వెంకటేష్ హీరోగా ..... తేజ దర్శకత్వంలో ' సావిత్రి' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. గతంలో లక్ష్మీ, తులసీ, మల్లీశ్వరి, నాగవల్లి వంటి టైటిల్స్‌తో సినిమాలు చేసిన వెంకీ... ఈసారి మాత్రం ' సావిత్రి' టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకటేష్, తేజ కాంభినేషన్‌లో వస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగినట్లుగా తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Monday, February 28, 2011
Sunday, February 27, 2011
నేడు పైనల్ మ్యాచ్ జరిగింది ....
నేడే పైనల్ మ్యాచ్ జరినంత పని అయ్యింది. మ్యాచ్ చూస్తుంటే ప్రపంచకప్‌లో ఇదే చివరి మ్యాచ్‌లా పీల్ అనిపించింది. ఇరు జట్లు రా రీగా పోటిపడి చివరికి సమానంగా నిలిచియి. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఇంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లు లేవు. ఇరు జట్టు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలతో స్వాగతం పలికారు. ముఖ్యంగా సచిన్ టెండ్కూలర్ తొలి మ్యాచ్‌లో 28 పరుగులు మాత్రమే చేసినా రెండో మ్యాచ్‌లో రెచ్చిపోయి అడాడు. అతని థీటుగా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్ట్రాస్ నేనేం తకువ కాదు నీతో ' ఢ ' అని పోటికి దిగాడు. అతను కూడా 158 పరుగుల చేసి సవాలుగా నిలిచాడు. ఇంగ్లాండ్ జట్టు సెహ్వాగ్‌ని త్వరగా అవుట్ చేయాలని వూహ్యం పలిచింది. మరో ఓపెనరు సచిన్ అతనికి తోడు గంభీర్ ఇద్దరు మంచి బిగ్ బ్యాట్స్‌మెన్‌లు. రెచ్చిపోయి సచిన్ సెంచరీ, గంభీర్ అర్థ సెంచరీ చేశారు. యువరాజ్ సింగ్ 58 పరుగులు చేశాడు. భారత్ 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి అలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ 339 పరుగుల లక్ష్యాంతో బరిలోకి దిగింది. ఇంగ్లాండ్ చివరి బంతి వరకు అడి మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్టు సమానంగా నిలవడంతో చెరోక పాయింట్ లభించింది.
విక్టరీ వెంకటేష్‌తో నిత్యా మీనన్
వెంకటేష్ తాజా చిత్రంలో హీరోయిన్‌గా నిత్యామీనన్ ఎంపికయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం విక్టరీతో డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశాని నిత్యామీనన్ స్వంతం చేసుకుందని సమాచారం. నిత్యామీనన్ తన మొదటి సినిమా అలా మొదలైయింది. తరువాత రెండో సినిమాల విక్టరీ వెంకటేష్ సరసన నటించండం అమెకు కలిసివచ్చిన అవకాశం. మరి ఇంత పెద్ద స్టార్ పక్కన చేయడం చిన్న విషయం కాదు.
మొదటి మ్యాచ్‌లో సెహ్వాగ్, రెండో మ్యాచ్‌లో సచిన్
ప్రపంచకప్‌లో భాగంగా భారత్ మొదటి మ్యాచ్‌లో సెహ్వాగ్ 175 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో సచిన్ సెంచరీతో బ్యాట్‌తో రూచి చూపించాడు. సచిన్ వన్డేలో 47 సెంచరీ నమోదు చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఇది ఐదో సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సెహ్వాగ్ 35 పరుగులు చేశాడు. సచిన్ 120, గంభీర్ 51, యువరాజ్ సింగ్ 58 ధోనీ 31 పరుగులు చేశారు. భారత్, ఇంగ్లాండ్‌కు ఒక సవాల్‌గా ఎదురైయింది. భారత్ 338 పరుగుల లక్ష్మాఁ్న ఇంగ్లాండ్ ముందుంచింది.
Saturday, February 26, 2011
పాక్ జయభేరి
పాక్‌స్థాన్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ 11 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 50 ఓవర్లలో 277 పరుగుల చేసింది. పాక్ బ్యాట్‌మైన్‌లు మిస్బావుల్ హక్ ,యూనిస్ ఖాన్ ఇద్దరు రాణిచండంతో పాక్ 277 పరగులు చేసింది. కమ్రాన్ అక్మల్ 39, హఫీజ్ 32 పరుగులు చేశారు. కెప్టెన్ షాహిద్ అఫ్రిద్ 12 బంతులలో 16 పరుగులు చేశాడు. అతడు బ్యాటింగ్ కన్నా బౌలింగ్‌కు ఎకువ ప్రాదన్యత వహిస్తున్నారు. అంతక ముందు మ్యాచ్‌లో కూడా బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసుకఁన్నాడు. ఇప్పుడు జరిగినా మ్యాచ్‌లో నాలుగు కీలక వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన లంక ఓపెనర్లు ఇద్దరు తరంగ 33, దిల్షాన్ 41 పరుగులు చేశారు. వీరిద్దరు మొదటి వికెట్టుకు 71 పరుగుల భాగ్యస్వామ చేశారు. వన్‌డౌన్‌గా వచ్చిన కెప్టెన్ 49 పరుగుల చేసి అఫ్రీద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అప్పటికైనా లంక వైపు మ్యాచ్ ఉంది. ఒక్కసారిగా వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన తరువాత మ్యాచ్ పాక్ దిశగా నడిచింది.జయవర్థన్, సమరవీర ఇద్దరు తకువ స్కోరుకే అవుట్ అయ్యారు. అతరువాత వచ్చిన మాథ్యుస్, స్లిల్వా ఇద్దరు స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఇద్దరు మంచిగా అడుతున్న సమయంలో మ్యాథ్యూస్‌ను అఫ్రిద్ అవుట్ చేశాడు. చివరిలో కఁలశేఖర్ 14 బంతులో 24 పరుగులు చేసి పాక్ భయం పుట్టించాడు. చివరికి పాక్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రపంచకప్‌లో నాలుగో వికెట్ .....
ప్రపంచకప్ ప్రారంభమైయిన ఎనిమిది రోజులకే మరో వికెట్టు పడిపోయింది. అంతక ముందు మూడు వికెట్లు పడిపోయినవి ఇది నాల్గొవ వికెట్టు. ఆస్ట్రేలియా పాస్ బౌలర్ బోలింగర్ గాయంతో ఈ ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. ఎడమకాలి మడమకు గాయం కావడంతో మిగితా మ్యాచ్‌లకు ఆడకుండానే స్వదేశానికి పయనం కానున్నాడు. ఇండియాలో అడుగుపెట్టినప్పటి నుండే బొలింగర్ మడమ గాయంతో బాధపడుతున్నాడు. అనుకోకుండా ఆ గాయం రానురాను పెద్దదయ్యింది. ప్రస్తుతం ఆయన బౌలింగ్ చేయలేని స్థితిలో ఉన్నాడు. బొలింగర్ స్థానంలో మైకెల్ హసి ఎంపిక కావొచ్చని సమాచారం.
వీరు గాయం ....
గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. ప్రాక్టీస్ సందర్భంగా సెహ్వాగ్‌కు పక్కటెముకల్లో బంతి తగిలి వాపు వచ్చింది. వెంటేనే అతని డ్రస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. అతడికి పెద్దగా సమస్య ఏమీ లేదని వైధ్య పరీక్షల్లో వెల్లడైయింది. అది చాలా చిన్న గాయం స్కానింగ్ కూడా అవసరం లేదు అని బారత జట్టు మేనేజర్ రంజిబ్ బిస్వల్ తెలిపారు.
Friday, February 25, 2011
ఇది ఒక సవాలు .... విజయం మాత్రము పెద్దది
చిన్న మ్యాచ్‌పై విజయం సాధించి జట్లు పెద్ద జట్లుపై విజయం వచ్చే సరికి ఎవరో ఒకరు ఓడిపోవడం తప్పదు. నేటి మ్యాచ్‌లో ఓడిపోయింది ఎవరు... ? గెలిచెంది ఎవరు ... ?
పాకిస్థాన్ తన మొదటి మ్యాచ్‌లో కెన్యా పై ఘన విజయం సాధించింది. లంక మొదటి మ్యాచ్‌లో కెనడాపై విజయం సాధించింది. రెండు జట్లు చిన్న మ్యాచ్‌లో విజయం సాధించినవి. ప్రపంచకప్‌లో 10వ మ్యాచ్ పాక్, లంక్ మధ్య జరుగుతుంది.
పాకిస్థాన్ తన మొదటి మ్యాచ్‌లో కెన్యా పై ఘన విజయం సాధించింది. లంక మొదటి మ్యాచ్‌లో కెనడాపై విజయం సాధించింది. రెండు జట్లు చిన్న మ్యాచ్‌లో విజయం సాధించినవి. ప్రపంచకప్‌లో 10వ మ్యాచ్ పాక్, లంక్ మధ్య జరుగుతుంది.
భాదలో రెండో మ్యాచ్‌లో విఫ్లవం
శుక్రవారం న్యూజిలండ్, ఆస్ట్రేలియా మాద్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చిన బాధలో ఉన్న సందర్భంగా రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఫేవలంగా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకు న్న ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ ఆహ్వానించింది. బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ నాథన్ మెక్‌క్లలమ్, వెట్లోరి చెప్పుకొద్దగ స్కోరు చేశారు.నాథన్ మెక్‌క్లలమ్ 52, వెట్లోరి 44 పరుగుల చేశారు. కివీస్ బ్యాటింగ్‌లో గుప్తిల్ 10, మెక్‌క్లలమ్ 16, రైడ్‌ర్ 25, టైలర్ 7, ఫ్రాంక్లిన్ 0, స్టైరిస్ 0 హౌ 22 సౌతీ 6, బెన్న్‌ట్ 0 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో జాన్సన్ నాలుగు వికెట్లు తీసుకోగా, టైట్ మూడు వికెట్లు తీసుకు న్నాడు. బ్రెట్‌లీ, వాట్స్‌న్, స్మిత్ చెరో ఒక వికెటు తీసుకున్నారు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏమాత్రం కగుతిన్న కుండా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాని సాధించింది. ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. వాట్సన్ 62, హ్యడిన్ 55, పాటింగ్ 12, పరుగులు చేశారు.
మనోజ్‌తో ఛార్మి లింక్ ఏమిటి ?
బొద్దుగా ఉండే ఛార్మింగ్ గర్ల్ ఛార్మి ఈ మదధ్య కాస్తస్లిమ్ అయ్యినట్లుంది. ప్రస్తుతం ఛార్మి మంచు మనోజ్‌తో బాగా క్లోజ్‌గా ఉంటుందని సమాచారం. రీసెంట్‌గా ఛార్మి నటించిన ' మంగళ' చిత్ర ఆడియో ఫంక్షన్‌కి ఛీప్ గెస్ట్‌గా మనోజ్ రావడం దీనికి ఉదాహరణగా కూడా అనుకోవచ్చు. ఇదే విషయంపై ఇరువురిని అడిగితే కేవలం మా మధ్య స్నేహం తప్ప ఇంకేమి లేదు. అని చెప్పుకున్నారు. ఈ ఇద్దరు పబ్‌లు, నైట్ పార్టీల్లో తరచూ కలుస్తున్నారని సమాచారం.ఎంత దూరం వెళ్తుందో కొన్నాళ్లు వేచి చూడాలి.
2007 ప్రపంచకప్ - చరిత్రలో చెప్పుకోదగిన సంఘటన
ప్రపంచ కప్ చరిత్రలో చీకటి దినంగా చెప్పుకోదగిన సంఘటన 2007 కప్‌లో జరిగింది. పాకిస్తాన్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోరంగా ఓటమి చెందింది. అదీ టోర్నీ తొలి ఆటలోనే కావడంతో కప్ సరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అదే రోజు రాత్రి పాకిస్తాన్ కోచ్ బాబ్ ఉల్మర్ దారుణంగా హత్యకు గురయినాడు. హోటలు గదిలో ప్రాణాలు కోల్పోయి అనుమానాస్పదంగా మృతి చెందిన ఉల్మర్‌ను గుర్తించారు. ఉల్మర్‌ను హత్య చేశారని జమైకా పోలీసులు ప్రకటించారు.
Thursday, February 24, 2011
ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌లో మొదటి విజయం
ప్రపంచకప్‌లో బాగంగా సౌతాఫ్రికా తన మొదటి మ్యాచ్‌లో వెస్డిండీస్‌పై మొదటి విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సౌతాప్రికా జట్టు వెస్టిండీస్‌పై ముడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. డివిలియర్స్ సెంచరీ చేశాడు. అంతక ముందు టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకఁంది. వెస్టిండీస్ 47.3 ఓవర్లలో 222 పరుగుల చేసి అలౌట్ అయ్యింది. బ్రావో 73, డిజె బ్రావో 40 పరుగులు చందర్‌పాల్ 31 పరుగులు చేశారు. మిగిలిన వారు తకఁ్కవ పరుగులకే పెవిలియన్ చేరుకఁన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తహీర్ నాలుగు , బోథా రెండు, స్టెన్ 3 వికెట్లు తీసుకఁన్నారు. ఆమ్లా 14, కల్లిస్ 4, స్మిత్ 45, డివిలియర్స్ 107, డూమిఁ 42 పరుగులు చేశారు.
సినీ రచయిత ముళ్లపూడి కన్నుమూత
ప్రముఖ తెలుగు సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ (80) కన్నుమూశారు. చెన్నైలోని అభిరామపురం ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. వెంకటరమణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ధవళేశ్వరంలో 1931 జూన్ 28న జన్నిమంచారు. వెంకటనరమణ అసలు పేరు ముళ్లపూడి వెంకటరావు. అయన తొలి చిత్రం రక్తసంబంధం చిత్రం ద్వారా ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు. వెంకటరమణ మృతిపట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ఆయన మృతి సినీపరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు ఆయనకు నివాశుర్పించారు.
Wednesday, February 23, 2011
నేడు అసలు మ్యాచ్ ప్రారంభం
శనివారం ప్రారంభమైన పదవ ప్రపంచకప్‌లో సమరంలో నిన్నటి వరకు సాగిన మ్యాచులన్నీ ఏకపక్షంగా సాగాయి. బలమైన జట్లు, చిన్న జట్ల మధ్య సాగిన ఈ మ్యాచుల్లో సాధారణంగా బలమైన జట్లే గెలుస్తాయి. గెలిచాయి కూడా ఇప్పటిదాకా చప్పగా అనిపించిన ఈ టోర్నమెంటు నేటి పోరుతో ఊపందుకోనుంది. ఎందుకంటే ఆగ్రశ్రేణి జట్టుగా పేరు గాంచినా ఇంత వరకు కప్ గెలవని దక్షిణాఫ్రికా జట్టు. రెండు సార్లు ప్రపంచకప్ గెలుచుకున్న వెస్టిండీస్ జట్ల మధ్య నేడు ఫిరోజ్ షా కోట్ల మైధానంలో క్రికెట్ అభిమానులను అలరించే అసలు సిసలు సమరం జరగనుంది.
ప్రపంచకప్‌లో రెండో ఓటమి
ప్రపంచకప్‌లో కెన్యా రెండో ఓటమి. కెన్యా తన మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఘోరంగా ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్‌తో 205 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 50 ఓవర్లలో 317 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన కెన్యా 33.1 ఓవర్లలో అలౌట్ అయ్యింది. ఓబుయా 47 పరుగులు చేసి టాప్ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్‌మైన్‌లు ఏఒకరు రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ షాహిద్ అఫ్రీద్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో విఫలమైన బౌలింగ్‌లో రాణించాడు. అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పాక్ 12 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్ చేరుకఁన్నారు. అనందం ఎంత సేపు నిలువలేదు. వన్‌డౌన్‌గా వచ్చిన అక్మల్ అర్థ సెంచరీతో అదుకున్నాడు. అతని తోడుగా యూనిస్‌ఖాన్ కూడా సహయపడ్డాడు. వరుసగా నాలుగు బ్యాట్‌మైన్‌లు అర్థసెంచరీలు చేశారు. మిసాబుల్ హాక్ 65, ఉమర్ అక్మల్ 71 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉమర్ అక్మల్‌కు లభించింది.
పిల్లకుంకలు చితక్కొట్టేశారు
క్రికెట్‌లో పేరుకి పిల్ల కుంకలేగానీ, చాలా సందర్భాల్లో పెద్ద జట్లకు షులక్ ఇచ్చి ఆటగాళ్ళునన్న జట్లు చాలానే వున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్ ఇంగ్లాండ్ జట్టుకు చెమటలుపట్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టాఁకి 292 పరుగులు చేసింది. కూపర్ 47, డస్కాటె 119 పరుగులు చేశారు. 293 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్ స్ట్రాస్ 88, ట్రాట్ 62 పీటర్సన్ 39, బెల్ 33, కాలింగ్ వుడ్ 30 పరుగులు చేశారు. ఇంకా 6 బంతులు మిగిలి వుండగానే లక్ష్మాని అదుకుంది.
Saturday, February 19, 2011
నూటికి నూరు మార్కులు ఓకే ...
వన్డేల్లో 50 ఓవర్లు పూర్తిగా ఎప్పుడూ ఆడలేదు. ప్రపంచకప్‌లో ఆదే నాలక్ష్యం అని పేర్కొనాడు.
ఆదివారం జరిగిన ప్రపంచకప్ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డేలో సెహ్వాగ్ 140 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్‌లతో సహయంతో 175 పరుగుల చేశారు. ఈ పరుగులు చేయడాఁకి సెహ్వాగ్ ఓపెనర్‌గా వచ్చి ఆట చివరి వరకు కోనసాగిస్తు చివరిలో సెహ్వాగ్ 47 ఓవర్లులో మూడో బంతికి చెత్త షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అతడు ఇంకా కొద్ది సేపు క్రీజులో ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడేమో ! ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ తన ఆట తీరులో మార్పు వచ్చింది. ప్రతి బంతిని బాదాలనే ఆత్రుత అతడిలో కనిపించలేదు. అలా అడిడంటే తకువ స్కోరు అవుట్ అయ్యేవాడు. ఏది ఏదేమైనా సెహ్వాగ్ తన వికెట్ విలువను గుర్తించేలా చేసింది. బత్తిడి ఎదుర్కోవడం అతడికి ఓ లెక్కే కాదు. కావాల్సిందల్లా నిలకడే అనుకు న్నట్లుగా 50 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయుండొచ్చు ఇన్నింగ్స్
ఆఖరి వరకు క్రీజులో ఉంటే ఏమవుతుందో చాటాడు. ప్రత్యర్థి జట్టు దఢ పుట్టించాడు. అతడి యాభై ఓవర్ల లక్ష్యం నెరవేరితే సచిన్ డబుల్ సెంచరీని దాటే అవకాశం లేకపోలేదు.
ఆఖరి వరకు క్రీజులో ఉంటే ఏమవుతుందో చాటాడు. ప్రత్యర్థి జట్టు దఢ పుట్టించాడు. అతడి యాభై ఓవర్ల లక్ష్యం నెరవేరితే సచిన్ డబుల్ సెంచరీని దాటే అవకాశం లేకపోలేదు.
వీరేంద్రుడి విరాట్ విశ్వసరూపం
టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్ ప్రపంచకలో అదిరిపోయే ఆరంభమిచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్ మెరుపులు, యువతేజం విరాట్ కోహ్లి పిడుగులతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓరర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 370 పరుగులు చేసింది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా పోరాట చూపినా, భారీ లక్షాఁ్న ఛేదించే ఆట తీరు లేకపోవడంతో... నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. దీంతో భారత్ 87 పరుగులు తేడాతో భారీ విజయం సాధించింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో తమీమ్ ఇక్బాల్ 70, సారథి సకిబుల్ హసన్ 50 , ఇమ్రాన్ కాయాస్ 34, జునాయద్ సిద్ధిఖీ 37, రకీబుల్ హాసన్ 28, ముషఫికరం రహీం 25 పరుగులు చేశారు. కాగా భారత బౌలర్లలో మునాఫ్ పటేల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. జహీర్ ఖాన్ రెండు, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ తలో వికెటు తీసుకున్నారు.
అంతకు ముందు సెహ్వాగ్, కోహ్లీ ధాటికి షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో పరుగుల వరద పొంగిపొర్లింది. ప్రేక్షకులను ఆనందం పరవంలో ముంచెత్తింది. అదురు, బెదురు, ఎదురులేని రీతిలో ఆడిన సెహ్వాగ్ పరుగుల జడివాన కురిపించాడు. 14 ఫోర్లు, 5 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై ఏమాత్రం కనికరం చూపకుండా చితక్కొట్టాడు.అతనితో పాటు పోటాపోటీగా ఆడిన విరాట్ కోహ్లీ ప్రపంచకప్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో కదం తొక్కారు.
నిశ్చితార్ధం అయ్యింది
సినీ నటి రీమాసేన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. శివ కరణ్ సింత్, రీమాసేన దగ్గరకు వెళ్లి స్వయంగా అడిగేశాడట. నన్ను పెళ్లి చేసుకుంటావా ? అని అడిగితే చిరునవ్వు నవ్వుకుంటూ.. ఓకే చెప్పడంతో వెంటనే రీమాకి ఉంగారం కూడా తొడిగేశారు. ఆ రకంగా నిశ్చితార్ధం అయిపోయింది. ఇక పెళ్లి జరగడమే ఆలస్యం. రీమాసేన్ నా ప్రేమను స్వీకరిస్తుందా, లేదా ? అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ రీమ్మా ఒప్పుకోవడం ఆనందంగా ఉంది.
ప్రపంచకప్- 2011లో సెహ్వాగ్ తొలి శతకం
మీర్పూర్‌లో ప్రారంభమైన ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న భారత డాషింగ్ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 2011లో ప్రారంభమై ఈ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన క్రీడాకారుడిగా పేరు నమోదు చేసుకఁన్నాడు. కేవలం 94 బంతుల్లోనే ఒక సిక్సర్‌తోపాటు, 9 పోర్లు సహయంతో సెంచరీ సాధించాడు. సెహ్వాగ్ వ్యక్తిగతంగా వన్డేలలో ఇది 14వ సెంచరీ.
Friday, February 18, 2011
తొలి సమరం నేడే
ఈ రోజు నుంచి 43 రోజుల పాటు జరిగే ప్రపంచకప్ ఆట మొదలు అయ్యింది. రోజులు చూస్తూడంగానే దగ్గరికి వచ్చాయి. నెల రోజుల నుంచి హాడవిడిగా ఉన్న ప్రపంచకప్ ఈ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి ఆట మొదలు అవుతుంది. మొదటి మ్యాచ్ భారత్ - బంగ్లాదేశ్ తో ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ భారత్ - వెస్డిండీస్ మధ్య జరగనుంది. నిన్న బంగ్లాదేశ్‌లో ప్రపంచకప్ ప్రారంభమైయింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న 14 దేశాల జట్ల కెప్టెన్లు రిక్షాలో మైదానంలో రావడంతో ప్రారంభోత్సవ కారక్రమం ఆరంభమైంది.
అవకాశం దక్కేనా ?
రజనీకాంత్‌తో అనుష్క జోడీ కట్టబోతుందా ? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు 'సింగం' సినిమాతో తమిళ నాట అభిమానుల్ని సంపాధించుకొంది. అనుష్క కథా నాయికగా అక్కడ ఎన్ని అకకాశాలు వస్తున్నా... అనుష్క మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. తమిళనాట మరో మంచి అవకాశం ఇపుడు అనుష్కని వూరిస్తోంది. అదే రజనీకాంత్‌తో కలసి నటించే అవకాశం ' రోబో' తరువాత రజనీ నటించే మరో చిత్రానికి రంగం సిద్దమవుతోంది. ' రాణా ' అనే పేరుని ఖరారు చేశారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాలో ఓ కథానాయికగా దీపికా పదుకొణే ఎంపికైంది. కథలో మరో నాయికకూ స్థానం ఉంది. అది అనుష్కదే అని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. అసిన్ కూడా రేసులో ఉందట.
Thursday, February 17, 2011
ఘనంగా ప్రపంచ కప్ ప్రారంభోత్సవం
నలభై ఐదు రోజుల పాటు అభిమానులను ఆనందోత్సాహాల్లో నింపేందుకు క్రికెట్ కార్నవాల్‌గా అభివర్ణించతగ్గ ఐసిసి ప్రపంచకప్ అట్టహాసంగా ప్రారంభమైంది. బంగ్లాదేశ్ రాజధాని నగరంలోని చారిత్రాత్మకమైన బంగబంధు స్టేడియం ప్రారంభోత్సవ వేడుకలకు వేదికగా నిలిచింది. ఈ మెగా పండుగను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు.
వేలాది మంది ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఈ పోటీలు ప్రారంభమయ్యాయని ఆమె ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు తమ దేశాన్ని ఎంపిక చేసినందుకు ఆమె అంతర్జాతీయ క్రికెట్ మండలికి కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్ సంప్రదాయానికి అనుగుణంగా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న 14 దేశాల జట్ల కెప్టెన్లు రిక్షాలో మైదానంలోకి రావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఆరంభమైంది. చివరగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వచ్చినపుడు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పారు. ధోనీకి కూడా వారు పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. 15 సంవత్సరాల తరువాత భారత ఉపఖండంలో ప్రపంచకప్ తిరిగివచ్చింది.
బంగ్లాదేశ్‌లో ఈ మెగా టోర్నమెంట్ జరగడం ఇదే ప్రథమం. 1971లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత ఇంతటి పెద్ద టోర్నమెంట్ బంగ్లాదేశ్‌లో జరగడం ఇదే ప్రథమం. ఈ నెల 19న భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న ప్రారంభమ్యాచ్‌తో ఈ మెగా టోర్నమెంట్ ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం తమకు కలగడం పట్ల బంగ్లాదేశ్‌లో క్రికెట్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తొలి మ్యాచ్‌లో తమ జట్టు గెలవగలదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోగలదని వారు భావిస్తున్నారు.
వేలాది మంది ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఈ పోటీలు ప్రారంభమయ్యాయని ఆమె ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు తమ దేశాన్ని ఎంపిక చేసినందుకు ఆమె అంతర్జాతీయ క్రికెట్ మండలికి కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్ సంప్రదాయానికి అనుగుణంగా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న 14 దేశాల జట్ల కెప్టెన్లు రిక్షాలో మైదానంలోకి రావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఆరంభమైంది. చివరగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వచ్చినపుడు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పారు. ధోనీకి కూడా వారు పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. 15 సంవత్సరాల తరువాత భారత ఉపఖండంలో ప్రపంచకప్ తిరిగివచ్చింది.
బంగ్లాదేశ్‌లో ఈ మెగా టోర్నమెంట్ జరగడం ఇదే ప్రథమం. 1971లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత ఇంతటి పెద్ద టోర్నమెంట్ బంగ్లాదేశ్‌లో జరగడం ఇదే ప్రథమం. ఈ నెల 19న భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న ప్రారంభమ్యాచ్‌తో ఈ మెగా టోర్నమెంట్ ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం తమకు కలగడం పట్ల బంగ్లాదేశ్‌లో క్రికెట్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తొలి మ్యాచ్‌లో తమ జట్టు గెలవగలదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోగలదని వారు భావిస్తున్నారు.
ఐసుపై మోజు పడ్డ సంజు!
అమితాబ్-హేమమాలిని జంటగా రూపొంది ఘన విజయం సాధించిన ‘సత్తే పె సత్తే’ చిత్రాన్ని సంజయ్‌దత్‌తో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హేమమాలిని పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి.అయితే.. విద్యాబాలన్‌ను తామెప్పుడూ అనుకోలేదని, తొలుత నుంచి ఈ పాత్రకోసం ఐశ్వర్యను మాత్రమే తాము అనుకుంటూ వచ్చామని హీరో సంజయ్‌దత్ చెబుతున్నాడు.ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే. ఆరుగురు తమ్ముళ్లకు వదినగా ఐశ్వర్య అయితేనే బాగుంటుందని భావిస్తున్న సంజయ్‌దత్.. ఆమె డేట్స్ కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించేందుకు తాను సిద్ధమేనంటున్నాడు. అటు ఐశ్వర్య కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.కాబట్టి.. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లడం ఖాయం!
ఐపీఎల్-4 షెడ్యూల్ విడుదల
అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్-4 టోర్నీ షెడ్యూల్‌ను ఐపీఎల్ పాలకమండలి బుధవారం ఇక్కడ విడుదల చేసింది. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న దృష్టా ఇంకా దీనికి తుది ఆమోదాన్ని ఇవ్వలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వం వహిస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ చెనై్న సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్ జట్ల మధ్య చెనై్నలోని ఎమ్‌ఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే 28 వ తేదీన టోర్నీ నిర్వహించబోయే కొన్ని నగరాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నందున్న ఆయా రాష్ట్రాల అధికారులను సంప్రదించిన అనంతరం. టోర్నీ షెడ్యూల్‌కు తుది అమోదాన్ని ఇస్తామని ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ చిరాయు అమీన్ వెల్లడించారు.
74 మ్యాచులు: టోర్నీలో మొత్తం 74 మ్యాచులను నిర్వహించనున్నారు. వీటిన నిర్వహణ కోసం వివిధ నగరాల్లో ఎంపిక చేసిన 13 వేదికలను ఎంపిక చేశారు. ఈ మ్యాచులన్నీ మొత్తం 51 రోజుల పాటు జరగనున్నాయి.
క్రొత్త ఫార్మాట్
ఈసారి టోర్నీని కొత్త ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఫైనల్స్‌కు అర్హత సాధించడానికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు కొత్తగా ప్రవేశపెట్టిన ప్లే ఆఫ్ మ్యాచులను ఆడాల్సి ఉంటుంది. ఈ ప్లే ఆఫ్ మ్యాచులను క్వాలిఫైయర్-1, 2 లుగా వర్గీకరించారు. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆ తర్వాతి దశ అయిన ప్లేఆఫ్ మ్యాచ్-1 (క్వాలిఫైయర్-1)లో పోటీపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తుంది.
74 మ్యాచులు: టోర్నీలో మొత్తం 74 మ్యాచులను నిర్వహించనున్నారు. వీటిన నిర్వహణ కోసం వివిధ నగరాల్లో ఎంపిక చేసిన 13 వేదికలను ఎంపిక చేశారు. ఈ మ్యాచులన్నీ మొత్తం 51 రోజుల పాటు జరగనున్నాయి.
క్రొత్త ఫార్మాట్
ఈసారి టోర్నీని కొత్త ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఫైనల్స్‌కు అర్హత సాధించడానికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు కొత్తగా ప్రవేశపెట్టిన ప్లే ఆఫ్ మ్యాచులను ఆడాల్సి ఉంటుంది. ఈ ప్లే ఆఫ్ మ్యాచులను క్వాలిఫైయర్-1, 2 లుగా వర్గీకరించారు. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆ తర్వాతి దశ అయిన ప్లేఆఫ్ మ్యాచ్-1 (క్వాలిఫైయర్-1)లో పోటీపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తుంది.
Tuesday, February 15, 2011
Monday, February 14, 2011
ఐదు రోజుల్లో దొంగల ముఠా సినిమా ఘాటింగ్ పూర్తి
దొంగల మూఠా సినిమా ఘాటింగ్ మునుపే చెప్పినట్లుగా ఐదు రోజుల్లో , కేవలం ఎనిమిది మంది క్య్రూమెంబర్స్‌తో దిగ్విజయంగా పూర్తియ్యింది. అందరూ ఊహించుకున్నట్లుగా ఘాటింగ్ ఇరవై నాలుగు గంటల షెడ్యూల్‌తో కాకుండా కేవలం సాదారణ పని గంటలలో, ఏ ఒక్క రోజు నిర్ధేశించిన సమయం మించకుండా పూర్తి చేయడం జరిగింది.
ఇంత వరకూ మొత్తం ఫిలం ఇండ్రస్టీలోనే ఎవరూ ఊహించని విధంగా ఆలోచించి, దానికి ఈ విధంగా కార్యరూపం ఇవ్వడం సినిమా మేకింగ్ లోనే ఒక సరి కొత్త అధ్యాయానికినాంది. నాలుగు కెనాన్ కెమెరాలను ఉపయోగించి. ఒకేసారి నాలుగు అంగిల్స్ లో ప్రతీ షాట్ తీయడం వల్ల అత్యంత వేగంగా ఘాట్ చేయడం సాధ్యపడింది.
అసలు లైట్స్ మరియు డాలి, జిబ్ మొదలుగు ఎక్విప్‌మెంట్స్ ఉపయోగించకుండా సినిమా మొత్తం సహజమైన లైటింగ్‌లో చేయడం జరిగింది. రవితేజ, ఛార్మి, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజ్, బ్రహ్మాజి, మరియు సుప్రిత్ మొదలగు వారున్న ఈ సినిమాను ఇండస్టీలోనే మొదటి సారిగా జీరో బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఆక్టర్లకని గాని, టెక్నీషియన్లకు ఎటువంటి రెమ్యునరేషన్ ఇవ్వబడలేదు. మార్చి 4న ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతోంది.
ఇంత వరకూ మొత్తం ఫిలం ఇండ్రస్టీలోనే ఎవరూ ఊహించని విధంగా ఆలోచించి, దానికి ఈ విధంగా కార్యరూపం ఇవ్వడం సినిమా మేకింగ్ లోనే ఒక సరి కొత్త అధ్యాయానికినాంది. నాలుగు కెనాన్ కెమెరాలను ఉపయోగించి. ఒకేసారి నాలుగు అంగిల్స్ లో ప్రతీ షాట్ తీయడం వల్ల అత్యంత వేగంగా ఘాట్ చేయడం సాధ్యపడింది.
అసలు లైట్స్ మరియు డాలి, జిబ్ మొదలుగు ఎక్విప్‌మెంట్స్ ఉపయోగించకుండా సినిమా మొత్తం సహజమైన లైటింగ్‌లో చేయడం జరిగింది. రవితేజ, ఛార్మి, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజ్, బ్రహ్మాజి, మరియు సుప్రిత్ మొదలగు వారున్న ఈ సినిమాను ఇండస్టీలోనే మొదటి సారిగా జీరో బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఆక్టర్లకని గాని, టెక్నీషియన్లకు ఎటువంటి రెమ్యునరేషన్ ఇవ్వబడలేదు. మార్చి 4న ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతోంది.
ప్రాక్టీస్ గెలుపు
బౌలర్ల విజయం
ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఆదివారం నాడిక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్ విఫలమై 214 పరుగులకు ఆలౌటైనప్పటికీ బౌలర్లు, ముఖ్యంగా పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్ భారత్‌కు అద్భుత విజయం అందించారు. వన్డే మ్యాచ్ మజాను భారత బౌలర్లు అందించారు. ఒక వికెట్ నష్టానికి 118 పరుగులతో విజయంవైపు దూసుకెళుతున్న ఆసీస్‌కు పియూష్ చావ్లా అడ్డుకట్ట వేసాడు. చావ్లా తొమ్మిది ఓవర్లలో 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్ ఐదు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ 37.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. రెండో వార్మప్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో జరుగుతుంది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 214 పరుగులు మాత్రమే చేయ్యగలిగింది. భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత్ నిర్ణీత 44.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే భారత బ్యాట్స్‌మెన్‌లో రాణించి అర్ధసెంచరీ చేసాడు. సెహ్వాగ్ 56 బంతులను ఎదు ర్కొని ఎనిమిది బౌండరీలు, ఒక సిక్సర్‌తో 54 పరుగులు చేసాడు. వీరూ తరువాత చెప్పు కోతగ్గ స్కోరు చేసింది యూసుఫ్ పఠాన్. పఠాన్ 38 బంతుల్లో రెండు సిక్సర్లతో 32 పరు గులు చేసాడు.
కెనాడాపై బంగ్లా విజయంచిట్టగాంగ్లో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల తేడాతో కెనడాను ఓడించింది. తొలిగా బ్యాటింగ్ చేసిన కెనాడా 37.3 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్ కాగా విజయానికి అవసరమైన 113 పరుగులను బంగ్లాదేశ్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఇంకా 184 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ 69, ఇమ్రుల్ కేయిస్ 39 పరుగులు చేసారు. తొలి వికెట్‌కు వీరు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బౌలింగ్‌లో షకీబ్ అల్ హసన్ రాణించి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
కెన్యాపై విండీస్ విజయం
కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. కెన్యాను 45.3 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్ చేసింది.
గుప్తిల్ సెంచరీ
ఐర్లండ్‌తో శనివారం నాగపూర్‌లో జరిగిన మరో వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ సెంచరీ చేసాడు. గుప్తిల్ సెంచరీతోపాటు వన్‌డౌన్ జెస్సీ రైడర్ 48, ఫ్రాంక్లిన్ 49 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆరంభంలోనే బ్రెండన్ మెక్‌కలమ్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ రెండో వికెట్‌కు రైడర్, గుప్తిల్ 79 పరుగులు చేయడంతో కోలుకుంది. టేలర్ 33 పరుగులు చేయడంతోపాటు గుప్తిల్‌తో కలసి 47 పరుగులు జోడించాడు. ఇందులో టేలర్ వాట 33 పరుగులు . గుప్తిల్ 134 బంతుల్లో 12 బౌండరీలు, మూడు సిక్సర్లతో 130 పరుగులు చేసాడు. ఐర్లండ్ ఓపెనర్ పోర్టర్‌ఫీల్డ్ 72 పరుగులు చేయడం విశేషం. కడపటి వార్తలు అందే సమయానికి ఐర్లండ్ 35 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
శ్రీలంక
మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై శ్రీలంక 156 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలు చేయడం విశేషం. పోటీ మా ముగ్గురు మధ్యే ...
భారత జట్టులో స్థానం కోసం విరాట్ కోహ్లీ, యూసుప్ పఠాన్ మధ్య తీవ్రంగా పోటీ మొదలైయిదని సురైష్ రైనా అన్నాడు. ఏడుగురు బ్యాట్‌మైన్స్‌లో సచిన్, వీరు, గంభీర్, యువరాజ్ సింగ్, ధోనీలు ఖారారు కాగా.... మిగిలినా రెండు స్థానాలు కోసం పోటీ ముగ్గురు తలపడుతున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్‌కోహ్లీ, యూసుఫ్ పఠాన్ ఇద్దరు రాణించగా.. రైనా విఫలమవడంతో అతని స్థానానికి ముప్పు వచ్చింది.
Sunday, February 13, 2011
కనిపిస్తే కళ్యాణం ..............
ఫిబ్రవరి 14న రోజు అంటే ఎవరికైనా గుర్తువుండే రోజు అదే ప్రేమికులు రోజు
పార్కుల్లోనూ, కాఫీక్లబుల్లోనూ ఒక అమ్మాయి, అబ్బయి కనిపిసే పెళ్లి జరిపిస్తామని భజరంగ్‌దళ్ కార్యకర్తలు తెలిపారు.
పార్కుల్లోనూ, కాఫీక్లబుల్లోనూ ఒక అమ్మాయి, అబ్బయి కనిపిసే పెళ్లి జరిపిస్తామని భజరంగ్‌దళ్ కార్యకర్తలు తెలిపారు.
మరి మా ఫ్రెండ్ రేపు ఇందిరా పార్కుకు వెళ్ళుతున్నాడు. జాగ్రత్త అని చేప్పాను.
వాడు నాకు ఏ సమాధానం చేప్పాడంటే ' పోరా వేదవ ' అని సమాధానం చేప్పాడు.
మరి వాడి పరిస్థితి ఏమవుతుందో చూద్ధాం.
వాడు నాకు ఏ సమాధానం చేప్పాడంటే ' పోరా వేదవ ' అని సమాధానం చేప్పాడు.
మరి వాడి పరిస్థితి ఏమవుతుందో చూద్ధాం.
కొందరికి ఇదే చివరి ప్రపంచకప్ ?
ఐసిసి పదవ ప్రపంచకప్ అనేకమంది క్రీడాకారులకు చివరి ప్రపంచ కప్ కానుంది. వీరు 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో సంయుక్తంగా జరగనున్న టోర్నమెంట్‌లో ఆడే అవకాశాలు ఉండకపోవచ్చునని పరిశీలకులు భావిస్తు న్నారు. ఇందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు కూడా వినపడుతోంది. రిటైరయ్యే ఆలోచన ఏదీ లేదని సచిన్ పదేపదే చెబుతున్నప్పటికీ అతడు మరో నాలుగు సంవత్సరాలు ఆడకపోవచ్చుననే అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది. సచిన్‌తోపాటు జహీర్ ఖాన్ పేరు కూడా ప్రస్తావనకు వస్తుండటం గమనార్హం. ఈ కప్ చివరి కప్ అయ్యే అవకాశాలున్న క్రీడాకారుల్లో ఈ కింది పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
1.స్టీవ్ టికోలో: కెన్యా ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన స్టీవ్ టికోలో తన కెరీర్‌లో ఐదో వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నాడు. విజయవంతమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచాడు. 2003 ప్రపంచకప్‌లో కెన్యా సెమీఫైనల్స్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
2.రికీ పాంటింగ్: 36 ఏళ్ల ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ 1990 దశకం నుండి క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. వరుసగా మూడు ట్రోఫీలు గెలుచుకున్న ఆసీస్ జట్టులో అతడు సభ్యునిగా ఉన్నాడు. ఈ కప్‌ను ఆసీస్ నిలబెట్టుకుంటే వరుసగా మూడు సార్లు ట్రోఫీ సంపాదించిపెట్టిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పుతాడు. పాంటింగ్ స్వయంగా ప్రకటించక పోయినప్పటికీ ఇది అతడి చివరి ప్రపంచ కప్ అని భావిస్తున్నారు.
3. బ్రెట్ లీ: ఆసీస్ స్పీడ్‌స్టర్‌కు ఈ వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం అనుకోని రీతిలో వచ్చింది. మోకాలి నొప్పితో బాధపడుతున్న తాను ఇంకా ఎంతోకాలం క్రికెట్ ఆడే అవకాశం లేదని బ్రెట్ లీ అనేక సార్లు చెప్పాడు. 2003, 2007లో విజేతగా నిలిచిన ఆసీస్ జట్లలో సభ్యునిగా ఉన్నాడు.
4.పాల్ కాలింగ్‌వుడ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్. ఇటీవల అంతగా రాణించ లేకపోతుండటంతో అందరూ రిటైర్ కావాలని సూచిస్తున్నారు.
5.స్కాట్ స్టయిరిస్: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ తదుపరి ప్రపంచకప్ జరిగే సమయానికి 40వ ప్రాయంలో పడతాడు. వరల్డ్‌కప్‌ల్లో మంచి రికార్డు ఉంది. అతడి సగటు 18 మ్యాచ్‌ల్లో 69.12.
5.షోయబ్ అక్తర్: రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన అక్తర్ ఈ వరల్డ్‌కప్‌పై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. ప్రపంచంలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా పేరుగాంచాడు.
6.జాక్స్ కల్లిస్: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్. అతడిపైనే ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
7.ముత్తయ్య మురళీధరన్: ఈ వరల్డ్‌కప్ తరువాత వన్డే క్రికెట్‌కు స్వస్తి చెబుతానని ఇంతకుముందే ప్రకటించాడు. టెసÊఉటల్లో 800 వికెట్లు తీసుకున్న మురళి టెస్టు క్రికెట్‌కు ఇంతకుముందే గుడ్‌బై చెప్పాడు.
8.దిల్షన్ తిలకరత్నే: విధ్వంసక ఓపెనర్‌గా పేరుగాంచాడు. శ్రీలంక జట్టులో సీనియర్ బ్యాట్స్‌మన్.
9.శివనారాయణ్ చంద్రపాల్:36 ఏళ్ల చంద్రపాల్ కెరీర్‌లో ఐదో ప్రపంచకప్ ఆడుతున్నాడు.1996 ప్రపంచకప్‌లో విండీస్ రన్నరప్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
10. జహీర్ ఖాన్: తరచూ గాయాలబారిన పడే జహీర్ ఎక్కువ కాలం క్రికెట్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. వర్క్‌లోడ్ పెరిగిపోవడమే ఇందుకు కారణం. భారత జట్టు ప్రస్తుతం అతడిపై మితిమీరి ఆధారపడుతోంది.
11. సచిన్ టెండూల్కర్: అన్ని రకాల రికార్డులు, ట్రోఫీలు అందుకున్న సచిన్‌కు వరల్డ్‌కప్ ఒక్కటే వెలితిగా ఉంది. ఈ లోటును ఈసారి నెరవేర్చుకోగలడేమో చూడాలి. Saturday, February 12, 2011
హర్భజన్ సింగ్‌కు గాయం?
భారత్ అభిమానులకు మరో దుర్వార్త. ఏస్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాడు ప్రాక్టీస్ చేస్తుండగా భజ్జీకి గాయం తగిలినట్లు ధృవీకరించని వార్తలు సూచిస్తున్నాయి. అందువల్లనే అతడు శుక్ర, శనివారాల్లో ప్రాక్టీస్‌కు హాజరుకాలేదని అనధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల19న ప్రపంచకప్ ప్రారంభం కానున్న తరుణంలో భారత్ ప్రధాన స్పిన్నర్ హర్భజన్ గాయ పడటం భారత జట్టుకు దెబ్బగానే చెప్పాలి. అయితే భజ్జీ గాయం స్వరూపం తెలియలేదు. అతడు ఈ నెల 19న బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆడుతాడా, లేదా అన్న విషయం ఇంకా తెలియలేదు. మూడో రోజు ప్రాక్టీస్‌కు భజ్జీ డుమ్మా కొట్టడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ప్రాక్టీస్ హౌటల్ రూంలో విశ్రాంతి తీసుకున్నట్లు భారత జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలికాలంలో భారత జట్టు సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించిన మీడియం పేసర్ ప్రవీణ్ కుమార్ మోచేతి గాయం నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. ప్రవీణ్ అందుబాటులో లేకపోవడం భారత జట్టుకు ఇబ్బంది కలిగించే అంశమేనని ధోనీ పేర్కొన్నాడు. అతడి స్థానంలో శ్రీశాంత్ జట్టులోకి వచ్చాడు.
నేడే 'డమరుకం' ప్రారంభం
అక్కినేని నాగార్జున నటిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం' ప్రారంభోత్సవం లాంఛనంగా శనివారంనాడు జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావుతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ...'సోషియోఫాంటసీ చేయాలనే చిన్నకోరిక ఉండేది. అది 'డమరుకం'తో తీరింది. రెండువేల సంవత్సరాలనాటి కథ. నేటికి ట్రావెల్ అవుతూ సాగుతుంది. ఇందులో నాలుగు గెటప్స్ ఉన్నాయి. 'హలోబ్రదర్'లో చేసిన మాస్ రోల్ ఇందులో చేస్తున్నా. ఏప్రిల్‌లో షూటింగ్‌లో పాల్గొంటా' అని చెప్పారు.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...'కొత్తదననాన్ని ప్రోత్సహించే హీరోల్లో నాగార్జున ముందుంటారు. గీతాంజలి, శివ, హలోబ్రదర్, అన్నమయ్య వంటి ఆ కోవలోనే వచ్చాయి. కామెడీ చిత్రాలు తీసే నేను, ఆర్.ఆర్.మూవీమేకర్స్‌లో అందులోనూ నాగార్జునతో చేయడం మర్చిపోలేని విధంగా ఉంది. దేవీశ్రీప్రసాద్ కథ చెప్పగానే వెంటనే అంగీకరించారు. త్వరలో రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి' అని అన్నారు.
దేవీశ్రీప్రసాద్ మాట్లాడుతూ...'నాగార్జునతో నాకిది నాలగవ సినిమా. సంగీతానికి అవకాశముంది. మరో సెస్సేషనల్ హిట్ అయ్యేలా కృషిచేస్తా'నని పేర్కొన్నారు.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...'కొత్తదననాన్ని ప్రోత్సహించే హీరోల్లో నాగార్జున ముందుంటారు. గీతాంజలి, శివ, హలోబ్రదర్, అన్నమయ్య వంటి ఆ కోవలోనే వచ్చాయి. కామెడీ చిత్రాలు తీసే నేను, ఆర్.ఆర్.మూవీమేకర్స్‌లో అందులోనూ నాగార్జునతో చేయడం మర్చిపోలేని విధంగా ఉంది. దేవీశ్రీప్రసాద్ కథ చెప్పగానే వెంటనే అంగీకరించారు. త్వరలో రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి' అని అన్నారు.
దేవీశ్రీప్రసాద్ మాట్లాడుతూ...'నాగార్జునతో నాకిది నాలగవ సినిమా. సంగీతానికి అవకాశముంది. మరో సెస్సేషనల్ హిట్ అయ్యేలా కృషిచేస్తా'నని పేర్కొన్నారు.
Friday, February 11, 2011
డ్రగ్స్‌తో పట్టుబడ్డ జీవిత సోదరుడు
200 గ్రాముల కొకైన్ స్వాధీనం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ కొనుగోలు చేసి స్నేహితులతో వెళ్తున్న ప్రముఖ నటి జీవిత సోదరుడు, నిర్మాత మురళితోపాటు అతని ఇద్దరి స్నేహితులను పశ్చిమ మండలం డిసిపి స్పెషల్ టీమ్ శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారి నుంచి 200 గ్రాముల కొకైన్, కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మురళి గతంలో మగాడు, శేషు చిత్రాలు నిర్మించాడు. ఆశించిన స్థాయిలో రెండు సినిమాలూ ఆడలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆయన తన స్నేహితులైన రాంబాబు, ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి కుమారుడు న్యాస్‌తో కలిసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఓ నైజీరియన్ నుండి 200 గ్రాముల కొకైన్ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి ఎపి 28 డిఎ 3540 కారులో వెళ్తుండగా పశ్చిమ మండలం డిసిపి స్పెషల్ టీముకు సమాచారమందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మురళి కారును ఆపి సోదా చేయగా కొకైన్ లభించింది. వారిని వెంటనే జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్లలో ఉన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. వారికి కొకైన్ అమ్మిన నైజీరియన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ కొనుగోలు చేసి స్నేహితులతో వెళ్తున్న ప్రముఖ నటి జీవిత సోదరుడు, నిర్మాత మురళితోపాటు అతని ఇద్దరి స్నేహితులను పశ్చిమ మండలం డిసిపి స్పెషల్ టీమ్ శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారి నుంచి 200 గ్రాముల కొకైన్, కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మురళి గతంలో మగాడు, శేషు చిత్రాలు నిర్మించాడు. ఆశించిన స్థాయిలో రెండు సినిమాలూ ఆడలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆయన తన స్నేహితులైన రాంబాబు, ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి కుమారుడు న్యాస్‌తో కలిసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఓ నైజీరియన్ నుండి 200 గ్రాముల కొకైన్ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి ఎపి 28 డిఎ 3540 కారులో వెళ్తుండగా పశ్చిమ మండలం డిసిపి స్పెషల్ టీముకు సమాచారమందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మురళి కారును ఆపి సోదా చేయగా కొకైన్ లభించింది. వారిని వెంటనే జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్లలో ఉన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. వారికి కొకైన్ అమ్మిన నైజీరియన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
తేడా తెలీందటోన్న కాజల్
టాలీవుడ్ అయినా, కాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా నటన ఒక్కటేన్ని చెబుతుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కాజల్. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాకి కమిట్ అయ్యింది. బాలీవుడ్ అవకాశం గురించి కాజల్ మాట్లాడుతూ, నేటివిటీని కొంచెం అర్థం చేసుకుంటే ఏ భాషలో అయినా నటించొచ్చననీ, తనకు బాగా తెలిసిన భాష హిందీ కావడంతో బాలీవుడ్‌ల్ పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదని కాజల్ పేర్కోనంది. ఫలానా లాంగ్వేజ్‌లో నాటిస్తే ఫలానా విధంగా వుండాలన్న తేడాలు తనకు తెలీవనీ, అక్కడి దర్శకులు ఆయా పాత్రల్ని మలచే తీరుని బట్టే తాన ఆ ప్రాజెకుట చెయ్యాలా ? వద్దా ? అనేది సైడ్ చేసుకుంటానంటోంది కాజల్.
Thursday, February 10, 2011
మరో సినిమా 'తెలంగాణ జిందాబాద్'
గతంలో 'హనీమూన్' అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఎం.ఎస్. గుప్తా ఈసారి తెలంగాణా పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. 'తెలంగాణ జిందాబాద్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'గతంలో 'హనీమూన్' తీశాను. నాలుగు భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలంగాణా బిడ్డగా తెలంగాణా అవసరం ఏమిటనేది... చూపించబోతున్నా. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెల్లడిచేస్తా'నని అన్నారు.
ఇలియానా ..... సైడ్ బిజినెస్
సినీపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న ఇలియానకు డబ్బు పిచ్చి పట్టిందెమోగాని ఈ మధ్య ఎక్కువగా సైడ్ బిజినెస్ దృష్టిపెట్టుతుంది. కొంతమంది బామలు ఆఫర్లు లేక ఏమి చేయ్యలేని పరిస్థితిలో ఉంటే ఇలియానా మాత్రం సైడ్ బిజినెస్‌పై దృష్టి సాధింస్తుంది. ఇంతకీ ఇలియానా బిజినెస్ ఏమిటో తెలసా...? వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టాలని సన్నాహాలు చేస్తుంది. అన్నట్లు వస్త్రాల పేరేమిటో తెలుసా ... ఇలియానా. తన తొలి బ్రాంచ్ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయబోతుందంట. తర్వాత గోవాలో కూడా ఆ బిజినెస్ ప్రారంభించిందట. ఎందుకు ఈ బిజినెస్ పెట్టాలనుదో తెలుసా ..... ఇలియాన తల్లి సమీరా ఆ వస్త్రాలను డిజైన్ చేస్తుందట. ఇప్పటివరకు ఇలియానా నటించిన సినిమాలకు సమీరానే డిజైనర్‌గా వ్యవహరించారట. చేతిలో పనే కదా అందుకే మరింత కాసులు దండుకోవాలని ఇలియానా ఈ ప్లాన్ చేసివుంటుందని అనుకుంటున్నారు పబ్లిక్.
Subscribe to:
Posts (Atom)