Sunday, January 9, 2011

దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం

<b>మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోహిత్‌ శర్మ లభించింది.</b>
 ఇక్కడ జరిగిన ఏకైక ట్వంటీ- 20 మ్యాచ్‌లో దణాఫ్రికాపై భారత్‌ 21 తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన దక్షాణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను వాన్‌విక్‌ దాటిగా ప్రారంభించాడు. ఐదు ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 50 పరుగులు చేసింది. ఒక్క పక్క వికెట్లు పడుతుండగానే తన అర్థసెంచరీని పూర్తి చేశారు. ఆమ్లా 1, ఇంగ్రామ్‌ 2, డివిల్లియర్స్‌ 14, డుమినీ 0, పానెల్‌ 14, మిల్లర్‌ 10, బోథా 25, పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. థీయర్‌ 1 , ఎన్‌తిన్‌ 1 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. భారత్‌ బౌలింగ్‌లో నెహ్రా, యూసుప్‌ పఠాన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్‌ కుమార్‌, మునాఫ్‌ పటేల్‌ , అశ్విన్‌ , యువరాజ్‌ సింగ్‌ తలో వికెట్టు తీసుకున్నారు. అంతక ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 53, రైనా 41, కోహ్లీ 28, విజరు 14, యువరాజ్‌ సింగ్‌ 12, ధోనీ 10, పఠాన్‌ 6 పరుగులు చేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోహిత్‌ శర్మ లభించింది.

రెండో రోజూ ఐపీఎల్‌ -4 వేలంలో సీనియర్లకు నిరాశే

బెంగుళూరులో జరిగిన రెండు రోజుల వేలంలో సీనియర్లను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. రూ. 3.45 కోట్లతో ఉమేష్‌ యాదవ్‌ను ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ దక్కించుకుంది. రూ.3.22 కోట్లతో మునాప్‌ పటేల్‌ను ముంబయి ఇండియన్స్‌ కొనుక్కుంది. రూ. 3.22 కోట్లతో వేణుగోపాల్‌ను ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తీసుకుంది. రూ. 2.3 కోట్లతో లక్ష్మీపతి బాలాజీని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దక్కించుకుంది. రూ. 1.33 కోట్లతో వినరుకుమార్‌ను కోచి తీసుకుంది. రూ. 1.1 కోట్లతో త్యాగిని చెన్నై సూపర్‌కింగ్స్‌ తన జట్లులో చేర్చుకుంది. రూ. 1.73 కోట్లతో అశోక్‌దిండాను ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, రూ. 1.3 కోట్లతో అభిమాన్యు మిధున్‌ను బెంగుళూరు రాయల్స్‌ చాలెంజర్స్‌ దక్కించుకున్నాయి.