Saturday, April 23, 2011

ఐపీఎల్‌లో వన్డే మ్యాచ్‌ ...

 ఐపీఎల్‌-4లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ రికార్డు సృష్టించింది. పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవ్‌న్‌, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 20 ఓవర్లలో 231 పరుగులు చేసి రికార్డును సృష్టించింది. గత మూడు ఐపీఎల్‌లో రికార్డును తిరగరాసింది. ఐపీఎల్‌ -4లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో అత్యదికంగా 185 పరుగులు చేసింది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు 231 పరుగులు చేశారు. మొదటి వికెటుకు 146 పరుగుల భాగ్యస్వామం వహించారు. సెహ్వగ్‌ 35 బంతులలో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో సహయంతో 77 పరుగులు చేశాడు. కొద్ది సేపు వుంటే మాత్రము ఏకంగా సెంచరీ నమోదు చేసుకున్నేవాడు. అతని తోడు వార్నర్‌ రెచ్చిపోయి 48 బంతులలో 77 పరుగులు చేశాడు. ఒక్కరి మించి మరోకరుగా రెచ్చిపోయారు. నాయర్‌ 11, ఫించ్‌ 3 పరుగులు చేశారు. వేణుగోపాల్‌ రావ్‌, ఓజా ఇద్దరు చివరిలో రెచ్చిపోయారు. ఓజా ఎనిమిది బంతులలో రెండు సిక్స్‌లు, ఒక ఫోరుతో 19 పరుగులు చేశాడు. వేణుగోపాల్‌ రావ్‌ 15 బంతులలో 28 పరుగులు చేశాడు. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ ఘటుగానే సమాధానం ఇచ్చింది. 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. గిల్‌క్రిస్ట్‌ 42 మార్ష్‌ 95 పరుగులు చేసి ఢిల్లీకి షాక్‌ ఇచ్చారు. మార్ష్‌ చివరి దాకా వుంటే మాత్రము ఢిల్లీకి పంచ్‌ ఇచ్చేవారు. ఢిల్లీ బ్యాట్స్‌మైన్‌లు రాణించడంతో విజయం సాధించింది.