుడు' సినిమా చేశాను. ఇప్పుడు ఆయన వారసుడు మహేష్‌ నా వారసుడి సినిమా ఆడియో లాంచ్‌ చేసినందుకు థ్యాంక్స్‌. అభిమానులతో అనుబంధం 75 ఏళ్ళ క్రితమే మొదలైంది. విజయదశమి కానుకగా అక్టోబర్‌ 22న సినిమాను విడుదల చేస్తున్నాం' అని అన్నారు.ఒక హీరోని ప్రెజంట్‌ చేయడమంటే ఎవరైనా వినాయక్‌గారి తర్వాతే. ఇండిస్టీకి మరో పెద్ద హీరోని ఇచ్చినందుకు వినాయక్‌ గారికి థ్యాంక్స్‌. ఏఎన్నార్‌ లివ్స్‌ ఆన్‌. ఈరోజు అక్కినేని నాగేశ్వరావుగారు చాలా హ్యాపీగా ఉండుంటారు. ఈ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నా' అని మహేష్‌ చెప్పారు. అఖిల్‌ మాట్లాడుతూ,'నాకు చీకటిలో టార్చ్‌లైట్‌గా వినాయక్‌ గారు కనిపించారని నా లాంచింగ్‌ రోజే చెప్పాను.
        
 అనూప్‌, థమన్‌లకు చాలా థాంక్స్‌. అమోల్‌ రాథోడ్‌గారు ఒక కొత్త యాంగిల్‌లో చూపించారు. నేను కష్టపడలేదు కానీ నా చుట్టూ ఉన్నవారు బాగా కష్టపడ్డారు. ఈ సినిమాకి సుధాకర్‌రెడ్డిగారు బ్యాక్‌బోన్‌లా ఉండి నన్ను హైట్స్‌లో పెట్టి సినిమా తీశారు. వినాయక్‌ గారు సినిమాకి గుండెలా ఉన్నారు. నితిన్‌ నా కాలర్‌ పట్టుకుని ఈ సినిమా చేయిం చాడు. సపోర్ట్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌' అని చెప్పారు. ''ఈ సినిమా పెద్ద సెన్సేషనల్‌ హిట్‌ అవుతుందని నేను నాగార్జునగారికి ప్రామీస్‌ చేశాను. ఆ ప్రామీస్‌ను 100% నిలబెట్టుకున్నానని రేపు ప్రేక్షకులు కూడా చెబుతారు. సినిమా తీసిన వాడిగా అఖిల్‌ సూపర్‌స్టార్‌ అవుతాడని చెబుతున్నాను' అని వి.వి.వినాయక్‌ అన్నారు.

Monday, September 7, 2015

కొండారెడ్డి పల్లిని దత్తత తీసుకోనున్న ప్రకాశ్‌రాజ్

  ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ రాష్ట్రంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావును కలిశారు. ప్రకాశ్ రాజ్ మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా చేపడుతున్న చర్యల్లో భాగంగా గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన ప్రకాశ్‌రాజ్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

గ్రామాన్ని దత్తత తీసుకునే ఇతివృత్తంతో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా ఇన్‌స్పిరేషన్‌తో ఆ సినిమా స్టార్ మహేశ్‌బాబు తెలంగాణలో ఓ గ్రామాన్ని, ఏపీలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో వైపు శ్రీమంతుడు హీరోయిన్ శృతిహాసన్ కూడా తమిళనాడులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు.