Friday, February 25, 2011

ఇది ఒక సవాలు .... విజయం మాత్రము పెద్దది

 చిన్న మ్యాచ్‌పై విజయం సాధించి జట్లు పెద్ద జట్లుపై విజయం వచ్చే సరికి ఎవరో ఒకరు ఓడిపోవడం తప్పదు. నేటి మ్యాచ్‌లో ఓడిపోయింది ఎవరు... ? గెలిచెంది ఎవరు ... ?
పాకిస్థాన్‌ తన మొదటి మ్యాచ్‌లో కెన్యా పై ఘన విజయం సాధించింది. లంక మొదటి మ్యాచ్‌లో కెనడాపై విజయం సాధించింది. రెండు జట్లు చిన్న మ్యాచ్‌లో విజయం సాధించినవి. ప్రపంచకప్‌లో 10వ మ్యాచ్‌ పాక్‌, లంక్‌ మధ్య జరుగుతుంది.

భాదలో రెండో మ్యాచ్‌లో విఫ్లవం

 శుక్రవారం న్యూజిలండ్‌, ఆస్ట్రేలియా మాద్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చిన బాధలో ఉన్న సందర్భంగా రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఫేవలంగా ఉంది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకు న్న ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్‌ ఆహ్వానించింది. బ్యాటింగ్‌ ప్రారంభించిన కివీస్‌ నాథన్‌ మెక్‌క్లలమ్‌, వెట్లోరి చెప్పుకొద్దగ స్కోరు చేశారు.నాథన్‌ మెక్‌క్లలమ్‌ 52, వెట్లోరి 44 పరుగుల చేశారు. కివీస్‌ బ్యాటింగ్‌లో గుప్తిల్‌ 10, మెక్‌క్లలమ్‌ 16, రైడ్‌ర్‌ 25, టైలర్‌ 7, ఫ్రాంక్లిన్‌ 0, స్టైరిస్‌ 0 హౌ 22 సౌతీ 6, బెన్న్‌ట్‌ 0 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో జాన్సన్‌ నాలుగు వికెట్లు తీసుకోగా, టైట్‌ మూడు వికెట్లు తీసుకు న్నాడు. బ్రెట్‌లీ, వాట్స్‌న్‌, స్మిత్‌ చెరో ఒక వికెటు తీసుకున్నారు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏమాత్రం కగుతిన్న కుండా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాని సాధించింది. ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. వాట్సన్‌ 62, హ్యడిన్‌ 55, పాటింగ్‌ 12, పరుగులు చేశారు.

మనోజ్‌తో ఛార్మి లింక్‌ ఏమిటి ?

 బొద్దుగా ఉండే ఛార్మింగ్‌ గర్ల్‌ ఛార్మి ఈ మదధ్య కాస్తస్లిమ్‌ అయ్యినట్లుంది. ప్రస్తుతం ఛార్మి మంచు మనోజ్‌తో బాగా క్లోజ్‌గా ఉంటుందని సమాచారం. రీసెంట్‌గా ఛార్మి నటించిన ' మంగళ' చిత్ర ఆడియో ఫంక్షన్‌కి ఛీప్‌ గెస్ట్‌గా మనోజ్‌ రావడం దీనికి ఉదాహరణగా కూడా అనుకోవచ్చు. ఇదే విషయంపై ఇరువురిని అడిగితే కేవలం మా మధ్య స్నేహం తప్ప ఇంకేమి లేదు. అని చెప్పుకున్నారు. ఈ ఇద్దరు పబ్‌లు, నైట్‌ పార్టీల్లో తరచూ కలుస్తున్నారని సమాచారం.ఎంత దూరం వెళ్తుందో కొన్నాళ్లు వేచి చూడాలి.

2007 ప్రపంచకప్‌ - చరిత్రలో చెప్పుకోదగిన సంఘటన

 ప్రపంచ కప్‌ చరిత్రలో చీకటి దినంగా చెప్పుకోదగిన సంఘటన 2007 కప్‌లో జరిగింది. పాకిస్తాన్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఘోరంగా ఓటమి చెందింది. అదీ టోర్నీ తొలి ఆటలోనే కావడంతో కప్‌ సరీస్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అదే రోజు రాత్రి పాకిస్తాన్‌ కోచ్‌ బాబ్‌ ఉల్మర్‌ దారుణంగా హత్యకు గురయినాడు. హోటలు గదిలో ప్రాణాలు కోల్పోయి అనుమానాస్పదంగా మృతి చెందిన ఉల్మర్‌ను గుర్తించారు. ఉల్మర్‌ను హత్య చేశారని జమైకా పోలీసులు ప్రకటించారు.