
రాబోయే రోజుల్లో కామెడీ సినిమాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నాను. హాస్యరస పాత్రల్లో నటించి మెప్పించడం అంత సులువు కాదు..ఎవరికైనా అది పెద్ద ఛాలెంజ్ లాంటిది. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నా సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా వున్నాను’ అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించే చిత్రంలో ఈ సుందరిని కథానాయికగా ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత పూరి-పవన్ కలయికలో వస్తోన్న ఈ చిత్రం మేలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలుత ఈ చిత్రానికి బాలీవుడ్ భామను కథానాయికగా అనుకున్నా ‘బిజినెస్‌మేన్’ సక్సెస్‌తో పూరి చేత లక్కీగాళ్ అనిపించుకున్న ఈ భామనే హీరోయిన్‌గా ఓకే చేయనున్నట్లు సమాచారం.