Tuesday, August 31, 2010
స్పాట్ ఫిక్సింగ్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫిక్సింగ్ వివాదంలో పాల్పడింది. ఇంగ్లండ్ జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్‌లోని లార్డ్స్ టెస్టులో ఈ స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కెప్టెన్ భట్‌తో సహా మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ అమీర్, కీపర్ ఆక్మల్ ఈ వ్యవహరంలో దోషులుగా ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు క్రీడాకారులు కూడా సంబంధం ఉండి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసింది. మహ్మద్ అసిఫ్, మహ్మద్ అమీర్ ఇద్దరు మజీద్ సూచనల మేరకు గురువారం, శుక్రవారం నాడు మూడు నోబాల్స్ వేస్తారని వెల్లడించింది. పాక్ బౌలర్లు ఉద్దేశపూర్వకంగానే మూడు నోబాల్స్ వేయాలని మజర్ పాకిస్తాన్ క్రీడాకారుల మధ్య రహస్య అంగీకారం కుదిరిందని పేర్కొంది.
అమితాబ్ సరసన శ్రీదేవి
తెలుగు ప్రేక్షకుల అతిలోక సుందరి...శ్రీదేవి. ఆ గుర్తింపు కేవలం ఒక్క తెలుగుకే పరిమితం కాలేదు. తనవైన అందం, అభినయంతో బాలీవుడ్‌ను సైతం దశాబ్దాలపాటు ఏలుకొంది. హిందీలో అగ్ర కథానాయకుల సరసన నటించి అలరించింది. భాషా భేదం లేకుండా అందరినీ కలగలిపి ఆకట్టుకున్న శ్రీదేవి బోనీకపూర్‌తో పెళ్లయ్యాక మాత్రం సినిమాలకు దూరమైంది. అప్పట్నుంచి ఆమె పునరాగమనం కోసం అభిమానులు ఎదురుచూస్తునే ఉన్నారు. బుల్లితెర ప్రేక్షకుల కోసం మధ్యలో ఒక ధారావాహికలో కనిపించి ముచ్చట తీర్చినా...వెండితెరపై కనిపించే ప్రయత్నమేదీ చేయలేదు. ఇదిగో, అదిగో...అని.
ఊరిస్తూనే ఆమె చేయబోయే చిత్రంపై స్పష్టమైన సంకేతాలేవీ వచ్చింది లేదు. అయితే ఆవిడ అభిమానులకు ఓ శుభవార్త. వెండితెరపై వెలిగేందుకు మరోసారి సిద్ధమవుతోంది. సినిమా మాత్రం తెలుగులో కాదు. ప్రస్తుతానికి హిందీలోనే. ఇంతకీ కథానాయకుడు ఎవరను కుంటున్నారా..! అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ అంతా ఆయన్ని ఃబిగ్ బిః అని పిలుచుకుంటుందని సినీ అభిమానులకంతా తెలిసిందే. మరి అదే పేరుతో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి ఆర్.బల్కీ దర్శకత్వం వహిస్తున్నారు.

Sunday, August 22, 2010
ఎనిమిది వికెట్ల తేడాతో లంక ఘన విజయం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 103 పరుగులకే అలౌట్ అయ్యింది. 104 లక్ష్యంతో దిగిన లంక 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి, 104 పరుగులు చేసి విజయం సాధించింది. జయవర్థన్ 33, దిల్షాన్ 35, పరుగులు చేసి అవుట్ అయ్యారు. సంగక్కర 13, తరంగ 12 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. భారత్ బ్యాట్ మెన్స్‌లో యువరాజ్ సింగ్ 38 పరుగులు చేసి టాప్ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు రెండు అంకెల స్కోరు కూడా చేయలేదు. లంక బౌలర్లలో పెరారి 5, మలింగా , కులశేఖర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మాథ్యస్ 1 వికెటు లభించింది. పెరారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Saturday, August 21, 2010
అన్'హ్యాపీగా'సాగే...
'హ్యాపీడేస్'తో కెరీర్ ప్రారంభించిన వరుణ్‌సందేశ్ 'కొత్తబంగారులోకం'తో కథానాయకుడిగా మెట్టు ఎక్కాడు. అయితే దిల్‌రాజు నిర్మించిన 'మరోచరిత్ర'తో మెట్టుదిగాడు. తన కెరీర్‌గ్రాఫ్ మళ్ళీ హ్యాపీగా కావాలనే కాన్సెప్ట్‌తో ముక్కోణపు ప్రేమకథతో 'హ్యాపీహ్యాపీగా' ముందుకు వచ్చాడు. తనేం ఆశించాడోగానీ ఆ చిత్రం మాత్రం అన్‌హ్యాపీగానే మిగిలింది. 'ఫీలింగ్స్ మీవి- ఎక్స్‌ప్రెషన్స్ మావి' అనే కొత్త పాయింట్‌ను తెరపై ఆవిష్కరించాడు. ఇందులో హీరో చేసే ఉద్యోగం కూడా చిత్రంగానే ఉంటుంది. కొరియర్‌మాదిరిగానే ఎదుటివారిని హ్యాపీగా ఉంచేందుకు వారి ఫీలింగ్స్‌ను తన ఎక్స్‌ప్రెషన్స్‌గా చూపిస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. వినేందుకే కొత్తగా ఉన్న ఈ పాయింట్‌ను డీల్‌చేయడానికి దర్శకుడు ప్రియశరణ్ చేసిన ప్రయత్నం గందరగోళానికి గురిచేస్తుంది.
సంతోష్ (వరుణ్‌సందేశ్) ఓ అనాధ. నలుగురు స్నేహితులతో కలిసి కార్టూన్‌తరహా వస్త్రధారణతో వెళ్ళి కస్టమర్ల బాధలను తమ బాధలుగా భావించి వారిని హ్యాపీహ్యాపీగా ఉండేలా చూస్తాడు. తమ టీమ్‌కు 'కార్టూన్‌గైస్'గా పేరుపెట్టుకుంటారు. పనిలోపనిగా ఎవరినైనా ప్రేమించి జీవితంలో సెటిల్‌అవ్వాలనుకుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ ప్రేమించరు. వృత్తిలోభాగంగా యు.ఎస్.నుండి వచ్చే పూజ (వేగ)ను ఎయిర్‌పోర్ట్‌నుంచి తీసుకువస్తూ ఎంటర్‌టైన్ చేసే క్రమంలో ఆమె ప్రేమలో పడిపోతాడు. ప్రేమపై సదభిప్రాయంలేని పూజ మంచి స్నేహితునిగా ఉంటానని సంతోష్‌కు చెబుతుంది. స్నేహంతోటే ప్రేమను పొందాలని పలుకరాలుగా సంతోష్ ప్రయత్నిస్తాడు. తనో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబుతూ ఫీలింగ్స్ అన్నీ పూజకు వ్యక్తం చేస్తుంటాడు.
ఓ సందర్భంలో తన డ్రీమ్‌గాళ్‌ను చూపించే ప్రయత్నంలో యాదృశ్చికంగా అటుగా వెళుతున్న ప్రియ (శరణ్యమోహన్)ను చూపిస్తాడు. దీంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి తన ఫ్రెండ్ ఎంతో ప్రేమిస్తూ రాసిన లవ్‌లెటర్స్‌ను ప్రియకు చూపిస్తూ ఆమెను ప్రేమలోకి బలవంతంగా లాగుతుంది పూజ. ప్రేమలేఖల్లో ఉన్న ప్రేమకు ముగ్థురాలై ప్రియ నిజంగా సంతోష్‌ను ప్రేమించేస్తుంది. ఇది తెలుసుకున్న సంతోష్ తాను ప్రేమిస్తుందని పూజననే విషయాన్ని ప్రియ సోదరుడు సూరి (డబ్బింగ్ బొమ్మాలి రవి)కు చెబుతాడు. అయితే అతని మంచితనానికి మెచ్చిన సూరి తన సోదరికి సరైనవాడు ఇతడేనని భావించి, ఈ నిజాన్ని చెబితే ఎంతోకాలం బతకని ప్రియ ఇప్పుడే చనిపోతుందనీ, అందుకే ప్రేమిస్తున్నట్లు నటించమని ప్రాధేయపడతాడు సూరి. ఈ క్రమంలో ఆమెపై నిజమైన ప్రేమ పెంచుకుంటాడు.
మరోవైపు సంతోష్ ప్రేమించింది తననేనన్న విషయం పూజ గ్రహిస్తుంది. ఆ దశలో సంతోష్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేదే సినిమా.కథ లేకున్నా దాన్ని ప్రెజెంట్‌చేసే విధానంలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకులున్నారు. తమిళ దర్శకులవద్ద పనిచేసిన ప్రియాశరణ్ తెలుగులో దర్శకుడిగా మారిన చిత్రమిది. ఆయన చెప్పాల్సిన పాయింట్ స్పష్టంగా గాకుండా డొంకతిరుగుడుగా చెప్పి ప్రేక్షకుల్ని గందరగోళపరిచాడు. దాంతో కథలో పాయింట్ నీరుగారిపోయింది. ప్రేమకథలకు పాటలు సంగీతం ప్రాణం. సాహిత్యం బాగున్నా అందుకు తగిన బాణీలు లేవు. మణిశర్మ విన్పించినా బాణీలన్నీ ఎక్కడో విన్నట్లుంటాయి. సరైన సంభాషణలు లేవు.
ఆద్యంతం అలీతో నవ్వించడానికి ప్రయత్నించినా సన్నివేశాలన్నీ పేలవంగా ఉండడంతో ఫీల్ మిస్సయింది. అందరి ఫీలింగ్స్‌ను తను పంచుకునే సంతోష్‌కు తన జీవితంలో వచ్చే ఫీలింగ్స్‌ను పంచుకోవడంలో పడిన సంఘర్షణను బాగా డీల్‌చేశాడు. భాషలో చాలా మార్పువచ్చిందని చెప్పుకున్నా ఎప్పటిలానే ఇంగ్లీషు తెలుగును మిక్స్‌చేసేట్లుగా వరుణ్ భాష ఉంది. వేగ పాత్రలో ప్రత్యేకత లేదు. శరణ్యపాత్రతో కథకు మలుపు. అయితే ఆ పాత్రను చంపడంతోనే కాస్త ఫీలింగ్ కల్గించినా అదే సినిమాను నిలబెడుతుందనేది ఎండమావే. ఫీలింగ్ మీవి. ఎక్స్‌ప్రెషన్స్‌మావి అని హీరో పలికితే... కష్టాలు మీవి, బాధలు మావి అని ప్రేక్షకుడు అనేలా ఉందీ సినిమా.

Subscribe to:
Posts (Atom)