Saturday, February 19, 2011

నూటికి నూరు మార్కులు ఓకే ...

వన్డేల్లో 50 ఓవర్లు పూర్తిగా ఎప్పుడూ ఆడలేదు. ప్రపంచకప్‌లో ఆదే నాలక్ష్యం అని పేర్కొనాడు. 
 ఆదివారం జరిగిన ప్రపంచకప్‌ భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన తొలి వన్డేలో సెహ్వాగ్‌ 140 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్‌లతో సహయంతో 175 పరుగుల చేశారు. ఈ పరుగులు చేయడాఁకి సెహ్వాగ్‌ ఓపెనర్‌గా వచ్చి ఆట చివరి వరకు కోనసాగిస్తు చివరిలో సెహ్వాగ్‌ 47 ఓవర్లులో మూడో బంతికి చెత్త షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అతడు ఇంకా కొద్ది సేపు క్రీజులో ఉంటే డబుల్‌ సెంచరీ చేసేవాడేమో ! ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ తన ఆట తీరులో మార్పు వచ్చింది. ప్రతి బంతిని బాదాలనే ఆత్రుత అతడిలో కనిపించలేదు. అలా అడిడంటే తకువ స్కోరు అవుట్‌ అయ్యేవాడు. ఏది ఏదేమైనా సెహ్వాగ్‌ తన వికెట్‌ విలువను గుర్తించేలా చేసింది. బత్తిడి ఎదుర్కోవడం అతడికి ఓ లెక్కే కాదు. కావాల్సిందల్లా నిలకడే అనుకు న్నట్లుగా 50 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయుండొచ్చు ఇన్నింగ్స్‌
ఆఖరి వరకు క్రీజులో ఉంటే ఏమవుతుందో చాటాడు. ప్రత్యర్థి జట్టు దఢ పుట్టించాడు. అతడి యాభై ఓవర్ల లక్ష్యం నెరవేరితే సచిన్‌ డబుల్‌ సెంచరీని దాటే అవకాశం లేకపోలేదు.

వీరేంద్రుడి విరాట్‌ విశ్వసరూపం


టైటిల్‌ ఫెవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్‌ ప్రపంచకలో అదిరిపోయే ఆరంభమిచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్‌ మెరుపులు, యువతేజం విరాట్‌ కోహ్లి పిడుగులతో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓరర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 370 పరుగులు చేసింది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా పోరాట చూపినా, భారీ లక్షాఁ్న ఛేదించే ఆట తీరు లేకపోవడంతో... నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. దీంతో భారత్‌ 87 పరుగులు తేడాతో భారీ విజయం సాధించింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో తమీమ్‌ ఇక్బాల్‌ 70, సారథి సకిబుల్‌ హసన్‌ 50 , ఇమ్రాన్‌ కాయాస్‌ 34, జునాయద్‌ సిద్ధిఖీ 37, రకీబుల్‌ హాసన్‌ 28, ముషఫికరం రహీం 25 పరుగులు చేశారు. కాగా భారత బౌలర్లలో మునాఫ్‌ పటేల్‌ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. జహీర్‌ ఖాన్‌ రెండు, హర్భజన్‌ సింగ్‌, యూసుఫ్‌ పఠాన్‌ తలో వికెటు తీసుకున్నారు.
అంతకు ముందు సెహ్వాగ్‌, కోహ్లీ ధాటికి షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో పరుగుల వరద పొంగిపొర్లింది. ప్రేక్షకులను ఆనందం పరవంలో ముంచెత్తింది. అదురు, బెదురు, ఎదురులేని రీతిలో ఆడిన సెహ్వాగ్‌ పరుగుల జడివాన కురిపించాడు. 14 ఫోర్లు, 5 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై ఏమాత్రం కనికరం చూపకుండా చితక్కొట్టాడు.అతనితో పాటు పోటాపోటీగా ఆడిన విరాట్‌ కోహ్లీ ప్రపంచకప్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో కదం తొక్కారు.

నిశ్చితార్ధం అయ్యింది

 సినీ నటి రీమాసేన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. శివ కరణ్‌ సింత్‌, రీమాసేన దగ్గరకు వెళ్లి స్వయంగా అడిగేశాడట. నన్ను పెళ్లి చేసుకుంటావా ? అని అడిగితే చిరునవ్వు నవ్వుకుంటూ.. ఓకే చెప్పడంతో వెంటనే రీమాకి ఉంగారం కూడా తొడిగేశారు. ఆ రకంగా నిశ్చితార్ధం అయిపోయింది. ఇక పెళ్లి జరగడమే ఆలస్యం. రీమాసేన్‌ నా ప్రేమను స్వీకరిస్తుందా, లేదా ? అని చాలా టెన్షన్‌ పడ్డాను. కానీ రీమ్మా ఒప్పుకోవడం ఆనందంగా ఉంది.

ప్రపంచకప్‌- 2011లో సెహ్వాగ్‌ తొలి శతకం


 మీర్పూర్‌లో ప్రారంభమైన ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న భారత డాషింగ్‌ ఓపెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 2011లో ప్రారంభమై ఈ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన క్రీడాకారుడిగా పేరు నమోదు చేసుకఁన్నాడు. కేవలం 94 బంతుల్లోనే ఒక సిక్సర్‌తోపాటు, 9 పోర్లు సహయంతో సెంచరీ సాధించాడు. సెహ్వాగ్‌ వ్యక్తిగతంగా వన్డేలలో ఇది 14వ సెంచరీ.