Monday, October 31, 2016

అనుష్కకు కల్యాణ ఘడియలు?

 మూడు పదుల వయసు పైబడిన నటీమణులకు ఇంటా బయట పెళ్లి ఒత్తిడి పెరగడం సర్వసాధారణం. 34 ఏళ్ల నటి అనుష్కకు అలాంటి తాకిడి ఉంటుందనడం అనూహ్యమేమీ కాదు. ఉన్నత విద్యను పూర్తి చేసిన అనుష్క ఆదిలో యోగా శిక్షణ పొంది, తర్వాత యోగా టీచర్‌గా పలువురికి శిక్షణ ఇచ్చారు. అలాంటి బ్యూటీని విధి నటిని చేసింది. అనుష్క 2005లో వెండితెరకు పరిచయం అయ్యారు.

అలా తొలి రోజుల్లో అందాలారబోస్తూ అవకాశాలు పెంచుకుంటూ వచ్చిన అనుష్కకు అరుంధతి చిత్రం ఆమె నట దిశను ఒక్కసారిగా మార్చేసింది. స్టార్ నాయకిగా తమిళం, తెలుగు భాషల్లో అగ్రనాయకిగా రాణిస్తున్నారు. ఈ రెండు భాషల్లో అగ్రనాయకులందరితోనూ డ్యూయెట్లు పాడేసి ఆ సరదాను తీర్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ఎస్-3 చిత్రంలో సూర్యతోనూ, ద్విభాషా చిత్రం బాహుబలి-2, హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం భాగమతి, భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో నటిస్తున్నారు.

వీటిలో ఎస్-3 చిత్రం డిసెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. బాహుబలి-2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇలా ఉండగా అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం జోరందుకుంది. కారణం ఈ అమ్మడి కి కల్యాణ ఘడియలు దూసుకొస్తున్నాయని సమాచారం. నటిగా ప్రశంసలు అందుకుంటున్న అనుష్క వ్యక్తిగతంగా పలు వదంతులను ఎదుర్కొంటున్నారన్నది గమనార్హం.

నటుడు ఆర్యతో ప్రేమకలాపాలంటూ అప్పట్లో గాసిప్స్ హల్‌చల్ చేశాయి. ఇక ఒక తెలుగు నటుడితో డేటింగ్ అంటూ ప్రచారం హోరెత్తింది. ఇటీవల వివాహితుడైన నిర్మాతను పెళ్లాడబోతున్నట్టు ప్రచారం కలకలం పుట్టించింది. కాగా వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టే విధంగా అనుష్క కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడంలో వేగం పెంచినట్లు తాజా సమాచారం. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లిని నిశ్చయించినట్లు సినీ వర్గాల టాక్. బాహుబలి-2 విడుదల తరువాత అనుష్కకు డుండుండుం...పీపీపీనేననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
 

Saturday, October 29, 2016

రివ్యూ: ధర్మయోగి


 కథేంటంటే?: ధర్మ, యోగి (ధనుష్‌) కవల పిల్లలు. ధర్మకి బుద్ధిబలం ఎక్కువ. యోగి మొండివాడు. చిన్నప్పట్నుంచే తండ్రితో తిరుగుతూ రాజకీయాలపై మమకారం పెంచుకొంటాడు యోగి. ధర్మ మాత్రం బాగా చదువుకొని కళాశాలలో అధ్యాపకుడు అవుతాడు. బాపట్ల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడంతో వూహించని రీతిలో ప్రజాస్వామ్య పార్టీ తరపున యోగికి ఎమ్మెల్యే టిక్కెట్‌ లభిస్తుంది. అధికారంలో ఉన్న ప్రగతిశీల పార్టీ తరపున యోగి ప్రియురాలు అయిన అగ్నిపూల రుద్ర (త్రిష)కి టికెట్టు వస్తుంది. ప్రేయసి, ప్రియుడు ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇంతలో యోగి హత్యకి గురవుతాడు. ఆ హత్య చేసిందెవరు? యోగి హత్య తర్వాత రుద్ర ఎన్నికల బరి నుంచి తప్పుకొని ఏం చేసింది? యోగి హత్యకి కారకులైన వాళ్లకి ఎవరు శిక్ష విధించారు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. ఒక పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇదే కథలో ఫ్యామిలీ డ్రామా కూడా మిళితమైంది. అధికారం కోసం రాజకీయ నాయకులు వేసే ఎత్తులు, పైఎత్తులు ఇదివరకు చాలా సినిమాల్లోనే చూశాం. ఇది కూడా ఆ బాపతు కథే. కాకపోతే ఓ యువజంట నేపథ్యంలో ఆ కథని తీర్చిదిద్దడమే ఇందులో కొత్తదనం. బలహీనుడైన ఓ తమ్ముడు అన్న చనిపోయాక మొండివాడిగా ఎలా మారాడు? అన్న ఆశయాన్ని ఎలా నెర వేర్చాడనే అంశం కూడా ఇందులో కొత్తగా అనిపిస్తుంది. తొలి సగభాగం కథంతా కూడా ధర్మ, అతడిని ఇష్టపడే అమ్మాయి మాలతి (అనుపమ)ల పరిచయం, ప్రేమ.... అలాగే యోగి, ఆయన ప్రియురాలైన అగ్నిపూల రుద్రల ప్రేమాయణం, రాజకీయ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాల చుట్టూనే సాగుతుంది. మధ్యమధ్యలో పార్టీ ఆఫీసులు, రాజకీయ పరిణామాలతో సన్నివేశాలన్నీ సున్నితంగానే సాగిపోతాయి. విరామానికి ముందు నుంచే కథలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకొంటాయి. అప్పటికప్పుడు యోగిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ప్రకటించడం, అదే సమయంలో అవతలి పార్టీ నుంచి కూడా అగ్నిపూల రుద్ర కూడా బరిలోకి దిగుతుండటంతో కథ రక్తి కడుతుంది. ప్రేమలో ఉన్న ఓ జంట పోటీ పడుతుండటంతో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనే ఆసక్తి ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగానే దర్శకుడు ద్వితీయార్ధంలో బోలెడంత డ్రామా ఉండేలా చూసుకొన్నాడు.
అయితే ఆ డ్రామా కొన్నిసార్లు ప్రేక్షకులని గందరగోళంలోకి నెట్టేసే స్థాయికి వెళ్లింది. ఒక పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉండటం, అసలు ఎవరు ఏ పార్టీకి చెందినవారో, ఎవరు ఎవరెవర్ని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తుంటారో అర్థం కాదు. కానీ ఈ రకమైన కథని ఓ ప్రేమజంట నేపథ్యంలో తెరకెక్కించడం మాత్రం ప్రేక్షకులకి కొత్తదనాన్ని పంచుతుంది. ముఖ్యంగా రుద్ర వేసే ఎత్తులు, ఆమె ఎంపీగా ఎన్నికయ్యే విధానం మంచి డ్రామాని పండిస్తాయి. పతాక సన్నివేశాల్లో మాత్రం కొత్తదనం లోపించింది.
చివరిగా: రక్తికట్టించే రాజకీయం నేపథ్యంలో... ‘ధర్మయోగి’ 

Friday, October 28, 2016

హిందీ-2,తెలుగు-1

హింది రెండు తెలుగు ఒకటి అంటె ఏదో అనుకున్నారు. అచర్య పోవలసిన్న అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు హింది సినిమాలు రెండు సినిమాలు రిలిజ్‌ అయ్యాయి. తెలుగులో ఇక సినిమా విడుదల అయ్యింది.

( హింది )

రివ్యూ: యే దిల్‌ హై ముష్కిల్‌

కథేంటి?: అయాన్‌(రణ్‌బీర్‌ కపూర్‌) బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన యువకుడు. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. ఇతరులు చెప్పినట్లుగానే ఫాలో అవుతుంటాడు. అలిజె(అనుష్క శర్మ) అతనితో స్నేహంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి పిక్నిక్‌లకు, పబ్‌లకూ వెళ్తారు. ఆ సాన్నిహిత్యాన్నే ప్రేమగా ఫీలవుతాడు అయాన్‌. కానీ.. అలిజె‌ అప్పటికే మరో వ్యక్తితో లవ్‌లో ఉంటుంది. అతనే అలీ(ఫవాద్‌ ఖాన్‌). వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్తుంది. దీంతో అయాన్‌ తీవ్ర వేదనకు గురవుతాడు. ఆ సమయంలోనే అందాల రాశి సబా(ఐశ్వర్య రాయ్‌)తో ఇన్నింగ్స్‌ మొదలవుతుంది. ఆ తర్వాత ఏమైంది? సబాతో అయాన్‌ పరిచయం ఎంతవరకు వెళ్లింది? అనుష్కతో స్నేహానికి పూర్తిగా కటీఫ్‌ చెప్పేశాడా? వంటి విషయాలను తెరపై చూడాల్సిందే.
 ఎలా ఉందంటే..: ప్రేమే ప్రపంచం అనుకునే అయాన్‌(రణ్‌బీర్‌ కపూర్‌).. అన్ని విషయాల్లోనూ తెలివిగా వ్యవహరించే అలిజె‌(అనుష్క) మధ్య స్నేహం అందరినీ ఆకట్టుకుంది. అతని వ్యక్తిత్వాన్ని మార్చడంలోనూ ఆమె పాత్ర ఉంటుంది. అనుష్క ప్రేమికుడు అలి(ఫవాద్‌ ఖాన్‌) అని తెలుస్తుంది. కానీ.. వారి ప్రేమ కథ గురించి మాత్రం తెరపై చూపించలేదు. ఇక ఐశ్వర్యరాయ్‌ అందాలకు కొదవలేదు. సెకండాఫ్‌ ఆరంభంలోనే హాట్‌ లుక్స్‌తో.. దొండపండు లాంటి పెదాలతో కుర్రకారు మతిపోగొట్టడం ఖాయం. ట్రైలర్లు చూసి రణ్‌బీర్‌ కపూర్‌తో ఐష్‌ హాట్‌ సన్నివేశాలు భారీగానే ఉన్నట్లు భావించారు. కానీ సెన్సార్‌ కత్తిరింపులో ఏమో.. సినిమాలో ఒకటి, రెండుకు మించి హాట్‌ సన్నివేశాలేమీ కనిపించవు. ఇది ఐష్‌ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమని చెప్పాలి. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం బాగుంది. సంగీతం విషయంలోనూ మంచి మార్కులే పడతాయి.

ఎవరెలా..?: సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా రణ్‌బీర్‌ కపూర్‌ నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలోని నటీనటుల్లో ఎక్కువ మార్కులు రణ్‌బీర్‌కే పడతాయి. అందాల రాశి ఐశ్వర్యరాయ్‌లో గ్లామర్‌ డోస్‌ ఏమాత్రం తగ్గలేదు. కొన్ని సన్నివేశాల్లో అనుష్క శర్మలో గ్లామర్‌ మిస్సయినట్లు అనిపిస్తుంది. ఐశ్వర్య కంటే అనుష్కనే తెరపై ఎక్కువసేపు కనిపిస్తుంది. ఫవాద్‌ఖాన్‌ తన పరిధి మేరకు నటించాడు. షారుక్‌ఖాన్‌.. ఆలియా భట్‌లు గెస్ట్‌ రోల్‌లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. కొన్ని సన్నివేశాలను సాగదీసినట్లు అనిపిస్తుంది. 

చివరిగా.. విడుదలకు ముందు ‘ముష్కిల్‌ హై’..  తెర‌పై ప్రేమికులకు ‘దిల్‌ కుష్‌ హై’
రివ్యూ: శివాయ్‌
కథేంటి?: శివాయ్‌(అజయ్‌ దేవగణ్‌) భోళా మనిషి. ఎంత శక్తివంతుడైనా ఎవ్వరి జోలికి వెళ్లేరకం కాదు. సాహసాలతోనే తన సావాసం. పర్వాతారోహణను ఇష్టపడే శివాయ్‌ హిమాలయ పర్వతాలను అధిరోహించే పనిలో ఉంటాడు. ఓసారి బల్గేరియా నుంచి వచ్చిన యువతి ఓల్గా(ఎరికా కార్‌) పర్వతారోహణ సమయంలో ప్రమాదంలో పడితే రక్షిస్తాడు. ఈ క్రమంలో ఒకరినొకరు ఇష్టపడతారు. శారీరకంగానూ దగ్గరవుతారు. దీంతో ఓల్గా గర్భం దాల్చుతుంది. కానీ ఇదంతా ఇష్టం లేని ఓల్గా ఓ పాపకు జన్మనిచ్చి బల్గేరియా వెళ్లిపోతుంది. అప్పట్నుంచి కూతురే ప్రాణంగా జీవిస్తుంటాడు శివాయ్‌.

అలా తొమ్మిదేళ్లు గడిచిపోతాయి. ఓ రోజు కూతురు(అబిగేల్‌ ఏమ్స్‌) కోరిక మీద ఓల్గాను వెతికేందుకు ఇద్దరు కలిసి బల్గేరియా వెళ్తారు. అక్కడ కొంతమంది ఆ పాపను కిడ్నాప్‌ చేస్తారు. ఇంతకీ పాపను కిడ్నాప్‌ చేసింది ఎవరు? ఆ దుర్మార్గుల నుంచి శివాయ్‌ కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ తండ్రీకూతుళ్లు ఓల్గాను కలిశారా? ఇంతకీ శివాయ్‌కి.. సాయేషా సైగల్‌కి ఉన్న సంబంధమేంటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
ఎలా ఉందంటే..: కథపై నమ్మకంతో అజయ్‌ దేవగణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగానూ మారారు. అందుకే సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా నిడివి ఎక్కువైనప్పటికీ ఎక్కడా బోర్‌ కొట్టకుండా స్క్రీన్‌ప్లేతో కట్టిపడేశారు. కాకపోతే స్క్రిప్టుకి ఇంకాస్త పదును పెట్టాల్సింది. ఛాయాగ్రహణం సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. మంచు పర్వతాల నేపథ్యంలో జరిగే పోరాట ఘట్టాలు.. బల్గేరియా.. పోలాండ్‌.. ఉత్తరాఖండ్‌ల్లోని ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించారు. గ్రాఫిక్స్‌ కూడా బాగున్నాయి. యాక్షన్‌ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. మోతాదు కొంచెం ఎక్కువైంది.
కథపరంగా సినిమా మొత్తం అజయ్‌ దేవగణ్‌ చుట్టూనే తిరుగుతుంది. ఇందులో అజయ్‌ సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన శైలిలో అలరించారు. పోలాండ్‌కి చెందిన నటి ఎరికా కార్‌ కూడా పర్లేదు గానీ.. ఆమె సంభాషణలు చెప్పే విధానం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సాయేషా సైగల్‌ పాత్ర చాలా చిన్నది. అయినప్పటికీ పరిధి మేరకు ఆకట్టుకుంది. అజయ్‌దేవగణ్‌ కూతురుగా నటించిన అబిగేల్‌ ఏమ్స్‌ తన పాత్రకు న్యాయం చేసింది. గిరీష్‌ కర్నాద్‌.. వీర్‌ దాస్‌ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యమేమీ లేదు.
చివరగా.. యాక్షన్‌ అభిమానులకు నచ్చే ‘శివాయ్‌’.
తెలుగు
రివ్యూ: కాష్మోరా!   
 కథేంటంటే?: ప్రేతాత్మల నుంచి విముక్తి కల్పిస్తానంటూ మేజిక్కులు చేస్తూ బతికేస్తుంటాడు క్యాష్‌ అలియాస్‌ కాష్మోరా(కార్తీ). తనకి శక్తులేవీ లేకపోయినా ఉన్నట్టు అందరినీ నమ్మిస్తుంటాడు. అతడికి సొంత కుటుంబం కూడా తోడుంటుంది. ఆత్మల పేరుతో చేతివాటం ప్రదర్శించే కాష్మోరా ఒకసారి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ తమ కుటుంబ సభ్యులంతా రోహిణి నక్షత్రంలో పుట్టామని, అందుకే తమకి ఈ శక్తులు అబ్బాయని చెబుతాడు. అదే విషయాన్ని పత్రికల్లోనూ ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకొంటుంటాడు. నిజంగానే ప్రేతాత్మ అయిన రాజ్‌నాయక్‌ (కార్తీ)కి ఆ ప్రకటన గురించి ఎలా తెలుస్తుంది? రాజ్‌నాయక్‌ ప్రేతాత్మలా మారిపోవడానికి కారణమేమిటి? 700 యేళ్ల క్రితంనాటి అతని చరిత్ర ఎలాంటిది? రోహిణి నక్షత్రంలో పుట్టిన కాష్మోరా కుటుంబాన్ని రాజ్‌నాయక్‌ ఆత్మ తన దగ్గరికి రప్పించుకొని ఏం చేసింది? ఈ కథతో యామిని (శ్రీదివ్య) అనే పరిశోధక విద్యార్థినికీ, రత్నమహాదేవి (నయనతార)కీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: ఇదొక ఫాంటసీ కథ. 700 ఏళ్ల క్రితం నాటి కథకీ, అప్పటి ఓ శాపానికీ, ప్రస్తుతం భూత వైద్యుడిగా చెప్పుకొంటూ కాలం వెళ్లదీసే ఓ కుటుంబానికీ మధ్య ముడిపెట్టి కథని అల్లారు. తొలి సగభాగం కథంతా ఆత్మల్ని పైకి పంపిస్తానంటూ కాష్మోరా పాత్రలో కార్తీ, ఆయన తండ్రి పాత్రలో వివేక్‌ చేసే మేజిక్కులతోనే సాగిపోతుంది. ఆ సన్నివేశాలన్నీ కడుపుబ్బా నవ్వించేలా తీర్చిదిద్దారు. భూతం ఉందంటూ నమ్మించేందుకు రిమోట్‌ కంట్రోల్‌తో కూడిన పరికరాలతో కాష్మోరా కుటుంబమంతా చేసే విన్యాసాలు కూడా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతాయి. కాష్మోరా కుటుంబమంతా రాజ్‌నాయక్‌ బంగ్లాకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. రాజ్‌నాయక్‌ ఎందుకు ప్రేతాత్మగా మారాడో, అతనికి పునరుజ్జీవం రావడానికి తమ కుటుంబం ఎలా కీలకమో కాష్మోరాకి తెలిసే క్రమం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 700 ఏళ్ల క్రితం నాటి రాజ్యాన్ని, అప్పటి యుద్ధాన్ని, రాజ్‌నాయక్‌ పరాక్రమాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అప్పటి రాజ్యాన్ని విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కళ్లకు కట్టిన తీరు చాలా బాగుంది. ‘బాహుబలి’ స్థాయి ఎఫెక్ట్స్‌ ఆ సన్నివేశాల్లో కనిపిస్తాయి. ఒక ఆత్మ కథని... ఫాంటసీతో ముడిపెట్టి తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. దర్శకుడు కథని అల్లుకొన్నవిధానం, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం కూడా మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉంది. అయితే తొలి సగభాగంలోని కామెడీలో కొంచెం కూడా మలి సగభాగంలో లేకపోవడమే ప్రేక్షకులకి కాస్త లోటు అనిపిస్తుంది. కథంతా కూడా మలి సగభాగంలో చెప్పాల్సి రావడమే అందుకు కారణం. అక్కడక్కడా సన్నివేశాల్లో స్పష్టత లోపించినట్టు అనిపించినా ఆసక్తి మాత్రం చివరి వరకు కొనసాగుతుంది.
ఎవరెలా చేశారంటే?: కార్తీ నటనే సినిమాకి ప్రధాన బలం. ఆయన మూడు కోణాల్లో కనిపిస్తూ ప్రతీ సన్నివేశంలోనూ సందడి చేస్తుంటారు. కానీ కథానాయికలకి అసలేమాత్రం ప్రాధాన్యం లేదు. రెండో సగభాగంలోనే నయనతార తెరపైకొచ్చినా ఉన్నంతలో ఆమే ఎక్కువసేపు కనిపిస్తుంది. శ్రీదివ్యకి చెప్పుకోదగ్గ ప్రాధాన్యం లేదు. కార్తీ తండ్రిగా కనిపిస్తూ వివేక్‌ చాలా సన్నివేశాల్లో నవ్వించారు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు. రాజ్‌నాయక్‌ పాత్రలో కార్తీ చేసే సందడి చాలా బాగుంది. కాష్మోరా పాత్రలో మంచి టైమింగ్‌ని ప్రదర్శించి నవ్వించారు. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులే పడతాయి. ఓం ప్రకాష్‌ ఛాయాగ్రహణం, సంతోష్‌ నారాయణ్‌ సంగీతం, విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా బాగా కుదిరాయి. దర్శకుడు గోకుల్‌కి ఇది మూడో సినిమానే అయినా ఎంతో పరిణతిని కనబరుస్తూ తెరకెక్కించారు. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.
 

Thursday, October 27, 2016

క్లాసీ లుక్.. కార్ చేజ్!

 హీరో గోపీచంద్ తన స్టైల్ చేంజ్ చేశారు. ఆల్రెడీ ‘లౌక్యం’, ‘జిల్’ సినిమాల్లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ సినిమాలో క్లాసీ లుక్‌లో గోపీచంద్ సరికొత్తగా కనిపిస్తారని చిత్ర బృందం చెబుతోంది. శ్రీ బాలజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. నెల రోజుల పాటు బ్యాంకాక్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘బ్యాంకాక్ బ్రిడ్జ్‌పై హెలికాప్టర్‌తో చిత్రీకరించిన భారీ కార్ చేజింగ్ సీన్, ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ప్రీ-క్లైమాక్స్ సీన్ అద్భుతంగా వచ్చాయి. గోపీచంద్, హీరోయిన్ క్యాథరిన్ సహా సుమారు 70మంది నటీనటులు షూటింగ్‌లో పాల్గొన్నారు. దర్శకుడు సంపత్ నంది చాలా స్టైలిష్‌గా తీస్తున్నారు’’ అన్నారు. ముఖేశ్ రుషి, సచిన్ కేడేఖర్, నికితన్ ధీర్, ‘వెన్నెల’ కిశోర్ నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: రామ్-లక్ష్మణ్, సంగీతం: ఎస్.ఎస్.థమన్.

మెగాస్టార్ సినిమా కాదని.. తమిళ్ లో చేస్తున్నాడు

 బాలీవుడ్ యాక్టర్స్ కు  హీరో, విలన్ అన్న తేడా ఉండదు. కథలో తమ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే చాలు ఏ పాత్రకైనా రెడీ అయిపోతారు. అందుకే అమితాబ్, షారూఖ్, ఆమిర్ లాంటి టాప్ స్టార్లు కూడా నెగెటివ్ రోల్స్ లో అలరించారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా రోబో సినిమా సీక్వల్ కోసం విలన్ గా మారిపోయారు. అదే బాటలో మరో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన క్రిష్ 3 సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు.
దీంతో తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో విలన్ గా వివేక్ ను నటించాల్సిందిగా కోరారు. కానీ అప్పట్లో చిరుకు విలన్ గా చేసేందుకు నో చెప్పిన వివేక్ ఇప్పుడు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో విలన్ గా నటించేందుకు అంగకీరించాడట. ఇప్పటికే అజిత్ హీరోగా వరుస సూపర్ హిట్స్ అందించిన శివ మరోసారి తలాతో కలిసి మ్యాజిక్ రిపీట్చేయాలని భావిస్తున్నాడు. ఈ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో పాటు జేమ్స్ బాండ్ తరహా సినిమా కావటంతో విలన్ పాత్ర స్టైలిష్ గా ఉండబోతోందని వివేక్ ఈ ఆఫర్ ను ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది.

Wednesday, October 26, 2016

గాల్లో ఫీట్లు... ఖరీదు కోట్లు..!

 ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ 150 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇది భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయట. విశేషం ఏంటంటే... 150 కోట్లలో 30 కోట్లను గాల్లో తీయబోయే ఫైట్‌కి ఖర్చు పెట్టనున్నారట.

  హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లతో దుబాయ్‌లో ఈ స్కై ఫైట్‌ను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ రిస్కీ ఫైట్స్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘రన్ రాజా రన్’తో దర్శకుడిగా పరిచయమైన సుజీత్, ఆ సినిమా తర్వాత రెండేళ్ల నుంచి ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే వర్క్ చేస్తున్నారు.

త్వరలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టి సారించనున్నారు. ‘బాహుబలి: ద కంక్లూజన్’ షూటింగ్ డిసెంబర్‌కి పూర్తి కానుంది. ఆ తర్వాత సుజీత్ సినిమా ప్రారంభమవుతుందని చిత్రబృందం చెబుతోంది.

మహేష్ మూవీకి భారీ ఆఫర్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేస్తుంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు సినిమా ఆడియో రిలీజ్ తో పాటు శాటిలైట్ రైట్స్ ను కలిపి ఓ టీవీ ఛానల్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. అది కూడా బాహుబలి రెండో భాగంగా కన్నా మహేష్ సినిమాకు ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి రైట్స్ సొంతం చేసుకున్నారట.

ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న మహేష్, మురుగదాస్ ల సినిమా ఆడియో, శాటిలైట్ రైట్స్ కోసం ఓ టీవీ ఛానల్ 26 కోట్లు ఆఫర్ చేసిందట. మహేష్, మురుగదాస్ ల కాంబినేషన్ పై ఉన్న అంచనాలతో పాటు ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. సూపర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ వార్తలతో పండుగ చేసుకుంటున్నారు.

Tuesday, October 25, 2016

గెడ్డం గీయించుకున్న హీరోయిన్

  హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఏ చిన్న లోపం కూడా కనిపించకుండా తెరమీద వీలైనంత అందంగా కనిపించాలని చూస్తారు. అందుకోసం మేకప్ నుంచి మేకోవర్ వరకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తుంటారు. హీరోయిన్లలో ఎవరికి వాళ్లకు వ్యక్తిగత మేకప్ మెన్ ఉంటారు. వాళ్లతో తమకు కావల్సినట్లుగా మేకప్ చేయించుకుంటూ ఉంటారు. బుజ్జిగాడులో సెకండ్ హీరోయిన్‌గా చేసి, నిన్న మొన్నటి సర్దార్ గబ్బర్‌సింగ్‌లో విలన్‌కు భార్యగా నటించిన సంజనా గల్రానీ కూడా ఇలాగే మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. అయితే.. అందరిలా కేవలం మేకప్‌తోనే సరిపెట్టకుండా ఆమె గెడ్డం కూడా గీయించుకుంది!! అదేంటి, హీరోయిన్లు గెడ్డం గీయించుకోవడం ఏంటని మీకు అనుమానంగా వచ్చిందా? 
 
పురుషులకే కాదు, మహిళలలో కూడా కొంతమందికి ముఖం మీద అవాంఛిత రోమాలు వస్తుంటాయి. మామూలు వాళ్లు వాటిని పెద్దగా పట్టించుకోరు గానీ, సినిమా హీరోయిన్లు మాత్రం స్క్రీన్ మీద మెరిసిపోవాలనుకుంటారు కాబట్టి వాటిని పూర్తిగా తీయించేసుకుంటారు. కొంచెం పెరిగినా సరే.. వెండితెరమీద బాగోదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నీట్‌గా షేవ్ చేయించుకుంటారు. అలాగే సంజన కూడా తన వ్యక్తిగత మేకప్ మన్‌తో గెడ్డం గీయించుకుంది. ఎక్కడా చిన్న గాటు కూడా పడకుండా.. అలాగే రోమాలు ఏవీ మిగలకుండా జాగ్రత్తగా గీయాలంటూ అతడికి సూచనలు కూడా ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మరోసారి జాగ్రత్తగా చూసుకుని అప్పుడు సంతృప్తి పడింది. అయితే.. షేవింగ్ క్రీమ్ ఏదీ పూసుకోకుండానే ఆమె ఈ షేవింగ్ చేయించుకోవడం విశేషం.

Monday, October 24, 2016

అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదు!

సౌతిండియాలో ఏడాదికి నాలుగైదు లేదా కనీసం రెండు సినిమాల చొప్పున రాకెట్ స్పీడుతో ఇలియానా నటించారు. ముంబై వెళ్లిన తర్వాత ఈ గోవా బ్యూటీలో అంత స్పీడు కనిపించడం లేదు. అక్కడ జోరు తగ్గడానికి కారణం... హిందీ సినిమాల్లో అవకాశాలు రాక కాదట, వచ్చిన వాటిలో మంచివి ఎంపిక చేసుకోవడమే అంటున్నారు. అంతే కాదండోయ్.. అవకాశాల కోసం ఎవ్వర్నీ అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదని ఇలియానా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘ఇక్కడ (బాలీవుడ్‌లో) చాన్సులు, మీ సెలక్షనే కీ రోల్ పోషిస్తాయి. మీకో మంచి అవకాశం వచ్చిందనుకోండి.. నటించాలా? వద్దా? అనేది మీ చేతుల్లో ఉంటుంది.                   మీ సెలక్షన్ మంచిదయితే మీరు ఇండస్ట్రీలో ఉంటారు. చెత్తగా ఉంటే.. కెరీర్ క్లోజ్ అవుతుంది’’ అని ఇలియానా స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు, అందులో ఆమె సెలక్షన్ పట్ల హ్యాపీగా ఉన్నారట. ‘‘నా వరకూ నేను మంచి సినిమాలే సెలక్ట్ చేసుకున్నా. నా హార్డ్ వర్క్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెప్పగలను. ఇప్పటివరకూ ఎవర్నీ ఫేవర్ చేయమని అడగలేదు. అవకాశాల కోసం ఎవర్నీ అడుక్కోను. నా డిగ్నిటీ నాకుంది’’ అన్నారామె. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో ఇలియానా నటిస్తున్నారు.

నాన్నకు ప్రేమతో...

మన కలలను నెరవేర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. అయితే తల్లిదండ్రుల కలలను సాకారం చేయడంలో కలిగే సంతృప్తే వేరు. అందానికి ప్రతిరూపం లాంటి నటి త్రిష ఇప్పుడు రెండో రకం సంతోషాన్ని అనుభవించ డానికి దగ్గరగా ఉన్నారు. తొలి నుంచి కమర్శియల్ చిత్రాల్లో నటిస్తూ గ్లామర్‌తో నాయకిగా నెట్టుకొచ్చిన త్రిష ఇటీవల తన బాణిని మార్చారన్నది ఆమె చిత్రాల ఎంపిక చూస్తేనే అర్థం అవుతుంది. నాయకి చిత్రంతో హీరోయిన్ సెంటరిక్ పాత్రకు మారారు. ఆ చిత్రం నిరాశ పరచినా అదే బాణీలో మోహిని చిత్రంలో నటిస్తున్నారు.నాయకి చిత్రం అందించలేని ఆనందాన్ని మోహిని ఇస్తుందనే ఆశతో ఉన్నారు.
మోహిని చిత్ర ఫస్ట్‌లుక్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ధనుష్ జంటగా కొడి చిత్రంలో ప్రతినాయకి చాయలున్న పాత్ర దుమ్మురేపేలా నటించారనే టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 28న తెరపైకి రానుంది. ఈ చిత్ర విజయం నటి త్రిషతో పాటు, ధనుష్‌కు చాలా అవసరం. కాగా త్రిష ప్రస్తుతం మోహిని చిత్రంలో నటిస్తున్నారు. గర్జనై, చతురంగవేట్టై, సామి-2 చిత్రాల్లో నటించనున్నారు. ఇకపై వైవిధ్యభరిత కథా పాత్రల్లోనే నటించాలని ఈ బ్యూటీ నిర్ణయించుకున్నారట. కాగా ప్రముఖ హీరోయిన్లు ఇప్పుడు ఒక పక్క నటిస్తూనే మరో పక్క ఇతర వ్యాపారాల్లో ఆదాయాన్ని గడిస్తున్నారు.
  అదే విధంగా 14 ఏళ్ల సినీ వయసులోనూ నాయకిగా బిజీగా ఉన్న నటి త్రిష హోటల్ బిజినెస్‌లోకి దిగుతున్నారు. బెంగళూర్‌లో 60 గదులతో కూడిన ఆధునిక స్టార్ హోటల్‌ను నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. త్రిష ఈ హోటల్ నిర్మించడానికి కారణం ఉందట. తన తండ్రి కృష్ణ ఒక నక్షత్ర హోటల్‌లో పని చేసేవారు. ఆయనకు తాను హోటల్ యజమానిని కావాలని కలల కనేవారట. అయితే ఆ కల నెరవేరకుండానే ఆయన తనువు చాలించారు. దీంతో తన తండ్రి కలను సాకారం చేయడానికే త్రిష స్టార్ హోటల్‌ను కట్టిస్తున్నారట.

Sunday, October 23, 2016

డార్లింగ్‌ ప్రభాస్‌ పూర్తి పేరు ఏంటో తెలుసా?

  తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్‌. ’బాహుబలి’ సినిమాతో జాతీయ స్టార్‌గా ఎదిగిన ఆయన ఆదివారం 37వ వసంతంలో అడుగుపెట్టారు. ఆయన జన్మదిన కానుకగా ఇప్పటికే ’బాహుబలి-2’ పోస్టర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌ విడుదల సందర్భంగా 18వ ముంబై చిత్రోత్సవం సందర్భంగా ప్రభాస్‌కు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చి గౌరవించారు.
14 ఏళ్ల నట ప్రస్థానంలో అసాధారణమైన అద్భుతాలను ఈ యంగ్‌ హీరో సొంతం చేసుకున్నాడు. ప్రభాస్‌ ఖాతాలో పలు విజయవంతమైన సినిమాలు ఉన్నప్పటికీ ‘బాహుబలి’ ప్రాంచైజ్‌తో ఒక్కసారిగా గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిపోయాడు. వంద కోట్లు వసూళ్లు సాధించడమే కష్టం అనుకునే టాలీవుడ్‌ రేంజ్‌ ను దాటి ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’  సినిమా ఏకంగా రూ. 600 కోట్లు వసూలు చేసింది. ’బాహుబలి-2’ మీద అనేక అంచనాలు ఉన్నాయి. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన కబుర్లు ఇవి..
  • ప్రభాస్‌ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దనాన్న.
     
  • ’బాహుబలి’  సూపర్‌ సక్సెస్‌తో ఇక ప్రభాస్‌ బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తాడని వినిపిస్తోంది. కానీ, 2014లోనే ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అజయ్‌ దేవగణ్‌ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన ‘యాక‌్షన్‌ జాక్సన్‌’ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు.
     
  • ప్రభాస్‌కు ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థినితో నిశ్చితార్థం అయింది. తల్లిదండ్రులు సెలెక్ట్‌ చేసిన అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి గురించి పెద్దగా వివరాలు తెలియదు. గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రభాస్‌ పెళ్లి జరగాల్సి ఉండగా.. ’బాహుబలి’ ప్రాజెక్టు కారణంగా వాయిదా వేసుకున్నాడు. అది ప్రభాస్‌కు పనిపట్ల అంకితభావమని సన్నిహితులు చెప్తారు.
     
  • ప్రభాస్‌ బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన 'భక్తకన్నప్ప'. బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ సినిమాలు అన్నా పడిచస్తాడు. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌, త్రి ఇడియట్స్‌ సినిమాలను 20సార్లకుపైగా చూశాడట. ఇక హాలీవుడ్‌ విషయానికొస్తే రాబర్ట్‌ డీనీరో నటన అంటే ఇష్టం.
     
  • ప్రభాస్‌కు వాలీబాల్‌ అంటే ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్‌ వరల్డ్‌ 2010 లక్ష్మణ్‌ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్‌ ఎక్విప్‌మెంట్స్‌ ఇచ్చారు.
     
  • చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్‌ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. 'బాహుబలి' సముద్రం లాంటి సినిమా. ఒక్క బాహుబలి వంద సినిమాలతో సమానం. కాబట్టి మధ్యలో నదిలాంటి సినిమాలను ఇవ్వడం ఆయనకు ఇష్టంలేదు.

Saturday, October 22, 2016

‘మ‌హేంద్ర బాహుబ‌లి’వ‌స్తున్నాడు

 తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన చిత్రం ‘బాహుబలి’. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ప్రస్తుతం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ సిద్ధమవుతోంది. కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడు? సగటు సినీ ప్రేక్షకుడి మదిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఈ నేపథ్యంలో బాహుబలి-2లో ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మహేంద్ర బాహుబలి వస్తున్నాడు’ అంటూ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. చేతికి గొలుసులు చుట్టుకుని సిక్స్‌ప్యాక్‌తో ఉన్న ప్రభాస్‌ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తొలిభాగాన్ని మరిపించేలా రెండో భాగం ఉంటుందని ఇటీవల రానా చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లు చిత్ర బృందం రెండో భాగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రలు పోషించారు.
‘బాహుబలి: ద బిగినింగ్‌’కు కొనసాగింపు ‘కన్‌క్లూజన్‌’ను తీసుకువస్తున్నట్లే దర్శకుడు రాజమౌళి 2015లో చేసిన ట్వీట్‌ను కొనసాగింపు ఇచ్చారు. ‘ప్రతి కథలోనూ అంతర్లీనంగా ఒక ప్రత్యేక సందర్భం ఉంటుంది. అది మొత్తం కథను నిర్వచించి, ముందుకు నడిపిస్తుంది. అదే బాహుబలి ద బిగినింగ్‌’ అనే ట్వీట్‌కు కొనసాగింపుగా, ‘ఇప్పుడు అతడు తన అనితరశక్తితో ఎలా మాహిష్మతి రాజ్యాన్ని గెలుస్తాడో.. అదే బాహుబలి2 ద కన్‌క్లూజన్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

Friday, October 21, 2016

రివ్యూ: ఇజం



పూరి జగన్నాథ్‌ గొప్ప కథకుడు. చిన్న పాయింట్‌ అయినా ఆసక్తికరమైన కథలుగా మలచి ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు కూర్చోబెట్టే సమర్థుడు. అందుకే పూరి సినిమాల్లో కథ కంటే.. వేగంగా పరిగెట్టే కథనం.. పసందైన మాటలు ప్లస్‌ పాయింట్లుగా మారతాయి. పూర్తి స్థాయి పూరీ స్టైల్‌లో తీసిన సినిమా ‘ఇజం’. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ‘ఇజం’ ఎలా ఉంది? ఇందులో పూరి ఏ ‘ఇజం’ గురించి చెప్పాడన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే..: కల్యాణ్‌రామ్‌ (కల్యాణ్‌రామ్‌) ఓ స్ట్రీట్‌ ఫైటర్‌. బ్యాంకాక్‌లోని ఓ దీవిలో డబ్బుల కోసం ఫైట్‌ చేస్తుంటాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గం అన్వేషిస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అలియా (అదితి ఆర్య)ని చూసి మనసు పడతాడు. ఆమె.. చీకటి సామ్రాజ్యానికి అధినేత అయిన జావేద్‌ భాయ్‌ (జగపతిబాబు) కూతురు. దేశాన్ని తన తండ్రి భయపెట్టిస్తుంటే.. తన తండ్రినే భయపెట్టించే మగాడ్ని పెళ్లి చేసుకోవాలనుకొంటుంది. ఆ లక్షణాలు చూసే కల్యాణ్‌రామ్‌ని ప్రేమిస్తుంది. అయితే కల్యాణ్‌రామ్‌ అసలు పేరు సత్య మార్తాండ్‌ అని.. తన తండ్రి భాగోతాన్ని బయటపెట్టడానికి వచ్చిన ఓ జర్నలిస్ట్‌ అని తెలుస్తుంది. ఇంతకీ ఈ సత్యమార్తాండ్‌ ఎవరు? తను అలియా ప్రేమని అడ్డు పెట్టుకొని ఏం సాధించాలనుకొన్నాడు? జర్నలిజం గొప్పతనాన్ని సత్య ఎలా చాటి చెప్పాడు? అనేది వెండితెర మీద చూడాల్సిందే.
ఎలా ఉందంటే..: పూరి మార్క్‌ కమర్షియల్‌ హంగులతో సాగే సినిమా ఇది. ముందే చెప్పినట్టు పూరి ఓ చిన్న పాయింట్‌ని నమ్ముకొన్నాడు. అయితే ఆ పాయింట్‌ బలంగా ఉంది. వికీలీక్స్‌ లాంటి బలమైన నెట్‌వర్క్‌ని స్థాపించి.. విదేశాల్లో నలధనం దాచుకొంటున్న ‘నల్ల దొరల’ గుట్టురట్టు చేసి.. ఆ డబ్బుని పేద ప్రజలకు పంచి పెట్టడం అన్నదే ఆ పాయింట్‌. ఇలాంటి కథలు సామాన్య ప్రేక్షకుడికి ఈజీగా కనెక్ట్‌ అయిపోతాయి. అయితే.. అసలు విషయం పది నిమిషాలే. సినిమా రెండు గంటలకు పైగా. అంటే.. మిగిలిన రెండు గంటలూ దర్శకుడు ఏం నడిపాడన్నది కీలకం.
సినిమా ప్రారంభానికి ముందే.. కల్యాణ్‌రామ్‌ ఓ జర్నలిస్ట్‌ అనే హింట్‌ దొరికేస్తుంది ప్రేక్షకులకు. దాన్ని ఇంట్రవెల్‌ వరకూ దాచి పెట్టి.. దాన్నో బ్యాంగ్‌ అన్నట్టు చూపించడం అతికినట్లుగా అనిపించదు. తొలి సగం.. కథ కంటే మిగిలిన విషయాలే సాగిపోతుంటాయి. హీరోయిన్‌ వెనుక పడటం.. ఆమెతో డ్యూయెట్లతో తొలి భాగం ముగిస్తే.. ద్వితీయార్థంలో హీరోని వెదుక్కొంటూ హీరోయిన్‌ వస్తుంది. ఆ సన్నివేశాలు అలా సాగుతున్న వేళ.. సినిమా చివర్లో ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. కోర్టు సీన్‌తో తన ఉద్దేశం.. లక్ష్యాన్ని చాటి చెప్పాడు దర్శకుడు. కోర్టు సీన్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. దర్శకుడి ఉద్దేశం గొప్పగా ఉన్నా.. ఆ విషయాన్ని ఆసక్తికరంగా చెప్పటంలో తడబాటు కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..: గత సినిమాల్లో కల్యాణ్‌ రామ్‌కు ఇందులో పాత్రకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పూరి సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో.. అలానే కనిపిస్తారు కల్యాణ్‌ రామ్‌. కోర్టు సన్నివేశంలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. అదితి ఆర్యకి ఇదే తొలి సినిమా. ఆమె ఓకే. జగపతిబాబుని విలన్‌ అనుకోవడానికి వీల్లేదు. బీడీ ప్రేమికుడిగా.. కొన్ని సన్నివేశాల్లో రక్తి కట్టించాడు. అయితే డాన్‌ పాత్రపై మరింత దృష్టి పెట్టాల్సింది. గొల్లపూడి కనిపించేది ఒక్క సన్నివేశమైనా బాగుంది. అనూప్‌ బాణీల్లో మెలోడీ గీతం బాగుంది. ‘ఇజం.. ఇజం’ అంటూ పూరి పాడిన పాట ఆకట్టుకునేలా ఉంటుంది. పూరి డైలాగుల్లో మరిన్ని మెరుపులు ఉంటే బాగుండేది. కథ విషయంలో మరికాస్త కసరత్తు చేయాల్సింది.చివరిగా.. జర్నలిజానికి జాతీయవాదం తోడైతే ఈ ‘ఇజం’

Thursday, October 20, 2016

కోహ్లీకి ఇప్పటికీ అతడంటే వణుకు!


 టీమిండియా ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సాధించాడు. టెస్ట్ కెప్టెన్ గానూ అద్భుత విజయాలను సాధిస్తూ దూసుకెళ్తున్నాడు. టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్నా కోహ్లీ మాత్రం ఇప్పటికీ ఓ వ్యక్తికి భయపడతాడట. అయితే అతడు ఓ బౌలర్ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే కోహ్లీ అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అంటే అంతగా భయపడిపోతాడట. బుధవారం తన జీవితం కథాంశంగా సీనియర్ క్రికెట్ జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి రచించిన 'డ్రైవెన్' పుస్తకావిష్కరణలో విరాట్ పాల్గొన్నాడు. సందర్భంగా ఈ ఆసక్తికర అంశాన్ని కోహ్లీ వెల్లడించాడు.
కోచ్‌ అంటే ఉన్న అపార గౌరవం కారణంగా ఆయన ఎన్ని మాటలన్నా ఇప్పటికీ మౌనమే తన సమాధానమని చెప్పాడు. 1998 నుంచి రాజ్ కుమార్ శర్మే తన కోచ్‌గా ఉన్నారని, తానెప్పుడూ కోచ్ ను మార్చే ప్రయత్నం చేయలేదన్నాడు. కానీ, తప్పుచేస్తే కోచ్ నుంచి చీవాట్లు తినాల్సి వస్తుందని హడలిపోయేవాడినని మరోసారి గుర్తుచేసుకున్నాడు కోహ్లీ. ఐపీఎల్ లో తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి మాత్రమే ఆడానని, భవిష్యత్తులోనూ తన నిర్ణయం ఇదేనని స్పష్టంచేశాడు.



భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, రవిశాస్త్రి ఈ ఈవెంట్లో పాల్గొని విరాట్ ఆటతీరును కొనియాడారు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. తాను టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న సమయంలో 'ప్రదీప్ సాంగ్వాన్ తన వద్దకు వచ్చి భయ్యా ఓ బ్యాట్స్ మన్ నిన్ను కచ్చితంగా అదిగమిస్తాడు. నీ రికార్డులను బ్రేక్ చేస్తాడని చెప్పాడు. అతడు మరెవరో కాదు విరాట్ కోహ్లీ' అని వివరించాడు. కోహ్లీ ఫిట్ నెస్ అతడి బలమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.

Wednesday, October 19, 2016

మహేష్‌ చిత్రం టైటిల్‌ అదేనా?

 ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘ప్రిన్స్‌’ మహేష్‌బాబు నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్‌ అభిమానులు కూడా వీరి కాంబినేషన్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు వీరి కాంబినేషన్‌లో సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతూండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళాల్లో దీనిని ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. రెండు భాషల్లో తెరకెక్కుతున్నందున రెండింటిలోనూ ఒకే శీర్షికను ఉంచాలన్న ఉద్దేశంతో ఏఆర్‌ మురుగదాస్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవలే ఈ సినిమాకు ‘ఏజెంట్‌ శివ’ అన్న టైటిల్‌ను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందులో మహేష్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తోంది. ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నారు. హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అనువాద చిత్రాల ద్వారా చెన్నై, కాంచీపురం, తాంబరం వంటి ప్రాంతాల్లో అభిమాన గణాన్ని మహేష్‌బాబు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా నేరుగా చిత్రంతో ప్రేక్షకజనాన్ని ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Tuesday, October 18, 2016

ఒక్క హిట్టులేక డబ్బులన్నీ పొగొట్టుకున్నా!

 ఇటీవలికాలంలో ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. బాక్సాఫీస్‌ వద్ద నేను ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. ఈ సినిమా హిట్‌ అయితే.. జైలు నుంచి విడుదలైన భావన కలుగుతుంది. కొంచెం ఉపశమనంతో, ప్రశాంతతతో రాబోయే సినిమాల్లో పనిచేస్తా.. ఇది బాలీవుడ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ ఆవేదన. ఒకప్పుడు వరుస విజయాలతో ఖాన్‌ త్రయంతో తర్వాత ఆ స్థాయి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌గా రణ్‌బీర్‌ ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ ఊహించనిరీతిలో ఎదురైన వరుస పరాజయాలు రణ్‌బీర్‌ కెరీర్‌ను తీవ్రంగా కుంగదీశాయి.
ఈ నేపథ్యంలో తన తాజా సినిమా ‘యే దిల్‌ హై ముష్కిల్‌’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ ఉండటంతో విడుదల కోసం అనేక చిక్కులు ఎదుర్కొంటున్నది. దీపావళి కానుకగా మరో పది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై కొన్ని థియేటర్ల సంఘాలు నిషేధం విధించాయి.

ఈ పరిణామాలు ఇలా ఉండగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రణ్‌బీర్‌ ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ హిట్‌ కోసం తానెంత ఆశగా ఎదురుచూస్తున్నాడో తెలిపాడు. ‘నా గత సినిమాకు ఈ సినిమాకు మధ్య చాలా గ్యాప్‌ వచ్చింది. నా చివరి సినిమా ’తమాషా’ గత ఏడాది నవంబర్‌లో విడుదల కాగా.. ఇప్పుడు తాజా సినిమా వస్తోంది. నా సినిమాలు బాగా ఆడటం లేదన్న అభిప్రాయం కారణంగా ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ విషయంలో ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నా. నేను బాక్సాఫీస్‌ వద్ద ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. ఒక హిట్టు వస్తే నాకు ఉపశమనం లభిస్తుంది. జైలు నుంచి విడుదలైన భావన కలుగుతుంది. ప్రశాంతంగా రాబోయే సినిమాల కోసం పనిచేస్తా’ అని రణ్‌బీర్‌ వివరించాడు. కాగా, ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఐశ్యర్యరాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ సాన్నిహిత్యంగా ఉన్న హాట్‌హాట్‌ ఫొటోలను విడుదల చేశారు.

'శ్రీమంతుడు'కి మరో రికార్డ్

 టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డ్ లన్నింటిని తిరగరాసిన సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం నమోదు చేసింది. మహేష్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ఈసినిమా ఇప్పటికీ తన రికార్డ్ ల హవా కొనసాగిస్తూనే ఉంది.

తాజాగా శ్రీమంతుడు ఆడియో యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన శ్రీమంతుడు ఆడియో సాంగ్స్ ను అదే కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లోనూ రిలీజ్ చేసింది. దాదాపు ఏడాదిన్నర క్రితం రిలీజ్ అయిన ఈ పాటలను ఇప్పటి వరకు 80 లక్షల మందిపైగా వినటంతో అరుదైన రికార్డ్ శ్రీమంతుడు సొంతమయ్యింది. ఈ విజయం పై ఆదిత్య మ్యూజిక్ కంపెనీతో పాటు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.

Monday, October 17, 2016

విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవరు?


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవరు? (ఎ) ప్రియాంక చోప్రా (బి) అనుష్క శర్మ (సి) దీపికా పదుకోన్ (డి) తెలియదు. ఇంతకీ ఈ ప్రశ్న ఏంటని వింతగా ఉందా? మహారాష్ట్రలోని భివండి హైస్కూల్ ఉపాధ్యాయుల లీల ఇది.
తొమ్మిదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన పీటీ పరీక్ష ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న ఉంది. ఇది చూసి విద్యార్థులు షాకయ్యారు. ఈ విషయం స్థానిక మీడియాలో రావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవరయితే విద్యార్థులకు ఏంటి? ఇది కోహ్లీ వ్యక్తిగత విషయం.. ఫిజికల్ ట్రైనింగ్ పరీక్షకు, ఈ ప్రశ్నకు ఏమైనా సంబంధముందా? అంటూ విమర్శలు గుప్పించారు. విరాట్ నటి అనుష్క శర్మతో డేటింగ్ చేస్తుండటం ఆయన వ్యక్తిగత విషయం.. ఈ విషయాన్ని పరీక్షల్లో ఎలా అడుగుతారని మండిపడ్డారు.

గత నెలలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ కు సంబంధించిన ప్రశ్న పరీక్షలో రావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తమిళనాడులో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకు సినిమా తెలివితేటలను పరీక్షించారు. వేలూరు ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో బాహుబలి సినిమాకు సంబంధించిన ప్రశ్న కనిపించింది. విద్యాశాఖ అధికారుల తీరు చూస్తుంటే మార్కుల కోసం పాఠ్యాంశాలతో పాటు క్రికెట్, సినిమాలు, ఎఫైర్ల గురించి తెలుసుకోవాలేమో అనే సందేహం విద్యార్థులకు రాకమానదు.

Sunday, October 16, 2016

అంతా అయిపోయాకా ఏం చేస్తాం?

 సినిమా విడుదలయ్యేంత వరకూ కష్టానికి తగిన ఫలితం వస్తుందా? హిట్‌ అవుతుందా, లేదా? అంటూ సవాలక్ష సందేహాలుంటాయి. విడుదలయ్యాక ఫలితం గురించి విశ్లేషణలూ ఉంటాయి. బాగా ఆడినా, ఆడకపోయినా కారణాలు అన్వేషించాల్సిందే. అయితే వీటి గురించి మరీ అతిగా ఆలోచించడం అనవసరం అంటోంది రాశీ ఖన్నా. ‘‘ఫలితంపై ఆరా అవసరమే. ఎందుకంటే ఎక్కడ తప్పు చేశామో ఓసారి పునః సమీక్షించుకొనే అవకాశం ఉంటుంది. అయితే మరీ వాటి గురించే ఎక్కువ ఆలోచించకూడదు. అంతా అయిపోయాక తీరిగ్గా కూర్చుని ఫలితాల్ని విశ్లేషించుకొంటూ బాధపడితే లాభం లేదు. కాలాన్ని వెనక్కి తిప్పి ఆ తప్పులు సరిదిద్దుకోలేం కూడా. అయ్యిందేదో అయిపోయింది. జరగాల్సిన విషయం ఆలోచించాలి. ఈ విషయంలో నా ఆలోచనలు అలానే ఉంటాయి. నిన్నటి గురించి, రేపటి గురించీ అతిగా ఆలోచించడం వల్ల ఒరిగేదేం ఉండదు. ప్రస్తుతం చేస్తున్న పనిపై కూడా మనసు లగ్నం చేయలేం’’ అంది రాశీ ఖన్నా.

బంగారు నాణేలు.. తవ్వుకునేందుకు జనాల పోటీ!

 నది ఒడ్డున ఉన్న ఆ ప్రాంతంలో మైనింగ్‌ జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ కొందరికి బంగారు నాణేలు దొరికియట. ప్రాచీనకాలంలో పాతిపెట్టిన గుప్తనిధికి సంబంధించిన ఆ బంగారు నాణెముల్లో రాజు లేదా దేవుడి ప్రతిమ, మహిళ, నెమలీ ప్రతిమలు ఉన్నాయని, అవి మాకు దొరికాయంటూ కొందరు వాట్సప్‌లో ఆ ఫొటోలు కూడా పెట్టారు. ఇంకేముంది ఆ నోటా ఈ నోటా ఈ వార్త దావాహనంలా పాకింది.
తెల్లారిలేచేసరికి స్థానిక గ్రామస్తులు అంతా ఆ నది ఒడ్డుకు వెళ్లి ఉత్త చేతులతో తవ్వడం మొదులుపెట్టారు. దీంతో ఆ నది ప్రాంతమంతా జాతరలా మారిపోయింది. ఎటుచూసినా ప్రజలు రోజుల తరబడి గుంతలు తవ్వుతూనే ఉన్నారు. బంగారు నాణెలు తమకు దొరకకపోతాయా అన్న ఆశతో గ్రామస్తులు తవ్వుతూనే ఉన్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని టాంక్‌ అనే మారుమూల గ్రామంలో జరిగింది. ఈ గ్రామ సమీపంలో ఉన్న నది ఒడ్డున బంగారు నాణేలు దొరుకుతున్నాయన్న వదంతులు వచ్చాయి. ఈ బంగారు నాణెలకు సంబంధించిన ఫొటోలు సైతం వాట్సాప్‌లో దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు. గ్రామస్తులందరినీ వాకబు చేసినా.. ఎవరూ తమకు బంగారు నాణెం దొరికిందని చెప్పలేదు. ఎవరో దుండగులు కావాలని వదంతులు రేపినట్టు గుర్తించిన పోలీసులు.. వాట్సాప్‌లో ఫొటోలు పెట్టిన నలుగురు వ్యక్తుల్ని అరెస్టుచేశారు. అయినా.. ఆ నది ఒడ్డున గత మూడు రోజులుగా గ్రామస్తులు తవ్వడం మాత్రం ఆపలేదు.

Saturday, October 15, 2016

సెట్లో పవన్‌కల్యాణ్‌ ఏంచేశారో తెలుసా?

 పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ని అభిమానులు విపరీతంగా ఆరాధిస్తుంటారు. అభిమానులే కాదు తోటి నటులూ ఆయనను అంతగానే ఇష్టపడతారు. తాజాగా నటుడు శివబాలాజీ పవన్‌ మంచితనం గురించి మరోసారి తెలియజేశారు. డాలీ దర్శకత్వంలో పవర్‌స్టార్‌ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రంలో శివబాలాజీ పవన్‌ సోదరుడి పాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం శివబాలాజీ పుట్టినరోజు. ఆరోజు సెట్‌లో ఏం జరిగిందో శివబాలాజీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వివరించారు.
 
‘పవన్‌కల్యాణ్‌ గారు లొకేషన్‌కి వచ్చారు. వెంటనే లేచి గుడ్‌ మార్నింగ్‌ సర్‌ అన్నాను. ఆయన నన్ను పలకరిస్తున్నంతలోనే దర్శకులు డాలీ, పవన్‌కల్యాణ్‌ గారితో ఇవాళ శివ పుట్టినరోజు సర్‌ అని చెప్పారు. వెంటనే పవన్‌గారు నా భుజంమీద చెయ్యివేసి నీ కోసం ఏమన్నా చెయ్యాలోయ్‌ అని, ప్రొడక్షన్‌ అని పిలిచారు. వెంటనే ప్రొడక్షన్‌ చీఫ్‌ ఆయన ముందు హాజరు. నా కొక కేక్‌ కావాలి.. పెద్దదిగా ఉండాలి.. ఏం శివా బ్లాక్‌ ఫారెస్ట్‌ కేక్‌ నచ్చుతుందా? అన్నారు.. నేను అలాగే కళ్ళప్పగించి ఎస్‌ సర్‌ అన్నాను. కొద్దిసేపటిలో అన్నీ అమరిపోయాయ్‌. మధు(నా భార్య, నటి)ని పిలవచ్చా అని అడిగాను. పిల్లల్ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా రమ్మనవోయ్‌ అన్నారు. పవన్‌ గారి మానవత్వానికి, ఆయన చేసే కొన్ని వేల సేవలలో.. నా పుట్టినరోజునాడు చేసింది చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ అంతటి మహామనిషి నాకు ఇంత విలువనివ్వటం!!! విలువకట్టలేని, మాటలలో చెప్పలేని మహదానుభూతి. నా జీవితంలో ఈ పుట్టినరోజును మధురానుభూతిగా నిలిపిన దర్శకుడు డాలీ(కిషోర్‌కుమార్‌ పార్ధసాని)కి ధన్యవాదాలు’ అని శివబాలాజీ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు కేక్‌ కట్‌ చేసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Friday, October 14, 2016

ఆమె ‘బాహుబలి’లో నటించనందట!

 ‘బాహుబలి’ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా భారత చిత్ర పరిశ్రమ ఖ్యాతిని చాటింది. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం కోసం దాదాపు అందరు నటీనటులు ఎదురుచూస్తుంటారు. అయితే ఈ చిత్రంలోని రమ్యకృష్ణ పాత్రలో నటించేందుకు శ్రీదేవి నిరాకరించిన సంగతి తెలిసిందే. కేవలం ఆమే కాదు మరో నటి కూడా ‘బాహుబలి’లో నటించేందుకు ఒప్పుకోలేదట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్‌ కథానాయిక సోనమ్‌ కపూర్‌. ఇటీవల చాట్‌ షో కార్యక్రమంలో ‘బాహుబలి’ చిత్రంపై తన అభిప్రాయం గురించి అడిగిన ప్రశ్నకు సోనమ్‌ కపూర్‌ షాకింగ్‌ సమాధానం ఇచ్చారు.
‘ఆ సినిమా(బాహుబలి) చూడలేదు. నేను ఆ చిత్రం కథ విన్నాను, అందులో నటించే అవకాశం వచ్చింది. కథ అద్భుతంగా ఉంటుంది’ అని సోనమ్‌ అన్నారు. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టగానే ఇంత చక్కటి అవకాశాన్ని సోనమ్‌ ఎందుకు వదులుకుంది? అని ఆశ్చర్యపోయారట. మరి ఏ కారణంగా ఈ అవకాశం వద్దనుకుందో, ఏ పాత్రలో తనను నటించమన్నారో సోనమ్‌ చెప్పలేదు.

దీపావళికి చూపిస్తారా?

 మహేష్‌బాబు, మురుగదాస్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ దీపావళికి టీజర్‌ని విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబరు నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. చెన్నైలోనూ కొంత మేర షూటింగ్‌ జరిగింది. ప్రస్తుతం చిత్రబృందం టైటిల్‌ వేటలో ఉంది. ‘వాస్కోడిగామా’, ‘ఎనిమీ’, ‘అభిమన్యుడు’ ఇలా చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇవేం కాదని చిత్రబృందం స్పష్టం చేసింది. తెలుగు, తమిళ భాషలు రెండింటికీ సరిపోయేలా టైటిల్‌ ఉండాలని మహేష్‌ భావిస్తున్నారట. దీపావళిలోగా టైటిల్‌ విషయంలోనూ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Thursday, October 13, 2016

వెస్టిండీస్ క్రికెటర్ తో తెలుగు హీరోయిన్ డేటింగ్..?

 దాదాపు దశాబ్దకాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసిన శ్రియ, ప్రస్తుతం తన వయసుకు తగ్గ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. వెండితెర మీద వరుసగా అవకాశాలు రాకపోయినా.. ర్యాంప్ షోలు, ఓపెనింగ్ ఈవెంట్ లతో కాలం గడిపేస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబందించిన మరో వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నేళ్ల కెరీర్ లో ఇంత వరకు ఏ స్టార్ తో శ్రియాకు రిలేషన్ ఉన్నట్టుగా వార్తలు రాలేదు. తాజాగా ఓ వెస్టిండీస్ క్రికెటర్ తో ఈబ్యూటి సన్నిహితంగా ఉంటుందన్న వార్త, మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రావో తో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటికి వస్తున్న శ్రియ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నిజంగానే శ్రియా, బ్రావోల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి తమ రిలేషన్ పై ఈ స్టార్స్ ఎప్పటికీ స్పందిస్తారో చూడాలి.

Wednesday, October 12, 2016

అనుష్కశర్మ స్థానంలో త్రిష?

 బాలీవుడ్‌ కథానాయిక అనుష్క శర్మ నటించిన థ్రిల్లర్‌ సినిమా ‘ఎన్‌హెచ్‌ 10’. ఫిమేల్‌ ఓరియెంటెడ్‌గా 2015లో మార్చిలో విడుదలైన ఈ సినిమా విజయం అందుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అనుష్క శర్మ పాత్రలో నటించడానికి త్రిషను నిర్మాతలు కలిసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇటీవల ‘నాయకి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిష ప్రస్తుతం‘మోహిని’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ధనుష్‌తో కలిసి ఆమె నటించిన ‘కోడి’ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని ‘ధర్మయోగి’ టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు.

Sunday, October 9, 2016

సీనియర్స్‌తో సై...

 అక్షరా హాసన్ సెలైంట్‌గా తమిళంలో బిజీ అయిపోతోంది. ‘షమితాబ్’ చిత్రం ద్వారా హిందీ తెరకు నాయికగా పరిచయమైన అక్షర ఆ తర్వాత అక్కడ వేరే సినిమాలు కమిట్ కాలేదు. ఈ మధ్యే తమిళంలో అజిత్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి అంగీకరించింది. ఇందులో కాజల్ అగర్వాల్ ఓ నాయిక. తాజాగా విశాల్ హీరోగా రూపొందుతోన్న ‘తుప్పరివాలన్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించింది. తుప్పరివాలన్ అంటే డిటెక్టివ్ అని అర్థం.
ఇందులో  కథానాయికగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తోంది. రకుల్ కంటే కాజల్ సీనియర్. రకుల్ వచ్చి నాలుగైదేళ్లవుతోంది. ఈ ఇద్దరితో పోల్చితే అక్షర జూనియర్. మరి.. ఇద్దరు సీనియర్ నాయికలున్న సినిమాలో ఓ నాయికగా నటించడమంటే అక్షరకు సవాలే. అయినా.. లోక నాయకుడు కమల్‌హాసన్ కూతురు కదా... సీనియర్స్‌కి ధీటుగా అక్షర నటిస్తుందని ఊహించవచ్చు.

Saturday, October 8, 2016

జాకీచాన్‌ను చూసినప్పుడు మాట రాలేదు!

బాలీవుడ్‌ నటి అమైరా దస్తూర్‌.. మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు, నటుడు జాకీచాన్‌తో కలిసి ‘కుంగ్‌ ఫు యోగా’ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో జాకీచాన్‌తో కలిసి నటించడం కలలాంటి అనుభవమని అమైరా అన్నారు. ‘నేను తొలిసారి జాకీ సార్‌ను కలిసినప్పుడు ఆనందం, ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. మౌనంగా ఉండిపోయా. తర్వాత జాకీచాన్‌ చాలా మంచి వారు, నేను ఏ ఫీలింగ్‌, భయం లేకుండా మాట్లాడగల ఇతర వ్యక్తుల్లాగే ఆయనా ఓ సామాన్య వ్యక్తని గ్రహించా. జాకీచాన్‌ ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడైనా తనే గొప్ప అనే విధంగా ఎప్పుడూ ప్రవర్తించరు. ఆయనతో కూడిన సన్నివేశాల్ని మొదట తీయాలని అనుకోరు. అందరు నటీనటులకు జాకీచాన్‌ ఆదర్శం.
ఆయన మాటలతో కాకుండా యాక్షన్‌తో టెక్నిక్స్‌ను చూపించడానికి ప్రాధాన్యం ఇస్తారు. సినిమా సెట్‌లో ఆయన సీన్లను షూట్‌ చేయకపోయినా, ఓ వైపు నిల్చుని జోక్యం చేసుకోకుండా షూట్‌ చూస్తుంటారు. షూటింగ్‌లో ఏదైనా లోపం ఉంది అనిపించినప్పుడు మాత్రం సలహా ఇస్తారు’ అని చెప్పారు అమైరా.

Tuesday, October 4, 2016

కొత్త జిల్లాల్లో దసరాకు సెలవు నో

 దసరా పండుగ రోజున ఉద్యోగులు విధిగా విధులకు హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రోజున కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నందు న సెలవును రద్దు చేసింది. జిల్లాల  పునర్విభజనతో సంబంధ మున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు.

 జిల్లాల ప్రారంభం రోజున ఉదయం 10:30 గంటలకల్లా కలెక్టరేట్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా వర్క్ టు సర్వ్ ఆర్డర్లను అందజేయాలని సూచించారు. అన్ని విభాగాల ఉద్యోగులకు వర్తించేలా సింగిల్ ఆర్డర్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక పునర్విభజన పరిధిలోకి రాని ఉద్యోగులు సోమవారం (10వ తేదీ) ఐచ్చిక సెలవును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
 
వేడుకలు నిర్వహించండి
నూతన జిల్లా, డివిజన్, మండలాలకు అవసరమైన ఫైళ్లు, స్టేషనరీ, ఫర్నిచర్ ఇతర సరంజామాను ఆయా కార్యాలయాలకు తక్షణం చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆవిర్భావ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యమైన ఫైళ్లను మాత్రం మాతృ (ప్రస్తుత) జిల్లా కార్యాలయాల్లోనే ఉంచాలని.. పరిపాలన కుదుటపడ్డాక సంబంధిత కార్యాలయాలకు బదిలీ చేయాలని పేర్కొంది. నూతన మండలాల్లో ఆవిర్భావ వేడుకలను ఇన్‌చార్జి అధికారులు నిర్వహించాలని కోరింది. కొత్త జిల్లాలకు కొత్త వెబ్‌సైట్, ఫేస్‌బుక్ ఖాతాలను అదే రోజున ఆవిష్కరించాలని స్పష్టం చేసింది.
 
తొలి రోజునే పని విభజన
జిల్లాల ఆవిర్భావం రోజునే ఏ అధికారి ఏ విధులు నిర్వహించాలి, ఏయే విభాగం ఏయే దస్త్రాలను పరిశీలించాలన్న అంశంపై పని విభజన జరగాలని సర్కారు ఆదేశించింది. దానివల్ల ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం ఉండదని స్పష్టం చేసింది. ప్రజల నుంచి అందే అర్జీలను పరిష్కరించేందుకు సిటిజన్ చార్టర్ అమలు పక్కాగా జరిగేం దుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇక మండలాలను ఏ, బీ, కేటగిరీ లుగా విభజించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా ఉద్యోగులను కేటాయించనుంది. ‘ఏ’ కేటగిరీలోని మండలాలకు ఉద్యోగుల కేటాయింపులో కోత ఉండదు. బీ కేటగిరీ మండలాలకు సిబ్బందిని కుదించనున్నారు. ఆయా మండలాలకు డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఉండదని అధికారవర్గాలు తెలిపాయి.

తాగి కారు నడిపిన నటుడి కుమారుడు

ప్రముఖ నటుడు అలోక్‌నాథ్‌ కుమారుడు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుపడ్డాడు. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత అలోక్‌నాథ్‌ కుమారుడు శివాంగ్‌నాథ్‌, ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి మిగిలిన స్నేహితులతో కలిసి తిరిగి వస్తుండగా, ట్రాఫిక్‌ పోలీసులు అతడి కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే అతడు కారు ఆపకుండా ఇంకా వేగాన్ని పెంచి, పారిపోవాలని ప్రయత్నించాడు. శాంతాక్రజ్‌ పోలీసులు వెంబడించి పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
శివాంగ్‌ వద్ద కనీసం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేదు. అయితే అతడి వెంట వున్న మహిళా స్నేహితులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, తామే వాహనాన్ని నడిపామని తెలిపినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం బాంద్రా ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు, పోలీసులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు మరో కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్‌ అశోక్‌ దుదే తెలిపారు. అనంతరం వాహనాన్ని సీజ్‌ చేసి, జరిమానా రూ.2,600 విధించినట్లుగా తెలిపారు.

పరుగు ఆపేశా

 ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క... అంటూ ప్రభాస్‌ ‘మిర్చి’లో ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతాడు. కథానాయిక కాజల్‌ కూడా ఇంచుమించు అదే చెబుతోంది. కాకపోతే ఇక్కడ కాజల్‌ చెబుతున్నది సినిమా కోసం కాదు, తన కెరీర్‌ గురించే. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో కొనసాగుతున్న సీనియర్‌ కథానాయికల్లో కాజల్‌ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె అవకాశాల్ని అందుకొంటోంది. సుదీర్ఘమైన ఈ ప్రయాణం కోసం మీరు అనుసరించిన వ్యూహాలు ఎలాంటివి? అని అడిగితే... ‘‘కథానాయికగా ఇంత దూరం నేను ప్రయాణం చేయాలని, ఇన్నేళ్లు నటిగా కొనసాగాలని నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. అయినా చిత్రసీమలో వ్యూహాలు, ప్రణాళికలు చెల్లుబాటవుతాయంటే నేను నమ్మను. మనం ఒకటి వూహిస్తే, వాస్తవంలో మరోటి జరుగుతుంటుంది. అందుకే తొలినాళ్లల్లో ఇదే నా చివరి సినిమా అనుకొనేదాన్ని. కొన్నాళ్ల తర్వాత కెరీర్‌పై పట్టు పెరిగింది. వరుసగా అవకాశాలొస్తున్నప్పుడు ఇక దేని గురించీ ఆలోచించే అవసరం రాలేదు. అయితే అంతా సీనియర్‌ కథానాయిక అని పిలుస్తున్నప్పట్నుంచే నా ఆలోచనల్లో మార్పులొచ్చాయి. వ్యూహం అంటారో, ఇంకేమంటారో తెలియదు కానీ.. ఇక నుంచి మాత్రం కొత్త లెక్కలతో ప్రయాణం చేయాలనుకొంటున్నా. చేసే ప్రతి పాత్ర నటిగా ఆత్మ సంతృప్తినిచ్చేలా ఉండాలనే ఆలోచనతో సినిమాల్ని ఎంపిక చేసుకొంటున్నా. ఇదివరకటి పరుగుని ఆపేశా. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ పనిచేస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది కాజల్‌.

Sunday, October 2, 2016

ముందు ఎవరితో?


మహేశ్‌బాబుతో మూడో సినిమా కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ ‘జన గణ మణ’ అనే టైటిల్ ఎప్పుడో రిజిస్టర్ చేయించారు. మహేశ్-పూరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’.. రెండూ హిట్టే. దాంతో ‘జన గణ మణ’ ప్రకటించినప్పట్నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన పనులు చేస్తూనే మరోవైపు ఎన్టీఆర్‌తో సినిమా కోసం కూడా పూరి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌తో ఆయన తీసిన ‘ఆంధ్రావాలా’ ఆశించిన విజయం ఇవ్వలేదు.

  కానీ, ఎన్టీఆర్-పూరిలు ‘టెంపర్’తో టార్గెట్ రీచ్ అయ్యారు. పూరి మార్క్ హీరోయిజంలో ఎన్టీఆర్ యాక్టింగ్ ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇజం’ విడుదలకు సిద్ధమైంది.

 ఈ నెల 5న ఆడియో, 20న సినిమా రిలీజ్. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు, ఎన్టీఆర్.. ఇద్దరితోనూ తదుపరి సినిమాలు చేయబోతున్నట్టు ఆదివారం పూరి చెప్పారు. ముందు ఎవరితో చేస్తారు? అనేది ఇక్కడి ప్రశ్న. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివ లైన్‌లో ఉన్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత చిన్న ఎన్టీఆర్ మరో సినిమా అంగీకరించలేదు. సో, ముందు మొదలయ్యేది ఎన్టీఆర్ సినిమానేనా? వెయిట్ అండ్ సీ!

ఆ విషయం రానాకు ముందే తెలుసు..!

 ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన చైతూ, సమంతల పెళ్లి విషయంలో మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు నాగచైతన్య. ఇప్పటికే తను పెళ్లి చేసుకోబోయేది సమంతనే అంటూ ప్రకటించేసిన ఈ యంగ్ హీరో ఈ విషయం తన తల్లి దండ్రుల కన్నా ముందే మరోకరికి తెలుసని చెప్పాడు.
తాను సమంతను ఇష్టపడుతున్న విషయం రానాకు ముందే తెలుసని చెప్పాడు. 'రానా నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, తను నా కజిన్ కూడా ఇద్దరం కలిసే పెరిగాం. అందుకే నా ఇష్టా ఇష్లాలన్ని ముందు తనతోనే షేర్ చేసుకుంటాను. అందుకే సమంత విషయం కూడా నాన్న కన్నా ముందే రానాకు తెలుసు' అని చెప్పాడు.

బికినీకి సై


నటి లక్ష్మీమీనన్ మైండ్‌సెట్ మారిందా? తన సహ నటీమణులకంటే వెనుక పడ్డానని గ్రహించిందా? అవకాశాలను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా? తన తాజా మాటల్లో ఇలాంటి ప్రశ్నలు సాధారణ ప్రేక్షకుడికి కూడా తెలెత్తకపోవు. కొండవాసి యువతిగా కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళాకుట్టి ఆ చిత్ర విజయం తన జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత వరుస అవకాశాలు. వాటిలో తొంబై శాతం విజయాలు వరించడంతో తమిళచిత్ర పరిశ్రమలో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది. అలాంటి సమయంలో ఆపేసిన చదువును పూర్తి చేయాలంటూ నటనకు చిన్న విరామం తీసుకుంది. అది తనపై పెద్ద ప్రభావాన్నే చూపించిందనే చెప్పాలి.

  అజిత్‌కు చెల్లెలిగా వేదాళం చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. లక్ష్మీమీనన్‌కు మంచి పేరే వచ్చింది. అయినా అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్‌లో చిత్రాలను తగ్గించుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఈ మలయాళీ భామను అడిగితే అలాంటిదేమీ లేదని బదులిచ్చింది. అయితే ఇకపై నటనపై అధిక శ్రద్ధ చూపాలని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రం ఏడో తేదీన తెరపైకి రానుందని, ఇందులో గ్లామరస్ పాత్రను పోషించానని తెలిపింది. అదే విధంగా విజయ్‌సేతుపతితో కలిసి నటించడం వినూత్న అనుభవంగా పేర్కొంది.

 తదుపరి జీవాకు జంటగా నెంజముండు నేర్మైయుండు చిత్రంలో నటించనున్నానని చెప్పింది. గ్లామర్‌కు సిద్ధం అయ్యానంటున్నారు ఈత దుస్తులు ధరించి నటిస్తారా? అన్న ప్రశ్నకు తాను స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ఈత దుస్తులు ధరించి స్మిమ్ చేశానని, అలాంటిది సినిమాల్లో ఈత దుస్తుల్లో నటించడం ఒక లెక్కా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.తనకు ఇప్పటి వరకూ ఈత దుస్తుల్లో నటించే అవకాశం రాలేదని, అలాంటి సందర్భం వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అయితే నిజ జీవితంలో ఇప్పటి వరకూ బికినీ ధరింలేదని, అందువల్ల సినిమాల్లోనూ అలాంటి దుస్తులు ధరించనని తెలిపింది. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు మోడరన్ దుస్తులు తన శరీరాకృతికి నప్పవు అని చెప్పుకొచ్చిన ఈ కేరళాకుట్టి ఇప్పుడు అలాంటి పాత్రలకు సిద్ధపడింది.రేపు బికినీ ధరించినా ఆశ్చర్యపడనక్కర్లేదు

Saturday, October 1, 2016

నాకు పెళ్లి కాదన్నారు!

 హీరోయిన్‌లు భలే అందంగా ఉంటారే.. పుట్టుకతోనే ఇంత అందంగా పుడతారేమో... శరీరాకృతి మొదలు ఆకర్షణీయమైన మేని ఛాయ...చక్కటి జుత్తు అన్నీ వందశాతం వాళ్లకే బాగుంటాయి.. నా ముఖం ఏం బాగాలేదు. మంచి రంగు లేను.. జుత్తు సరిగా పెరగడం లేదు... ఇలా అర్ధరాత్రి అద్దం ముందు కూర్చొని ఏడ్చే టీనేజ్‌ అమ్మాయిలు చాలామంది ఉంటారు. కథానాయికలు ఇందుకు మినహాయింపు కాదని బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌కపూర్‌ మాటలు వింటే అనిపిస్తుంది. సోనమ్‌ పేరు గ్లామర్‌ ప్రపంచంలో ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. టీనేజ్‌ అమ్మాయిగా ఉన్నప్పుడు సోనమ్‌కపూర్‌ కూడా తన రూపం గురించి చాలా బాధపడేదట. ‘‘చాలామంది అమ్మాయిలు ఉదయం నిద్రలేవగానే తమ ముఖాన్ని చూసుకొని హీరోయిన్లలా లేదని బాధపడుతుంటారు. నిద్రలేవగానే హీరోయిన్లు సాధారణ అమ్మాయిల్లానే ఉంటారు. దానికి నేనూ మినహాయింపు కాదు. టీనేజర్‌గా ఉన్నప్పుడు అబ్బాయిల కంటే పొడుగ్గా.. లావుగా ఉండేదాన్ని. దానికి తోడు నేను పెద్ద రంగు ఉండేదాన్ని కాదు. కుటుంబ వేడుకలకు వెళ్లినపుడు ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందా? అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేముందు చాలా ఆలోచించాను. నన్ను నేను మార్చుకున్నాను. తిండిమీద పూర్తి నియంత్రణ తెచ్చుకున్నాను. అయినా తొలి చిత్రంలో వీపు కనిపించేలా ఓ డ్రెస్‌ వేసుకోవాలంటే చాలా భయపడ్డాను’’అని చెప్పింది సోనమ్‌. ‘‘నేను ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి బయట కాలుపెట్టాలంటే ఓ గంటన్నర పాటు మేకప్‌ ఛైర్‌కు అతుక్కుపోవాల్సిందే. ఒక్క నా మేకప్‌ కోసమే ఆరుగురు పనిచేస్తారు’’అని చెప్పింది సోనమ్‌.

నా లవ్ గురించి...ఎప్పుడో క్లూ ఇచ్చా!


సెలబ్రిటీల జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ల లవ్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు. ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమలో అలా ఆసక్తిగా నిలిచిన జంట నాగచైతన్య, సమంత. వీళ్లిద్దరూ లవ్‌లో పడ్డారనే వార్త వచ్చినప్పట్నుంచీ రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘అవును.. మేం లవ్‌లో ఉన్నాం’ అని బహిరంగంగా చెప్పినా, ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడలేదు. ‘పెళ్లెప్పుడు’ అనే చర్చ జరుగుతోంది. దానికి ఇంకా టైమ్ ఉందని చెప్పేశారు.

 ఆ సంగతలా ఉంచితే.. అసలు వీళ్లిద్దరూ ఎప్పుడు లవ్‌లో పడ్డారబ్బా? అనే చర్చ జరుగుతోంది. ఇదే విషయం గురించి ఓ తాజా ఇంటర్వ్యూలో సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మొదట్లో మంచి స్నేహితుల్లా ఉండేవాళ్లమనీ, ఆ తర్వాత అది ప్రేమగా మారిందనీ సమంత పేర్కొన్నారు. ఎప్పుడు లవ్‌గా టర్న్ అయిందనే విషయం మాత్రం ఆమె స్పష్టంగా చెప్పలేదు.

 అయితే, ముందు నుంచీ నాగచైతన్యతో తన లవ్ గురించి క్లూ ఇస్తూ వచ్చానని, ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదనీ సమంత పేర్కొనడం విశేషం. ఆ విషయం గురించి సమంత మాట్లాడుతూ - ‘‘నా మొదటి సినిమా ‘ఏ మాయ చేసావె’ అప్పట్నుంచీ మా గురించి ‘హింట్’ ఇస్తూ వస్తున్నాను. కానీ, ఎవరూ ఆ విషయాన్ని గ్రహించలేదు.

 మొదట్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ‘మీతో కలసి యాక్ట్ చేసిన హీరోల గురించి వన్ వర్డ్‌లో చెప్పండి’ అని రిపోర్టర్లు అడిగితే, నాగచైతన్య గురించి చెప్పేటప్పుడు ‘ఫస్ట్ లవ్’ అనేదాన్ని. ఆ క్లూని ఎవరూ పట్టుకోలేకపోయారు. నా జీవితంలో నాగచైతన్య ముఖ్యమైన వ్యక్తి. ఇండస్ట్రీలో నా మొదటి స్నేహితుడు తనే. ఎప్పటికీ తను నాకు బెస్ట్ ఫ్రెండే. ఇండస్ట్రీలో ఒకటిగా ఎదిగాం. ఒకవేళ మేమిద్దరం కలసి ఉండలేకపోతే.. ఇక ఎవరితోనూ ఉండలేం అనిపించింది. దాంతో ఒక నిర్ణయానికి వచ్చేశాం’’ అని పేర్కొన్నారు.