Tuesday, February 1, 2011

సచిన్‌ డబుల్‌ సెంచరీ గొప్పా.... సెహ్వాగ్‌ ట్రిఫుల్‌ సెంచరీ గొప్పా.....

 త్వరలో ప్రపంచకప్‌ ప్రారంభంమవుతుంది ముఖ్యంగా టీం ఇండియా ఇద్దరి మీద ఆదరపడిఉంది. ఒకటి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌, మరొకరు డేరింగ్‌ ఆండ్‌ డాషింగ్‌ ఓపెనర్‌ వీరు. దీనిబట్టి చూస్తే సచిన్‌ గొప్పా సెహ్వాగ్‌ గొప్పా అంటే. యస్‌ సచిన్‌నే గొప్ప అంటారు చాలా మంది. కానీ సెహ్వాగే గొప్ప అంటారు నాలాంటి చాలా మంది వీరు అభిమానులు.
సచిన్‌ : ఇత
ని గురించి ఎంత చెప్పినా తక్కువ రికార్డుల దీరుడు. వన్డేల్లో , టెస్టుల్లో మొత్తం కలిపి 97 సెంచరీల సాధించి సెంచరీల సెంచరీకి దగ్గరలో ఉన్నాడు.ఈ వివరాలు చాలు సచిన్‌ ది గ్రేట్‌ అని చెప్పడానికి. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకూ డబుల్‌ సెంచరీ చేసిన ఏకైక మొనగాడు ఒక్కడే అతడా మన లిటిల్‌ మాస్టర్‌ టెండూల్కర్‌.
సెహ్వాగ్‌ : వీరేంద్ర సెహ్వాగ్‌ క్రీజులో ఉంటే చాలు పరుగుల వరద జలజలా పారుతుంది. ఫోర్లు సిక్సర్లు అలవోకగా మంచినీళ్లు తాగినంత సులభంగా బాదే సెహ్వాగ్‌ క్రీజులో ఉంటే ఎదుటి జట్టు
కువెన్నులో వణుకు పడుతూనే ఉంటుంది. వీరు ఉన్నత సేపు స్కోరు బోర్డు ఇలా చూస్తూంటే అలా చకచకా వెళ్లిపోతుంది. అతను క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఏ బౌలర్‌ అయినా... స్పిన్‌ అయినా, ఫాస్ట్‌ అయినా..! ఒక్కటే 'వీర' బాదుడు. ఇందులో ఇంకో విషయం తక్కువ స్కోరు వద్ద వికెట్‌ పడిందంటే అది సెహ్వాగ్‌ అని ప్రతి ఒక్కరు అనుకఁటారు. ఇది కూడా నిజం. అతను అడిన 5 బంతులలో ఒక ఫోరు తప్పని సరిగా వుంటుంది. తక్కువ బంతులలో క్కువ  స్కోరు చేసి జట్టుకు వేగంగా పరుగుల అందిస్తాడు. అతని స్కోరు 300 ఉన్నా, 350 ఉన్నా అట తీరు మాత్రం ఒక్కటే. స్కోరు చాలా వుందికదా అని చూడడం అలవాటు లేదు.
సెహ్వాగ్‌ ఆడుతున్నంత సేపు ప్రేక్ష
కుడు టీవి ముందునుంచి కదలడంటే వీరు ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసంరంలేదు. భారత్‌ బ్యాట్స్‌మెన్లలో ఇంత వరకూ ట్రిఫుల్‌ సెంచరీ చేసిన మొనగాడు సెహ్వాగ్‌ మాత్రమే ఒక్క సారి కాదు ఏకంగా రెండు సార్లు చేసి క్రికెట్‌ విష్లేశకుల ప్రశంసలు పొందాడు మన వీరు. మరి సచిన్‌ డబుల్‌ సెంచరీ గొప్పా సెహ్వాగ్‌ ట్రిఫుల్‌ సెంచరీ గొప్పా అంటే దేనికదే గొప్ప అంటారు. కానీ నాకు అదికాదు కావల్సింది రెండింటిలో ఏది గొప్ప అనే అంశం మీద మీ అభిప్రాయం ఏమిటి....?
మీ స్నేహితుడు

త్రిపాత్రాలో రజనీ ' రాణా '

 దక్షిణా భారత్‌ చలన చిత్ర సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చాలాకాలం తరువాత త్రిపాత్రాభినయంతో వెండి తెరపై కన్పించబోతున్నారు. అభిమానుల్ని మెస్మరైజ్‌ చేయడానికి ' రాణా ' రూపంలో ఆయన రాబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. సింగిల్‌, డబుల్‌ రోల్స్‌తో బాక్సాఫీసుల్పీ బద్దలు కొట్టిన రజనీకాంత్‌ తాజాగా త్రిపాత్రాబియనం చేయడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి రాణా అనే పేరును పెట్టారు. దీనిని అక్కర్‌ స్టూడియోస్‌, ఎరోస్‌ ాంటర్నేషనల్‌ మీడియా లిమిటెడ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. తమిళం, తెలుగు, హందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం ఘాటింగ్‌ మార్చిలో మొదలుకానున్నది. రజనీ కాంత్‌తో ముత్తు పడయప్ప ( నరసింహ ) వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని తీసిన ప్రముఖ దర్శకుడు కేఎస్‌రవికుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నందున ప్రజల్లో అంచనాలు మరింత పెరగనున్నాయి. ' ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చే ఈ చిత్రానికి ఛాయగ్రహం రత్నవేల్‌, ఎడిటింగ్‌ ఆంటోని అందించనున్నారు. అలాగే రజనీకాంత్‌ చిన్న కుమారై సౌందర్య ఈ చిత్రానికి టెక్నికల్‌ ఆండ్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌గా వ్వవహరించనున్నారు. ఈ చిత్రాన్ని 2012 ఫిబ్రవరి లో విడుదల చేస్తారు. ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనేను ఎంపిక చేసినట్లు సమాచారం.

నవ్యుల డాన్‌ పుట్టిన రోజు ..

పూర్తి పేరు : కన్నెగంటి బ్రహ్మానందం.
తండ్రి : కన్నెగంటి నాగలింగాచారి
తల్లి పేరు : కన్నెగంటి లక్ష్మీనరసమ్మ
పుట్టిన తేది : ఫిబ్రవరి 1, 1956
పుట్టిన ఊరు : గుంటూరు జిల్లా, సత్తెనపల్లి, తాలూకా ముప్పాళ్ల
నవ్యుల

డాన్‌ అంటే బ్రహ్మానంద. బ్రహ్మానందం గురించి ఎంత చెప్పిన తక్కువే. అయన 300 పైగా సినిమా తీశాడు. ఆయన తీసిన ప్రతి సినిమా నవ్వులతో ప్రేక్షకులను ఆక్షరించడమే ఆయన ఆనందం. తీహాస్మానికే కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే బ్రహ్మానందం అతధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్నారు. రాష్ట్రప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును అందుకున్న హాస్యబ్రహ్మ అతడు.