Friday, June 24, 2011

అంతర్జాతీయ క్రికెట్‌కు స్టైరిస్‌ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టైరిస్‌ గుడ్‌డై చెప్పాడు. స్టైరిస్‌ 188 వన్డేలలో నాలుగు సెంచరీలతోపాటు, 137 వికెట్లు తీసుకొన్ని, 4483 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ టోర్నిలో మొదటి మూడు ఐపీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ జట్టులో కొనసాగాడు. నాలుగో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో స్టైరిస్‌ కొనసాగాడు. స్టైరిస్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు.

Monday, June 20, 2011

భారత్‌ తొలి ఇన్సింగ్‌ 246 అలౌట్‌

 భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనరు ముక్నుంద్‌, విజరు ఇద్దరు ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. మురళీ విజరు 12 బంతులలో 8 పరుగులు చేసి రామ్‌పాల్‌ బౌలింగ్‌లో బిస్‌షో క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. మరో ఓపెనరు ముకున్‌ంద్‌ 11 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. 30 పరుగులు ఓపెనర్లు ఇద్దరు పెవిలియక్‌ చేరుకున్నారు. ద్రావిడ్‌, లక్ష్మణ్‌ ఇద్దరు క్రీజు ఉన్నారు. ఇద్దరు మరో వికెటు పడకుండా జాగ్రత పడ్డారు. లక్ష్మణ్‌ 12 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. వన్‌డే మ్యాచ్‌లో బిగ్‌ హిట్‌గా పేరు తేచ్చుకున్నా విరాట్‌ కోహ్లీ తొలి సారిగా టెస్టులో స్థానం దక్కింది. కాని నాలుగు పరుగులే చేసి అవుట్‌ అయ్యాడు. అతరువాత ఓవర్లలో ద్రావిడ్‌ వికెట్టు కోల్పోయ్యాడు. 67 బంతులలో ఏడు ఫోర్లు సహయంతో 40 పరుగులు చేశాడు. కెప్టెన్‌ ధోని డకౌట్‌ అయ్యాడు. టీమిండియా 85 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాలలో చిక్కుకుంది. క్రీజులో హర్భజన్‌ సింగ్‌, రైనా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు అచి తూచి అడూతు స్కోరు బోర్డును ముందుకు నడిపారు. హర్భజన్‌సింగ్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 35 బంతులలో తొమ్మిది ఫోర్లుతో 45 పరుగులు చేశాడు. ఇంకా ఐదు పరుగుల కోసం చాలా కష్టపడి ఐదు పరుగులు సాధించి అర్థసెంచరీ పూర్తి చేశాడు. మరో వైపు రైనా 75 బంతులలో అర్థసెంచరీ పూర్తి చేశాడు. హర్భజన్‌సింగ్‌ 74 బంతులలో పది ఫోర్లు, ఒక సిక్స్‌లతో 70 పరుగులు చేసి జట్టును అపదలో అదుకున్నాడు. ప్రవీణ్‌ కుమార్‌ 4, అమిత్‌మిశ్రా 6, పరుగులు చేశారు. ఒక పక్క వికెట్లు పడుతున్న తన దైన స్థాయిలో అడుతున్నాడు. సెంచరీ కొద్దిలో మిస్‌ అయ్యాడు. 115 బ ంతులలో 15 ఫోర్లుతో 82 పరుగులు చేశాడు. వెస్టిండిస్‌ బౌలింగ్‌లో ఎడ్వ్‌ర్ల్‌ నాలుగు వికెట్లు, రాంపాల్‌, బిస్‌షో చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

Saturday, June 18, 2011

మళ్లీ 'రాణా ' సినిమాకు రజనీకాంత్‌ రెడీ

 సింగపూర్‌లో చికిత్స పొందుతున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన ఆరోగ్యం బేషుగా వున్నదని స్పష్టం చేశారు. అభిమానుల ప్రార్థనలవల్ల తాను త్వరగా త్వరగా కోలుకున్నానని ఆయన అన్నారు. తన గురించి ఆందోళన చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రజనీకాంత్‌ ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయ్యారని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానులకోసం త్వరలోనే రాణాగా వారి ముందుకు వస్తానని తెలిపారు.

Tuesday, June 7, 2011

నమాస్తే తెలంగాణ దినపత్రిక ఫోటోగ్యాలరీ

నమాస్తే తెలంగాణ దినపత్రిక ఫోటోగ్యాలరీ 
 
 
 
 
 
 
 
 
 
 

Monday, June 6, 2011

తొలి వన్డేలో భారత్‌ విజయం

 భారత్‌- వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 214 పరుగులు చేసి తోమ్మిది వికెట్లు కోల్పోయింది. శర్వాణ్‌ను 56, శ్యాముల్స్‌ 55 పరుగులు చేసి జట్టు అదుకున్నారు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకు అవుట్‌ అయ్యారు. భారత్‌ బౌలింగ్‌లో హర్భజన్‌ సింగ్‌ పది ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ప్రవీణ్‌ కుమార్‌, మునాఫ్‌ పటేల్‌ ,రైనా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 29 పరుగుల వద్ద మొదటి వికెటు కోల్పోయింది. పార్థివ్‌ పటేల్‌ 13 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన విరాట్‌ కోహ్లీ 2 పరుగులు చేసి నిరాశపరిచాడు.ధావన్‌ తోడుగా బధ్రీనాత్‌ ఉన్నాడు. ఇద్దరు మంచి ఆడుతున్న సమయంలో మళ్లీ వికెట్లు పడింది. బధ్రీనాత్‌ 17 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. 15 ఓవరల్లలో భారత్‌ 61 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ శర్మ, ధావన్‌ ఇద్దరు క్రీజులో ఉన్నారు. ధావన్‌ 76 బంతులలో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ల సహాయంతో 51 పరుగులు చేశాడు. కెప్టెన్‌ సురేష్‌ రైనా 50 బంతులలో నాలుగు ఫొర్లులతో 43 పరుగులు చేశాడు.యూసుఫ్‌ పఠాన్‌ 10 పరుగులు చేశాడు. భారత్‌ 44.5 బంతులలో 217 పరుగులు చేసి లక్ష్యం సాధించింది. రోహిత్‌ శర్మ 68 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. చివరిలో వైస్‌ కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌ సిక్స్‌ కొట్టి విజయం సాధించింది. వెస్టిండీస్‌ బౌలింగ్‌లో రామ్‌పాల్‌, మార్టిన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచÊ రోహిత్‌ శర్మ ఎంపికయ్యాడు.

నమస్తే తెలంగాణ దినపత్రిక విడుదల

నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఈరోజు ఉదయం 11 గంటలకు అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. సోమవారం రవీంద్రభారతిలో జరిగిన ఆవిష్కరణ కారక్రమానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, జయశంకర్‌, కోదండరామ్‌, కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sunday, June 5, 2011

కోలుకుంటున్న డా || రాజశేఖర్‌

డా || రాజశేఖర్‌ గాయాలనుంచి నెమ్మదిగా కోలుకుంటునట్లు సమాచారం. ఆయన హీరోగా ' మహాంకాళి' చిత్రంలో చెన్నైలో ఇటీవల జరగుతుంది.ఈ సందర్భంగా ఆయన ఘూటింగ్‌ చేస్తున్న సందర్భంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ నుంచి చెన్నై అఫోలో ఆస్పత్రిలో చిక్సిత చేశారు. ఆతరువాత హైదరాబాద్‌కు తరలించారు. కూడి చేతి మడమ మీద కూడా గాయమైంది. డాక్టర్ల సలహా మేరకు 4,5 వారాల విశ్రాంతి అవసరం అన్నారు.