Monday, January 31, 2011

కోచ్చి కెప్టెన్‌గా బెంగాలీ టైగర్‌ ?


మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ నాలుగవ ఐపీఎల్‌ సీజన్‌లో కోచ్చి జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యే అవకాశం ఉంది. దీన్ని కొచ్చి ఫ్రాంఛైజీ సూత్రప్రాయంగా అంగీకరించింది. శుక్రవారం జరిగే ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో గంగూలీ భవిష్యత్‌ తేలనున్నది. ఈ సమావేశంలో వేలంలో అమ్ముడుపోని భారత ఆటగాళ్లను ఏపద్దతుల్లో వివిధ ఫ్రాంచైజీలు తీసుకోవాలనే విషయంపై చర్చలు జరపునున్నారు. ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చిన తరువాత కోచ్చి ఫ్రాంచైజీ గంగూలీ అభిప్రాయం కోరుతూ ఒక లేఖ రాయనున్నది. ఇతర తొమ్మిది ఫ్రాంచైజీలను కూడా నో అజ్జక్షన్‌ సర్టిఫికెట్‌ అడగనున్నది. నాలుగవ ఐపీఎల్‌ సౌరబ్‌ను కొనాలని కోచ్చి ఫ్రాంచైజీ ఆసక్తిని చూపిస్తోంది. దీనికి సౌరవ్‌ కూడా అంగీకరించగలడని ఆశాభావం వ్యక్తం చేసింది.

త్రిష కోరిక తీర్చిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌

 '' మీరు కనుక అంగీకరిస్తే ఎన్నాళ్లుగానో నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకుంటూ'' అని ఫ్లయిట్‌ ఎక్కగానే తెల్లని కాగితంలో ముత్యాలను తలపించే దస్తూరీతో పైలట్‌కి రాసి పంపిస్తుంటారట త్రిష. ' కాకిపిట్‌' లో కూర్చుని విమానాన్ని పైలట్‌ ఎలా నడుపుతున్నారో చూడాలన్న త్రిష కోరిక. ఇది చిన్న కోరికేం కాదు. అయినా సరే ఎలగైనా తీర్చుకోవాలి త్రిష పంతం పట్టారు. విమానిం ఎక్కిన ప్రతిసారీ తన ప్రొపైల్‌ను ఎయిర్‌ హేస్టస్‌కి ఇచ్చి పైలట్‌కి అందజేయమని కోరుతుంటారట త్రిష.
గత కొన్ని సంవత్సరాలు ఈ వ్యవహారం సాగుతోంది. దానికి కారణం తమతో పాటు కాక్‌పిట్‌లో ప్రయాణీకులు ఉంటే అధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్న భయమే. ఇటీవల తన కోరిక నెరవేరిందని సమాచారం. ఎప్పటిలానే త్రిష విమానం ఎక్కి తన సీట్లో కూర్చోగానే పైలట్‌కు ప్రొపైల్‌ పంపించారట. ఈ సారి కూడ ' నో ' అనే సమాధానమే వస్తుందని ఫిక్స్‌ అయ్యారట. కానీ పైలట్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో త్రిష ఆశ్చర్యపోయారట. కాక్‌పిట్‌లో కూర్చుని విమానాన్ని పైలట్‌ ఎలా కంట్రోల్‌ చేస్తున్నారో కాసేపు తిలకించి త్రిష ఆనందపడ్డారట. తన కోరిక నెరవేరినందుకు శ్రేయోభిషుల దగ్గర ఆ ఆనందాన్ని కూడా పంచుకున్నారట. ఇంతకీ త్రిష కోరిక తీర్చినది మన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ కాదు .. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ అటజ

Sunday, January 30, 2011

' మిరపకాయ్ ' సస్సెస్‌మీట్‌


రవితేజ కథానాయకుడి హరీష్‌ శంకర్‌ యస్‌. దర్శకుడిగా ఎల్లో ప్లవర్స్‌ పతాకంపై రమేష్‌ పుష్పాల నిర్మిస్తున్న ' మిరపకారు ' సినిమా సస్సెస్‌మీట్‌ తాజ్‌దక్కన్‌ హోటల్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో రమేష్‌పుప్పాల, రవితేజ, ఆలీ, బ్రహ్మాజీ, రిచా గంగోపాద్యాయ, సునిల్‌, స్నిద్గ, దీక్షాసేత్‌, దువ్వాసి మోహన్‌, తమన్‌, సాహితి, రామ్‌ ప్రసాద్‌, గౌతమ్‌రాజ్‌, హరీష్‌ శంకర్‌, ఫిష్‌ వెంకట్‌, గిరి, భాస్కర్‌ తదితరులు హజరయ్యారు.
రవితేజ మాట్లాడుతూ ..

 ఈ విజయం చాలా ఆనందాన్ని ఇ చ్చింది. దర్శకుడు నిర్మాతకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు, సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు, స్నిగ్ద వాయిస్‌కు విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది అన్నారు.
సునిల్‌ మాట్లాడుతూ ..
ఆంధ్రా అంతా మిరపకాయ్ తోటలాగా పాకి పోయింది. సినిమా చూసి ఒక ఆడియన్‌గా చాలా ఆనందించాను. సూపర్‌హిటÊ అవుతుందని చెప్పాను. రొటీన్‌ కమర్షియల్‌ సినిమా అని క్రిటిక్స్‌ అన్నారు. అయితే రవితేజ గారి ప్రయోగాత్మక సినిమాలు చేశారు. అయితే అవి ఆశించినంతగా ఆడలేదు. అయితే ఇ ది శాంపిల్‌ మాత్రమే. ముందు అసలు సినిమా చూస్తారు.
ఆలీ మాట్లాడుతూ..
ఈ బేనర్‌ పెట్టడంతోటే సక్సెస్‌ స్టార్ట్‌ అయింది. ఈ బేనర్‌ పేరు అలాంటిది. భవిష్యత్‌లో తీసిన సినిమాలు తప్పకుండా విజయవంతం సాధిస్తాయి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రవితేజ హైఓల్టేజ్‌లో పని చేశారు. హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. 'మిరపకాయ్' ఘాటుగా తీశారు. సంక్రాంతిలో సూపర్‌ హిట్‌ చేసిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు అన్నారు.
దీక్షా సేత్‌ మాట్లాడుతూ ..
ఈ సినిమా దర్శకుడి సత్తా ఏమిటో తెలిసింది. ఈ సినిమా చేయడం ఒక కొత్త అనుభూతి ఈ సినిమా మంచి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది.
రిచా మాట్లాడుతూ ..

సినిమా విజయవంతం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఆవకాశం ఇ చ్చిన నిర్మాత దర్శకులకునా కృతజ్ఞతలు అన్నారు.
స్నిగ్థ మాట్లాడుతూ ..
ఇ ది నా తొలిసినమా ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులను నా కృతజ్ఞతులు అన్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ..
ఈ సక్సెస్‌ను ఎంజారు చేస్తున్నారు. దర్శకుడు అంటే రవికి నమ్మకం ఆ నమ్మకంతోనే ఈ సినిమా ఇ చ్చాడు. నా కెరియర్‌లోనే నా గురించి ఓ మంచి కేరక్టర్‌ రాశాడు దర్శకుడు అన్నారు.
రాంప్రసాద్‌ మాట్లాడుతూ ..
సినిమా చేయడం చాలా అనందంగా ఉంది. సినిమా తప్పకుండా ఆడుతుందనే నమ్మకం ముందునుండి కలిగింది. దర్శకుడు హరీష్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
తమన్‌ మాట్లాడుతూ ..
ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞలు తెలపుకుంటున్నాను అన్నయ్య రవితేజకు. హరీష్‌ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. అతను ఎంతో కష్టపడ్డాడు. సినిమా విజయవంతం అయినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
రమేష్‌ పుప్పాల మాట్లాడుతూ ..

చాలా అనందంగా ఉంది. ఈ సినిమా విజయం వెనక కృషి చేసిన సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఘాటింగ్‌కు వచ్చినపుడు ఎవరికి వారు ఈ సినిమా నాది అన్నట్లుగా పని చేసుకుంటూ ఉండేవారు. నా నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ నిజం చేశారు. ఈ సినిమ విజయం గురించి వింటుంటే చాలా అనందంగా ఉంది అన్నారు.
హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ ..
ఈ సినిమా విజయవంతం అయిదంటే ఆ క్రెడిట్‌ రవితేజ గారిదే. నా మీద నాకున్న కంటే రవితేజకు నామీద ఎక్కవ దాంతో నేను అప్పుడప్పుడూ టెన్షన్‌ పడ్డాను. ఆ సమయంలో టెన్షన్‌ పడవద్దు ఈ సినిమా కాకపోతే మరో సినిమా చేద్దాము అని ధైర్యం ఇచ్చారు. నా మీద నమ్మకం ఉంచాడు. సినిమా ఇ చ్చాడు. ఈ సినిమాకు టైటిలÊ పెట్టింది రవితేజ కథ విని ఈ టైటిల్‌ను పెట్టాడు. మేము ఏది చేసినా మాకు నమ్మకం
చ్చింది రవితేజనే. అతను లేకపోతే సినిమానే లేదు. స్నిగ్ధ వాయిస్‌ నచ్చి ఆమెను ఈ సినిమా ద్వారా పరిచయం చేశాము. అలాగే సినిమాకు పని చేసిన వారందరకీ పేరు పేరున కృతజ్ఞతలు తెలపుకుంటున్నాను అన్నారు.

రాజకుమారుని సినీ ప్రస్థానం .. .. ..

 మహేష్‌ బాబు నటజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్ణి కేంద్రీకరించడం కోసం మహేష్‌ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. డిగ్రీ పూర్తి అయ్యాక సినిమా రంగానికి తిరిగివచ్చాడు. హీరోగా మహేష్‌ బాబు తన తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాదించకపోయినా మహేష్‌ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలిబింద్రే సరసన కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్‌కు తొలి హిట్‌ను అందించింది. ఆ తరువాత 2002లో వచ్చిన టక్కరిదొంగ, బాబీ రెండు సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి.
 2003లో గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఒక్కడు' చిత్రం 2003 సంవత్సరంలో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం మహేష్‌ బాబు సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది. అదే సంవత్సరంల విడుదలయిన నిజం చిత్రం పరాజయం పాలయ్యింది. 2003 సంవత్సరంలో మహేష్‌ బాబుకు ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నాడు. 2004లో విడుదలైన అర్జున్‌ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదని చెప్పాలి. ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.
 2005లో విడుదల అయిన 'అతడు' చిత్రం తెలుగునాట మాత్రమే కాకా విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. ఆ చిత్రం నందగోపాల్‌ పాత్రలో మహేష్‌ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్‌కు మరొకసారి బంగారు నంది లభించింది. 
2006లో మహేష్‌ బాబు నటించిన మరో భారీ హిట్‌ సినిమా 'పోకిరి'. వ్యాపారపరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన ' సైనికుడు ' చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన ఏ సినిమా హిట్‌ కాలేదు. ' అతిథి ' ' ఖలేజా ' చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుతం మహేష్‌ బాబు శ్రీనువైట్ల దర్శకత్వంలో ' దూకుడు ' చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలో పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో ' ది బిజినెస్‌మేన్‌' గా నటించనున్నాడు. ఈ చిత్రాలతో హిట్‌ సాధించి మరోసారి మహేష్‌ బిజినెస్‌ మ్యాన్‌గా, 'దూకుడు' ప్రదర్శిస్తాడని ఆశిస్తూ....
                                                                                      మీ స్నేహితుడు

టెస్టులు, టి20 మావీ .. వన్డేలు మీవీ ..

 ఇంగ్లాండ్‌ ‌ , ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ ‌, ఆస్ట్రేలియా మధ్య ఏడు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 5-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. టెస్టు, ట్వి 20 మ్యచ్‌లో ఇంగ్లాండ్‌ ‌ గెలిచి వన్డే సిరీస్‌లో పరాజయం పాలైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని 49.3 ఓవర్లలో 249 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో వోక్స్‌ ఒక్కడే 6 వికెట్లు తీసి ఆస్ట్రేలియా కట్టడి చేశాడు. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 198 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది. పీటర్సన్‌ ఒక్కడే 40 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్‌మైన్‌లు ఏ ఒక్కరు రాణించలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో షేన్‌ వాట్సన్‌ బ్యాటింగ్‌లో విఫలమైన బౌలింగ్‌లో మాత్రం 3 వికెట్లు తీసుకున్నాడు. బ్రెట్‌లీ, బోలింగర్‌, హస్టింగ్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వోక్స్‌ లభించింది. ( ఇంగ్లాండ్‌ )

నేడే తేలుస్తాం ..

షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 27న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌ కోల్‌కత్తా ( ఈడెన్‌) లోనే జరుగుతుందా ? లేదంటే.. మరో వేదికలోనా ? దీనిపై నిర్ణయం ఆదివారమే వెలవడనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి అధ్యక్షుడు శరద్‌ పవారే స్వయంగా ప్రకటించారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో ఓవరాల్‌గా 4 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వీటిలో భారత్‌- ఇంగ్లాండ్‌ ‌ మధ్య జరగాల్సిన మ్యాచే ఆ వేదికన తొలి వన్డే అయితే .. అప్పటికే ఆ స్డేడియం మరమ్యమతు పనులు పూర్తి ఆయ్యే పరిస్థితిలేదని ఈడెన్‌ నుంచి తరలిపోయిన వన్డేకు బెంగుళూరు ఆతిథ్యం ాచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుందని శరద్‌ పవార్‌ ఇప్పటికే తేల్చేశాడు.

ఆకాశమే హద్దు.. అవకాశం వదలోద్దు

నవదీప్‌, రాజీవ్‌ సాలూరి హీరోలుగా పంచి బొరా హీరోయిన్‌గా రవి కార్పొరేషన్‌ సంస్థ నిర్మిస్తున్న ' ఆకాశమే హద్దు ' చిత్రం రెండు పాటలు సహా 70 శాతం టాకీ పూర్తి చేసుకుంది. రవిచరణ్‌ మెరిపో ఈ చిత్రానికి దర్శకుడు. నిమ్మగడ్డ వేణుగోపాల్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఏప్రిల్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత మాట్లాడుతూ '' నేటి యువతరం అభిరుచులకు అద్దం పట్టే చిత్రమది. ప్రేమ, బాధ్యతల మధ్య భావోద్వేగాలను మా చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం.

Saturday, January 29, 2011

వారి పెళ్లిగోళ మనకెందుకు....?

 అల్లు అర్జున్‌ పెళ్లి తేది ఖరారైపోయింది. ఎన్టీఆర్‌ పెళ్లి తేదీ కూడా తర్వలోనే ప్రకటించబడనుంది. ఇంతకీ మిగిలిన కుర్ర హారో, హీరోయిన్‌ల పెళ్లెప్పుడు అనే సందేహం ఇప్పుడు సినీ అభిమానులలో మెదులౌతున్న ప్రశ్న. హీరోలు సినిమాల మీద సినిమాలు తీసున్నారు. మరి పెళ్లెప్పుడు అని అడిగితే సమయం రావాలి కదా అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌ , గోపీచంద్‌లను గురించి చెప్పుకోవచ్చు. వీరి పెళ్లి గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా మీడియాలో ఊహగానాలు వెలువడుతూనే ఉన్నాయి. ప్రభాస్‌ , కాజల్‌ వీరిద్దరి కాంభినేషన్‌లో డార్లింగ్‌, మిస్టర్‌ ఫర్‌పెక్టు సినిమాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య పుకార్లు వస్తున్నాయి .. ? ఈ సంవత్సరంలో వీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. గోపీచంద్‌, అనుష్కల గురించయితే చెప్పనవసరం లేదు. వారి ప్రేమ చిగురించిన నాటితో పోల్చుకుంటే వారికి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండాలి. అయినా ఇంకా సమయం కావాలి సమయం సమయం కావాలి దాట వేస్తూనే ఉన్నారు.  ఇక పోతే రామ్‌ చరణ్‌, రాణా, మంచు మనోజ్‌, నాగచైతన్య, తరుణ్‌, నితిన్‌, ఉదరు కిరణ్‌ లిస్ట్‌లో ఉన్నారు. మోహన్‌ బాబు రెండో కుమారుడు మనోజ్‌ పెళ్లి ఈ ఏడాదే జరిగే అవకాశాలున్నాయి. గతేఏడాది విష్ణు వివాహం జరిగిపోయింది. మనోజ్‌ వివాహనికి అడ్డంకులేవీ లేవు.

కెప్టెన్‌ వెంకి

 సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ ( సీసీఎల్‌ ) మ్యాచ్‌ అటు దక్షిణాది, ఇటు  ఉత్తరాది తారాగణంతో జరుగనుంది. టాలీవుడ్‌ జట్టుకు వెంకటేష్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ తరపున ఈ జట్టు ఓనర్‌గా మంచు విష్ణు వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14 లోపు ఈ జట్టులో ఎవరెవరు ఆడతారో నిర్ణయిస్తామని, ఆ టీం ఆవిష్కరణ కార్యక్రమం జరపగానికి సన్నాహాలు చేస్తున్నామని శనివారంనాడు మంచి విష్ణు విలేకరులకు తెలియజేశారు. జట్టుకు ప్రచార కర్తలుగా తాప్సీ, సమంత వ్యవహరిస్తున్నారు. కన్నడ జట్టుకు పునీత్‌ రాజ్‌కుమార్‌, హిందీ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్‌ఖాన్‌ వ్యవహరిస్తున్నారు.


ఆల్‌ రౌండర్స్‌ ..

షాహిద్‌ ఆఫ్రిద్‌, అబ్దుల్‌ రజాక్‌ , యూసుఫ్‌ పఠాన్‌, మాథ్యూస్‌ , దిల్షాన్‌, ఫెరీరా, షకిబుల్‌, రైడర్‌, నాథన్‌ మెకకలమ్‌, షేన్‌ వాట్సన్‌, కామెరూన్‌ వైట్‌, డేవిడ్‌ హసీ, క్రిస్‌గేల్‌, కాలింగ్‌వుడ్‌, లా ప్రతి ఒక టీమ్‌లో ఇద్దరు లేక ముగ్గురు ల్‌ రౌండర్స్‌ ఉంటారు.
షాహిద్‌ ఆఫ్రిద్‌, అబ్దుల్‌ రజాక్‌ లాంటి
ల్‌ రౌండర్లు మెరుపులు మెరిపిస్తే ఎంతటి జట్టుయినా చిత్తు కావాల్సిందే. ముఖ్యంగా అఫ్రిద్‌ ఫామ్‌లోకి వస్తే చాలు ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. సిక్స్‌ల వర్షం కురిపిస్తాడు. అతని తోడు రజాక్‌ కూడా అవసరమైన సమయంలో జట్టును అదుకుని పరుగుల రాబట్టడం అలవాటు బౌలింగ్‌లో అఫ్రిది తన స్పిన్‌తో కీలక సమయాల్లో వికెట్టు పడగొట్టి మ్యాచ్‌ను మలుపుతిప్పుతాడు.
యూసుఫ్‌ పఠాన్‌ విధ్యంసకర బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపిస్తాడు. కీలక సమయంలో ఎలాంటి భయం లేకుండా అలవోకగా సిక్సర్లు ఫోర్లు బాదడం ఇతని బలం. బౌలింగ్‌లో తన ఆఫ్‌ స్పిన్‌తో కీలక వికెట్టు పడగొడతాడు. అతనికి తోడు యువరాజ్‌ సింగ్‌ ఉన్నాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టి పడేయడం, తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించడం యువీనైజం. వీరిద్దరూ రాణిస్తే ప్రపంచ కప్‌ ఇండియాదే.
మాథ్యూస్‌, ఫెరారీ, దిల్షాన్‌, లాంటి ఆల్‌ రౌండర్లు రాణిస్తే శ్రీలంక జయభేరి తథ్యం. దిల్షాన్‌ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా రాణించగలడు. అతనికి తోడు మాథ్యూస్‌, ఫెరీరా ఇద్దరు మంచి అల్‌ రౌండర్లు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫోర్లు, సిక్సులతో విరుచుపడే మ్యాథ్యూస్‌, ఆరంభంలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు నడ్డి విరవడం వెన్నతో పెట్టిన విద్య.
షకిబుల్‌ బంగ్లాకు చాలా కీలక ఆటగాడు. వన్డేల్లో ఆల్‌రౌండర్‌గా రాణించగలిగాడు. బ్యాటింగ్‌ బౌలింగ్‌ రెండింటిలో సత్తా చాటుతున్నాడు.
న్యూజిలాండ్‌లో జట్టులో రైడర్‌, స్లైరీస్‌, వీరితో పాటు నాథన్‌ మెక్‌కలమ్‌ స్పిన్‌ బౌలర్‌గా, అల్‌ రౌండర్‌గా జట్టుకు సేవలందిస్తున్నాడు. రైడర్‌ బ్యాటింగ్‌లో మంచి ఫామ్‌తో పరుగుల వర్షం కురుపిస్తూనే.. తనదైన శైలి బౌలింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. స్టైరీస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఎంతో తోడుపడుతున్నాడు. నాథన్‌ మెక్‌కలమ్‌ కీలక సమయాలలో జట్టుకు వెన్నంటి ఉంటూ విజయ తీరాలకు చేరుస్తున్నారు.
ఆస్ట్రేలియాలో షేన్‌ వాట్సన్‌, వైట్‌ వీద్దరు కలిసి రాణిస్తే విజయం వారిదే. జట్టు ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌, మిడిలార్డర్‌లో డేవిడ్‌ హసీ, వైట్‌లలో ఏ ఒక్కరు రాణించినా ప్రత్యర్థి జట్టు విజయంపై ఆశలు వదులుకోవల్సిందే...!
క్రిస్‌గేల్‌ అతను ఉన్నతసేపు జట్టు విజయానికి డోకా ఉండదు. క్రిస్‌గేల్‌ సిక్స్‌, ఫోర్లు వర్షం కురిస్తే ఇక అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. జట్టులో అతని తోడుగా బ్రావో అల్‌ రౌండర్‌గా మంచి ప్రదర్శన కనబరుస్తాడు. వీరుద్దరు విజృంబించిన రోజు విండీస్‌పై గెలిచే దైర్యం ఏ జట్టుకు లేదు.

' జై బోలో తెలంగాణ' సినిమా పోటీ లేరు



 'జై బోలో తెలంగాణ' చిత్రానికి నిజంగా ఎంత క్రేజ్‌ ఉందనేది తెలియదు. కానీ ఈ చిత్రంతో తలపడేందుకు ఎవరి వారు భయపడుతున్నారు. తెలంగాణలో, అంటే నైజాం ఏరియాలో ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్‌ ఉంటుందని చిత్ర పరిశ్రమ అంచనా వేస్తోంది. దాంతో ఈ సినిమాతో పాటు రిలీజ్‌ చేస్తే సినిమా వారం, లేక రెండు వారాలు పాటు వాయిదా వేసుకున్నారు.అందుకే ' జై బోలో తెలంగాణ ' చిత్రం విడుదలవుతున్న రోజు ఏ సినిమా విడుదలకు సిద్దంగా లేదు. ఇప్పటికే ' కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు' సినిమా వాయిదా పడగా, తాజాగా మరో సినిమా ' వస్తాడు నారాజు ' చిత్రం కూడా వారం రోజుల పాటు వెనక్కి వెళ్లింది.

Friday, January 28, 2011

కాంట్రాక్టుల వర్షం ..

 భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండ్కూలర్‌ మైదానంలో ప్రవేశిస్తే పరుగుల వర్షం. కాంట్రాక్టులకు సుమఖత చూపితే కనకవర్షం. ఈ ఏడాది తొలి 27 రోజుల్లోనే సచిన్‌ టెండ్కూలర్‌కు అతడి ఆదాయం ఎంతో తెలుసా ! కోటిన్నర రూపాయలు. అతడు తాజాగా రు. 40 కోట్ల రూపాయల మేర కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో రాణించి భారత్‌కు ప్రపంచకప్‌ అందిస్తే మరిన్ని కాంట్రాక్టులు అతడికి దక్కనున్నాయనడంలో ఆశ్చర్యం లేదు. ాక కోకాకోలా సంస్థ సచిన్‌తో మూడేళ్ల కాంట్రాక్టు కుదర్చుకుంది. ఈ కాంట్రాక్టు విలువ రు. 20 కోట్లు. రు. 250 కోట్లతో ప్రాజెక్ట్‌ ప్రారంభించిన అమిత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సచిన్‌కు రెండు ఆధునాతన విల్లాలను కూడా కానుకగా సమర్పించుకుంది. వీటి విలువ ఒక్కొక్కటి రెండున్నర కోట్ల రూపాయాలు. సచిన్‌ ాప్పటికే 17 కంపెనీల ఉత్పతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు.

ప్రపంచకప్‌ కీలకమైన జట్లు ఇవే

  శ్రీలంక జట్టు : కుమార్‌ సంగక్కర , జయవర్ధన్‌, దిల్షాన్‌, మురళీ ధరన్‌, మథ్యస్‌, తరంగా, సమరావీరా , స్లిల్వా, కపుదెగేరా, పెరార్‌ , కులాశేఖరా, మలింగా, మెండిస్‌, హీరాత్‌ , పెరోనార్‌.

 వెస్టిండీస్‌ జట్టు : డారెన్‌ సమ్మీ ( కెప్టెన్‌ ), క్రిస్‌ గేల్‌, బ్రావో, డారెన్‌ బ్రావో,  పొలార్డ్‌, రామ్‌నరేష్‌ శర్వాన్‌, డెవోన్‌ స్మిత్‌, సులైమాన్‌ బెన్‌, నిఖితా మిల్లర్‌, బాగ్‌ ( వికెట్‌ కీపర్‌), ఆండ్రీ రస్సెల్‌, రవి రాంపాల్‌, కేమర్‌ రోచ్‌, చందర్‌ పాల్‌ , ఆండ్రియన్‌ భరత్‌.
 న్యూజిలండ్‌ జట్టు : వెటోరి ( కెప్టెన్‌ ), బెన్నెట్‌, జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌, గుప్టిల్‌, జేమీ హౌ, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, నాథన్‌ మెక్‌కల్లమ్‌, కైల్‌ మిల్స్‌, జాకబ్‌ ఓరమ్‌, జెస్సీ రైడర్‌, టిమ్‌ సౌతీ, స్లైరిస్‌, రాస్‌ టేలర్‌, కేన్‌ విలియమ్సన్‌, ల్యూక్‌ వుడ్‌కాక్‌.
 
 దక్షిణాఫ్రికా జట్టు : గ్రేమ్‌ స్మిత్‌ ( కెప్టెన్‌ ), ఆమ్లా, బోథా, డివిలియర్స్‌, డుమిని, డు ఫ్లెసిన్‌, ఇంగ్రామ్‌, కలిస్‌, మోర్నీ మోర్కెల్‌, వేనీ పార్నెల్‌, పీటర్సన్‌, స్టెయిన్‌, తాహిర్‌, సోట్‌సొబ్‌, వాన్‌విక్‌.


 భారత్‌ జట్టు : మహేంద్రసింగ్‌ ధోనీ ( కెప్టెన్‌ ) వీరేంద్ర సెహ్వాగ్‌ ( వైస్‌ కెప్టెన్‌ ), సచిన్‌ టెండ్కూలర్‌, గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, యుసుఫ్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, నెహ్రా, ప్రవీణ్‌ కుమార్‌, మునాఫ్‌ పటేల్‌, ఆశ్విన్‌, పీయూష్‌ చావ్లా
ఆస్ట్రేలియా జట్టు : రిక్‌ పాటింగ్‌ ( కెప్టెన్‌ ) మైఖెల్‌ క్లార్క్‌ ( వైస్‌ కెప్టెన్‌ ), బొల్లింగర్‌, బ్రాడ్‌ హ్యాడీస్‌, జాన్‌ హేస్టింగ్స్‌, నాథన్‌ హర్టీజ్‌, డేవిడ్‌ హస్సీ, మిచెల్‌ జాన్సన్‌, బ్రెట్‌లీ, టిమ్‌ ఫెయిన్‌, స్ట్రీవ్‌ స్మిత్‌, షాన్‌ టెయిట్‌, షేన్‌ వాట్సన్‌, కామెరూన్‌ వైట్‌.
 
 పాక్‌స్థాన్‌ జట్టు : షాషిద్‌ ఆఫ్రీదీ, మిస్బాఉల్‌హక్‌, మహ్మద్‌ హఫీజ్‌, కమ్రాన్‌ అక్మల్‌ ( వికెట్‌ కీపర్‌), యూనిస్‌ ఖాన్‌, అషద్‌ షఫీక్‌, ఉమర్‌ అక్మల్‌, అబ్దుల్‌ రజాక్‌, అబ్దుర్‌ రెహమాన్‌, సయ్యద్‌ అజ్మల్‌, పోయబ్‌ అక్తర్‌, ఉమర్‌గుల్‌, వహబ్‌ రీయాజ్‌, సోహాయిల్‌ తన్వీర్‌, అహ్మద్‌ షెహజాద్‌.
ఇంగ్లండ్‌ జట్టు : ఆండ్రూ స్ట్రాస్‌ ( కెప్టెన్‌ ), అండర్సన్‌, ఇయాన్‌ బెల్‌, టిమ్‌ బ్రెన్నన్‌, స్టువర్డ్‌ బ్రాడ్‌, పాల్‌ కాలింగ్‌వుడ్‌, ఇయాన్‌ మోర్గాన్‌, పీటర్సన్‌, ప్రయార్‌, అజ్మల్‌ షెహజాద్‌, గ్రేమ్‌ స్వాన్‌, ట్రెడ్‌వెల్‌, ట్రాట్‌, రైట్‌, యార్డీ.

ఆ హీరోతో కూడా చేస్తే ఓ పనైపోతుంది

తెలగుతో పాటు కన్నడంలో కూడా అగ్రతారల్లో ఒకరుగా భాసిల్లుతున్నారు ప్రియమణి. ఈమె ప్రస్తుతం. కన్నడంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. కాగా.ఇటీవల   అక్కినేని నాగార్జునతో ' రగడ ' చిత్రంలో రొమాన్స్‌ చేసిన ఈ తార ఆ చిత్రంలోని ' అష్టలక్ష్మీ ' పాత్ర తనకెంతో పేరు తెచ్చి పెట్టిందనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.ఇదే   విషయం గురించి ఆమె మాట్లాడుతూ '' నాగ్‌తో పుల్‌లెంగ్త్‌ హీరోయిన్‌గా నటించాలన్న నా కోరిక ' రగడ'తో తీరింది. ఆయనతో నాటించడం ఎంతో కంపర్టబుల్‌గా వుంటుంది. మళ్ళీ నాగ్‌తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఒకవైపు నాగార్జునతో ' రగడ' చేస్తూనే మరో వైపు ఆయన మేనల్లుడు సుమంత్‌తో ' రాజ్‌' చిత్రంలో నటిస్తుంటే ఎంతో థ్రిల్లింగ్‌ అనిపించేది. ఒకేసారి అక్కినేని కుటుంబానికి చెందిన ాద్దరు హీరోలతో నటించాను.ఇక బ్యాలెన్స్‌గా వున్న ' నాగచైతన్యతో కూడా నటిస్తే ఓ పనైపోతుంది. '' అంటూ ముసిముసిగా నవ్యుతూ తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. ప్రియమణి. మీరుఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలోనూ మరో హీరోయిన్‌తో కలిసి నటిస్తున్నారు. అప్పుడు మీ మధ్య కాంపిటీషన్‌ ఎలా వుంటుందన్న ప్రశ్నకు ఆమె సమధానం చెబుతూ ' ప్రతి హీరోయిన్‌తోనూ నాకు మంచి సంబంధమే వుంది.

Thursday, January 27, 2011

జై బోలో తెలంగాణ మూవీ స్టిల్స్‌ ఎక్స్లూజివ్‌

జై బోలో తెలంగాణ మూవీ స్టిల్స్‌ ఎక్స్లూజివ్‌














సినిమాల సందడి

 గగనం, అమెరికా అల్లుడు, వస్తాడు నా రాజు, అప్పల్రాజు, జై బోలో తెలంగాణ ాలా నాలుగు సినిమాలు వారి అభ్రిపాయాలు.
వివిదాస్పందంగా మారిన చిత్రం ' జై బోలో తెలంగాణ ' కు సెన్సార్‌ బోర్డు అనుమతి లభించింది. ఫిబ్రవరి 4న సినిమా విడుదల కానున్నట్లు దర్శక నిర్మాత ఎస్‌. శంకర్‌ ప్రకటించాడు.
నాగార్జున నటించిన ' గగనం ' చిత్రం ఫిబ్రవరి రెండో వారానికి విడుదల సిద్దమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు దిల్‌రాజ్‌, శిరీష్‌, లక్ష్మణ్‌లు తెలియజేస్తున్నారు.
శ్రీకాంత్‌, కామ్నా జెఠ్మలానీ, జెన్నీఫర్‌ కొత్వాల్‌ ప్రధాన పాత్రల్లో ఓం సాయి ప్రకాష్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ' అమెరికా అల్లుడు ' చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై కె. వెంకటరెడ్డి తెలుగులో అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలకు సిద్దమైంది. 

సునిల్‌ హీరోగా నటించిన అప్పల్రాజు ఫిబ్రవరి 4న విడుదలకు సిద్దం కానున్నది. అదే రోజు మోహన్‌ బాబు కూమారుడు విష్ణు ' వస్తాడు నారాజు ' చిత్రాన్ని అదే రోజున విడుదల చేస్తూ ఈ స్టార్‌ డైరెక్టర్‌తో సై అంటున్నారు. ' ఢ ' తర్వాత మరో హిట్‌ లేని విష్ణు ' సలీమ్‌' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని చేసిన ఈ చిత్రంపై అచంచల నమ్మకంతో ఉన్నాడు. ' మర్యాద రామన్న ' తర్వాత సునిల్‌, స్వాతి కాంబినేషనల్‌లో వస్తున్న అప్పల్రాజు ఫిబ్రవరి 4న వచ్చే ఏర్పాటు చేస్తున్నారు.

' జై బోలో తెలంగాణ ' సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌

వివాదాస్పదంగా మారిన చిత్రం ' జైబోలో తెలంగాణ ' కు సెన్సార్‌ బోర్డు అనుమతి లభించింది. ఫిబ్రవరి 4న సినిమా విడుదల కానున్నట్లు దర్శక నిర్మాత ఎస్‌. శంకర్‌ ప్రకటించాడు. సెన్నార్‌ బోర్డ్‌లో కొందరు సీమాంధ్రులు సినిమా విడుదలకు అడ్డుకట్ట వేశారంటూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లవెత్తడం సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా ' జై బోలో తెలంగాణ ' సినిమాకి సెన్సార్‌ ాబ్బందులు ఎదురయిన సంగతి విదితమే. దీంతో ' జై బోలో తెలంగాణ ' సినిమా విడుదలకు మార్గం సుగమమయింది.

మార్చి 6న అల్లు అర్జున్‌ పెళ్లి

 అల్లు అర్జున్‌ రియల్‌ లైఫ్‌లో ' వరుడు ' కాబోతున్నాడు. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. మార్చి 6న అల్లు అర్జన్‌ వివాహానికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. హైదరాబాద్‌కి చెందిన స్నేహారెడ్డితో అల్లు అర్జున్‌ వివాహం జరగనుంది. అల్లు అర్జున్‌, స్నేహారెడ్డిల మధ్య ప్రేమ గురించి చిగురించి చాన్నాళ్ళే అయినా, పెద్దల అంగీకారం కోసం ఇన్నాళ్ళు పట్టింది. ఇరు కుటుంబాల మేరకు పెద్దలతో కుదిర్చిన సంబంధమే ఖారారైంది. మార్చి 6న హైద్రాబాద్‌లోని హైటెక్స్‌లో వివాహం. మార్చి 9న అల్లు అర్జున్‌ తండ్రి, అల్లు అరవింద్‌ సొంతూరు పాలకొల్లులో వెడ్డింగ్‌ రిసెష్షన్‌ జరగనుంది.

Wednesday, January 26, 2011

ఫిబ్రవరి రెండో వారంలో ' గగనం '

 విమానాన్ని హైజాక్‌ చేసినపుడు పరిస్థితి క్లిష్టంగానే ఉంటుంది. ఉగ్రవాదుల డిమాండ్లకు తలొగ్గాలా ? ఎలాంటి హాని జరగకుండా ప్రయాణికుల్ని రక్షించడం ఎలా ? ఆ సమయంలో ప్రభుత్వం, భద్రతా దళాలు ఏవిధంగా వ్యవహరిస్తాయి ? గగనతలంలో జరిగిన ఈ సంఘటనపై పలు ఆసక్తిరకమైన ప్రశ్నలు తలెత్తుయి ? ఈ చిత్రానికి రాదామోహన్‌ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ' దిల్‌' రాజు, శిరిష్‌, లక్ష్మణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, సనాఖాన్‌, పూనమ్‌కౌర్‌, డా. భరత్‌ రెడ్డి, రిషి, శ్రీలక్ష్మి తదితరులు ముఖ్య పాత్రలు షోషిస్తున్నారు.

రవి తేజ కొత్త సినిమా ' వీర ' మూవీ స్టిల్స్‌

 రవి తేజ కొత్త  సినిమా  ' వీర ' మూవీ స్టిల్స్‌ 















లక్ష్మణ్‌, నారంగ్‌లకు పద్మశ్రీ అవార్డు

 హైదరాబాద్‌ సోగసరి బ్యాట్స్‌మెన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, స్టార్‌ ఘాటర్‌ గగన్‌ నారంగ్‌లకు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు లభించింది. మంగళవారం ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం విజేతలను ప్రకటించింది. లక్ష్మణ్‌, గగన్‌ నారంగ్‌లతో పాటు మరో ఏడుగురు క్రీడాకారులను పద్మశ్రీ అవార్డు లభించింది. సుశీల్‌ కుమార్‌ ( రెజ్లింగ్‌ ), కుంజరాణి దేవి ( వెయిట్‌ లిఫ్టింగ్‌), కృష్ణ పునియా ( డిస్కస్‌ త్రో ), శీతల్‌ మహాజన్‌ ( పారా జంప్‌), హర్భజన్‌ సింగ్‌ ( పర్వతారో హకుడు ) లను పద్మ పురస్కారం దక్కింది.
భారత జట్టును కష్టకాలంలో ఆదుకునే ఆపద్భాందవుడిగా పేరుపొందిన వివిఎస్‌ లక్ష్మణ్‌ పద్మశ్రీ అవార్డును లభించింది. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 120 టెస్టుల్లో 16 సెంచరీలతో 7903 పరుగులు చేశాడు. 86 వన్డేల్లో ఆరు సెంచరీలతో 2338 పరుగులు సాధించాడు.
గోల్డెన్‌ ఘాటర్‌ గగన్‌ నారంగ్‌ గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఏకంగా నాలుగు స్వర్ణాలు కొల్లగొట్టాడు. ఆసియన్‌ గేమ్స్‌లోనూ రెండు రజతాలు సాధించి సత్తా చాటుకున్నాడు. అలాగే బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్టర్‌ సుశీల్‌ 2010 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. 2009లో సుశీల్‌ ఖేల్‌రత్న దక్కింది.

ఆశ చిగురింప చేసిన నాల్గోవ వన్డే

 ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గోవ వన్డేలో ఇంగ్లండ్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నాల్గోవ వన్డేలో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఆశ నిరాశగా ఉండిపోయింది. మూడు వన్డేలు ఓడిపోయిన ఇంగ్లండ్‌ నాల్గోవ వన్డేలో మాత్రము విజయం సాధించి ఇంగ్లండ్‌ 3-1 తేడాతో ఉంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకన్న ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 299 పరుగుల చేసింది. స్ట్రాస్‌ 8 పరుగుల చేసి అవుట్‌ అయ్మాడు. అతరువాత వన్‌డౌన్‌గా వచ్చిన ట్రాట్‌నా ప్రియార్‌కి తోడుగా నిలిచాడు. ప్రియర్‌ అర్థసెంచరీ, ట్రాట్‌ సెంచరీ చేసి జట్టుకు అదుకున్నారు ప్రియర్‌ 67 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. అతరువాత వచ్చిన బ్యాట్‌మైన్‌లు పీటర్సన్‌ 12, బెల్‌ 0 తక్కువ పరుగులకే అవుట్‌ అయ్యారు. చివరిలో మౌర్గ్‌ 24, కాలింగ్‌వుడ్‌ 27, యాదవ్‌ 39 పరుగుల చేశారు. 300 పరుగు లక్ష్యంతో బ్యాటింగ్‌ దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 278 పరుగుల చేసింది. వాట్స్‌న్‌ 64, చేయాగా హడ్డిన్‌ 20 , మార్ష్‌ 1, క్లార్క్‌ 15, వైట్‌ 44, హుస్సీ, 28 , స్మిత్‌ 46, చివరిలో బ్రెట్‌లీ 39 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. మాన్య్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ట్రాట్‌ ఎంపికయ్యాడు.
 

రవితేజ తన పుట్టిన రోజు మీడియాతో .....

 తనదైన అల్లరితో వినోదాన్ని కురిపిస్తున్న రవితేజ నుంచి వచ్చిన తాజా చిత్రం ' మిరపకాయ' బుకింగ్‌ కౌంటర్‌ వద్ద మంచి కలెక్షన్‌ రాబట్టుకుంటోంది. అతను మాట్లాడే విదానం అందరిని హర్ట్‌ అవుతారు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ఇలా ముచ్చటించారు.
హరీష్‌ శంకర్‌తో వచ్చిన షాక్‌ సినిమా ప్లాపు అవడంతో అతని తక్కువ అంచనా వేయడం సరికాదు. ఒక్క సారి ప్లాపు అయిన మాత్రనా మరోసారి హిట్టు కాకపోదా అన్న నమ్మకం. అందుకే హరీష్‌ వారి దర్శకుడి మరో సినిమా ' మిరపకాయ ' తీసుకున్నాను.
మీ సినిమా అభిమానులలో ఒక్కే విధంగా ఉంటాయి ఏమిటి.
అలా ఏం కాదు కథ బాగుంటే చాలు ఒప్పుకుంటా. బేసిక్‌గా నేను చాలా యాక్లివ్‌గా ఉంటాను. నాతో సినిమా చేసే దర్శకులందరూ దాదాపు నా స్నేహితులే. అందుకే వారికి బాగా తేలుసు కాబట్టి అలాంటి పాత్రలను సృష్టిస్తున్నారేమో.
ఎనర్జటిక్‌గా కనబడతారు. ఎందుకు
?
ఎప్పుడూ నేనే ఒకేలా వుంటాను. బేసిక్‌గా నాకు స్లోగా వుండటం, డల్‌గా వుండటం, రిజర్వ్‌డ్‌గా వుండటం అసలిష్టం వుండదు. ఎప్పుడూ యాక్టివ్‌గా వుండడాన్ని లైక్‌ చేస్తాను. అందుకే నాపక్క ఉన్నవాలు కూడా అలా వుడడం ఇష్టపడుతాను. సినిమాలో కూడా అదే తీరు.

కొత్త చిత్రాలు ?
ఇప్పుడు ' వీర ' చేస్తున్నా. వర్మ ' దొంగలముఠా', తర్వాత గుణశేఖర్‌ దర్శకుడుగా వైవిఎస్‌ బ్యానర్‌ నిర్మించే ' నిప్పు ' ఉంటుంది. ఇంకా కొన్ని సినిమా చర్చల్లో ఉన్నాయి.
వర్మ గురించి ?
రామూతో చేస్తున్న ' దొంగల ముఠా ' ప్రయోగం సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది.
సినిమా హిట్‌ ?
కష్ట పడి సినిమా చేస్తాను. అది హిట్‌, ప్లాప్‌ అన్న విభేదాలు ఉండవు. ప్లాప్‌ అయినా భాదపడుతు మరొ సినిమా తీయకుండ ఉండను. అదే హిట్‌ అయితే కూడా అదే అలోచన.

Monday, January 24, 2011

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు

భారత్‌ మిడిల్‌ ఆర్డర్స్‌ బ్యాట్స్‌మెన్‌లు ఎవరు అన్న సందేహాం. యువరాజ్‌ సింగ్‌, రైనా, ధోని, వీరి ముగ్గురి మీద బాధ్యత. ఓ పెనరు రోహిత్‌ శర్మ, పార్థివ్‌ పటేల్‌, వన్‌డౌన్‌ విరాట్‌ కోహ్లీ, టుడౌన్‌ యువరాజ్‌ సింగ్‌, త్రీ డౌన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ఫోరుత్తు డౌన్‌ సురేష్‌ రైనా అతరువాత అల్‌ రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ అతరువాత బౌలర్ల బాధ్యత. ఇలా వరుసగా వస్తుంటారు. ముఖ్యంగా ఓ పెనర్లు విఫలమైన వన్‌డౌన్‌ మీద భాధ్యత ఉంటుంది. అతరువాత టుడౌన్‌ వచ్చిన వ్యక్తి ఇద్దరు కలిసి జట్టును ముందుకు నడిపించే బాధ్యత ఉంటుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌లో కెప్టెన్‌ ధోని 75 పరుగులు చేశాడు. అందులో ఒక అర్థసెంచరీ కూడా నమోదు కాలేదు. యువరాజ్‌ సింగ్‌ ఐదు వన్డే సిరీస్‌లో కేవలం 91 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమై బౌలింగ్‌లో మాత్రము రాణించగలగాడు. రోహిత్‌ శర్మ ఐదు వన్డేలో 49 పరుగుల చేశాడు. కనీసం అర్థ సెంచరీ కూడ నమోదు కాలేదు. రైనా ఐదు వన్డేలో 111 పరుగులు చేశాడు. యూసుఫ్‌ పఠాన్‌ మూడు వన్డేలో 166 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీ చేశాడు. మురళీ విజరు మూడు మ్యాచ్‌లో కేవలం 18 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఐదు వన్డేలో 195 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో యూసుఫ్‌ పఠాన్‌, విరాట్‌ కోహ్లీ అద్భుతంగా రాణించగలిగాడు.

ముచ్చటగా మూడో విజయం

 ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. టెస్ట్‌ సిరీస్‌లో రాణించిన ఇంగ్లండ్‌ వన్డేలో మాత్రం వరుస పరాజయాలు మూట కట్టుకుంటోంది. 3-0 తేడాతో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా అదిక్యతం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 48 ఓవర్లలో 214 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. ట్రాట్‌ 84 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 46 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. బ్రెట్‌లీ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Sunday, January 23, 2011

కల కలగానే మిగిలిపోయింది. నిజం కాలేదు.

 చరిత్ర సృష్టించాలనే కల కలగానే మిగిలిపోయింది. ఇక్కడ జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌లలో సాతాఫ్రికా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా 3-2 తేడా సిరీస్‌ సోంతం చేసుకుంది.
యూసుఫ్‌ పఠాన్‌ ఒంటరి పోరాటం వృదా

 
జట్టు విజయం కోసం అల్‌ రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ విరోచితంగా పోరాడినా ఫలితం లేకపోయింది. యూసుఫ్‌ పఠాన్‌ క్రీజు వచ్చినప్పడు జట్టు స్కోరు 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. టీమిండియా విజయం సాధించాంటే 209 పరుగులు చేయాలి. ఇంకా ఆరు వికెట్లు మాత్రమే వున్నాయి. అందులో రైనా ఒక్కడె బ్యాట్‌మైన్‌ మిగితా బౌలర్లలు ఉన్నారు. రైనా 11, హర్బజన్‌ సింగ్‌ 13, చావ్లా 8 పరుగులకే అవుట్‌ అయ్యారు. యూసుఫ్‌ పఠాన్‌కు జహీర్‌ ఖాన్‌ తోడు అయ్యాడు. అవసరం వచ్చినడల్లా సిక్స్‌, ఫొర్లుతో జట్టు స్కోరు ముందుకు నడిపాడు. జహీర్‌ ఖాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ ఇద్దరు 100 బాగ్యసామ్యాన్ని నెలకొల్పారు. సౌతాఫ్రికా తన బ్యాట్‌ మరో సారి రూచి చూపాడు. స్మిత్‌ ఎని ప్రయత్నాలు ఉపయోగించిన యుసుఫ్‌ పఠాన్‌ తన దైన శైలిలో అడుతు ముందుకు నడిపాడు. బౌలర్లలను పదే పదే మార్పులు చేసి ఉపయోగం లేకపోయింది. చివరికి అతడు 70 బంతులలో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లతో 105 పరుగులు చేసి మోర్కెల్‌ బౌలింగ్‌లో పైయిస్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అతడు వున్నత సెంపు విజయం భారత్‌దే అనుకున్న అభిమానులకు ఒక్కసారి యూసుఫ్‌ పఠాన్‌ అవుట్‌ అవడంతో మళ్లీ కథ 

మొదటి వచ్చింది.

అంతక ముందు భారత్‌ టాస్‌ గెలచి బౌలింగ్‌ ఎంచుకున్నది. స్మిత్‌ 7 పరుగుల అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌ వచ్చిన వాన్‌వాక్‌ 63 బంతులలో 56 పరుగుల చేసి యువరాజ్‌ సింగ్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. డివిల్లిర్‌ 11 అవుట్‌ అయ్యాడు. డుమ్మిని 35 పరుగులు చేశాడు. మునాఫ్‌ పటేల్‌ పైయిస్స్‌ , బోథా ఇద్దరి ఒక్కే ఓవర్లలో అవుట్‌ చేశాడు. పీటర్సన్‌, స్టెన్‌, మోర్కెల్‌ ముగ్గురు జహీర్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యారు. చివరికి ఆమ్లా సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రోహిత్‌శర్మ రూపంలో తొలి వికెటు కోల్పోయింది. అక్కడి నుంచి వికెట్ల పతనం ప్రారంభం అయ్యింది. ఒకరి తరువాత ఒకరు క్యూ కట్టారు. ఏమి చేయలేని పరిస్థితి టీమిండియాకు వచ్చింది. యూసుఫ్‌ పఠాన్‌ వచ్చే వరకు సగం బ్యాట్‌మెన్స్‌లు పెవిలియన్‌ చేరుకున్నారు. టీమిండియా 60/5 స్కోరు బోరు. ఒక్క పార్థవ్‌ పాటేల్‌ 38 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ 5, కోహ్లీ 2, ధోని 5, యువరాజ్‌ సింగ్‌ 8, రైనా 11 హర్భజన్‌ సింగ్‌ 13, చావ్లా 8, జహీర్‌ ఖాన్‌ 24, పరుగులు చేశారు.