Friday, April 15, 2011

సచిన్‌ ' హిట్‌ ' ముంబయి ' ఫట్‌ '


ఐపీఎల్‌-4లో మ్యాచ్‌లో ముంబయి,కోచిల మధ్య జరిగిన మ్యాచ్‌లో కొచ్చి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి కొచ్చి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముంబయి జాకబ్‌,సచిన్‌ ఇద్దరు ఓపెనింగ్‌ ప్రారంభించారు. జాకబ్‌ 12 పరుగులకే అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన రాయుడు. వచ్చి రావడంతో చిచ్చర పిడుగులగా సిక్స్‌ల మోత మోగించాడు. ఇద్దరు ఒక్కరి మిచ్చి ఫోర్లు, సిక్స్‌లతో మోత మోగించారు. సచిన్‌ 66 బంతులలో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సహయంతో 100 పరుగులు చేశారు. ఐపీఎల్‌-4లో ఇది రెండో సెంచరీ. రాయుడు కేవలం 33 బంతులలో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో అర్థసెంచరీ పూర్తి చేశాడు. రాయుడు చివరిలో రెండు పరుగులు కోసం వెళ్లి రనౌట్‌ అయ్యాడు. ముంబయి 20 ఓవర్లలో 182 పరుగుల చేసింది. లక్ష్యం చాలా పెద్దది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించారు. మెక్‌కల్లమ్‌, జయవర్థన్‌ ఇద్దరు ఓపెనింగ్‌ వచ్చారు. మొదటి నుంచి పరుగులు రాబటడం ప్రారంభించారు. మొదటి వికెట్‌కు 128 పరుగుల బాగ్యస్వామం వహించారు. మెక్‌కల్లమ్‌ 81, జయవర్థన్‌ 56 పరుగులు చేశారు. చివరిలో జడేజా 11 బంతులలో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సహయంతో 25 పరుగులు చేశాడు.

తీన్‌మార్‌ రివ్యూ

 ' తీన్‌మార్‌ ' మూడు రకాలు సినిమా వినోదం
తీన్‌మార్‌ సినిమాలో మూడు రకాలుగా తెరపైకి వచ్చింది. ఈ సినిమాల పవన్‌కళ్యాణ్‌ రెండు విధాలుగా తెరపై కనిపిస్తాడు.మొదటిగా పవన్‌ కళ్యాణ్‌ ఇటాలియన్‌ రెస్టారెంట్‌లో ఛెప్‌ గా పని చేస్తుంటాడు. అల్లరి చిల్లరిగా వుంటూ అమ్మాయిల్ని ప్రేమించేస్తుంటాడు. రెండోవాడిగా వారణాసిలో వుంటూ అందరికి సహాయపడుతుంటాడు. అక్కడ వసుమతి ( కృతి కర్బందా ) ప్రేమలో పడతాడు. త్రిష మొదటి పరియం అయిన తరువాత మూడు రోజులకే ( లీపూ టూ లీపూ ) పెడతాడు. అలా వాళ్ల ఇద్దరి మధ్య స్నేహం కోనసాగుతుంది. కానీ అది ప్రేమ మాత్రం కాదు. అని పవన్‌కళ్యాణ్‌ అనుకుంటాడు. అతలోనే త్రిషకు ఇండియాకు వెళ్ళడానికి సిద్దం అవుతుంది. అవిషయంపై పవన్‌కళ్యాణ్‌ చర్చింతుంది. అప్పుడు కూడా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరోకటి లేదు అని తేలికగా తీసుకుంటాడు. వీరిద్దరు విడిపోవటం చూసిన ఒక రెస్టారెంట్‌ యజమాని- పేరు సేనాపతి ( పరేష్‌ రావెల్‌ ) సేనాపతి మైక్‌ ఒక కథ చెప్తాడు. అందులో అర్జున్‌ పాల్వారు, వసుమతి ఇద్దరి మధ్య జరిగిన ప్రేమ కథ చెప్తాడు. ఈ కథలో నాటి తరానికి నేటి తరానికి వున్న వ్యత్యాసాన్ని చూపిస్తారు. పవన్‌ కళ్యాణ్‌ అర్జున్‌ పాత్రలో పోషణలో మంచిమార్కులు కొట్టేస్తాడు. ఇంకా మైక్‌ పాత్రతో ఇప్పటికే ఎన్నో సినిమాలో చూసిన పవన్‌కళ్యాణ్‌ మళ్ళీ చూపించాడు. అదే అల్లరిగా చిల్లరిగా తిరుగుతు అమ్మాయితో ఫబ్ల్‌లో డ్యాన్‌ చేయడం ఇలా చేస్తుంటాడు. త్రిష ఇండియాకు వెళ్లిపోయిన తరువాత పవన్‌కళ్యాణ్‌కు మరో అమ్మాయితో కలసి తిరుగుతుంటాడు. అప్పుడు అమ్మాయితో కలసి ఇండియాకు వెళ్లడానికి సిద్దం అవుతాడు. దానికి హోటల్‌ యజమాని మరి అప్పుడు కలగని ఫీలింగ్‌ ఇప్పడు ఎందుకు కలిగింది అని హోటల్‌ యజమాని అడుగుతాడు. తెలియదు అని సమాధానం చెప్తాతాడు. ఇండియా వెళ్లిన తరువాత త్రిషతో కలసి బయటికి వెళ్లుతాడు. కాని అప్పుడు కూడా అదే స్నేహం కొనసాగుతుంది. త్రిషకి అప్పటికే సోన్‌సూద్‌తో పరిచయం అవుతుంది. ఒక్కసారిగా త్రిష పెళ్లి విషయం పవన్‌కళ్యాణ్‌ చెప్పుతుంది. ఓకే త్యాన్‌ క్యూ అని సమాధానం చెప్పుతాడు. పెళ్లి రోజు ఇద్దరు కలసి మాట్లాడుతారు. అప్పుడు అతనిలో స్నేహం కనిపిచందు. ప్రేమ అని అర్థం అవుతుంది. సోన్‌సూద్‌తో త్రిష్‌ పెళ్లి జరుగుతుంది. అదే రోజు పవన్‌కళ్యాణ్‌కు జాబ్‌ వస్తుంది. జాబ్‌లో మంచి పేరు సంపాదింస్తాడు. ఒక రోజు పవన్‌కళ్యాణ్‌ రోడ్డుపై అమ్మాయిని రౌడిలు తీసుకు వెళ్తుతుంటే వారితో ఫైట్‌ చేసి రక్షిస్తాడు. అప్పుడు అతనికి జాబ్‌లో పెద్ద నష్టం వస్తుంది. కానీ అతక ముందే అమ్మాయిని రక్షించిన వాళ్ల బారుప్రెండ్‌ పెద్ద మొత్తంలో డాల్లర్లతో సహయం చేస్తాడు. అప్పుడే జాబ్‌కు రాజీనామ చేస్తాడు. పవన్‌కళ్యాణ్‌కు అప్పుడు అర్థం అవుతుంది. త్రిష కావాలని కోరుకుంటాడు. అప్పటికే త్రిషకు పెళ్లి కూడా అయిపోతుంది. త్రిష పెళ్లి చేసుకున్న తరువాత మరుసటి రోజు సోన్‌సూద్‌తో వీడాకులకు సిద్దం అవుతుంది. అతను ఎప్పటికైనా వస్తాడు అని త్రిష అనుకుంటుంది. చివరికి వీళ్ల ఇద్దరు ఒక్కటవుతారు. సినిమాలో పాటలు చాలా వరకు బాగున్నాయి.