Monday, January 31, 2011

కోచ్చి కెప్టెన్‌గా బెంగాలీ టైగర్‌ ?


మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ నాలుగవ ఐపీఎల్‌ సీజన్‌లో కోచ్చి జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యే అవకాశం ఉంది. దీన్ని కొచ్చి ఫ్రాంఛైజీ సూత్రప్రాయంగా అంగీకరించింది. శుక్రవారం జరిగే ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో గంగూలీ భవిష్యత్‌ తేలనున్నది. ఈ సమావేశంలో వేలంలో అమ్ముడుపోని భారత ఆటగాళ్లను ఏపద్దతుల్లో వివిధ ఫ్రాంచైజీలు తీసుకోవాలనే విషయంపై చర్చలు జరపునున్నారు. ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చిన తరువాత కోచ్చి ఫ్రాంచైజీ గంగూలీ అభిప్రాయం కోరుతూ ఒక లేఖ రాయనున్నది. ఇతర తొమ్మిది ఫ్రాంచైజీలను కూడా నో అజ్జక్షన్‌ సర్టిఫికెట్‌ అడగనున్నది. నాలుగవ ఐపీఎల్‌ సౌరబ్‌ను కొనాలని కోచ్చి ఫ్రాంచైజీ ఆసక్తిని చూపిస్తోంది. దీనికి సౌరవ్‌ కూడా అంగీకరించగలడని ఆశాభావం వ్యక్తం చేసింది.

త్రిష కోరిక తీర్చిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌

 '' మీరు కనుక అంగీకరిస్తే ఎన్నాళ్లుగానో నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకుంటూ'' అని ఫ్లయిట్‌ ఎక్కగానే తెల్లని కాగితంలో ముత్యాలను తలపించే దస్తూరీతో పైలట్‌కి రాసి పంపిస్తుంటారట త్రిష. ' కాకిపిట్‌' లో కూర్చుని విమానాన్ని పైలట్‌ ఎలా నడుపుతున్నారో చూడాలన్న త్రిష కోరిక. ఇది చిన్న కోరికేం కాదు. అయినా సరే ఎలగైనా తీర్చుకోవాలి త్రిష పంతం పట్టారు. విమానిం ఎక్కిన ప్రతిసారీ తన ప్రొపైల్‌ను ఎయిర్‌ హేస్టస్‌కి ఇచ్చి పైలట్‌కి అందజేయమని కోరుతుంటారట త్రిష.
గత కొన్ని సంవత్సరాలు ఈ వ్యవహారం సాగుతోంది. దానికి కారణం తమతో పాటు కాక్‌పిట్‌లో ప్రయాణీకులు ఉంటే అధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్న భయమే. ఇటీవల తన కోరిక నెరవేరిందని సమాచారం. ఎప్పటిలానే త్రిష విమానం ఎక్కి తన సీట్లో కూర్చోగానే పైలట్‌కు ప్రొపైల్‌ పంపించారట. ఈ సారి కూడ ' నో ' అనే సమాధానమే వస్తుందని ఫిక్స్‌ అయ్యారట. కానీ పైలట్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో త్రిష ఆశ్చర్యపోయారట. కాక్‌పిట్‌లో కూర్చుని విమానాన్ని పైలట్‌ ఎలా కంట్రోల్‌ చేస్తున్నారో కాసేపు తిలకించి త్రిష ఆనందపడ్డారట. తన కోరిక నెరవేరినందుకు శ్రేయోభిషుల దగ్గర ఆ ఆనందాన్ని కూడా పంచుకున్నారట. ఇంతకీ త్రిష కోరిక తీర్చినది మన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ కాదు .. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ అటజ