Wednesday, November 30, 2011

నేడు సినీ హీరో రామ్‌చరణ్‌ నిశ్చితార్థం


నేడు ప్రముఖ సినీ హీరో, ఎమ్మెల్యే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తేజ, అపోలో గ్రూప్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి మనుమరాలు ఉపాసనల నిశ్చితార్థం జరుగనుంది. ఈ నిశ్చితార్థనికి మొయినాబాద్‌ మండలం అజీజ్‌ నగర్‌లోని అపోలో ఫాంహౌస్‌లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఫాంహౌస్‌ను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ముందు ప్రతాప్‌రెడ్డి సొంత జిల్లా అయిన నిజామా బాద్‌లోని తన సొంత కోటలో నిశ్చితార్థం నిర్వహించాల నుకున్నారు. అనంతరం హైదరాబాద్‌ నగరా నికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండే విధంగా నిశ్చితార్థ వేదికను ఈ ఫాంహౌస్‌కి మార్చారు. 20 రోజులుగా నిశ్చితార్థ ఏర్పాట్లు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో నిశ్చితార్థం ప్రాంగణాన్ని తయారు చేశారు. వేదికను భారీ సెట్టింగులతో ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది వరకు రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు రాష్ట్ర నలుమూలల నుంచి రావడంతో పాటు దేశ రాజధాని నుంచి వివిఐపిలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు.
హాజరుకానున్న ప్రముఖులు
చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌తేజ నిశ్చితార్థానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్‌ అధికారులు సైతం హాజరవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ నగరానికి చేరువలో అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి కిలోమీటర్‌ దూరంలో నిశ్చితార్థ వేదిక ఏర్పాట్లు చేశారు. వివిఐపిలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. వివిఐపిల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నగరానికి దగ్గరలో ఏర్పాట్లు చేశారు. దేశ రాజధాని నుంచి కొందరు ప్రముఖులు రావడంతో విమానాశ్రయానికి చేరువలో ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. నిశ్చితార్థం ప్రాంగణంలోనికి వివిఐపిలకు ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. విలేకర్లను మాత్రం లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు.

Tuesday, November 29, 2011

తొలివన్డేలో భారత్‌ గెలుపు

వెస్టిండీస్‌-భారత్‌ జట్ల మధ్య బారబతి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా జయభేరి మోగించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ పోటీ చూసేందుకు తొలినుంచి ప్రేక్షకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. టాస్‌నెగ్గిన ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌ వెస్టిండీస్‌ను నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు పడగొట్టి 211 పరుగలకే కట్టడి చేసింది. ఆ తరువాత 212 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఒకదశలో 60 పరుగలకే 5 వికెట్లు కోల్పోయి చతికిలపడింది. ఆ దశలో రోహిత్‌శర్మ, జడేజాలు నిలదొక్కుకుని భారత్‌ స్కోరును నెమ్మదిగా పెంచారు. చివర్లో వికెట్లు వడివడిగా పడినప్పటికీ భారత్‌ 9 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి ఒక వికెట్టు వియాన్ని సాధించింది. రోహిత్‌ 72 పరుగులు చేసి వన్డేల్లో 9వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.

Monday, November 28, 2011

బాలీవుడ్‌లోకి అల్లరి నరేష్‌

అల్లరి వేషాలతో తెలుగులో టాప్‌ కామెడీ హీరోగా మారిన అల్లరి నరేష్‌ త్వరలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై నరేష్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో హిందీలో రీమేక్‌ కాబోతోంది. అందులో నన్ను నటించమని అడిగారు, కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నరేష్‌ చెప్పుకొచ్చారు.

Friday, November 25, 2011

వెస్టిండీస్‌తో మూడు వన్డేలకు భారత జట్టు ఎంపిక , కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌

వెస్టిండీస్‌తో తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు.. కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ని ఎంపిక చేశారు. గంభీర్‌, కోహ్లీ, పార్థివ్‌ పటేల్‌, రహానే, మనోజ్‌తివారీ, రైనా, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్‌, వరుణ్‌ ఆరోన్‌, ఉమేష్‌ యాదవ్‌, రాహుల్‌ శర్మ, ప్రవీణ్‌కుమార్‌, వినయ్‌కుమార్‌కు టీమ్‌లో స్థానం కల్పించారు. ధోనీ, సచిన్‌, యువరాజ్‌ సింగ్‌లకు విశ్రాంతి కల్పించారు. హర్భజన్‌కు చోటు దక్కలేదు.

Sunday, November 13, 2011

ఇంటివాడయిన క్రికెటర్‌ అశ్విన్‌

 భారత స్పిన్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం ఇక్కడి రాఘవేంద్ర కల్యాణమండపంలో తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతి నారాయణన్‌ను సంప్రదాయబద్ధంగా అశ్విన్‌ వివాహం చేసుకున్నాడు. గత వారం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో అశ్విన్‌ 9వికెట్ల తీసిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట కోల్‌కతా వెళ్లే అవకాశం ఉంది. కోల్‌కతాలో సోమవారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో అశ్విన్‌ అడాల్సి ఉన్న విషయం విదితమే.

Saturday, November 12, 2011

ఘనంగా 'దూకుడు' అర్థ శతదినోత్సవం

 ప్రముఖ నటుడు మహేష్‌బాబు, నటి సమంత నటించిన 'దూకుడు' అర్థ శతదినోత్సవం శనివారం విజయవాడలో ఘనంగా జరిగింది. వేలాదిగా తరలొచ్చిన అభిమానులతో విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాల మైదానం హోరెత్తింది. రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ వేడుకలకు నటుడు మహేష్‌బాబు ముందుగా గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గం ద్వారా వచ్చారు. మహేష్‌బాబు, ఇతర సినీనటులను చూసేందుకు వచ్చిన వారితో బందరురోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఒకానొక సమయంలో కళాశాల గేటువద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు తీవ్ర అవస్థలు పడ్డారు. హీరో మహేష్‌బాబును అభిమానులు గజమాలతో సత్కరించారు. అనంతరం ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్‌బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, సుంకర అనీల్‌ నటీనటులు, సాంకేతికవర్గాన్ని అభినందించారు. సినీరంగంలో ఉన్న సగం మంది కానూరు కళాశాలకు రావడంతో అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ చిన్నతనంలోనే సినిమారంగంలో 'దూకుడు' ప్రదర్శించిన మహేష్‌బాబు పెద్దయిన తరువాత కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారని అన్నారు. 75 ఏళ్ల సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన 'పోకిరి' అతని కీర్తిలో కలికితురాయని అన్నారు. దాని రికార్డులకు చేరువగా 'దూకుడు' వెళుతుందని అన్నారు. నటి సమంత మాట్లాడుతూ 'దూకుడు' సినిమా తనకు జీవితంలో గుర్తుండిపోయే విజయాన్ని అందించిందన్నారు.

పెళ్లి పీటలెక్కనున్న మమత


Friday, November 11, 2011

పెళ్లికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన స్నేహ

సినీ నటి స్నేహ పెళ్ళి తెరను అడ్డు తొలగించింది. సుమారు 3, 4 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్న స్నేహితుడు మరియు కోలివుడ్‌ నటుడు. ప్రసన్నను వివాహమాడనుంది. 2012 మార్చిలో పెళ్ళి చేసుకుంటున్నట్లు స్నేహ అధికారికంగా ప్రకటించింది. స్నేహ ప్రస్తుతం హీరో నాగార్జున చిత్రం ' రాజన్న' సినిమాలో నటిస్తుంది. ఇక ఎంగేజ్‌మెంట్‌ను అంగరంగ వైభవంగా చేసేందుకు త్వరలో తేదిని ప్రకటిస్తామన్నారు.

Thursday, November 10, 2011

11-11-11 నేడు అరుదైన తేదీ

నవంబర్ 10: అన్ని ఒకేరకమైన అంకెలతో, ఎటు నుంచి చూసినా ఒకేలాగ కనిపించే అరుదైన తేదీ 11-11-11.. నేడు అంటే శుక్రవారం ఈ తేదీకి వేదిక కానుంది. వందేళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి తేదీ దర్శనమిస్తుంది. అందులోనూ 11-11-11 తేదీన 11గంటల, 11నిమిషాల. 11 సెకన్లు సమయం మరీ ప్రత్యేకం. అరుదైన అంకెల గారడీ చుట్టూ ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు ముసురుకున్నాయి. ఈ ప్రత్యేక తేదీన ఔత్సాహికులు విహహాలు, వేడుకలు జరుపుతుండగా, హిందూ సంప్రదాయం ప్రకారం ఈ సంఖ్య అంతగా అచ్చిరాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 11-11-11 తరహాలో తదుపరి అంకెలు (22-22-22) కాల్యెండర్‌లో లేకపోవడమే ఇందుకు కారణమని కొన్ని వెబ్‌సైట్లు ప్రవచిస్తున్నాయి. గతం ఈ తేదీ వచ్చినప్పుడు, అంటే 1911, నవంబర్ 11న పర్యావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి