Tuesday, January 31, 2012

చెవిలో పూలు పెట్టుకోవడం ఎప్పుడైనా చూస్తారా ఇది చూడండి.

చెవిలో పూలు పెట్టుకోవడం ఎప్పుడైనా చూస్తారా ఇది చూడండి.
 



Monday, January 30, 2012

పవన్ సరసన్ కాజల్?


DSC55 talangana patrika telangana culture telangana politics telangana cinema‘బిజినెస్‌మేన్’ సక్సెస్‌తో మేఘాల్లో తేలిపోతోంది ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. గ్లామర్‌తో పాటు చక్కటి అభినయం కలబోసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయని మురిసిపోతోంది ఈ వయ్యారి. అయితే యాక్షన్ సినిమాల కంటే తనకు స్వతహాగా కామెడీ సినిమాలంటే ఇష్టమని, ఫుల్‌పూంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నటించాలన్నది తన చిరకాల కోరికని సెలవిస్తోంది కాజల్ అగర్వాల్. ‘చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలంటే అస్సలు ఇష్టం వుండదు. అంతేందుకు టీవీ చూస్తున్నప్పుడు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ వస్తే వెంటనే ఛానల్ మార్చేస్తా. అయితే సినిమాల్లోకి వచ్చాక యాక్షన్ సినిమాలకు తప్పనిసరిగా అలవాటు పడిపోవాల్సి వచ్చింది.
రాబోయే రోజుల్లో కామెడీ సినిమాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నాను. హాస్యరస పాత్రల్లో నటించి మెప్పించడం అంత సులువు కాదు..ఎవరికైనా అది పెద్ద ఛాలెంజ్ లాంటిది. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నా సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా వున్నాను’ అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించే చిత్రంలో ఈ సుందరిని కథానాయికగా ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత పూరి-పవన్ కలయికలో వస్తోన్న ఈ చిత్రం మేలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలుత ఈ చిత్రానికి బాలీవుడ్ భామను కథానాయికగా అనుకున్నా ‘బిజినెస్‌మేన్’ సక్సెస్‌తో పూరి చేత లక్కీగాళ్ అనిపించుకున్న ఈ భామనే హీరోయిన్‌గా ఓకే చేయనున్నట్లు సమాచారం.

Friday, January 27, 2012

మూడు భాషల్లో రాణిస్సా!

అంతా యువతీయువకులే ఉన్న టీమ్‌తో పనిచేస్తే హుషారొస్తుంది. ఫలితమూ అంతే బావుంటుంది’’ అంటున్నారు ‘కొలవెరి..డి’ ఫేం, ‘3’ సంగీతదర్శకుడు అనిరుధ్‌. 21ఏళ్ల ఈ యువకుడు ఒకే ఒక్క ‘కొలవెరి..’తో ప్రపంచ ప్రసిద్ధ సంగీతదర్శకుడైపోయాడు. తెలుగు, తమిళ్‌, హిందీలో నేడు వరుస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ-‘ఐశ్వర్య దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ‘3’ సినిమాకి సంగీతం అందిస్తున్నా. ఆల్బమ్‌లో రెండు పాటలు కూడా పాడాను. ‘కొలవెరి...’కి కోరస్‌ పాడాను. అసలు ‘కొలవెరి...’ అనేది ప్రేమలో విఫలమైనప్పుడు..విచారంలో పాడుకునే పాట. రొటీన్‌కి భిన్నంగా ఉండాలని బాణి కొత్తగా వినిపించాను. హాస్యం, విచారం ఒకే పాటలో ఉండేలా ట్యూన్‌ కట్టడం చాలా కష్టం. ప్రయత్నించి సక్సెసయ్యాను. అలాగే ‘3’ సినిమాకోసం ముందస్తు ప్రణాళికలెన్నో. సెట్స్‌కెళ్లడానికి ముందు 13 లఘుచిత్రాలు మేమంతా కలిసి రూపొందించాం. అందులోంచి ఓ లఘుచిత్రాన్ని పూర్తి స్థాయి ఫీచర్‌ సినిమా ‘3’ గా తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ని విపరీతంగా అభిమానించే అనిరుధ్‌..బికాం పూర్తిచేసి లండన్‌ ట్రినిడాడ్‌ సంగీతకళాశాలలో మ్యూజిక్‌ కోర్స్‌ పూర్తిచేశారు. కర్నాటిక్‌ సంగీతంలోనూ మంచి ధిట్ట.

Sunday, January 22, 2012

ప్రిన్స్‌కు వదిన దొరికినట్లేనా!

వెంకటేష్‌, మహేష్‌బాబుల సంచలన కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమయింది. అయితే గత కొంతకాలంగా వెంకటేష్‌ సరసన నటించే హీరోయిన్‌ విషయమై సందిగ్థం నెలకొంది. త్రిష, భూమిక, అమలాపాల్‌ లాంటి హీరోయిన్ల పేర్లు ఆ మధ్య వినిపించాయి. తీరా విషయానికి వస్తే అవన్నీ ఒట్టిదేనని తేలింది. ఇప్పుడు అనూహ్యంగా అంజలి పేరు వినిపిస్తోంది. అంజలి అచ్చంగా తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ అచ్చతెలుగు అందాల అపరంజి బొమ్మను వెంకటేష్‌ పక్కన నటింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. వెంకటేష్‌ సరసన అయితే ఓకేగానీ హీరోయిన్లంతా ప్రిన్స్‌ మహేష్‌బాబుకు ఒదిన పాత్ర అనేసరికి వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడు అంజలి కూడా అవకాశం ఉపయోగించుకుంటుందో లేక మిగతా హీరోయిన్ల మాదిరిగా వదులుకుంటుందో మరి వేచిచూడాలి.

Tuesday, January 17, 2012

మార్చిలో జహీర్‌ ఖాన్‌ పెళ్లి

భారత క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ ఓ ఇంటివాడు కానున్నారు. చిరకాల స్నేహితులు, బాలీవుడ్‌ తార ఇషా షేర్వాణితో జహీర్‌ మార్చి నెలలో పెళ్లి జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత జహీర్‌ ఖాన్‌ పెళ్లి జరిగే అవకాశముంది. ఒక వేళ మార్చి నెలలో సాధ్యపడకపోతే అక్టోబర్‌ నెలలో జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Friday, January 13, 2012

ఎవరు మారినా వీళ్లు మాత్రం మారారు ...

సచిన్‌, ద్రావిడ్‌, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌
ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లల్లో భారత్‌ అదే తీరు ఉంది. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఇండియా బ్యాట్స్‌మెన్‌లు సచిన్‌, ద్రావిడ్‌, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. కాని ఘోరంగా విఫలమవుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌లో భారత్‌, ఆస్ట్రేలియాపై ఒక మ్యాచ్‌లో కూడా పైచేయి సాధించలేకపోయారు. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో కూడా రాణించలేకపోయారు. ఇప్పటికైనా అవకాశం ఉంది.

బిజినెస్ మెన్ రివ్యూ

 మహేష్, పూరి జగన్నాథ్ ల పోకిరి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి అలాగే ఉంటుందా. దాన్ని తలదన్నే రేంజ్ లో ఉంటుందా. దూకుడు తరువాత వస్తున్న సినిమా కాబట్టి ఆ రేంజ్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందా…., ఇలాంటి సందేహాలతో థియేటర్లో కూర్చున్న వారికి సందేహాలు తీర్చేసి, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు సందేశం కూడా ఇచ్చెసాడు పూరి. చూసే ( దర్శకుడు చూపించే ) యాంగిల్ బావుంటే చెడులో మంచిని, విలన్ లో హీరోను చూడవచ్చు. బిజినెస్ మెన్ లో ఇదే చూస్తాం. ఫస్ట్ ఫ్రేం నుంచి చివర వరకు హీరో విలన్ లాగే చూస్తాడు. విలన్ లాగే మాట్లాడుతాడు. అయినా కూడా విలన్ లా కనిపించే హీరో నచ్చుతాడు. సింపుల్ గా చెప్పాలంటే యాంటీ హీరోయిజం. కథ పరంగా చెప్పుకోవాలంటే బిజినెస్ మెన్ లో కథ ఏమీ లేదు. ఉన్నదంతా హీరో క్యారక్టరైజేషన్ మాత్రమే. సూర్య (మహేష్ ) అనే వ్యక్తీ వంద కోట్ల మంది ఉన్న భారతదేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటాడు. అతననుకున్నది సాధించడా లేదా అనేదే సినిమా. ప్రతి మనిషికి ఓ గోల్ ఉండాలి. అది సాధించి తీరాలి అనే విషయాన్ని చాలా సినిమాల్లో చూసి ఉంటాం కాని, అదే విషయాన్ని బిజినెస్ మెన్ లో ఓ కొత్త కోణంలో చూస్తాం. ఓవరాల్ గా సినిమా బాగుంది. మహేష్ యాక్టింగ్ సూపర్. డైలాగ్ డెలివరీ లో మహేష్ స్టైల్ సూపర్ హిట్. మహేష్ స్టైల్ కు తగ్గట్టుగానే పూరి డైలాగ్స్ కూడా ఆదరగ్గొట్టా యి. డైలాగ్స్ అంటే కేవలం పంచ్ ల కోసమే మాత్రమే కాకుండా వాటిలో మంచి మీనింగ్ కూడా ఉండేలా పూరి డైలాగ్స్ ఉన్నాయి. కాజల్ గత సినిమాలకంటే గ్లామరస్ గా ఉంది. పూరి సినిమాల్లో ఉండే విధంగానే కాస్త ఎక్స్ పోజింగ్ డోస్ పెంచింది కాజల్. అవసరమైన మేరకు యాక్షన్ ఉంది. ప్రత్యేకమైన కామెడీ ఏమీ లేకపోయినా ఎక్కడా ఆ లోటు కనిపించదు. మహేష్ పంచ్ డైలాగ్స్ నవ్విస్తాయి. చప్పట్లు కొట్టిస్తాయి. స్క్రీన్ మీద కనిపించే హీరో మహేష్ అయితే, స్క్రీన్ వెనుక ఉన్న హీరో తానె అంటూ పూరి తన డైలాగ్స్ తో చూపించాడు. కొన్ని చోట్ల డైలాగ్స్ శృతి మించినా, మంచి డైలాగ్స్ ఎక్కువ ఉండటంతో అవే గుర్తుకు వస్తాయి. తమన్ మ్యూజిక్ దూకుడు స్థాయిలో లేదు. ఉన్నంత వరకు ఫర్వాలేదు. ఆడియో రిలీజ్ అవ్వగానే హిట్ అయిన సార్ వస్తారా…, బాడ్ బోయ్స్, ముంబాయి సాంగ్స్ మాత్రమే మంచి రెస్పాన్స్ సంపాదించాయి. మిగతా  సాంగ్స్ ఒకే. కాజల్ ఫ్రెండ్ క్యారక్టర్ డైలాగ్స్ ఇరిటేటి౦గ్ తెప్పిస్తాయి. కాజల్ కు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పేవారే బెటర్. లవ్ ట్రాక్, ఇంటర్వెల్ సీన్ పోకిరిని తలపిస్తాయి. టెక్నికల్ విషయలన్నింటిని డైలాగ్స్ డామినేట్ చేసేసాయి. సినిమాలో టెక్నికల్ మేటర్స్ అన్నీ సాధారణంగా కనిపిస్తాయి. ఓవరాల్ గా బిజినెస్ మెన్ డీసెంట్ హిట్ అనిపించుకుంటుంది. సినిమాకి మళ్ళీ మళ్ళీ రప్పించే ఎంటర్ టైన్ మెంట్ లేదు, సినిమాను రిలీజ్ చేయడం అత్యంత భారీగా చేసారు  కాబట్టి రికార్డులు విషయంలో బిజినెస్ మెన్ మొదటి రోజు, మొదటి వారం రికార్డులు తప్ప పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు.

Thursday, January 12, 2012

Monday, January 9, 2012

Sunday, January 8, 2012

కొత్త ఏడాది..కొత్తగ

 లవర్‌బోయ్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గకుండా..ప్రేమకథకు యాక్షన్‌ జోడించిన చిత్రాలలో నటిస్తున్నా. కొత్త సంవత్సరంలో సరికొత్తగా మీ ముందుకొస్తున్నా’’ అన్నారు తరుణ్‌. ఆదివారం ఈ యువహీరో పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాజా సినిమాల గురించి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నా. రెండూ యాక్షన్‌ కథాంశం ఉన్నవే. చక్రి సంగీతం అందిస్తున్నారు. ‘అనుచరుడు’ 3పాటల చిత్రీకరణ సహా నాలుగు రోజుల షూటింగ్‌ మిగులుంది. నాపై యాక్షన్‌ సన్నివేశాలు పూర్తి చేస్తున్నారిప్పుడు. తదుపరి ఓ పాటను సెట్‌లో, మిగతావి హైదరాబాద్‌ పరిసరాల్లో తెరకెక్కిస్తారు. ఫిబ్రవరిలో రిలీజ్‌ చేస్తారు. మరో సినిమా ‘యుద్ధం’ 30శాతం పూర్తయింది. అనుచరుడు తర్వాత మిగతా చిత్రీకరణ సాగుతుంది. 
అలాగే కొన్ని స్క్రిప్టు దశలో ఉన్నాయి’’ అన్నారు. సినిమాల ఎంపిక విషయమై మాట్లాడుతూ -స్క్రిప్టు నచ్చి, పాత్రకు సూటవుతానని భావిస్తే ఏ తరహా చిత్రంలోనైనా చేస్తానని అన్నారు. వెంకటేష్‌ సారథ్యంలో ‘సిసిఎల్‌ సీజన్‌ 2’ క్రికెట్‌ కప్‌ను కచ్ఛితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు తరుణ్‌. ఈ సారి టాలీవుడ్‌ టీమ్‌ మరింత బలంగా ఉందన్నారు. మ్యాచ్‌ ఫలితం ఏదైైనా..ఆటతో అందరికీ వినోదాన్ని పంచుతామన్నారు. పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు సమాధానంగా ‘దానికింకా టైముంది. రెండేళ్ల సమయం పట్టొచ్చు’ అన్నారు. తన పుట్టినరోజు వేడుకల కోసం విచ్చేసిన అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి.

Saturday, January 7, 2012

నిర్మాతగా పదేళ్ల ప్రయాణం!

DSC_0407-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘2002లో బాలాదిత్య నటించిన ‘చంటిగాడు’ చిత్రంతో నిర్మాతగా నా ప్రస్థానం మొదలై ఈ ఏడాదితో పదేళ్లయ్యింది’ అన్నారు. నిర్మాత బి.ఎ. రాజు. ఆయన పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ నిర్మాతగా నా ప్రస్థానం మొదలై ఈ ఏడాదితో పదేళ్లు కావడం ఆనందంగా వుంది. ప్రస్తుతం ‘ప్రేమకావాలి’ ఫేమ్ ఆది కథానాయకుడిగా డా. రాజేంవూదవూపసాద్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘లవ్‌లీ’ చిత్రాన్ని ఆర్. ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నాను. బి. జయ దర్శకురాలు. శాన్వి నాయికగా నటిస్తోంది. నాలుగు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 2 నుంచి డబ్బింగ్ ప్రారంభించాం. ఓ పాటను ఈ నెల 8నుంచి కేరళలోని చాలకుడిలో సబీనా ఖాన్ నేతృత్వంలో చిత్రీకరించనున్నాం. మరో మూడు పాటలను విదేశాల్లో చిత్రీకరించి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.

Friday, January 6, 2012

ఐపిఎల్‌-5 షెడ్యూల్‌ విడుదల

ఐపిఎల్‌-5 షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ షెడ్యూల్‌ ఏప్రిల్‌ 4న ప్రారంభమై 27న ముగుస్తుంది. మొత్తం 27 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌ చెన్నై, ముంబయిల మధ్య జరుగుతుంది.

Tuesday, January 3, 2012

ఇబ్బందిగా లేకుండా అడుకుట్టున్నా ఆస్ట్రేలియా

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 482 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీపాటింగ్‌ టెస్టులో 40వ సెంచరీ పూర్తి చేశాడు. కెప్టెన్‌ క్లార్క్‌ కెరీయర్‌లో తొలి డబుల్‌ సెంచరీ చేశాడు. భారత్‌పై ఆస్ట్రేలియా 291 పరుగుల అధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఇబ్బంది లేకుండా అడారు. రికీపాటింగ్‌ 134 పరుగుల చేసి ఇషాంత్‌ బౌలింగ్‌లో సచిన్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఆట ముగిసే సమయానికి క్లార్క్‌ 251, హాస్సీ 55 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. టీమిండియా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లును ఇబ్బంది పెట్టలేకుండా పోతున్నారు.

Sunday, January 1, 2012

సచిన్‌ పైకి ద్రవిడ్‌ కిందకి

  తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ లో సచిన్‌ ర్యాంకు మెరుగు పడగా, ద్రవిడ్‌ టాప్‌ టెన్‌ నుంచి పడిపోయాడు. తొలి టెస్టులో హాఫ్‌ సెంచరీతో రాణించిన సచిన్‌ నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌తో కలిసి ర్యాంకును పంచుకున్నాడు. మరోవైపు ద్రవిడ్‌ రెండు స్థానాలు దిగజారి 11వ ర్యాంక్‌ తో సరిపెట్టుకున్నాడు. బౌలర్లలో జహీర్‌ ఆరోర్యాంకుతో సరిపెట్టుకోగా.. ఆసీస్‌ పేసర్‌ పీటర్‌ సిడిల్‌ మూడు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరాడు. సౌతాఫ్రికాపై చెలరేగిన హెరాత్‌ కూడా ఏడోస్థానంలో నిలిచాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పాటిన్సన్‌, భారత్‌ యంగ్‌ గన్‌ ఉమేష్‌ యాదవ్‌ ఐదు స్థానాలు మెరుగుపడ్డారు. పాటిన్సన్‌ 31, యాదవ్‌ 42 స్థానాల్లో నిలిచారు