ఐపీఎల్-5 విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆవిర్భవించింది. చైన్నై సూపర్‌కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా అదిలోనే ఓపెనరు గంభీర్ వికెటు కోల్పోయిడు. కానీ మరో ఓపెనర్ బిస్లా దిటుగా అడాడు. బిస్లా 89, కల్లిస్ 69, శుక్లా 3, యుసుఫ్ పఠాన్1 పరుగులు చేశారు. ఆఖర్లో షకిబుల్ 11, తివారీ 9 లాంఛనాన్ని పూర్తి చేశారు. చైన్నై బౌలింగ్‌లో హిల్ఫెనాస్ 2, మోర్కెల్, అశ్విన్, బ్రావో చెరో వికెటు లభించింది. అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హస్సీ 54, విజరు 42, సురేష్ రైనా 73 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలింగ్‌లో షికిబుల్, కల్లిస్, భాటియా తలో వికెటు తీశారు.