Saturday, October 29, 2011

ఐటమ్‌ సాంగ్‌కి 50 లక్షలు

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో మహేష్‌బాబు హీరోగా ' ది బిజినెస్‌ మేన్‌ ' సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్‌ హిట్‌ అయిన ' దూకుడు' తర్వాత మహేష్‌ బాబు హీరోగా మరో సినిమా కావడంతో ' ది బిజినెస్‌ మేన్‌' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా వుంటే, ' ది బిజినెస్‌ మేన్‌ ' సినిమా కోసం మాస్‌ మసాలా ఐటమ్‌ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. ఇందు కోసం ముంబై నుంచి శ్వేతా భరద్వాజ్‌ అనే సెక్సీ భామని టాలీవుడ్‌కి ఇంపోర్డ్‌ చేస్తున్నారు.
ఇక, ఈ ఐటమ్‌ సాంగ్‌ కోసం ఏకంగా శ్వేతా భరద్వాజ్‌కి యాభై లక్షలు చెల్లిస్తున్నారట. పాట పిక్చరైజేషన్‌ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పెయిన్‌లో ఘాటింగ్‌ జరుపుకుంటోన్న ' ది బిజినెస్‌ మేన్‌ ' విదేశాలనుంచి తిరిగిరాగానే, ఐటమ్‌ సాంగ్‌ చిత్రీకరణ జరగనుందట.

Friday, October 28, 2011

కాజల్‌ ఔట్‌ .. త్రిష ఇన్‌

 జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ' దమ్ము ' సినిమాలో పలువురు సినీ హీరోయిన్లు పేర్లు వినిపిస్తున్నాయి. ఏకంగా రెండు, కాదు మూడు కాదు ఏకంగా నాలుగురు లేక ఐదుగురి పేర్లు విని పిస్తున్నాయి. తొలుత హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటించాల్సి వుండగా, అనూహ్యంగా ఆ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది శృతిహాసన్‌ ప్లేస్‌లో ' జోష్‌ ' ఫేం కార్తీక పేరు వినించింది.. అయితే కార్తీక పేరు తెరమరుగైపోయి.. కొత్తగా కాజల్‌ పేరు తెరపైకొచ్చింది. ' దమ్ము'లో కాజల్‌ హీరోయిన్‌గా నటించడం దాదాపు ఖాయమైపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో .. కాజల్‌కి బదులుగా త్రిషని తీసుకున్నారని సమాచారం. ఇంతవరకు జూనియర్‌ ఎన్టీఆర్‌తో త్రిష ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

Thursday, October 27, 2011

గౌతమ్‌ గంభీర్‌కు పెళ్లి కళ ...

   భారత బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌ కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి నేడు వైవాహిక జీవితంలోకి ఆడుగుపెట్టబోతున్నాడు. ఢిల్లీకే చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె నటాషా జైన్‌తో గంభీర్‌కు గుర్గావ్‌ ఫామ్‌ హౌస్‌లో శుక్రవారం వివాహం జరగనుంది. ఈ ప్రయివేట్‌ కార్యక్రమానికి గంభీర్‌ సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ వివాహానికి ప్రముఖ సింగర్‌ రహత్‌ ఫతేష్‌ ఖాన్‌ ప్రత్యేక ఆహ్వానితునిగా విచ్చేయనున్నాడు. గౌతమ్‌, నటాషాలకు సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. ఆరు నెలల కిందే వీరి వివాహాం జరగాల్సింది. కానీ భారత్‌-ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌ నేపథ్యంలో వాయిదా పడింది.

Tuesday, October 25, 2011

భారత్‌ క్లీన్‌స్వీప్‌

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ భారత్‌ 5-0 క్లీన్‌స్వీప్‌ చేసింది. భారత్‌ను భారత గడ్డ మీద ఓడించడం అంతా సులువు కాదు. అన్ని ఇంగ్లాండ్‌కు మరో సారి స్పష్టం చేసింది. మంగళవారం జరిగిన ఐదవ, చివరి వన్డే మ్యాచ్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌పై 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ జట్టు ఒక మార్పు జరిగింది. పార్థివ్‌ పటేల్‌ స్థానంలో మనోజ్‌ తివారి జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గంభీర్‌, రెహ్మన్‌ ఓపెనర్లుగా వచ్చారు. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెటుకు 80 పరుగుల జోడించారు. గంభీర్‌ 46 బంతులల్లో నాలుగు బౌండరీల సహాయంతో 38 పరుగులు చేసి ఫిన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. రెహ్మన్‌ 61 బంతులల్లో 42 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. తివారి 24, రైనా 38, జాడేజ 21, అశ్విన్‌ 7, ప్రవీణ్‌ కుమార్‌ 16 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. కెప్టెన్‌ ధోని 75 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో పాటేల్‌ మూడు వికెట్లు తీసుకోగా, ఫిన్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లాండ్‌ 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 176 పరుగులు అలౌట్‌ అయ్యింది. ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 125 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు అర్థసెంచరీతో నాటౌటుగా ఉన్నారు. ఇంగ్లాండ్‌ విజయం దిశగా పయనిస్తున్న సమయంలో అరోన్‌ కెప్టెన్‌ కుక్‌ను బౌల్డ్‌ చేశాడు.
కుక్‌ 61 బంతులల్లో ఎనిమిది ఫోర్ల సహయంతో 60 పరుగులు చేశాడు. క్విస్టర్‌ 63, బెల్‌ 2, ట్రాట్‌ 5, బైర్‌స్టవ్‌ 2, బోపార 4, బెన్‌సన్‌ 0, పటేల్‌ 18, ఫిన్‌ 1 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. 129 పరుగుల వద్ద తొలి వికెటు కోల్పోయిన ఇంగ్లాండ్‌ మరో 49 పరుగులు జోడించి అలౌట్‌ అయ్యింది. భారత్‌ స్పినర్ల్‌ రవీంద్ర జడేజా 4/33 , రవీంద్ర అశ్విన్‌ 3/28 ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ను కుప్పకూలించారు. ఈ విజయం ద్వారా ఇంగ్లాండ్‌ వైట్‌వాష్‌ అయిన భారత్‌ సొంత గడ్డపై మళ్లీ క్లీన్‌స్వీప్‌ చేసి ప్రతీకారం తీర్చుకుంది.

Thursday, October 20, 2011

సిరీస్‌ భారత్‌ వశం : క్లీన్‌స్వీప్‌ కోసం భారత్‌ ఎదురుచూపు ...

 భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మూడోవ వన్డేలో భారత్‌ 49.2 బంతులలో 300 పరుగులు చేసి విజయం సాధించింది. ఐదు వన్డే సిరీస్‌లో భారత్‌ 3-0 తేడాతో ఉంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనరు కుక్‌ 3 పరుగులకే అవుట్‌ అయ్యాడు. వన్‌ డౌన్‌గా వచ్చిన ట్రాట్‌ 116 బంతులల్లో ఎనిమది పోర్లు సహయంతో 98 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు చివరికి రెండు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. పీటర్సన్‌ 64, పటేల్‌ 70, బోపరా 24 పరుగులు చేశారు. భారత్‌ బౌలింగ్‌లో ప్రవీణ్‌ కుమార్‌, వినరుకుమార్‌ , కోహ్లీ , జడేజా చెరో వికెటు తీసుకున్నారు. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఇంకా నాలుగు బంతులు మిగిలి వుండగానే విజయం లక్ష్యం సాధించింది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లు అందరు కలిసి కట్టుగా అడి విజయం సాధించారు. పటేల్‌ 38, రెహ్మన్‌ 91, గంభీర్‌ 58, కోహ్లీ 35, రైనా 0 పరుగులు చేశారు. ధోని 35, జడేజా 26 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలారు.

Tuesday, October 11, 2011

హీరో రామ్‌ చరణ్‌ స్పల్పగాయాలు

 రచ్చ సినిమా షూటింగ్‌లో రాంచరణ్ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని బయటపడ్డారు..................... గోవాలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కారులో వేగంగా వెళుతూ రైలును ఓవర్‌టేక్ చేసే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు యూనిట్ వర్గాలు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారు వేగంగా వెళుతూ రైలు పట్టాలకు తగులుకోవడంతో రాంచరణ్ ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ చిన్నచిన్న గాయాలతోనే రాంచరణ్ బయటపడ్డారు.

Monday, October 10, 2011

క్రికెట్‌లో కొత్త నిబంధనలు

ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు అమలులోకి రానున్నాయి. రానున్న ఇండియా, ఇంగ్లాండ్‌ సిరీస్‌ ఈ నిబంధనల ప్రకారమే నడుస్తుంది. ఈ నెల 14 నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి వన్డే ప్రారంభమవుతుంది. క్రికెట్‌కు ఒ కొత్త లుక్‌ తీసుకురావడానికి ఐసీసీ తీసుకున్న నిర్ణయాలు అమలులోకి వచ్చాయి. ఐసీసీ క్రికెట్‌ కమిటీ సూచించిన ప్రతిపాదలను ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోందించింది. దీని ప్రకారం వన్డేలతో పాటు అన్ని ఫార్మాట్‌లలోనూ కొన్ని కీలక మార్పులు రానున్నాయి. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగి మ్యాచ్‌లో అన్ని నిబందంనలు జరుగుతాయి. ఐసీసీ కొత్త నిబంధనలు ప్రకారం వన్డేల్లో ఒక్కో ఎండ్‌ నుంచి ఒక్కో బంతి వాడాలన్నది ఇందులో ముఖ్యమైనది. ఒక పవర్‌ ప్లేలలోనూ కీలక మార్పులు తెచ్చారు. గతంలోలాగే 20 పవర్‌ ప్లే ఓవర్లలో తొలి 10 ఓవర్లు తప్పనిసరి. అయితే మిగతి 2 పవర్‌ప్లేలను మాత్రం 16 నుంచి 40 ఓవర్ల మధ్య వాడాలని నిబంధన విధించారు. ఇప్పటి నుంచి ఏ ఫార్మాట్లోనైనా రన్నర్‌ను అనుమతించరు. ఇక ఫీల్డర్‌ను బ్యాట్స్‌మెన్‌ కావాలనే అడ్డుకుంటే ఔట్‌గా ప్రకటించే అవకాశం అంపైర్‌లకు వుంటుంది. మిగిత నిబంధనలు సంగతి ఎలా వున్నా వన్డేల్లో ఒక్కో ఎండ్‌ నుంచి ఒక్కో బాల్‌ వాడటం, పవర్‌ప్లేలో మార్పులు 50 ఓవర్ల ఫార్మెట్‌కు కొత్త లుక్‌ను తీసుకొస్తాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా 16 నుంచి 40 ఓవర్ల మధ్య రెండు పవర్‌ప్లేలను వాడలనే నిబంధనలతో ఇక నుంచి మధ్య ఓవర్లలో మ్యాచ్‌ బోర్‌ కొట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. భారత్‌, ఇంగ్లాండ్‌ సీరిస్‌తోనే ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానుండడంతో మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా నడుస్తాయని అభిప్రాయం.

Monday, October 3, 2011

కెమెరా ముందుకు ' రజనీ '

 అనారోగ్యంతో కొంతకాలంగా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మళ్లీ ముఖానికి రంగు వేసుకోనున్నారు. బాలీవుడ్‌ హీరో షారూఖ్‌ఖాన్‌ చిత్రం రాావన్‌లో రోబో పాత్రను పోషిస్తున్నారు. గతంలో తన చిత్రం రోబోలో ఆయన చిట్టిగా నటించిన విషయం తెలిసిందే. రజనీ ఆరోగ్యం కుదుట పడడంతో షూటింగ్‌లో పాల్గోనేందుకు ఓకే చెప్పారు. ఆయన నటించాల్సిన సన్నివేశాలను డూప్‌తో షూట్‌ చేసి రజనీకి పంపించారు.