Monday, August 31, 2015

80వ దశకంలో అగ్ర తారలు


80వ దశకంలో దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించిన అగ్ర తారలందరూ శనివారం చెన్నైలోని ఓ అతిథి గృహంలో కలుసుకున్నారు. అప్పటి మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. అందరూ ఎరుపురంగు వస్ర్తాల్ని ధరించి సందడి చేశారు. ఈ తారా సమ్మేళనంలో చిరంజీవి, మోహన్ లాల్, వెంకటేష్, ప్రభు, సత్యరాజ్, సుమన్, నరేష్, రాధా, సుహాసిని, శోభన, సుమలత, జయసుధ, రమ్యకృష్ణ, రేవతి, ఖుష్భూ, లిజీ, సరిత, భాగ్యరాజా, రఘు, భానుచందర్, జాకీష్రాష్ తదితరులు పాల్గొన్నారు. 80వ దశకం నాటి తారలందరూ కలిసి ఆరేళ్ల కిత్రం మొదలుపెట్టిన ఈ పునః కలయిక సంప్రదాయాన్ని ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పాటిస్తుండటం విశేషం

Thursday, August 20, 2015

నార్వేలో శివమ్


           రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శివమ్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మిస్తున్నారు. రాశిఖన్నా కథానాయిక. శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నార్వేలో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. పవర్‌ఫుల్ యాక్షన్ అంశాలు మేళవించిన ప్రేమకథా చిత్రమిది. నా పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది అన్నారు. నార్వే, స్వీడన్‌లోని సుందరమైన లొకేషన్లలో పాటల్ని చిత్రీకరిస్తామని, వచ్చే నెలలో పాటల్ని విడుదల చేసి అక్టోబర్ 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్, యాక్షన్ అంశాలు మేళవించిన చిత్రమిది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రంలోని ప్రతి మలుపు ఆసక్తికరంగా వుంటుంది.

Wednesday, August 19, 2015

మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని : మహేశ్‌బాబు


రాష్ట్రప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతిలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కేటీఆర్ కోరారని మహేశ్‌బాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ కోరిక మేరకు త్వరలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మహేశ్ ట్వీట్ చేశారు. దత్తత తీసుకునే గ్రామం వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించారు.

Thursday, August 6, 2015

శ్రీమంతుడు చిత్రం రేపు విడుదల


మహేష్‌బాబు నటించిన చిత్రం ' శ్రీమంతుడు రేపు విడుదలకు సిద్దం కానున్నది. ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఊరికి ఎంతో కొంత సేవా చేయాలనే స్ఫూర్తివంతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. మునుపెన్నడూ లేని విధంగా మహేష్‌బాబును సరికొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. ప్రేక్షకులు ఓ అర్థవంతమైన చిత్రాన్ని చూశామని సంతృప్తిచెందేలా వుంటుంది అన్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి.
సైకిల్‌పై శ్రీమంతుడా ... తనయుడా ?        ఈ చిత్రంలో మహేష్‌ బాబు సైకిల్‌ మీద ఉన్న టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ ఫోటొను మార్పింగ్‌ చేసి మహేష్‌ ఫోటొ స్థానంలో ఆయన కుమారుడు గౌతమ్‌ ఫొటోను పెట్టారు. ఈ పొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హాల్‌చల్‌ చేస్తోంది.

బ్రాడ్ ధాటికి ఆసీస్ 60 పరుగులకే ఆలౌట్


 యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఆసీస్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 18.3 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండు బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసీస్‌కు చుక్కలు చూపించాడు. 9.3 ఓవర్లు వేసిన బ్రాడ్ కేవలం 15 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. రోజర్స్(0), స్మిత్(6), మార్ష్(0), క్లార్క్(10), వోజెస్(1) లాంటి హేమాహేమీలను పెవెలియన్ బాట పట్టించి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు బ్రాడ్. ఫిన్, వుడ్ చెరో వికెట్ తీశారు. టెయిలండర్ మిచెల్ జాన్సన్ చేసిన 13 పరుగులే అత్యధిక పరుగులు. 




Saturday, August 1, 2015

happy friendship day

happy

                   friendship 
                                day