Wednesday, January 6, 2016

తిరిగి ఇచ్చేయాలి... లేకపోతే వాళ్లు రోడ్డున పడతారు!

 ‘మనకింత చేసిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం’ అని ‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ చాలామంది పై ప్రభావం చూపించింది. కొంచెం అటూ ఇటూగా హిందీ హీరో, హీరోయిన్ రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె కూడా ఈ డైలాగ్‌లో ఉన్నట్లుగా చేశారట. ఈ మాజీ ప్రేమికులు ఇటీవల నటించిన ‘తమాషా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, పరాజయాన్ని చవిచూసింది.  ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ని చూపించి, చిత్రనిర్మాతలు ‘తమాషా’ని బాగానే అమ్మారట. కానీ, సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పంపిణీదారులు భారీ ఎత్తున నష్టపోయారు. కొంతమంది రొడ్డుకొచ్చే పరిస్థితిలో ఉన్నారని టాక్.  తాము తీసుకున్న పారితోషికంలో కొంతలో కొంత అయినా తిరిగిస్తే, పంపిణీదారులకు కొంత ఊరట లభిస్తుందని భావించిన రణ్‌బీర్ 10 కోట్ల రూపాయలు, దీపిక 5 కోట్లు వెనక్కి ఇచ్చేశారట.  అంటే.. దీపిక సగం పారితోషికం వెనక్కి ఇచ్చినట్లే. వీరిద్దర్నీ చూసి, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా స్పూర్తి చెందారట. ఆయన దర్శకత్వం వహించిన ‘బాంబే వెల్వట్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌కు తన పారితోషికంలో కొంత తిరిగి ఇచ్చేయాలని అనురాగ్ డిసైడ్ అయ్యారట. భేష్.. బాగుంది కదూ!

ఒత్తిడిలో ఉన్నప్పుడు నేను అదే చేస్తా

 సినీతారలకు సాధారణంగానే  ఒత్తిడి ఎక్కువ. కొంతమంది తాము పడుతున్న బాధ బయటకు చెబుతారు. మరికొంత మంది చెప్పరు. ఇటీవల దీపికా పదుకొనే తన స్ట్రెస్ లెవల్స్ గురించి మీడియా ముందు చెప్పి అందరికీ షాకిచ్చారు. చాలా మంది ఈ స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్‌లను తగ్గించుకోవడానికి తమదైన శైలిలో సొంత దారులు వెతుక్కుంటారు. ఇక ఆలియా భట్  అయితే తాను ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు షారుక్‌ఖాన్ పాటలు వింటా నంటున్నారు.
                 అవి గనక వినకపోతే చచ్చిపోతానని చెబుతున్నారు. ‘‘ఈ మధ్య ఆలియాభట్ నటించిన ‘షాన్‌దార్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆలియా ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకు న్నారు. కానీ ఫలితం వేరేలా రావడంతో నిరాశలో పడిపోయారు. కొన్నాళ్లు మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. మళ్లీ ఈ మధ్యే కాస్త బయటకు వచ్చిన ఆలియా ఆ ఫలితం గురించి మాట్లాడారు. ‘‘నేను ‘షాన్‌దార్’ సినిమా ఎంచుకున్నందుకు బాధపడడం లేదు. ఒక్కోసారి అనుకున్నవి జరగవు. మొదట్లో  కాస్త  ఒత్తిడికి గుర య్యా కూడా. ఇలాంటి  టైమ్‌లోనే నాకిష్టమైన షారుక్ పాటలు వింటూ రిలాక్స్ అవుతా.  చిన్నతనం నుంచి షారుక్ వీరాభిమానిని. ఆ పాటలు వింటే చాలు. ఇక సైకియాట్రిస్ట్ అవసరం లేదు’’ అని ఆలియా చెప్పుకొచ్చారు.