Tuesday, July 2, 2013

భారత్‌ 161 పరుగుల తేడాతో ఘోర పరాజయం

భారత్‌ 187 పరుగులకు అలౌట్‌
శ్రీలంక 348/1
తరంగా 174
జయవర్థన్‌ 107



లంక, భారత్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ల్లో లంక టీమిండియాపై 161 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌ బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ప్రభావం చూపలేకపోయింది. బౌలింగ్‌లో విఫలమైన బ్యాటింగ్‌లో మాత్రం తడబడింది. శ్రీలంక ఇదే అవకాశం అన్ని భారత్‌పై రెచ్చిపోయి అడింది. 349 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 187 పరుగులకు అలౌట్‌ అయ్యింది. జడేజా ఒక్కేడే 49 పరుగులు చేశాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకు అవుట్‌ అయ్యారు. ఛాంపియన్‌ ట్రోఫీ నుంచి భారత్‌ నేరుగా సెల్‌కాన్‌ మొబైల్‌ టోర్నమెంట్‌ వెళ్లింది. ఫ్రాక్టిస్‌ మ్యాచ్‌ కూడా అడకుండ వెళ్లింది. సెల్‌కాన్‌ మొబైల్‌ కప్‌ టోర్నమెంట్‌లో భాగంగా భారత్‌ ఇప్పటి వరకూ రెండుంటిలో పరాజయం పాలైయింది. సెల్‌కాన్‌ మొబైల్‌ కప్‌ టోర్నమెంట్‌లో భాగంగా శ్రీలంక, భారత్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ల్లో లంక 50 ఓవర్లలో ఒక వికెటు నష్టానికి 348 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెటుకు 213 పరుగుల భాగ్యస్వామం చేశారు. ఉప్పల్‌ తరంగా 159 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. వన్డే కెరీర్‌లో 174 పరుగులు చేసి బెస్ట్‌ స్కోరు చేశారు. మరో ఓపెనరు మహేల జయవర్థన్‌ 112 బంతుల్లో 9 పోర్లు, 2 సిక్స్‌లతో 107 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో యాదవ్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి స్లోగా అడి వికెటును కాప్పాడారు. 20 ఓవర్ల తరువాత రన్‌రెట్‌ పెంచారు. అతరువాత స్కోరుబోర్డును పెంచారు. ఇద్దరు అవకాశం వచ్చినప్పుడల్లా బౌండరీలతో రెచ్చిపోయారు. వన్‌డౌన్‌గా మాథ్యూస్‌ వచ్చాడు. తరంగా, మాద్యూస్‌ ఇద్దర కలసి చివరి పది ఓవరల్లో 124 జోడించారు. మాధ్యూస్‌ 29 బంతుల్లో నాలుగు పోర్లు, ఒక సిక్స్‌తో 44 పరుగులు చేశాడు. భారత్‌ బౌలర్లు వికెటు తీయడంలో నిరాశపరిచారు.