Sunday, April 24, 2011

బాబా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు

1926 : లో సత్యసాయిబాబా జననం
1936 : పదేళ్ల బాలుడైన సత్యనారాయణరాజు తన ఈడు పిల్లలతో ఒక భజన బృందాన్ని ఏర్పాటు చేశాడు. తను రచించిన భక్తి గీతాలను వారితో కలసి ఆలపించేవాడు.
1938 : తన 12వ ఏట సత్యనారాయణరాజు ' చెప్పినట్లు చేస్తారా...' అనే ఒక జానపద రూపకాన్ని రచించి ప్రదర్శించేవారు. అది గ్రామస్తులను ఉత్తేజపరిచేది.
1940 : అక్టోబరు 20: పద్నాలుగో ఏట సత్యనారాయణరాజు తనను తాను సాయిబాబాగా ప్రకటించుకున్నారు.
1941: లో భవిష్యత్తు వాణిని ప్రకటించారు.
1946 :  వూటీ, తిరుపతి, హైదరాబాద్‌ సందర్శించిన బాబా వేలాదిమందికి తన సందేశాలను వినిపించారు. పరిసర గ్రామాల ముస్లింలు ఆయన ప్రసంగాల కోసం తరలివచ్చేవారు.
1947 : అక్టోబరు 25 : బాబా తమిళనాడులోని తిరుచ్చి దగ్గర ఉన్న కరూర్‌లో తొలిసారిగా బహిరంగ వాణిని వినిపించారు. చిట్టీల మీద భక్తుల నుంచి వారి ప్రశ్నలకు స్వీకరించడమనే సంప్రదాయం ఇక్కడి నుంచే ప్రారంభించారు. దానిని చివరిదాకా కొనసాగించారు. ముఖ్యంగా ప్రత్యేక ఉత్సవాలు, కార్యక్రమాల్లో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది.
1948 : లో ప్రశాంతి నిలయానికి పునాది వేశారు.
1950 : బాబా తన 25వ జన్మదినం సందర్భంగా నవంబరు 23న ప్రశాంతి నిలయం మందిరాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఇది ప్రపంచలోనే ఒక గొప్ప ఆథ్యాత్మిక, శాంతి కేంద్రంగా రూపొందింది.
1956:లో సత్యసాయి జనరల్‌ ఆసుపత్రి ఏర్పాటు చేశాడు.
1957 : దేశంలో బ్రిటిష్‌ పాలన ముగిసిన దశాబ ్దం తర్వాత భారతీయ సనాతన ధర్మ ప్రచారంపై జరిగిన 9వ అఖిలభారత ఆధ్యాత్మిక సదస్సులో సాయిబాబా ప్రసంగించారు. ఆధ్యాత్మిక సదసుస్సలో దీన్నొక మైలురాయిగా పేర్కొంటారు.
1958 : తన 32వ ఏట బాబా మానవతా వాదంపై మార్గదర్శనాన్ని ప్రారంభించారు. నిత్యం ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఆయన భక్తులను ఆ దిశగా ఉత్తేజపరిచేవాడు. సాయి ఆధ్యాత్మిక ప్రసంగాలను విశ్వవ్యాప్తం చేయడానికి 'సనాతన సారధి' పేరుతో సాయి ఆశ్రమం మాసపత్రిక ప్రచురణ ప్రారంభించింది.
చక్కటి చిక్కటి తెలుగు బాషలో ప్రేమ వాహిని, ధర్మవాహిన, ధాన్యవాహిన, ప్రశాంతి వాహిన, సందేహ నివారిణి అనే ఐదు సంపుటాలను రచించారు. ' సనాతన సారథి' మాస సంపుటి దేశ బాషలన్నింటితో పాటు ఆంగ్లం, సింధీ, నేపాలీ భాషల్లో కూడా ప్రచురించడం ప్రారంభించారు.
1960 : బాబా జీవితంపై వచ్చిన గొప్ప పరిశోధన గ్రంధంగా పేరొందిన ' సత్యం, శివం, సుందరం' పుస్తకం తొలి సంపుటి ప్రచురితమైంది. చరిత్ర అధ్యాపకుడైన కస్తూరి దీనిని ప్రచురించారు.
1961: దసరా సందర్భంగా ' వేద పురష జ్ఞాన సప్తాహా ' యజ్ఞాన్ని నిర్వహించారు. పలువురు ఆధ్యాత్మికవేత్తలు నిత్య జీవితంలో ప్రశాంతతకు సనాతన ధర్మంలోని దార్శనికత గురించి వివరించారు.
1962 : బాబా తొలిసారిగా పనామాను సందర్శించి అక్కడ సాయి కేంద్రాన్ని ప్రారంభించారు.
1963 : జపాన్‌కు చెందిన రామచంద్రచుగాని తొలిసారిగా ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు.
1964 : ఆస్ట్రేలియాకు చెందిన హెవర్డ్‌ మర్ఫెట్‌ మద్రాసులో సాయిబాబాను కలిశారు. సాయి మహిమలు, సందేశాలపై ఆయన పరిశోధించి 1971లో వెలువరించిన ' సాయిబాబా-మేన్‌ అండ్‌ మిరాకిల్స్‌' అనే పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. లక్షలాది మందిన సాయి భక్తులుగా మార్చింది.
1965 : అమెరికా వైద్యుడు డాక్టర్‌ జాన్‌ హిస్లాన్‌ సాయిని సందర్శించారు. ఆ తర్వాత అమెరికన్‌ సాయి ఆర్గనైజేషన్‌ను ప్రారంభించి అక్కడ సాయిబాబా తత్వాన్ని వ్యాప్తిచేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు.
1966 : లో బాల వికాస్‌ పాఠశాల నిర్మాణం
1968 : లో ప్రపంచ మహాసభల నిర్వహణ. అనంతపురంలో బాలికల కళాశాల ఏర్పాటు
1969 : బాబా గుజరాత్‌ సందర్శించిన సందర్భంలో అక్కడి స్థానిక పత్రిక ' నవ కాల్‌ ' సాయి చేసే అద్భుతాల గురించి ధారావాహిక ప్రచురించింది. వీటిపై ఆ పత్రిక సంపాధకుడు పి.కె. సావంత్‌ సాయితో చర్చించి ఆ అద్భుతాల గురించి కథలు కథలుగా తన పత్రికలో ప్రచురించడంతో వాటిపై తీవ్రమైన విమర్శలు వెల్లువత్తాయి. వాటన్నింటికీ ఆ సంపాదకుడు సాయి నుంచి సమాధానాలు రాబట్టి ప్రచురించడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి.
ఇదే సంవత్సరం అక్టోబరులో ఇంద్రాదేవి కృషితో హాలీవుడ్‌ సాయి సెంటర్‌ ప్రారంభం ' అమెరికాలోని తొలి యోగా మహిళగా' ఆమె ఖ్యాతి పొందారు. అమెరికాలో బాబా ఖ్యాతిని పెంచింది ఆమే.
1970 : సాయి సందేశాలు, రచనలు, మహిమలు ప్రపంచ వ్యాప్తి చెందాయి.
లండన్‌లోని ఫ్రెడరిక్‌ ముల్లర్‌ ' సాయిబాబా... ద మేన్‌ ఆఫ్‌ మిరాకిల్స్‌ ' పుస్తకాన్ని ప్రచురించారు. వాటితోపాటు బాబాపై మరో మూడు పుస్తకాలను ఆయన రాశారు.
అమెరికా నిర్మాత, రచయిత, గేయ రచయిత అర్నాల్డ్‌ షల్‌మాన్‌ ' బాబా ' అనే పుస్తకాన్ని రాసి న్యూయార్క్‌లో ప్రచురించారు.
1971 : కాలిఫోర్నియా సహా అమెరికాలోని పలు ప్రాంతాల్లో సాయి కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
1972 : శాస్త్రి అనే భక్తుడి ద్వారా హాంకాంగ్‌లో సాయి చైతన్యం మొదలైంది. నిర్భాగ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభించారు.
కాలిఫోర్నియాకు చెందిన ఆధ్యాత్మికవేత్త మానసిక నిపుణురాలు ఫిలిస్‌ క్రిస్టల్‌ సాయి మీద రాసిన పలు పుస్తకాలు వేలాది మంది పాశ్ఛాత్యులను భక్తులుగా మార్చాయి.
1974 : సాయి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ అమెరికా ప్రారంభం. ఆ తర్వాత భారత్‌ వెలుపల బాబా ఆధ్యాత్మిక చింతనను వ్యాప్తిచేయడంతో ఈ సంస్థ కీలకంగా మారింది.
1975 : బెంగుళూరులో సత్యసాయి కళాశాల ఏర్పాటు.
1981 : లో డీమ్డ్‌ యూనివర్సిటీ స్థాపన
1985 : లో సత్యసాయి నక్షత్రాశాల ఏర్పాటు
1990 : లో ప్రపంచ 5వ మహాసభలు జరిగాయి.
1990 : లో పుట్టపర్తిలో విమానాశ్రయం నిర్మాణం
1990 : లో మ్యూజియం నిర్మాణంa
1992 : లో రూ. 300 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాపన
1995 : లో అనంతపురం జిల్లాలో దాహార్తిని తీర్చడానికి రూ. 350 కోట్లతో సత్యసాయి తాగునీటి పథకం ప్రారంభం.
1997 : లో హిల్‌ వ్యూ స్టేడియం ఏర్పాటు
2000 : లో నూతనంగా ప్రశాంతి నిలియం రైల్వేస్టేషన్‌ ప్రారంభం
2001 :లో రూ. 500 కోట్లతో బెంగుళూరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు.
2001 : లో సంగీత కళాశాల ఏర్పాటు.

సత్యసాయి బాబా అస్తమయం

 భగవాన్‌ సత్యసాయి బాబా (86) ఆదివారం తుది శ్వాస విడిచారు. బౌతికంగా ఆయన భక్తులకు దూరమయ్యారు. శ్వాస ఇబ్బందులతో మార్చి 28న ఆసుపత్రిలో చేరి ఆయన ఆ రోజు ఉదయం 7.40 గంటలకు బాబా కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఊపిరితిత్తులు, గుండె పనిచేయకపోవడం వల్ల ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.ఆ రోజు సాయంత్రం 6 గంటకు నుంచి సత్యసాయి బాబా భక్తులు ఆయన బౌతికకాయాన్ని దర్శించుకోవచ్చు. సత్యసాయి బాబా పార్థివదేహాన్ని రెండు రోజుల పాటు భక్తుల సందర్శనార్థం కోసం సాయి కుల్వంత్‌ హాల్‌లో బాబాను ఉంచుతారు. బుధవారం