Thursday, July 21, 2011

ఇంగ్లాండ్‌ 127/2

  భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ 19 పరుగులకే మొదటి వికెట్‌ కోల్పోయింది. స్ట్రాస్స్‌ 22, కుక్‌ 12 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. ట్రాట్‌ 58, పీటర్స్‌న్‌ 22 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలారు. వర్షం కారణంగా ఇంగ్లాండ్‌ మొదటి రోజు ఆట 49.2 ఓవర్ల మాత్రమే ఆడింది. భారత్‌ బౌలింగ్‌లో జహీర్‌ ఖాన్‌ రెండు వికెట్‌ తీసుకున్నాడు.

ప్రణీతకు మరో ఛాన్స్


praneetha-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaసిద్ధార్థ్ కథానాయకుడిగా రూపొందిన ‘బావ’ చిత్రం ద్వారా కన్నడ భామ ప్రణీత తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంతో తెలుగులో ఓ వెలుగు వెలగాలనుకున్న ఈ భామకు ‘బావ’ చేదు అనుభవాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. దీంతో తన దృష్టిని తమిళ చిత్రాల వైపు మళ్ళించిన ప్రణీత ప్రస్తుతం తమిళ్‌లో ‘యుగానికి ఒక్కడు’,‘ఆవారా’ చిత్రాల హీరో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ‘ షగుణి’ లో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంటే ప్రణీతకు దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ రూపంలో మరో లక్కీఛాన్స్ లభించిందని కోలీవుడ్ సమాచారం. క్రేజీ హీరో విజయ్ కథానాయకుడిగా ఎ.ఆర్.మురుగదాస్ తమిళ్‌లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే విజయ్‌కి జోడీగా ప్రణీతని ఎంపిక చేశారని తెలుస్తోంది. ‘బావ’ చిత్రంతో తెలుగులో మంచి బ్రేక్ వస్తుందని ఆశపడి భంగపడ్డ ప్రణీతకు తమిళ్‌లో వరుసగా భారీ చిత్రాల్లో క్రేజీ స్టార్స్‌తో నటించే అవకాశం వస్తుండటంతో ఇక ఆమె స్టార్ తిరిగిన తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.

ప్రభాస్ ‌'రెబెల్ ' లో తండ్రీ కొడుకులుగా...

ప్రభాస్, రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం... ‌'రెబెల్ ' ... ఈ చిత్రంలో కృష్ణరాజు, ప్రభాస్ తండ్రి కొడుకులగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని కృష్ణంరాజు కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఆయన మాటల్లోనే... ‌'రెబెల్ ' ...చిత్రంలో నేను నటిస్తున్న మాట నిజం. ప్రభాస్‌ తండ్రిగా కనిపించబోతున్నాను. దర్శకుడు లారెన్స్‌ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు అన్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం గురించి ప్రభాస్‌ మాట్లాడుతూప్రస్తుతం ' రెబల్‌ ' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాల కోసం ఆగస్టులో విదేశాలకు వెళతాం అన్నారు. ఇక లారెన్స్‌ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ఇది.గతంలో లారెన్స్..నాగార్జున తో మాస్ వంటి హిట్ ఇచ్చారు. అలాగే ఆ తర్వాత స్టైల్ అనే చిత్రం చేసారు. నాగార్జునతో చేసిన డాన్ చిత్రం ఫెయిల్యూర్ అవటంతో ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు. తమిళంతో ముని చిత్రంలో హిట్టు కొట్టి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు. ఇక లారెన్స్ డైరక్ట్ చేస్తూ నటించిన' కాంచనఃరీసెంట్ గా రిలీజై యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది.