Saturday, February 26, 2011

పాక్‌ జయభేరి

 పాక్‌స్థాన్‌, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 11 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ 50 ఓవర్లలో 277 పరుగుల చేసింది. పాక్‌ బ్యాట్‌మైన్‌లు మిస్బావుల్‌ హక్‌ ,యూనిస్‌ ఖాన్‌ ఇద్దరు రాణిచండంతో పాక్‌ 277 పరగులు చేసింది. కమ్రాన్‌ అక్మల్‌ 39, హఫీజ్‌ 32 పరుగులు చేశారు. కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిద్‌ 12 బంతులలో 16 పరుగులు చేశాడు. అతడు బ్యాటింగ్‌ కన్నా బౌలింగ్‌కు ఎకువ ప్రాదన్యత వహిస్తున్నారు. అంతక ముందు మ్యాచ్‌లో కూడా బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసుకఁన్నాడు. ఇప్పుడు జరిగినా మ్యాచ్‌లో నాలుగు కీలక వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన లంక ఓపెనర్లు ఇద్దరు తరంగ 33, దిల్షాన్‌ 41 పరుగులు చేశారు. వీరిద్దరు మొదటి వికెట్టుకు 71 పరుగుల భాగ్యస్వామ చేశారు. వన్‌డౌన్‌గా వచ్చిన కెప్టెన్‌ 49 పరుగుల చేసి అఫ్రీద్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. అప్పటికైనా లంక వైపు మ్యాచ్‌ ఉంది. ఒక్కసారిగా వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన తరువాత మ్యాచ్‌ పాక్‌ దిశగా నడిచింది.జయవర్థన్‌, సమరవీర ఇద్దరు తకువ స్కోరుకే అవుట్‌ అయ్యారు. అతరువాత వచ్చిన మాథ్యుస్‌, స్లిల్వా ఇద్దరు స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఇద్దరు మంచిగా అడుతున్న సమయంలో మ్యాథ్యూస్‌ను అఫ్రిద్‌ అవుట్‌ చేశాడు. చివరిలో కఁలశేఖర్‌ 14 బంతులో 24 పరుగులు చేసి పాక్‌ భయం పుట్టించాడు. చివరికి పాక్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ప్రపంచకప్‌లో నాలుగో వికెట్‌ .....

 ప్రపంచకప్‌ ప్రారంభమైయిన ఎనిమిది రోజులకే మరో వికెట్టు పడిపోయింది. అంతక ముందు మూడు వికెట్లు పడిపోయినవి ఇది నాల్గొవ వికెట్టు. ఆస్ట్రేలియా పాస్‌ బౌలర్‌ బోలింగర్‌ గాయంతో ఈ ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. ఎడమకాలి మడమకు గాయం కావడంతో మిగితా మ్యాచ్‌లకు ఆడకుండానే స్వదేశానికి పయనం కానున్నాడు. ఇండియాలో అడుగుపెట్టినప్పటి నుండే బొలింగర్‌ మడమ గాయంతో బాధపడుతున్నాడు. అనుకోకుండా ఆ గాయం రానురాను పెద్దదయ్యింది. ప్రస్తుతం ఆయన బౌలింగ్‌ చేయలేని స్థితిలో ఉన్నాడు. బొలింగర్‌ స్థానంలో మైకెల్‌ హసి ఎంపిక కావొచ్చని సమాచారం.

వీరు గాయం ....

 గురువారం ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డాడు. ప్రాక్టీస్‌ సందర్భంగా సెహ్వాగ్‌కు పక్కటెముకల్లో బంతి తగిలి వాపు వచ్చింది. వెంటేనే అతని డ్రస్సింగ్‌ రూమ్‌కు తీసుకెళ్లారు. అతడికి పెద్దగా సమస్య ఏమీ లేదని వైధ్య పరీక్షల్లో వెల్లడైయింది. అది చాలా చిన్న గాయం స్కానింగ్‌ కూడా అవసరం లేదు అని బారత జట్టు మేనేజర్‌ రంజిబ్‌ బిస్వల్‌ తెలిపారు.