Friday, August 12, 2011

మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ గెలుస్తుందా ? సచిన్‌ సెంచరీ చేస్తాడా... ?

 భారత్‌,ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమాయానికి భారత్‌ 35/1 పరుగులు చేసింది. గంభీర్‌ 14, రాహుల్‌ దావ్రిడ్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 710/7 డిక్టెర్‌ చేసింది. స్ట్రాస్‌ 87, కుక్‌ 294, బెల్‌ 34, పీటర్స్‌న్‌ 63, మోర్గాన్‌ 104 , బెన్నస్న్‌ 53 పరుగులు చేసింది. భారత్‌ బౌలింగ్‌లో అమిత్‌ మిశ్రా 3, ప్రవీణ్‌ కుమార్‌ 2, ఇషాంత్‌ శర్మ, రైనా చెరో వికెట్‌ లభించింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఒక వికెటు నష్టానికి 35 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ డకౌట్‌ అయ్యాడు. ఇంకా రెండు రోజుల సమయం ఉంది. రెండు రోజులలో భారత్‌ 451 పరుగులు చేస్తుందా... ? లేక అలౌట్‌ అవుతుందా. ఇంకా భారత్‌ బ్యాట్స్‌మెన్‌లపై ఆధారపడి వుంది. ఒక వేళ టీమిండియాలో బ్యాట్స్‌మెన్‌లు రాణింస్తే డ్రాగా ముగుస్తుంది. లేకపోతే 0-3 తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధిస్తుంది.