Friday, August 5, 2011

ఉత్తమ నటుడు బాలయ్య

 2010వ సంవత్సరం ‘నంది’ ఉత్తమ చిత్రంగా క్రిష్‌ ‘వేదం’, ఉత్తమ ద్వితీయ చలనచిత్రంగా ‘గంగపుత్రులు’ అవార్డులకి ఎంపికయ్యాయి. ‘సింహా’ చిత్రంలో ప్రదర్శించిన రాజసానికి ఉత్తమ హీరోగా బాలకృష్ణ, ‘అలామొదలైంది’లో హుషారైన నటనతో ఆకట్టుకున్న మలయాళీ భామ నిత్యామీనన్‌ ఉత్తమ కథానాయికగా ఎంపికయ్యారు. జాలరుల వెతలను హృద్యంగా ఆవిష్కరించిన పి.సునీల్‌కుమార్‌ రెడ్డి ఉత్తమ దర్శకుడిగా ‘నంది’కి ఎంపికయ్యారు. 
‘వేదం’, ‘గంగపుత్రులు’, ‘సింహా’, ‘మర్యాదరామన్న’, ‘వరుడు’ ..ఒక్కోటీ మూడేసి అవార్డుల చొప్పున తమ ఖాతాలో జమేసుకున్నాయి. హైదరాబాద్‌ ఎఫ్‌డిసిలో (చలనచిత్ర అభివృద్ధి సంస్థ) శుక్రవారంనాడు ఈ అవార్డులను నంది జ్యూరీ అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌ ప్రకటించారు. 15 మందితో కూడిన జ్యూరీ కమిటీ సభ్యులు ఈ అవార్డుల ఎంపి ప్రక్రియను పర్యవేక్షించినట్లు ఈ సందర్భంగా ఎన్‌.శంకర్‌ అన్నారు. అవార్డుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందని ఆయన అన్నారు. ఉత్తమ చిత్రానికి బంగారు నంది, 75వేల నగదు దక్కుతుంది. ఉత్తమ ద్వితీయ చిత్రానికి వెండి నంది, రూ.40వేల నగదు అందజేస్తారు. 

నందికి ఎంపికైన సినిమాల జాబితా:
ఉత్తమ చిత్రం-వేదం
ఉత్తమ ద్వితీయ చిత్రం-గంగ పుత్రులు
ఉత్తమ తృతీయ చిత్రం- ప్రస్థానం
ఉత్తమ కుటుంబ కథాచిత్రం -అందరి బంధువయ
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం -పరమ వీర చక్ర
ఉత్తమ ప్రజాదరణ చిత్రం- మర్యాద రామన్న
ఉత్తమ బాలల చిత్రం-లిటిల్‌ బుద్ధ
ఉత్తమ డాక్యుమెంటరీ-అదె్వైతం
ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ-ఫ్రీడమ్‌ పార్క్‌
ఉత్తమ దర్శకుడు -పి.సునీల్‌కుమార్‌ రెడ్డి (గంగపుత్రులు)
ఉత్తమ కథానాయకుడు-నందమూరి బాలకృష్ణ (సింహా)
ఉత్తమ కథానాయిక-నిత్యామీనన్‌ (అలా మొదలైంది)
ఉత్తమ సహాయ నటుడు -ఏవిఎస్‌ (కోతిమూక)
ఉత్తమ సహాయ నటి-ప్రగతి (ఏ మాయ చేశావె)
ఉత్తమ కేరెక్టర్‌ నటుడు- సాయికుమార్‌ (ప్రస్థానం)
ఉత్తమ హాస్యనటుడు-ధర్మవరపు సుబ్రహ్మణ్యం (ఆలస్యం అమృతం)
ఉత్తమ హాస్యనటి-ఝాన్సీ (సింహా)
ఉత్తమ ప్రతినాయకుడు-నాగినీడు (మర్యాదరామన్న)
ఉత్తమ బాలనటుడు-మాస్టర్‌ భరత్‌ (బిందాస్‌)
ఉత్తమ ఆరంగేట్ర దర్శకురాలు-నందిని రెడ్డి (అలా మొదలైంది)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత-గౌతమ్‌ మీనన్‌ (ఏ మాయ చేశావె)
ఉత్తమ నేపథ్యగాయకుడు-ఎం.ఎం.కీరవాణి (మర్యాదరామన్న)
ఉత్తమ సంగీత దర్శకుడు-చక్రి (సింహా)
ఉత్తమ గీత రచయిత- నందిని సిద్దారెడ్డి (వీర తెలంగాణ)
ఉత్తమ గాయని -ప్రణవి
ఉత్తమ కళాదర్శకుడు-అశోక్‌కుమార్‌
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌- గంగాధర్‌
ఉత్తమ కొరియోగ్రాఫర్‌- ప్రేమ్క్ష్రిత్‌
ఉత్తమ మేల్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌- ఆర్‌.సి.ఎం.రాజు
ఉత్తమ మహిళా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌- చిన్మయి
ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌-శేఖర్‌ (మనసారా)
ఉత్తమ కథా రచయిత-ఆర్‌.పి.పట్నాయక్‌ (బ్రోకర్‌)
ఉత్తమ స్ఫెషల్‌ ఎఫెక్ట్స్‌‌ట- అళగర్‌ స్వామి (వరుడు)
ఉత్తమ ఎడిటర్‌- కోటగిరి వెంకటేశ్వరరావు( డార్లింగ్‌)