Saturday, May 28, 2011

ఐపీఎలోల్‌ వరుసగా రెండో సారి టైటిల్‌ కైవసం చెన్నయ్

చెన్నయ్ అన్నుంది సాధించి ఇట్టు బ్యాటింగ్‌లో, అటు బౌలంగ్‌లో రాణించి విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరుని ఎలా కట్టడి చేయాలో కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని నిరుపించుకున్నాడు.
ఐపీఎల్‌ -4లో టోర్నిలో వరుసగా రెండోసారి చెన్నయ్ విజయం సాధించింది. ఈ సారి మాత్రం కోల్‌కతా, ముంబయి, బెంగుళూరుకు టైటిల్‌ వస్తుంది అని భావించాను. కాని చెన్నయ్ అ అవకాశం ఎవరికి ఇవ్వకుండా తనే హిట్లరుగా భావించింది. ఈ రోజు జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నయ్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి 10 ఓవర్లలో చెన్నరు 94 పరుగుల చేసింది. విజరు 49, హాస్సీ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. అతరువాత ఇద్దరికి బ్యాట్‌మెన్స్‌లకు చెరో అవకాశం దోరికింది. హాస్సీ 43 బంతులలో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లతో సహయంతో 63 పరుగులు చేశాడు. మురళీ విజయ్ 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. 52 బంతులలో నాలుగు ఫోర్లు, ఆరు సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. కెప్టెన్‌ ధోని 22 , మోర్కెల్‌ 2, రైనా 8 పరుగులు చేశారు. 20 ఓవర్లలో చెన్నయ్ 205 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు అదిలోనే క్రిస్‌గేల్‌ డకౌట్‌ అయ్యాడు. అశ్విని బౌలింగ్‌లో కీపర్‌ ధోని క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అశ్విని తన రెండో ఓవర్లలో మరో ఓపెనరు అగవ్రల్‌ 10 పరుగులకే అవుట్‌ చేశాడు. అతరువాత కోహ్లీ, డివిల్లర్‌ ఇద్దరు క్రీజులో ఉన్నారు. మ్యాచ్‌లో కొత్త అశలు వచ్చాయి. క్రీజులో మంచిగా అడుతున్న సమయంలో మళ్లీ వికెటు పడింది. జకాతి మొదటి ఓవర్లలో డివిల్లర్‌ను ఎల్‌బిడబ్లుగా పెవిలియన్‌క పంపడాడు. అలా వరుసగా ఒక ఓవరు తరువాత మరోకరి వికెట్లు పడుతునే ఉంది. పరుగుల మాత్రం రావడం లేదు. మ్యాచ్‌ పూర్తిగా చెన్నయ్ వైపు వెళ్లింది. కొద్దిలో కొద్ది విరాట్‌ కోహ్లీ 35 పరుగులు చేశాడు. బెంగుళూరు 20 ఓవర్లలో 147 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరిలో తివారి 42 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు.

Friday, May 27, 2011

విండీస్‌ టెస్టు సిరీస్‌కు బారత జట్టు ఎంపిక

విండీస్‌ పర్యటనకు సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌, యువరాజ్‌ దూరం కానున్నారు. గంభీర్‌ భుజం నొప్పితో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌కూడా అందుబాటులో ఉండడు. ఇంకా యువరాజ్‌ సింగ్‌ ఎడమ ఊపిరితిత్తులో ఇన్‌ ఫెక్షన్‌ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. సచిన్‌కు విశ్రాంతి ఇచ్చారు. గంభీర, యువరాజ్‌ స్థానంలో శిఖర్‌ ధావన్‌, మనోజ్‌ తివారి ఎంపిక చేశారు. విండీస్‌  టూర్‌కు వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా సురేష్‌ రైనా ఎంపిక చేశారు. వైస్‌ కెప్టెన్‌గా హర్భజన్‌ సింగ్‌ ఎంపిక చేశారు. వన్డేలో సిరీస్‌ తొలి సారిగా సురేష్‌ రైనా, వైస్‌ కెప్టెన్‌గా హర్భజ్‌ ఎంపిక అయ్యాడు.

విండీస్‌ టూర్‌కు టెస్ట్‌ జట్టు : ఎమ్‌ఎస్‌ ధోనీ (కెప్టెన్‌), వివిఎస్‌ లక్ష్మణ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఎమ్‌ విజరు, అభినవ్‌ ముకుంద్‌, రాహుల్‌ ద్రావిడ్‌, విరాట్‌ కోహ్లి, ఎస్‌ బద్రినాథ్‌, హర్భజన్‌ సింగ్‌, ఇశాంత్‌ శర్మ, ఎస్‌ శ్రీశాంత్‌, అమిత్‌ మిశ్రా, ప్రజ్ఞాన్‌ ఓఝా, జహీర్‌ ఖాన్‌, మునాఫ్‌ పటేల్‌, సురేష్‌ రైనా, పార్థీవ్‌ పటేల్‌

ఐపీఎల్‌ -4 లో ఫైనల్‌లో చెన్నయ్ తో బెంగుళూరు డీ

ఐపీఎల్‌-4లో రేపు జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నయ్ తో బెంగుళూరు మ్యాచ్‌ జరగబోతున్నాయి. క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో బెంగుళూరుపై చెన్నయ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌ చేరుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైనల్‌ అదే జట్లు డీకొీనటున్నాయి. చెన్నయ్ మ్యాచ్‌లో హాస్సీ, రైనా, విజరు, ధోని, బధ్రీనాథ్‌ , మోర్కెల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే బౌలింగ్‌ విధనంలో కూడా రాణించడంతో మ్యాచ్‌ గెలుస్తామని ధీమాతో ఉంది. బెంగుళూరు ఓపెనరు క్రిస్‌గెేల్‌ మరో సారి రాణిస్తే విజయంపై నమ్మకం ఉంటుంది. విరాట్‌ కోహ్లీ, డివిల్లర్‌, రాణిస్తే విజయం సాధిస్తుంది.

Saturday, May 21, 2011

సినిమాలో రెండో పాత్రలో తాప్సీ ...

 అదేంటోగానీ తాప్సీ ఎంత ఎక్స్‌పోజింగ్‌ చేసిన సినిమాలో మాత్రం పేరు రావడం లేదు. తొలి సినిమా 'ఝుమ్మంది నాదంలోనే ఎక్స్‌పోజింగ్‌ చేసిన తాప్సీ యాక్టింగ్‌ ఏమాత్రం సూట్‌ కాదు అని డిసెండ్‌ అయ్యింది. ' మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ ' సినిమా హిట్‌ అయినా ఆమే పేరు మాత్రం సంపాందిచుకోలేపోయింది. ఇంకా ' వీర ' సినిమాలో కూడా అదే తీరు మార్పు లేదు. అక్కడ కూడా కాజల్‌ హిట్‌ అయ్యింది. సినిమా హీరోయిన్లు పాత్రలో మొదటి పాత్రకు మంచి పేరు సంపాంధించుకోలేకపోయింది. ఇప్పటి వరకు నటించిన తాప్సీ రెండో పాత్రకు మంచి పేరు తేచ్చుకుంది. ఇంకా రాబోయే సినిమాలో తాప్సీ ఎలా ఉంటుందో తెలియదు.

Thursday, May 19, 2011

Tuesday, May 17, 2011

మహేష్‌ బాబుతో పెట్టుకుంటే మటాషే

 హీరో మహేష్‌ బాబుతో సినిమాలు తీయడానికి హీరోయిన్లు ( స్వారీ ) అని చేబుతున్నారు. అతనితో సిసిమా తీయడానికి ఏడాదికి పైగా గ్యాప్‌ వస్తుంది. ఒక వేళ తీసిన హిట్‌ అవుతుంది. అన్ని నమ్మకం లేదు. మహేష్‌ బాబు ' అతిథి ' తర్వాత మూడేళ్ల గ్యాప్‌ తీసుకుని ' ఖలేజా ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అ సినిమా అర్థంకాక ప్రేక్షకులు పరుగైతారు. మళ్లీ ఏడాది తర్వాత ' దూకుడు ' సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సమంత హీరోయినుగా నటించింది. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో మహేష్‌ బాబు ' బిజినెస్‌మ్యాన్‌ ' సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ పేరుగా విన్పిస్తోంది. అయితే కాజల్‌ సింపుల్‌గా పూరికి సారీ చెప్పేసిందట. అతనితో సినిమా తీయలంటే ఏడాది గ్యాప్‌ వస్తుంది. అని సింపుల్‌గా సారీ అన్ని చెప్పింది.

Sunday, May 15, 2011

ఐదు నెలలో ఐదు సూపర్‌ హిట్‌ సినిమాలు ...

2011 తెలుగు సినిమాకు బాగానే ఉన్నట్లు ఉంది. ఈ ఏడాదిలో విడుదలైన పెద్ద హీరోల చిత్రాలు ' పరమవీరచక్ర' శక్తి , తీన్‌మార్‌ సినిమాలు ఘోరంగా నిరాశపరిచినప్పటికీ.. మిగితా సినిమాల విజయం సాధించి ముదుకు వెళ్తుతున్నాయి. అలా మొదలైంది, మిరపకారు, ప్రేమకావాలి, అహ నాపెళ్లంట సినిమా వంద రోజులు పంక్షన్‌ చేసుకొని విజయం సాధించింది. ఇప్పడు కొత్తగా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, 100% లవ్‌ చిత్రాలు అదే బాటలో పయనిస్తున్నాయి.

మళ్లీ ఆసుపత్రిపాలైన రజనీ

మొన్నీమధ్యనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మరోమారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత 15 రోజుల్లో రజనీ ఆస్పత్రిల చేరడం ఇది నాలుగోసారి. రజనీకాంత్‌ అనారోగ్యానికి కారణమేంటో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ' రాణా' పేరుతో కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమామా ఘాటింగ్‌ ప్రారంభోత్సవంలో రజనీకాంత్‌ అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే.

Friday, May 13, 2011

ఫోటాపోటిగా ఇద్దరు హీరోలు ...

రవితేజ నటించిన ' వీర ' ఈ నెల 20 విడుదలకు సిద్దం కానుంది. ఈ చిత్రంలో రవితేజ ద్వితియపాత్రాభినయం చేశాడు. ఈసినిమాలో హీరోయిన్లు కాజల్‌, తాప్సీ నటించారు. ఇప్పటికే రవితేజ సినిమా మిరపకాయ 100 రోజుల పంక్షన్‌ చేసుకొన్ని మంచి రేంజ్‌లో ఉన్నాడు. రవితేజకు పోటీగా అల్లుఅర్జును సినిమా రాబోతుంది. వచ్చే నెల 3న బద్రినాథ్‌ రిలీజ్‌ కానుంది. ఈ సిఁమాలో అల్లు అర్జున సరసన తమన నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు వినాయక్‌. ఈ రెండు సినిమాలో విన్నర్‌ ఎవరు అవుతారో వెచ్చిచూడాలి. రవితేజ ఇంతక ముందు బాలకృష్ణతో రెండు సార్లు డీ కొన్ని గెలిచాడు. ఇప్పుడు మరో హీరోతో సవారి చేస్తున్నాడు.

Monday, May 9, 2011

గాయంతో ఐపీఎల్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ అవుట్‌

 ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో ఓటములతో సతమవుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు కష్టాలు మరింత పెరగనున్నాయి. డేర్ డెవిల్స్ సారథి వీరేంద్ర సెహ్వాగ్ భుజం గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఐపీఎల్ నాలుగో సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సెహ్వాగ్ భుజం గాయానికి చికిత్స చేసుకునేందుకు గానూ వెంటనే లండన్ వెళ్లనున్నాడు. జూన్, జులై నెలల్లో జరిగే వెస్టిండీస్ టూర్‌కు కూడా సెహ్వాగ్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సెహ్వాగ్ గైర్హాజరీలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్స్ ప్రస్తుత సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. ఆడిన 11 మ్యాచ్‌లలో ఈ జట్టు నాలుగు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది.

Tuesday, May 3, 2011

ఐపీఎల్‌ -4లో గంగూలీ స్థానం ...

 ఐపీఎల్‌-4లో గంగూలీకి అడే అవకాశం దక్కింది. పూణే వారియర్స్‌ జట్టులో ఆశ్రిష్‌ నెహ్రా గాయంతో ఉన్నప్పటికి అతని స్థానంలో అడే అవకాశం దక్కింది. నిన్న రాత్రే సౌరబ్‌ని తీసుకోవాలిని తుదినిర్ణయం తీసుకున్నాం. అని పూణే వారియర్స్‌ టీమ్‌ డైరెక్టర్‌ అభిజిత్‌ సర్కార్‌ పేర్కొన్నారు.

27 ఏళ్ళ తర్వాత ప్రపంచ కప్‌ గెలిచిన తరువాత ప్రజల్లో ఉత్సాహం, అనందం, కేరితాలు అరోజు పండుగా చేశారు.

27 ఏళ్ళ తర్వాత ప్రపంచ కప్‌  గెలిచిన తరువాత  ప్రజల్లో ఉత్సాహం, అనందం, కేరితాలు అరోజు పండుగా చేశారు.