Monday, December 27, 2010

భారత్‌ 92/4

<b>ప్రస్తుత ఆధిక్యం 166 పరుగులు </b>
  భారత్‌ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ 32, మురళీవిజరు 9, ద్రావిడ్‌ 2, సచిన్‌ 6 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. లక్ష్మణ్‌ 23, పుజారా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ 166 పరుగుల ఆధిక్యంతో ఉంది. స్టెయిన్‌, మార్కెల్‌ చెరో వికెట్‌ తీసుకోగా, సొత్సెబె రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతక ముందు రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 205 పరుగులకు అలౌట్‌ అయ్యాది. 

దక్షిణాఫ్రికా 131 అలౌట్‌
దక్షిణాఫ్రికా 131 పరుగులకే అవుట్‌ అయ్యింది. దక్షిణాఫ్రికా బ్యాట్‌మెన్స్‌లో ఏఒకరు రాణించలేకపోయారు. పీటర్సన్‌ 24, స్మిత్‌ 9, ఆమ్లా 33, కల్లిస్‌ 10, డివిల్లీర్‌ 0, ప్రిన్స్‌ 13, బౌచర్‌ 16, స్టెయిన్‌ 1, హరిస్‌ 0, మోర్కెల్‌ 10, సొత్సెబె 0 పరుగులు చేశారు. ఆమ్లా 33 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. భారత్‌ బౌలింగ్‌లో హర్భజన్‌ సింగ్‌ 4, జహీర్‌ ఖాన్‌ 3, శ్రీశాంత్‌, శర్మ చెరో వికెటు తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల అదిక్యత సాధించింది. రెండో రోజు వికెట్లు పతనం మొదలైయింది. ఒక్కే రోజు రెండు జట్ల మధ్య 18 వికెట్లు పడ్డాయి. లక్ష్మణ్‌ 23, పుజారా 10 పరుగులతో ఆడుతున్నారు. భారత్‌ కనీసం 300- 350 పరుగులు చేస్తే విజయ అవకాశాలు ఉంటాయి.