Wednesday, December 3, 2014

వరల్డ్‌కప్‌కు భారత ప్రాబబుల్స్ ఎంపిక నేడే


ఇప్పటికే జాతీయ జట్టులో స్థానం కోల్పోయి రెండు సంవత్సరాలైనా... తిరిగి సాధించుకోవడంలో విఫలమవుతున్న వీరేంద్ర సెహ్వాగ్‌ వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో జరుగనన్న ప్రపంచ కప్‌ కోసం ఎంపిక చేయనున్న 30 మందితో కూడిన ప్రాబబుల్‌‌సలో తన పేరుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మరోసారి అవకాశమిసేం్త ఈ 36 ఏళ్ల క్రికెటర్‌ నాల్గోసారి దేశానికి ప్రాతినిథ్యం వహించాలనే ఆతృతతో ఉన్నాడు. ''ప్రతి క్రికెటర్‌ తన దేశం తరపున ప్రపంచ కప్‌ ఆడాలని కోరుకుంటాడు. నేను కూడా ఇప్పటికీ అదే విధంగా కలగంటున్నాను'' అన్న సెహ్వాగ్‌ అందుకే ప్రపంచ కప్‌ టోర్నీ కోసం ఎంపిక చేయనున్న 30 మంది క్రికెటర్ల ప్రాబబుల్‌‌సలో నా పేరు కూడా ఉంటుందని భావిస్తున్నాను. ఇప్పటికే (మూడుసార్లు) 2003, 2007, 2011 సంవత్సరాలలో జరిగిన ప్రపంచ కప్‌ టోర్నీలో భారత్‌ తరపున సెహ్వాగ్‌ ప్రాతినిథ్యం వహించాడు. ధోనీ నేతృత్వంలోని భారత జట్టు మరోసారి టైటిల్‌ సాధించగలదనే ధీమా వీరూ వ్యక్తం చేశాడు. 2011లో మేము టైటిల్‌ గెలుచుకున్నాము. 2015లో సైతం టైటిల్‌ నెగ్గే సత్తా భారత్‌కు ఉంది. టీమిండియా సభ్యులు ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతమైన ఆటతీరును వన్డేలో ప్రదర్శిస్తున్నారు. కాబట్టే భారత్‌కు మరో టైటిల్‌ సాధించే సత్తా ఉందని అంటున్నాను. అని అన్నాడు.
బౌన్‌‌సను నిషేదిస్తే క్రికెట్‌లో మజానే లేకుండా పోతుంది

Tuesday, December 2, 2014

లింగా సినిమా డిసెంబర్‌ 12 విడుదల


లింగా సినిమా డిసెంబర్‌ 12 విడుదలకు సిద్ధం కానున్నంది. ఈ సందర్భంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ బర్తడే కూడా అదే తేది కావడం విషేషం. నవంబర్‌ 17 లింగా ఆడియో రీజిల్‌ అయినా విషయం తెలిసిందే. చాలా సినిమా ఎక్కువగా శుక్రవారం, తేదా గురువారం నాడు విడుదల చేస్తారు. లింగా సినిమా మాత్రం డిసెంబర్‌ 12 తేది నాడు శుక్రవారం వస్తుంది ఇది కూడా రజినీకాంత్‌కు కలిసిరావడం మరో విషేషం.