Tuesday, March 13, 2012

భారత్‌ తొలి విజయం

 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 254 అలౌట్‌ అయ్యింది. 152కే మూడు వికెట్లు కోల్పోయిన లంక విజయం దిశగా పయనిస్తుంది. సంగక్కర 60, తిరిమానేన్‌ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆశ్విన్‌ ఒకే ఓవర్లలో రెండు వికెట్లు తీసుకోని లంకకు దెబ్బమీద దెబ్బ తీస్తాడు. 35 ఓవర్లలో సంగక్కర 65, తిరిమానేన్‌ 29 అవుట్‌ చేస్తాడు. 38 ఓవర్లలో వినయకుమార్‌ హ్యాట్రిక్‌ మిస్‌ అయ్యాడు. కులశేఖర్‌ 11, కపుదేగారా 0 అవుట్‌ చేస్తాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లు జయవర్థనే 78, సంగక్కర 65 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకు అవుట్‌ అయ్యారు. భారత్‌ బౌలింగ్‌లో పఠాన్‌ నాలుగు, వినరు కుమార్‌, అశ్విన్‌ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అంతక ముందు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 304 పరుగుల చేసింది. గంభీర్‌ 100, విరాట్‌ కోహ్లీ 108 పరుగులు చేశారు. ఇద్దరు ఒకరు మించి ఒకరుగా పోటి పడి సెంచరీ సాధించారు. సచిన్‌ 6 పరుగులకు అవుట్‌ అయ్యారు. చివరిలో ధోని 46, రైనా 30 పరుగులు చేశారు.