Monday, October 5, 2015

టీ20 సిరీస్‌ సఫారీలదే

దక్షినాఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 17.2 ఓవర్లలో 92 పరుగులకు అలౌట్‌ అయ్యింది. దక్షిణాఫ్రికా జట్టు 17.1 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి 96 పరుగులు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. 
 స్టేడియంలోకి బాటిళ్లను విసిరిన ప్రేక్షకులు
భారత్‌ ఓటమికి చేరువుతున్న దశలో స్టేడియంలోకి ప్రేక్షకులు ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయారు. స్టేడియం నుంచి మైదానంలోకి వరుసగా బాటిళ్లను విసురుతూ మ్యాచ్‌కి అంతరాయాన్ని కలిగించారు. దీంతో మ్యాచ్‌ని అంపైర్లు రెండు సార్లు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే చివరికి పోలీసు సిబ్బంది బౌండరీ లైన్‌ వద్ద ఉంచి మ్యాచ్‌ని పూర్తి చేశారు.

చేతులెత్తేసిన భారత్‌ టాప్‌ అర్డర్‌
దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు భారత్‌ టాప్‌ అర్డర్‌ కుప్పకూలింది. మొదటి మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటామని అనుకున్న టీమిండియా ఆటగాళ్లు రెండో మ్యాచ్‌ల్లో 92 పరుగులకే అలౌట్‌ అయ్యాంది. టాస్‌ గెలిచిన సఫారీ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకున్నది. రోహిత్‌ (22), సురేశ్‌ రైనా (22) మాత్రమే ఫర్వాలేదనింపిచారు. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయ లేకపోయారు. మరో ముగ్గురు డకౌట్‌గా అయ్యారు. సఫారీ బౌలర్లలో మోర్కెల్‌ 3, మోరీస్‌ 2, తాహిర్‌ 2, రబాడ ఒక వికెట్‌ తీశారు.