Wednesday, July 9, 2014

విజయ్ అజేయ సెంచరీ


  నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటనను భారత జట్టు ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టింది. ఓపెనర్ మురళీ విజయ్ (122 బ్యాటింగ్; 294 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్‌తో తొలిటెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. విజయ్‌కు జతగా కెప్టెన్ ధోనీ (50 బ్యాటింగ్; 64 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. ఇద్దరూ అభేద్యమైన ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అంతకుముందు విజయ్‌కి పుజార (38), రహానే (32)లు చక్కగా సహకరించారు. 33 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయిన దశలో పుజార, రహానేలతో విజయ్ 73, 71 పరుగులు జోడించి ఇన్నింగ్‌ను గాడిలోపెట్టాడు. ధవన్ (12), కోహ్లీ (1)లు మాత్రం నిరాశపరిచారు. ఇంగ్లండ్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించేక్రమంలో భారత్‌కు రెండోరోజు ఆటలో తొలి సెషన్ కీలకం. చేతిలో 6 వికెట్లు మిగిలివున్న దశలో 375-425 వరకు సాధిస్తే, తర్వాత బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపినవారవుతారు. అండర్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కోసం రోహిత్‌ను పక్కనబెట్టారు.

స్కోరుబోర్డు  భారత్: విజయ్ (బ్యాటింగ్) 122, ధవన్ (సి) ప్రయర్ (బి) అండర్సన్ 12, పుజార (సి) బెల్ (బి) అండర్సన్ 38, కోహ్లీ (సి) బెల్ (బి) బ్రాడ్ 1, రహానే (సి) కుక్ (బి) ప్లంకెట్ 32, ధోనీ (నాటౌట్) 50, ఎక్స్‌ట్రాలు: 4,

మొత్తం: 90 ఓవర్లలో 259/4;
వికెట్ల పతనం: 1-33, 2-106, 3-107, 4-178;
బౌలింగ్: అండర్సన్ 21-6-70-2, బ్రాడ్ 19-8-26-1, స్టోక్స్ 19-4-47-0, ప్లంకెట్ 21-4-56-1, అలీ 9-0-50-0, రూట్ 1-0-6-0.