Wednesday, January 26, 2011

లక్ష్మణ్‌, నారంగ్‌లకు పద్మశ్రీ అవార్డు

 హైదరాబాద్‌ సోగసరి బ్యాట్స్‌మెన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, స్టార్‌ ఘాటర్‌ గగన్‌ నారంగ్‌లకు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు లభించింది. మంగళవారం ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం విజేతలను ప్రకటించింది. లక్ష్మణ్‌, గగన్‌ నారంగ్‌లతో పాటు మరో ఏడుగురు క్రీడాకారులను పద్మశ్రీ అవార్డు లభించింది. సుశీల్‌ కుమార్‌ ( రెజ్లింగ్‌ ), కుంజరాణి దేవి ( వెయిట్‌ లిఫ్టింగ్‌), కృష్ణ పునియా ( డిస్కస్‌ త్రో ), శీతల్‌ మహాజన్‌ ( పారా జంప్‌), హర్భజన్‌ సింగ్‌ ( పర్వతారో హకుడు ) లను పద్మ పురస్కారం దక్కింది.
భారత జట్టును కష్టకాలంలో ఆదుకునే ఆపద్భాందవుడిగా పేరుపొందిన వివిఎస్‌ లక్ష్మణ్‌ పద్మశ్రీ అవార్డును లభించింది. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 120 టెస్టుల్లో 16 సెంచరీలతో 7903 పరుగులు చేశాడు. 86 వన్డేల్లో ఆరు సెంచరీలతో 2338 పరుగులు సాధించాడు.
గోల్డెన్‌ ఘాటర్‌ గగన్‌ నారంగ్‌ గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఏకంగా నాలుగు స్వర్ణాలు కొల్లగొట్టాడు. ఆసియన్‌ గేమ్స్‌లోనూ రెండు రజతాలు సాధించి సత్తా చాటుకున్నాడు. అలాగే బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్టర్‌ సుశీల్‌ 2010 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. 2009లో సుశీల్‌ ఖేల్‌రత్న దక్కింది.

No comments:

Post a Comment