Tuesday, December 15, 2015

'చిరంజీవితో కచ్చితంగా సినిమా తీస్తా'

భవిష్యత్ లో మెగాస్టార్ చిరంజీవితో కచ్చితంగా సినిమా తీస్తానని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. కాగా చిరు 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం పూరి చేజారింది. చిరంజీవి 150వ సినిమాకు తొలుత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. పూరి జగన్నాథ్ గతంలో ఓ కథను రెడీ చేశారు. చిరంజీవికి సెకండాఫ్ నచ్చకపోవడంతో బ్రేక్ పడింది. చివరకు తమిళ చిత్రం కత్తిని రీమేక్ చేయాలని నిర్ణయించగా, ఆ అవకాశం వీవీ వినాయక్ కు దక్కింది. చిరు సినిమాకి సంబంధించిన వార్తను రామ్‌చరణ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళ చిత్రం 'కత్తి' రీమేక్‌లో తన తండ్రి నటిస్తారనీ, వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తారనీ చరణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఓ వార్త ఏజెన్సీతో మాట్లాడుతూ.. ఈ అవకాశం చేజారడం దురదృష్టకరమని, అయితే చిరంజీవితో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పారు.

వేలంలో ఆటగాళ్లను ఎంచుకున్న పుణే, రాజ్‌కోట్‌ ఫ్రాంచైజీలు



కొత్త ఫ్రాంచైజీలు పుణే, రాజ్‌కోట్‌ల కోసం ఐపీఎల్‌ మంగళవారం ప్రత్యేక వేలం నిర్వవహించింది. వచ్చే రెండు ఐపీఎల్‌ సీజన్ల కోసం నిర్వవహించిన ఈ వేలంలో పుణే, రాజ్‌కోట్‌ జట్లు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ రోజు జరిగిన వేలంలో పుణే జట్టుకు ధోని, ఆశ్విన్‌, రహానే, స్టీవెన్‌ స్మిత్‌, డుప్లెసిస్‌ ఎంపికయ్యారు. రాజ్‌కోట్‌ జట్టు సురేశ్‌రైనా, రవీంద్ర జడేజా, మెక్‌కల్లమ్‌, జేమ్స్‌ ఫాల్క్‌నర్‌, డ్వేన్‌ బ్రావోలను దక్కించుకఁంది. మిగతా ఆటగాళ్లను ఫిబ్రవరి 6న జరిగే ఐపీఎల్‌ వేలంలో ఎంపిక చేయనున్నారు.