శివసత్తులు ఊగంగా.. పోతరాజులు ఆడంగా.. తెలంగాణ ఆడపడుచులు బోనమెత్తి
పరవశించిపోయారు. స్వరాష్ట్రంలో సగర్వంగా బోనమెత్తిన నగరం పులకించిపోయింది.
గోల్కొండ కోట భక్తి పారవశ్యంతో నిండిపోయింది. అమ్మవారి నామస్మరణతో
మార్మోగింది. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బోనాల పండుగ
అట్టహాసంగా ప్రారంభమైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక
ఆలయంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించి పూజలు ప్రారంభించారు. గోల్కొండలో
మతాలకు అతీతంగా ముస్లింలు బోనాల ఊరేగింపునకు ఆత్మీయ స్వాగతం పలికారు.
విగ్రహాలకు ఘనంగా పూజలు
గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాల పండుగ కోసం ఊరేగించే ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యుడు, ప్రధాన అర్చకుడు అనంత చారి ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి విగ్రహాలను దిగంబర్ పంతులు ఇంటికి తీసుకొని వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు గడ్డి చంద్రశేఖర్, సభ్యులు రాజ్ మల్లేష్‌యాదవ్, మాజీ చైర్మన్లు, సంఘసేవకులు రాజువస్తాద్ పూజల్లో పాల్గొన్నారు.
ఆలస్యంగా ప్రారంభం
బోనాల పండుగ మొదటి పూజ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా మధ్యాహ్నం1.30కు ప్రారంభమైంది. దేవాదాయ శాఖ తరఫున డిప్యూటీ కమిషనర్ రామకష్ణారావు పట్టువస్ర్తాలను తీసుకొని లంగర్‌హౌస్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చారు. వేదికపై ఉన్న హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వస్ర్తాలను తీసుకెళ్లి ఆలయ కమిటీ చైర్మన్ తీగుల్ల విజయ్‌కుమార్‌కు అందజేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి పూజా సామాగ్రిని అందజేశారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి తొట్టెలకు పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌సింగ్, నాయకులు కావూరి వెంకటేష్, తూముకుంట అరుణ్‌కుమార్, కోడూరి శ్రీధర్‌సాగర్ తదితరులు నత్యం చేశారు.