Monday, June 6, 2011

తొలి వన్డేలో భారత్‌ విజయం

 భారత్‌- వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 214 పరుగులు చేసి తోమ్మిది వికెట్లు కోల్పోయింది. శర్వాణ్‌ను 56, శ్యాముల్స్‌ 55 పరుగులు చేసి జట్టు అదుకున్నారు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకు అవుట్‌ అయ్యారు. భారత్‌ బౌలింగ్‌లో హర్భజన్‌ సింగ్‌ పది ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ప్రవీణ్‌ కుమార్‌, మునాఫ్‌ పటేల్‌ ,రైనా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 29 పరుగుల వద్ద మొదటి వికెటు కోల్పోయింది. పార్థివ్‌ పటేల్‌ 13 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన విరాట్‌ కోహ్లీ 2 పరుగులు చేసి నిరాశపరిచాడు.ధావన్‌ తోడుగా బధ్రీనాత్‌ ఉన్నాడు. ఇద్దరు మంచి ఆడుతున్న సమయంలో మళ్లీ వికెట్లు పడింది. బధ్రీనాత్‌ 17 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. 15 ఓవరల్లలో భారత్‌ 61 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ శర్మ, ధావన్‌ ఇద్దరు క్రీజులో ఉన్నారు. ధావన్‌ 76 బంతులలో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ల సహాయంతో 51 పరుగులు చేశాడు. కెప్టెన్‌ సురేష్‌ రైనా 50 బంతులలో నాలుగు ఫొర్లులతో 43 పరుగులు చేశాడు.యూసుఫ్‌ పఠాన్‌ 10 పరుగులు చేశాడు. భారత్‌ 44.5 బంతులలో 217 పరుగులు చేసి లక్ష్యం సాధించింది. రోహిత్‌ శర్మ 68 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. చివరిలో వైస్‌ కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌ సిక్స్‌ కొట్టి విజయం సాధించింది. వెస్టిండీస్‌ బౌలింగ్‌లో రామ్‌పాల్‌, మార్టిన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచÊ రోహిత్‌ శర్మ ఎంపికయ్యాడు.

నమస్తే తెలంగాణ దినపత్రిక విడుదల

నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఈరోజు ఉదయం 11 గంటలకు అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. సోమవారం రవీంద్రభారతిలో జరిగిన ఆవిష్కరణ కారక్రమానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, జయశంకర్‌, కోదండరామ్‌, కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.