Monday, September 21, 2015

దాల్మియాకు వీడ్కోలు


  భారత క్రికెట్‌ యోధుడు జగ్‌మోహన్‌ దాల్మియా అంత్యక్రియలు అభిమనులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. దాల్మియా భార్య చంద్రలేఖ, కూతురు వైశాలి, చివరిసారి కన్నీటి వీడ్కోలు పలికారు. కుమారుడు అభిషేక్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు బిసిసిఐ ప్రముఖులు అనురాగ్‌ ఠాకుర్‌, రవిశాస్త్రి, సునీల్‌ గవాస్కర్‌, సిఎఒ రత్నాకర్‌ శెట్టి, సౌరవ్‌ గంగూలీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాలు పలువురు పాల్గొన్నారు.

 

దాల్మియా అంతిమయాత్ర ఆయన నివాసం నుంచి మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ప్రారంభమైంది. 12.50 నిమిషాలకు ఆయన భాతిక కాయాన్ని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) ఆఫీసుకు తీసుకువచ్చారు. అక్కడ ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల చివరి చూపు కోసం రెండు గంటలపాటు ఉంచారు. క్యాబ్‌ ఆఫీసులో మీడియా దిగ్గజం సభాష్‌ చంద్ర సంతాపం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ 'దాల్మియా భారత క్రికెట్‌నే కాదు ప్రపంచ క్రికెట్‌ను సైతం పాపులర్‌ చేశాడు. దాల్మియా గైర్హాజరీలో ప్రపంచ క్రికెట్‌ కూడా కష్టాలు పడింది. ఆయన వల్ల ధన ప్రవాహం భారత క్రికెట్లోకి మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లోకి కూడా పారింది.

దాల్మియా నేత్రదానం

   సమాజసేవకు పాటుపడాలని క్రికెటర్లకు నిత్యం ఉద్భోదించే దాల్మియా ఈ విషయంలోనూ తానే ముందని నిరూపించుకున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అంధత్వం నిర్మూలన అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన దాల్మియా.. ఇప్పుడూ తానూ నేత్ర దానం చేసి ఆదర్శప్రాయుడయ్యారు. కోల్‌కతాలోని సుస్రుత్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వన్ముక్తా ఐ బ్యాంక్‌కు దాల్మియా తన కళ్లు దానం చేశారు. స్పాట్ ఫిక్సింగ్‌తో మసకబారిన బీసీసీఐ ప్రతిష్ఠను పెంచే బాధ్యతలను అధ్యక్షుడిగా తన భుజానికెత్తుకున్న దాల్మియా.. ఐపీఎల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని, అంధత్వం నిర్మూలన అనే కార్యక్రమం తరహాలో అలాంటి కార్యక్రమం ఇక్కడా చేపట్టాలని లీగ్‌లో దాల్మియా పిలుపునిచ్చిన సంగతి విదితమే.

Bruce Lee - new poster-ram charan,rakul prithi sing

Bruce Lee - new poster-ram charan,rakul prithi sing