Monday, February 14, 2011

ఐదు రోజుల్లో దొంగల ముఠా సినిమా ఘాటింగ్‌ పూర్తి

 దొంగల మూఠా సినిమా ఘాటింగ్‌ మునుపే చెప్పినట్లుగా ఐదు రోజుల్లో , కేవలం ఎనిమిది మంది క్య్రూమెంబర్స్‌తో దిగ్విజయంగా పూర్తియ్యింది. అందరూ ఊహించుకున్నట్లుగా ఘాటింగ్‌ ఇరవై నాలుగు గంటల షెడ్యూల్‌తో కాకుండా కేవలం సాదారణ పని గంటలలో, ఏ ఒక్క రోజు నిర్ధేశించిన సమయం మించకుండా పూర్తి చేయడం జరిగింది.
ఇంత వరకూ మొత్తం ఫిలం ఇండ్రస్టీలోనే ఎవరూ ఊహించని విధంగా ఆలోచించి, దానికి ఈ విధంగా కార్యరూపం ఇవ్వడం సినిమా మేకింగ్‌ లోనే ఒక సరి కొత్త అధ్యాయానికినాంది. నాలుగు కెనాన్‌ కెమెరాలను ఉపయోగించి. ఒకేసారి నాలుగు అంగిల్స్‌ లో ప్రతీ షాట్‌ తీయడం వల్ల అత్యంత వేగంగా ఘాట్‌ చేయడం సాధ్యపడింది.
అసలు లైట్స్‌ మరియు డాలి, జిబ్‌ మొదలుగు ఎక్విప్‌మెంట్స్‌ ఉపయోగించకుండా సినిమా మొత్తం సహజమైన లైటింగ్‌లో చేయడం జరిగింది. రవితేజ, ఛార్మి, ప్రకాష్‌ రాజ్‌, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజ్‌, బ్రహ్మాజి, మరియు సుప్రిత్‌ మొదలగు వారున్న ఈ సినిమాను ఇండస్టీలోనే మొదటి సారిగా జీరో బడ్జెట్‌ తో నిర్మించడం జరిగింది. ఆక్టర్లకని గాని, టెక్నీషియన్లకు ఎటువంటి రెమ్యునరేషన్‌ ఇవ్వబడలేదు. మార్చి 4న ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతోంది.

ప్రాక్టీస్ గెలుపు

బౌలర్ల విజయం

ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఆదివారం నాడిక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ విఫలమై 214 పరుగులకు ఆలౌటైనప్పటికీ బౌలర్లు, ముఖ్యంగా పియూష్‌ చావ్లా, హర్భజన్‌ సింగ్‌ భారత్‌కు అద్భుత విజయం అందించారు. వన్డే మ్యాచ్‌ మజాను భారత బౌలర్లు అందించారు. ఒక వికెట్‌ నష్టానికి 118 పరుగులతో విజయంవైపు దూసుకెళుతున్న ఆసీస్‌కు పియూష్‌ చావ్లా అడ్డుకట్ట వేసాడు. చావ్లా తొమ్మిది ఓవర్లలో 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. హర్భజన్‌ సింగ్‌ ఐదు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌ 37.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. రెండో వార్మప్‌ మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో జరుగుతుంది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 214 పరుగులు మాత్రమే చేయ్యగలిగింది. భారత బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. భారత్‌ నిర్ణీత 44.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఒక్కడే భారత బ్యాట్స్‌మెన్‌లో రాణించి అర్ధసెంచరీ చేసాడు. సెహ్వాగ్‌ 56 బంతులను ఎదు ర్కొని ఎనిమిది బౌండరీలు, ఒక సిక్సర్‌తో 54 పరుగులు చేసాడు. వీరూ తరువాత చెప్పు కోతగ్గ స్కోరు చేసింది యూసుఫ్‌ పఠాన్‌. పఠాన్‌ 38 బంతుల్లో రెండు సిక్సర్లతో 32 పరు గులు చేసాడు. 

 కెనాడాపై బంగ్లా విజయం
చిట్టగాంగ్‌లో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొమ్మిది వికెట్ల తేడాతో కెనడాను ఓడించింది. తొలిగా బ్యాటింగ్‌ చేసిన కెనాడా 37.3 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్‌ కాగా విజయానికి అవసరమైన 113 పరుగులను బంగ్లాదేశ్‌ ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఇంకా 184 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ 69, ఇమ్రుల్‌ కేయిస్‌ 39 పరుగులు చేసారు. తొలి వికెట్‌కు వీరు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బౌలింగ్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ రాణించి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
కెన్యాపై విండీస్‌ విజయం
కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. కెన్యాను 45.3 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్‌ చేసింది.  
గుప్తిల్‌ సెంచరీ
ఐర్లండ్‌తో శనివారం నాగపూర్‌లో జరిగిన మరో వార్మప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ గుప్తిల్‌ సెంచరీ చేసాడు. గుప్తిల్‌ సెంచరీతోపాటు వన్‌డౌన్‌ జెస్సీ రైడర్‌ 48, ఫ్రాంక్లిన్‌ 49 పరుగులు చేయడంతో న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆరంభంలోనే బ్రెండన్‌ మెక్‌కలమ్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌ రెండో వికెట్‌కు రైడర్‌, గుప్తిల్‌ 79 పరుగులు చేయడంతో కోలుకుంది. టేలర్‌ 33 పరుగులు చేయడంతోపాటు గుప్తిల్‌తో కలసి 47 పరుగులు జోడించాడు. ఇందులో టేలర్‌ వాట 33 పరుగులు . గుప్తిల్‌ 134 బంతుల్లో 12 బౌండరీలు, మూడు సిక్సర్లతో 130 పరుగులు చేసాడు. ఐర్లండ్‌ ఓపెనర్‌ పోర్టర్‌ఫీల్డ్‌ 72 పరుగులు చేయడం విశేషం. కడపటి వార్తలు అందే సమయానికి ఐర్లండ్‌ 35 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
  శ్రీలంక
మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై శ్రీలంక 156 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేయగా నెదర్లాండ్స్‌ 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ అర్ధసెంచరీలు చేయడం విశేషం. 

పోటీ మా ముగ్గురు మధ్యే ...

భారత జట్టులో స్థానం కోసం విరాట్‌ కోహ్లీ, యూసుప్‌ పఠాన్‌ మధ్య తీవ్రంగా పోటీ మొదలైయిదని సురైష్‌ రైనా అన్నాడు. ఏడుగురు బ్యాట్‌మైన్స్‌లో సచిన్‌, వీరు, గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, ధోనీలు ఖారారు కాగా.... మిగిలినా రెండు స్థానాలు కోసం పోటీ ముగ్గురు తలపడుతున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్‌కోహ్లీ, యూసుఫ్‌ పఠాన్‌ ఇద్దరు రాణించగా.. రైనా విఫలమవడంతో అతని స్థానానికి ముప్పు వచ్చింది.