Monday, January 10, 2011

బెంగాలీ దాదాకు మళ్లీ నిరాశే

 బెంగాలీ దాదాకు మళ్లీ నిరాశే ఎదురైంది. భారత క్రికెట్‌ చరిత్రల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా పేరుగాంచిన మాజీ సారధి సౌరబ్‌ గంగూలీకి రెండో రోజు ఐపీఎల్‌లోని 10 ఫ్రాంచైజీలు కూడా మొండిచెయ్యి చూపాయి. గంగూలికీ ఈ అనుభ వం ఒక రకంగా అవమానం లాంటిదని చెప్పవచ్చు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన ఈ ప్రిన్స్‌ ఆఫ్‌ కొల్‌కత కేవలం ఐపీఎల్‌ టోర్నీలో పాల్గొనడం కోసమే తన క్రికెట్‌ కెరీర్‌ను పొడిగించాడు. 
లారా, జయసూర్యలది అదే పరిస్థితి 
గంగూలీతో పాటు ఇతర క్రికెట్‌ దిగ్గజాలైన బ్రియాన్‌ లారా, సనత్‌ జయసూర్యల కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మొదటి రోజు తొలి రౌండ్లోనే తిరస్కారానికి గురైన వీరి పేర్లు అసలు రెండో రోజు ప్రస్తావన కూడా రాలేదు. ఇలాంటి అనుభవమే ప్రస్తుతం అంతర్జాయ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తున్న వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌కు కూడా ఎదురుకోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఈ ఏడాది ఐపీఎల్‌లో క్రొత్తగా చేరిన సహారా, పూణె వారియర్స్‌ జట్టు గంగూలీని కొనుగోలు చేయవచ్చని అందరు భావించినా.... అలా జరగడకపోవడం గమన్హారం.

ఎన్తినికి వీడ్కోలు


ఎన్తిని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆదివారం జరిగిన టీ20నే అతడికి చివరి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ 12 ఏళ్లు నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. సచిన్తఓ కలిసి క్రికెట్‌ ఆడడం నాకు లభించిన గొప్ప గౌరవం అని ఎన్తిని చెప్పాడు.