Saturday, March 12, 2011

ప్రయోగాలు ఎక్కువయ్యాయి .. ఇంకా చాలు ధోని ...

 ప్రపంచకప్‌లో భాగంగా ధోని కెప్టెన్‌ ఎక్కువగా ప్రయోగాక్మతకాలు చేస్తున్నాడు. కాని అవి విఫలమవుతున్నాయి. ఓపెనర్లుగా సచిన్‌, సెహ్వాగ్‌, వన్‌డౌన్‌గా గంభీర్‌ వస్తున్నారు. మరి టుడౌన్‌గా వచ్చేసరికి విరాట్‌ కోహ్లీ రావాలి కాని అతనికి బదులుగా యూసుఫ్‌ పఠాన్‌ వస్తున్నాడు. వచ్చిన అతను పదే పదే విఫలమవుతున్నాడు. కానీ మళ్ళీ అతని రెండో స్థానంలో అతని పంపడం సులువు కాదు. విరాట్‌కోహ్లీ మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. అతని స్థానంలో యూసుఫ్‌ పఠాన్‌ రావడం కార్టెట్‌ కాదు. మిడిల్‌అర్డర్‌లో పరుగుల రావాడం కోసం అతని పంపిస్తున్నాము అంటే అతనితో కనీసం అర్థ సెంచరీ కూడ నమోదు కాలేదు. ఒక్కాన్కో దశలో యువరాజ్‌ సింగ్‌ బెటర్‌. ఐదు మ్యాచ్‌లో మూడు అర్థసెంచరీల సహయంతో 171 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఐదు మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసుకున్నాడు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌ యూసుఫ్‌ పఠాన్‌ కాతాతేరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరి కెప్టెన్‌గా మరి నీ బాధ్యత ఐదు మ్యాచ్‌లో కేవలం 96 పరుగులు మాత్రమే చేశావు. జట్టులో ఇద్దరిలో ఒక్కరిని తీసివేయాలి. అది యుసుఫ్‌ పఠాన్‌ లేదా మాహేంద్రసింగ్‌ ధోని ఇద్దరిలో ఒకరి తప్పకుండా తీసివేయాలి. అతని స్థానంలో రైనాను తీసుకోవాలి అతడు అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో జట్టు సహయపడుతాడు. ఈ నెల వెస్టిండీస్‌తో జరిగబోయే మ్యాచ్‌లో ఇద్దరిలో ఒక్కరు తప్పుకోవాలి. లేకపోతే వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఘోరగా ఓడిపోతాము అది మాత్రము నిజం......

ఈ రోజు మ్యాచ్‌లో ఓడిపోవడం కారణం నీదే బాధత్య

వంద సెంచరీలకు అడుగు దూరంలో సచిన్‌

 భారత స్టార్‌ క్రికెటర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వంద సెంచరీల రికార్డుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారమిక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో సచిన్‌ మరో శతకం బాదాడు. దీంతో టెస్ట్‌లు, వన్డేలో కలిపి అతడు 99 సెంచరీలు సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన మాస్టర్‌ 92 బంతులలో 7 ఫోర్ట్లు, 3 సిక్స్‌ర్లతో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేలో అతనికి 48వ సెంచరీ కాగా, వరల్డ్‌కప్లఓ ఇది ఆరో సెంచరీ నమోదు చేశాడు.

' వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ' జెండా ఆవిష్కరణ

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను యువనేత వైఎస్‌ జగన్‌ శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మధ్యాహ్నం 2.29 గంటల ప్రాంతంలో అశేష జనావళి సాక్షిగా జననేత జెండాను ఆవిష్కరించారు. ముందు నీలం మధ్యతో తెలుపు చివర ఆకుపచ్చ రంగుల్లో జెండా రూపొందించారు. జెండా మధ్యలో వైఎస్సార్‌ బొమ్మ పెట్టారు. బొమ్మ వెనుక కాషాయం రంగు ఉంది. బొమ్మ చుట్టూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందుపరిచారు. నీలం రండు యువ చైతన్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ వ్యవసాయానికి ప్రతీకలుగా తీసుకున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.