Friday, February 20, 2015

చంద్రమోహన్‌కు అస్వస్థత

 సీనియర్ నటుడు చంద్రమోహన్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం గుండెపోటురావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు ప్రకటించారు. చంద్రమోహన్ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని చంద్రమోహన్ మేనల్లుడు కృష్ణప్రసాద్ తెలిపారు. రెండురోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామన్నారని ఆయన చెప్పారు.

Thursday, February 19, 2015

ఐపీఎల్‌-8 యువరాజ్‌ కింగ్‌

 యువరాజ్‌ సింగ్‌ వన్డేలో స్థానంలో కోల్పోయినా ఐపీఎల్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదు. ఐపీఎల్‌-7లో 14 కోట్లు పలికిన యువరాజ్‌ సింగ్‌ ఈ ఏడాది 16 కోట్లు అమ్ముడుపోయాడు. కాని ఏవరు ఊహించని స్థాయిల్లో ఈ సారి ఐపీఎల్‌ వేలంల్లో రికార్డు ధర పలికాడు. ప్రపంచకప్‌కు దూరంగా ఉన్న అతని మాత్రం ఐపీఎల్‌-8లో బెంగుళూరు, పంజాబ్‌, ఢిల్లీ ఈ మూడు జట్టు యువరాజ్‌ కోసం వేలం పోటాపోటిగా ఎదురుకున్నాయి. చివరకి ఢిల్లీ 16 కోట్లుకు సోంతం చేసుకున్నంది. రంజీ మ్యాచ్‌లో ఏకంగా మూడు సెంచరీలు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. చివరిగా వన్డేలో అతను చివరిగా 2013 డిసెంబర్‌ సౌత్రాఫికా జట్టు అడాడు.
2015- ప్రపంచకప్‌లో స్థానం దక్కుతుందనే చిన్న ఆశ కూడ ఉండేది. అది కాస్థ అవిరైపోయింది. ఏదైతేనే మళ్లీ ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ రేటు పలికిన యువరాజ్‌ సింగ్‌ ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది.

Wednesday, February 18, 2015

సిని రంగంలో మరో పూవ్వు నేల రాలింది...



డి.రామానాయుడు కాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నాం 3 గం|| మరణించారు. సినిమా రంగంలో అతనికి మారు పేరు మూవీ మోఘల్‌. రామానాయుడు 1936 జూన్‌ 6వ తేదిన జన్మించారు. తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క మరియు చెల్లెలు. మూడేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. సినిమా రంగంలో ప్రపంచ రికార్డు సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఒక వేళ ఆ చిత్రం ప్లాప్‌ అయితే మరలా సినీరంగంలోకి అడుగుపెట్టనని సన్నిహితులతో అనేవారు. కానీ సినిమా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. దాంతో వెనక్కు తిరిగి చూసుకోలేదు.




నేడు సినిపరిశ్రమ బంద్‌
                 మూబీ మొఘల్‌ డా|| డి. రామానాయుడు మరణం పట్ల ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించేందుకు గురువారం నాడు సినిమా పరిశ్రమ బంద్‌నకు పిలుపునిచ్చింది. అలాగే ఘూటింగులతో పాటు థియేటర్లుకూడా బంద్‌ పాటించాలని ఇదే ఆయనకు అర్పించే గౌరవమైన నివాళి అని ప్రకటనలో పేర్కొన్నారు.

 


పలు అవార్డులు

2009లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డులు లభించింది.
2013లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్‌తో సత్కరించింది.
అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌తో చోటు పొందారు. 





12 మంది హీరోయిన్లు, ఏడుగురు సంగీత దర్శకులను చిత్రరంగానికి పరిచయం చేశారు.
1999లో బాపట్ల నుంచి తెలుగుదేశం తరుపున ఎంపీగా గెలుపొందారు.
2003లో బెస్ట్‌ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్నారు. 


Sunday, February 15, 2015

బెంగళూరులో ఐపీఎల్-8 వేలం


బెంగళూరులో ఐపీఎల్-8 వేలం ప్రారంభమైంది. ఐపీఎల్ అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ ఆధ్వర్యంలో వేలం కొనసాగుతోంది. ఐపీఎల్ వేలంలో 344 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. రూ. 3 కోట్లతో మురళీ విజయ్‌ను పంజాబ్ దక్కించుకుంది. రూ. 7.5 కోట్లతో ఏంజిలో మాథ్యూస్‌ను ఢిల్లీ దక్కించుకుంది.