Thursday, February 17, 2011

ఘనంగా ప్రపంచ కప్‌ ప్రారంభోత్సవం

 నలభై ఐదు రోజుల పాటు అభిమానులను ఆనందోత్సాహాల్లో నింపేందుకు క్రికెట్‌ కార్నవాల్‌గా అభివర్ణించతగ్గ ఐసిసి ప్రపంచకప్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌ రాజధాని నగరంలోని చారిత్రాత్మకమైన బంగబంధు స్టేడియం ప్రారంభోత్సవ వేడుకలకు వేదికగా నిలిచింది. ఈ మెగా పండుగను బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రారంభించారు.
 వేలాది మంది ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఈ పోటీలు ప్రారంభమయ్యాయని ఆమె ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు తమ దేశాన్ని ఎంపిక చేసినందుకు ఆమె అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్‌ సంప్రదాయానికి అనుగుణంగా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న 14 దేశాల జట్ల కెప్టెన్లు రిక్షాలో మైదానంలోకి రావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఆరంభమైంది. చివరగా బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వచ్చినపుడు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పారు. ధోనీకి కూడా వారు పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. 15 సంవత్సరాల తరువాత భారత ఉపఖండంలో ప్రపంచకప్‌ తిరిగివచ్చింది.
 బంగ్లాదేశ్‌లో ఈ మెగా టోర్నమెంట్‌ జరగడం ఇదే ప్రథమం. 1971లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత ఇంతటి పెద్ద టోర్నమెంట్‌ బంగ్లాదేశ్‌లో జరగడం ఇదే ప్రథమం. ఈ నెల 19న భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగనున్న ప్రారంభమ్యాచ్‌తో ఈ మెగా టోర్నమెంట్‌ ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం తమకు కలగడం పట్ల బంగ్లాదేశ్‌లో క్రికెట్‌ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తొలి మ్యాచ్‌లో తమ జట్టు గెలవగలదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు కనీసం క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోగలదని వారు భావిస్తున్నారు.

ఘనంగా ప్రారంభమైన ప్రపంచకప్‌ వేడుకలు

 ప్రపంచకప్‌ క్రికెట్‌ ఆరంభ కార్యక్రమాలు ఢాకా నగరంలోని బండబందు స్టేడియంలో ఘనంగా ప్రారంభమైనాయి. వివిధ దేశాలకు చెందిన కెప్టెన్లను బంగ్లాలోని సంప్రదాయ రిక్షాలో కూర్చో బెట్టి స్టేడియంలోకి తీసుకువచ్చారు. ఈ టోర్నిలో 14 దేశాలు, 210 మంది క్రీడాకారులు పాలుపంచుకున్నారు.

ఐసుపై మోజు పడ్డ సంజు!


అమితాబ్‌-హేమమాలిని జంటగా రూపొంది ఘన విజయం సాధించిన ‘సత్తే పె సత్తే’ చిత్రాన్ని సంజయ్‌దత్‌తో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో హేమమాలిని పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి.అయితే.. విద్యాబాలన్‌ను తామెప్పుడూ అనుకోలేదని, తొలుత నుంచి ఈ పాత్రకోసం ఐశ్వర్యను మాత్రమే తాము అనుకుంటూ వచ్చామని హీరో సంజయ్‌దత్‌ చెబుతున్నాడు.ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే. ఆరుగురు తమ్ముళ్లకు వదినగా ఐశ్వర్య అయితేనే బాగుంటుందని భావిస్తున్న సంజయ్‌దత్‌.. ఆమె డేట్స్‌ కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించేందుకు తాను సిద్ధమేనంటున్నాడు. అటు ఐశ్వర్య కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.కాబట్టి.. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లడం ఖాయం!

ఐపీఎల్‌-4 షెడ్యూల్‌ విడుదల


అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్‌-4 టోర్నీ షెడ్యూల్‌ను ఐపీఎల్‌ పాలకమండలి బుధవారం ఇక్కడ విడుదల చేసింది. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న దృష్టా ఇంకా దీనికి తుది ఆమోదాన్ని ఇవ్వలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని నేతృత్వం వహిస్తున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెనై్న సూపర్‌ కింగ్స్‌, కోల్‌కత నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య చెనై్నలోని ఎమ్‌ఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మే 28 వ తేదీన టోర్నీ నిర్వహించబోయే కొన్ని నగరాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నందున్న ఆయా రాష్ట్రాల అధికారులను సంప్రదించిన అనంతరం. టోర్నీ షెడ్యూల్‌కు తుది అమోదాన్ని ఇస్తామని ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌ చిరాయు అమీన్‌ వెల్లడించారు.
74 మ్యాచులు: టోర్నీలో మొత్తం 74 మ్యాచులను నిర్వహించనున్నారు. వీటిన నిర్వహణ కోసం వివిధ నగరాల్లో ఎంపిక చేసిన 13 వేదికలను ఎంపిక చేశారు. ఈ మ్యాచులన్నీ మొత్తం 51 రోజుల పాటు జరగనున్నాయి.
క్రొత్త ఫార్మాట్‌
ఈసారి టోర్నీని కొత్త ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఫైనల్స్‌కు అర్హత సాధించడానికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు కొత్తగా ప్రవేశపెట్టిన ప్లే ఆఫ్‌ మ్యాచులను ఆడాల్సి ఉంటుంది. ఈ ప్లే ఆఫ్‌ మ్యాచులను క్వాలిఫైయర్‌-1, 2 లుగా వర్గీకరించారు. లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆ తర్వాతి దశ అయిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌-1 (క్వాలిఫైయర్‌-1)లో పోటీపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తుంది.