Tuesday, March 20, 2012

ఆసియా కప్‌లో ముఖ్యాంశాలు ...

పైనల్‌లో పాక్‌, బంగ్లాదేశ్‌
భారత్‌ :సచిన్‌ 100వ శతకం పూర్తి చేశారు.
విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో కోనసాగిస్తున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 183 పరుగులు చేశాడు. ఆసియా పర్యటనలో మొత్తంలో విరాట్‌ తన విశ్వరూపాన్ని చూపించాడు. రెండు సెంచరీలు, ఒక అర్థసెంచరీ చేశాడు.
భారత్‌, బంగ్లాదేశ్‌పై ఓడిపోయి చివరికి నిరాశమిగిలింది. శ్రీలంక , పాకిస్థాన్‌ జట్లుపై గెలిచి బంగ్లాదేశ్‌ జట్టుపై ఓడిపోయింది. అత్యునమైన జట్టుపై గెలిచి బంగ్లాదేశ్‌పై ఓడిపోవడం చాలా దూరదృష్టంకరం. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో లంక గెలిస్తే పైనలో అవకాశం భారత్‌కు దక్కుతుంది. కాని బంగ్లాదేశ్‌ లంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనలో పాక్‌, బంగ్లాదేశ్‌ తలపడనుంది.

పాకిస్థాన్‌ :
ఆసియా కప్‌ భాగంగాలో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో గెలిచి పాక్‌ తొమ్మిది పాయ్లింటతో మొదటి స్థానంలో ఉంది.
పాకిస్థాన్‌ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 50 ఓవర్లలో 330 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం సాధించింది. విరాట్‌ కోహ్లీ 183 పరుగులు చేసి విజయం సాధించాడు.


బంగ్లాదేశ్‌ : బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌ పాక్‌పై తలపడింది. అందులో పాకిస్థాన్‌ గెలిచింది. అతరువాత మ్యాచ్‌ భారత్‌తో ఢ కొంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తెలికగా తీసుకున్న బంగ్లాదేశ్‌ మాత్రం గెలిచి తీరాలి అన్ని నిర్ణయించుకుంది. అనుకున్న లక్ష్యం సాధించి నాలుగు పాయింట్లుతో ముందు అడుగు వేసింది. అతరువాత మ్యాచ్‌ బంగ్లాదేశ్‌, శ్రీలంక ఉంది. లంక మ్యాచ్‌తో గెలిస్తే ఏకంగా పైనలో మళ్లీ పాక్‌పై తలపడనుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్‌ ఐదు వికెట్లు తేడాతో గెలిచి పైనల్‌లో అవకాశం దక్కిచుకుంది. లంకతో మ్యాచ్‌ ఓడిపోయింటే భారత్‌ పైనల్‌ చేరేఅవకాశం ఉంది. కాని బంగ్లాదేశ్‌ మాత్రం అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో మాత్రం రాణించడంతో పైనల్‌ చేరుకుంది. ఈ నెల 22న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ తలపడనుంది. చివరి మ్యాచ్‌లో పాక్‌పై బంగ్లాదేశ్‌ గెలిచి కప్‌ కోసం తహతహలాడుతుంది.
శ్రీలంక : ఆసియా కప్‌ భాగంగా లంక మూడు పరాజయాలు చూసింది. తొలి మ్యాచ్‌ భారత్‌, అతరువాత మ్యాచ్‌ పాకిస్థాన్‌ ఓడిపోయింది. చివరికి పరువు అయినా దక్కించుకోవాలన్ని అనుకున్న లంక చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆసియా కప్‌ పరాజయం పాలైయింది. 

Wednesday, March 14, 2012

ముచ్చటగా మూడు...


neelimaపవన్‌కల్యాణ్‌తో ఇటీవలే ‘పంజా’ చిత్రాన్ని నిర్మించిన సంఘమిత్ర ఆర్ట్స్ సంస్థ త్వరలో మూడు చిత్రాల నిర్మాణానికి పూనుకుంటోంది. కొత్త రచయితలను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ఇటీవలే ఈ సంస్థ కొత్త కథలకు స్వాగతం పలుకుతూ కాంటెస్ట్‌ను నిర్వహించింది. దీనికి రచయితల నుంచి మంచి స్పందన లభించిందని ,మొత్తం వేయికిపైగా కథల్లోంచి మూడు కథల్ని ఎంపికచేసుకున్నామని నిర్మాతలు నీలిమా తిరుమలశెట్టి, నగేష్ ముంతా తెలిపారు.
త్వరలో నిర్మించబోయే మూడు చిత్రాల విశేషాలను వారు తెలియజేస్తూ ‘అత్యద్భుతమైన మూడు కథల్ని ఎంపిక చేశాం. ‘అలియాస్ జానకి’ చిత్రానికి టెన్త్‌క్లాస్ చిత్రానికి దర్శకత్వం వహించిన చందు దర్శకత్వం వహిస్తాడు. ప్రేమకథా చిత్రమిది. చక్కటి సందేశం వుంటుంది. ‘ఏ శ్యామ్ గోపాల్ వర్మ ఫిలిం’ అనే చిత్రాన్ని ఐటీ రంగానికి చెందిన రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు. కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం వుంటుంది. ‘అరే...అరెరే..’ అనే టైటిల్‌తో రానున్న చిత్రాన్ని శేఖర్ కమ్ముల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తాడు. ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెలా ఓ చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం. చిత్రాల ప్రారంభోత్సవ తేదీలను త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు.

Tuesday, March 13, 2012

భారత్‌ తొలి విజయం

 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 254 అలౌట్‌ అయ్యింది. 152కే మూడు వికెట్లు కోల్పోయిన లంక విజయం దిశగా పయనిస్తుంది. సంగక్కర 60, తిరిమానేన్‌ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆశ్విన్‌ ఒకే ఓవర్లలో రెండు వికెట్లు తీసుకోని లంకకు దెబ్బమీద దెబ్బ తీస్తాడు. 35 ఓవర్లలో సంగక్కర 65, తిరిమానేన్‌ 29 అవుట్‌ చేస్తాడు. 38 ఓవర్లలో వినయకుమార్‌ హ్యాట్రిక్‌ మిస్‌ అయ్యాడు. కులశేఖర్‌ 11, కపుదేగారా 0 అవుట్‌ చేస్తాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లు జయవర్థనే 78, సంగక్కర 65 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకు అవుట్‌ అయ్యారు. భారత్‌ బౌలింగ్‌లో పఠాన్‌ నాలుగు, వినరు కుమార్‌, అశ్విన్‌ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అంతక ముందు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 304 పరుగుల చేసింది. గంభీర్‌ 100, విరాట్‌ కోహ్లీ 108 పరుగులు చేశారు. ఇద్దరు ఒకరు మించి ఒకరుగా పోటి పడి సెంచరీ సాధించారు. సచిన్‌ 6 పరుగులకు అవుట్‌ అయ్యారు. చివరిలో ధోని 46, రైనా 30 పరుగులు చేశారు.

Friday, March 9, 2012

రాహుల్‌ స్థానం భర్తీ చేయలేనిది టీమిండియా ...

రాహుల్‌ ద్రావిడ్‌ స్థానం భర్తీ చేయలేనిదని బీసీసీఐ అధ్యక్షుడు ఎస్‌ శ్రీనివాస్‌ అన్నారు. రాహుల్‌ ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. ఒక అద్భుతమైన క్రికెటర్‌ని చూసే అపురూపమైన అవకాశం మనకు లభించింది. ఆయన ఉత్తమ క్రీడా కారుడు మాత్రమే కాదు. అలాంటి వ్యక్తి మరొకరుంటారని నేను అనుకోవడం లేదు.

ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో రాహుల్‌ ద్రావిడ్‌, లక్ష్యణ్‌, సచిన్‌ సరిగా అడ్డకపోవడం వల్లనే సిరీస్‌ కోల్పోయా అని పలు సమచారం. అలాగే లక్ష్మణ్‌, ద్రావిడ్‌, సచిన్‌ టెస్టు సిరీస్‌లకు గుడ్‌బై చెప్పాలని పలువురు వ్యక్తం చేశారు. మరి ఈరోజు రాహుల్‌ ద్రావిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. దీనికి కారణం ...
బీసీసీఐ అధ్యక్షుడు ఎస్‌. శ్రీనివాస్‌ మాట్లాడూతూ ...


రాహుల్‌ ద్రావిడ్‌ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో మాట్లాడుతూ ఒక అద్భుతమైన క్రికెటర్‌ని చూసే అపురూపమైన అవకాశం మనకు లభించింది. ఆయన ఉత్తమ క్రీడాకారుడు మాత్రమే కాదు... నేటి తరానికి చక్కని ఆద్శరం కూడా. ఆయనలాంటి వ్యక్తి మరొకరుంటారని నేను అనుకోను... అలాంటి వ్యక్తులు ఆట వదిలేసి వెళ్లిపోవాలని ఎవరూ కోరుకోరు. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా బాధాకరమైన రోజు అని బీసీసీఐ అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాస్‌ చెప్పారు.

Sunday, March 4, 2012

11న రచ్చ ఆడియో


మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాల్ని అందించిన మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రై.లిమిటెడ్‌ సంస్థ లేటెస్ట్‌గా ‘రచ్చ’ నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సుప్రసిద్ధ నిర్మాత ఆర్‌.బి.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పారస్‌జైన్‌, ఎన్‌.వి.ప్రసాద్‌లు నిర్మాతలు. కాగా ‘రచ్చ’ ఆడియో వివరాలను చిత్ర నిర్మాతలలో ఒకరైన ఎస్‌.వి.ప్రసాద్‌ చెబుతూ ‘రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న రచ్చ చిత్రం ఆడియోను చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో 11వ తేదీన హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో విడుదల చేస్తు న్నాం. ఈ చిత్రాన్ని సమ్మర్‌ కానుకగా విడుదల చేస్తున్నాం’ అన్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం సంపత్‌నంది.

Friday, March 2, 2012

సచిన్‌ వన్డే మ్యాచ్‌లను దూరం చేయాలని పలువురు సూచనాలు ...

సచిన్‌ను వన్డే మ్యాచ్‌లను నుంచి దూరం చేయాలని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వన్డేలు వదిలి, టెస్టులపై దృష్టిసారించాలని సలహా ఇచ్చారు. తానే స్వచ్ఛందంగా వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని, తన వందో సెంచరీ కోసం అతడు ఆందోళన చెందనవసరం లేదని, పెద్ద ఫార్మాట్‌లో అతడు తప్పకుండా సెంచరీ సాధించి తీరతాడని అన్నాడు.

ఫైనలో భారత్‌, ఆస్ట్రేలియా డీ

ముక్కోణపు సిరీస్‌ భాగంగా ఫైనలో భారత్‌, ఆస్ట్రేలియా తలపడనుంది. అంతక ముందు లంక, భారత్‌ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 37 ఓవర్లలో 321 పరుగుల లక్ష్యాని సాధించింది. విరాట్‌ కోహ్లీ సెంచరీతో సమాదానం చెప్పాడు. అతని తోడుగా గంభీర్‌ హాఫ్‌ చేశారు.