Tuesday, December 21, 2010

వన్డే జట్టులో మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌

 మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తిరిగి వన్డే మ్యాచ్‌ల్లో ఆడనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో సచిన్‌ టెండూలర్‌ చోటు దక్కించుకున్నాడు. వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన 16 మంది సభ్యుల్లో సచిన్‌ ఉన్నాడు. డర్బన్‌లో జనవరి 9న జరగనున్న టి20 మ్యాచ్‌లో సచిన్‌ ఆడకపోవచ్చు. తొలి వన్డే డర్బన్‌లో జనవరి 12న, రెండో వన్డే జోహన్నెస్‌బర్గ్‌లో 15న , మూడో వన్డే కేప్‌ టౌన్‌లో (జనవరి 18), పోర్ట్‌ఎలిజబెత్‌ (జనవరి 21), సెంచూరియన్‌ (జనవరి 23) జరుగుతాయి.

భారత జట్టు: మహేంద్ర సింగ్‌ ధోనీ (కెప్టెన్‌), వీరేందర్‌ సెహ్వాగ్‌, గౌతం గంభీర్‌, సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కొహ్లి, సురేష్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌; ఆశిష్‌ నెహ్రా, ప్రవీణ్‌ కుమార్‌, మునాఫ్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యూసుఫ్‌ పఠాన్‌, పియూష్‌ చావ్లా, శ్రీశాంత్‌.
 
 రెండో ర్యాంక్‌లో సచిన్‌
బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌ టెన్‌లో కుమార సంగక్కర (882) సచిన్‌ టెండూల్కర్‌(880), జాక్స్‌ కల్లిస్‌ (846), సెహ్వాగ్‌(832), డివిల్లీర్స్‌ 806, మహేలా జయవర్ధనే (781), శివనారాయణ్‌ చంద్రపాల్‌ (779), హసీం ఆమ్లా (768), జోనాథన్‌ ట్రాట్‌ (767) ఉన్నారు.